 
													మల్టీస్ట్రాడా V2 & పానిగేల్ V2లను లాంచ్ చేసిన తర్వాత, డుకాటి 2026 స్ట్రీట్‌ఫైటర్ వీ4 బైకును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 28.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది అప్డేట్ డిజైన్, పెద్ద వింగ్‌లెట్ పొందుతుంది. కాబట్టి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.
2026 స్ట్రీట్‌ఫైటర్ వీ4 బైక్ 1,103cc డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 13500 rpm వద్ద 214 హార్స్ పవర్, 11250 rpm వద్ద 120 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో అక్రాపోవిక్ ఎగ్జాస్ట్ ఉండటం చూడవచ్చు. అంతే కాకుండా బ్రెంబో మాస్టర్ సిలిండర్‌తో జత చేసిన బ్రెంబో టాప్-స్పెక్ హైప్యూర్ కాలిపర్‌లు ఉన్నాయి.
ఇదీ చదవండి: భారత్‌కు అమెరికన్ కంపెనీ: రూ.3,250 కోట్ల పెట్టుబడి!
ఈ బైక్ పూర్తిగా కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతుంది. 15.8-లీటర్ ఇంధన ట్యాంక్.. సీటును కలిసే చోటు వరకు విస్తరించి ఉంటుంది. బాడీ-రంగు వింగ్‌లెట్‌లు ఉన్నాయి. 6.9 ఇంచెస్ TFT డాష్.. బైకుకు సంబంధించిన చాలా వివరాలను తెలియజేస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ABS, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ వంటి ఫీచర్స్ ఇందులో లభిస్తాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
