డుకాటీ కొత్త బైక్.. ధర ఎంతంటే? | 2025 Ducati Panigale V4 Revealed, Check Indian Price And Specifications Details Inside | Sakshi
Sakshi News home page

డుకాటీ కొత్త బైక్.. ధర ఎంతంటే?

Jul 29 2024 3:53 PM | Updated on Jul 29 2024 4:25 PM

2025 Ducati Panigale V4 Revealed

ప్రముఖ బైక్ తయారీ సంస్థ డుకాటీ 2025 పానిగెల్ వీ4ను ఆవిష్కరించింది. కంపెనీ మొదటిసారి దేశీయ విఫణిలో ఈ బైకును 2018లో లాంచ్ చేసింది. ఆ తరువాత అనేక మార్పులకు లోనవుతూ వచ్చిన ఈ బైక్ ఇప్పుడు లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.

మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 2025 డుకాటీ పానిగెల్ వీ4 సింగిల్-సైడెడ్ స్వింగార్మ్‌ కలిగి ఉంది. ఈ బైక్ 1103 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ వీ4 ఇంజిన్ పొందుతుంది. ఇది 13500 rpm వద్ద 216 హార్స్ పవర్, 11250 rpm వద్ద 120.9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది దాని మునుపటి బైక్ కంటే కూడా 2.7 కేజీల తక్కువ బరువును కలిగి ఉంటుంది.

2025 డుకాటీ పానిగెల్ వీ4 బైక్ 6.9 ఇంచెస్ TFT డిస్‌ప్లే పొందుతుంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, రైడింగ్ మోడ్‌లు, బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది.

కొత్త ఫెయిరింగ్ డిజైన్, రీడిజైన్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌, నార్మల్ స్వింగార్మ్‌ కలిగి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. టైయిల్‌లైట్ కూడా రీడిజైన్ చేశారు. ఈ బైక్ అధికారిక ధరలు ఇంకా వెల్లడికాలేదు. అయితే దీని ధర రూ. 27
72 లక్షల నుంచి రూ. 33.48 లక్షల మధ్య ఉండవచ్చని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement