
ముంబై: ఇటాలియన్ లగ్జరీ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ డుకాటీ గురువారం స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో పేరుతో కొత్త బైక్ విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.12.89 లక్షలుగా ఉంది. డుకాటీ స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో బైకులో 86 హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేసే 1077 సీసీ ఇంజిన్ ఉంది. ‘‘స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో బైక్ దాని ఎయిర్–కూల్డ్ ఎల్– ట్విన్ ఇంజిన్ చరిత్రకు నివాళులు అర్పించేందుకు తయారయ్యింది. ఈ ఏడాది భారత మార్కెట్లో డుకాటీ మొదటి ఆవిష్కరణ ఇది’’ అని కంపెనీ భారత విభాగపు ఎండీ బిపుల్ చంద్ర తెలిపారు.