
డ్యూకాటీ తన పానిగేల్ వీ4, స్ట్రీట్‌ఫైటర్ వీ4 బైకులకు రీకాల్ ప్రకటించింది. వెనుక చక్రాల ఇరుసులో లోపం ఉన్నందున డుకాటి ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమస్య భారతదేశంలోని 393 యూనిట్లను ప్రభావితం చేస్తుంది. దీనిని పరిష్కరించడానికి సంస్థ సిద్ధమైంది.
భారతదేశంలో 2018 నుంచి 2024 మధ్య తయారైన పానిగేల్ వీ4, 2018 నుంచి 2025 మధ్య తయారైన స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఈ రీకాల్ ద్వారా ప్రభావితమయ్యాయి. ఈ రీకాల్ ద్వారా లోపభూయిష్ట వెనుక ఆక్సిల్‌ను చెక్ చేయడంతో పాటు.. ఉచితంగా సమస్యను పరిష్కరించనుంది.
ఇదీ చదవండి: సిద్ధమవుతున్న డబ్ల్యూఎన్7 బైక్: ధర రూ.15.5 లక్షలు!
ఒక మోటార్ సైకిల్ కదులుతున్నప్పుడు వెనుక ఇరుసు విరిగిపోయిన ఒక సంఘటన తర్వాత డుకాటి విస్తృత ప్రపంచవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది. దీనికి ప్రతిస్పందనగా.. బైక్ తయారీదారు యునైటెడ్ స్టేట్స్‌లో అమ్ముడైన 10,000 కంటే ఎక్కువ మోటార్‌సైకిళ్లను రీకాల్ జారీ చేసింది.