బైక్‌ కొనుగోలుదారులకు షాక్‌.. డుకాటీ ధరలు పెరగనున్నాయ్‌!

Ducati India To Hikes Price Of All Its Motorcycles From 2023 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఓ వైపు కొత్త సంవత్సరం వస్తుండగా, మరో వైపు ఆటో మొబైల్ రంగ సంస్థలు క్రమంగా తమ వాహనాల ధరలను పెంచుతూ పోతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఇటాలియన్‌ సూపర్‌ బైక్స్‌ తయారీ సంస్థ డుకాటీ కూడా చేరింది. తమ అన్ని మోడళ్ల బైక్‌ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఎంత శాతం సవరిస్తుందన్న విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.  “ముడిసరుకు, ఉత్పత్తి, రవాణాలకు సంబంధించిన ఖర్చులు గణనీయంగా పెరిగాయి. కొంతకాలంగా కంపెనీ ఈ భారాన్ని భరిస్తూ వస్తోంది.

అయితే వీటిని అధిగమించేందుకు, ప్రస్తుతం ధరలను సవరించాలని నిర్ణయించుకున్నట్లు” అని డుకాటీ తెలిపింది. అలాగే గ్లోబల్‍ మార్కెట్‌లోకి విడుదలయ్యే అన్ని బైక్‍లను భారత్‌కు తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది.

చదవండి: ఇది మరో కేజీఎఫ్‌.. రియల్‌ ఎస్టేట్‌ సంపాదన, భవనం మొత్తం బంగారమే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top