సిద్ధమవుతున్న డబ్ల్యూఎన్‌7 బైక్: ధర రూ.15.5 లక్షలు! | Honda WN7 Electric Motorcycle Debuts - Know The Details Here | Sakshi
Sakshi News home page

సిద్ధమవుతున్న డబ్ల్యూఎన్‌7 బైక్: ధర రూ.15.5 లక్షలు!

Sep 18 2025 12:18 PM | Updated on Sep 18 2025 12:56 PM

Honda WN7 Electric Motorcycle Debuts - Know The Details Here

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో బైక్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. కంపెనీ దీనిని 'డబ్ల్యుఎన్7' పేరుతో మార్కట్లో లాంచ్ చేయనుంది. ఇది ఒక ఛార్జ్‌పై 130 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.

హోండా డబ్ల్యుఎన్7 బైక్.. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 30 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అయితే 6కిలోవాట్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 3 గంటలు అని తెలుస్తోంది. ఈ బైకులో 18కేడబ్ల్యు లిక్విడ్ కూల్డ్ మోటార్ ఉంటుంది. కాగా ఈ బైక్ బరువు 217 కేజీలు అని సమాచారం.

హోండా డబ్ల్యుఎన్7 బైక్ 5 ఇంచెస్ ఫుల్ కలర్ TFT స్క్రీన్ పొందుతుంది. ఇది ఇంటిగ్రేటెడ్ రోడ్‌సింక్ కనెక్టివిటీతో వస్తుంది. ఇందులో ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. ముందు భాగంలోని హెడ్‌లైట్‌పై పెద్దదిగా కనిపిస్తుంది. కంపెనీ ఈ బైకును యూకేలో 12999 పౌండ్స్‌కి (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 15.5 లక్షలు) విక్రయించే అవకాశం ఉంది. అయితే ఈ బైక్ భారతీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం లేదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement