
భారతదేశంలో ఖరీదైన బైకులను విక్రయించే బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీ దేశీయ విఫణిలో 1000 యూనిట్ల 'ఎస్ 1000 ఆర్ఆర్' (S 1000 RR) సూపర్‌బైక్‌లను విక్రయించింది. సంస్థ తన 1000 బైకును ఇటీవలే ఢిల్లీలో లుటియన్స్ మోటోరాడ్ యజమానికి డెలివరీ చేసింది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2025 ఎస్ 1000 ఆర్ఆర్ ను మూడు వేరియంట్లలో లాంచ్ చేసింది. అవి స్టాండర్డ్ (రూ. 21.30 లక్షలు), ప్రో (రూ. 23.80 లక్షలు) & ప్రో ఎం స్పోర్ట్ (రూ. 26.05 లక్షలు). ఇవన్నీ లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయి.
ఇదీ చదవండి: సరికొత్త హోండా షైన్ లాంచ్.. ధర తక్కువే!
బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ బైక్ 999 సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 210 హార్స్ పవర్, 113 న్యూటన్ మీటర్ తారక్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ సూపర్‌బైక్ కేవలం 3.3 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది.