
ఇండియన్ మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే బైకులకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'హోండా మోటార్‌సైకిల్' కంపెనీ కొత్త 'షైన్ 100 డీఎక్స్' లాంచ్ చేసింది. దీని ధర రూ.74,989 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.
హోండా షైన్ 100 డీఎక్స్.. దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో కొత్త గ్రాఫిక్స్, క్రోమ్ యాక్సెంట్స్ వంటి వాటితో పాటు ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. స్టీల్ ఛాసిస్‌పై నిర్మితమైన ఈ బైక్.. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, ఫైవ్ టైప్స్ అడ్జస్టబుల్ ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌ల పొందుతుంది. ఇది రెండు చివర్లలో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ట్యూబ్‌లెస్ టైర్లతో వస్తుంది.
పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, జెనీ గ్రే మెటాలిక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభించే కొత్త హోండా షైన్ 100 డీఎక్స్ 98.98 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 7500 rpm వద్ద 7.28 Bhp పవర్, 5000 rpm వద్ద 8.04 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
