డుకాటీ బైక్‌ రూ.72 లక్షలు

Ducati Launches Bike Between Rs 10.39 Lakh And Rs 72 Lakh In 2023 - Sakshi

న్యూఢిల్లీ: ఇటాలియన్‌ సూపర్‌బైక్స్‌ తయారీ సంస్థ డుకాటీ ఈ ఏడాది భారత్‌కు స్ట్రీట్‌ఫైటర్‌ వీ4 లంబోర్గీని మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. 208 హెచ్‌పీ పవర్‌తో 1,103 సీసీ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది.

డుకాటీ క్విక్‌ షిఫ్ట్‌తో 6 స్పీడ్‌ గేర్‌బాక్స్, హైడ్రాలికల్లీ కంట్రోల్డ్‌ స్లిప్పర్‌ డ్రై క్లచ్‌ ఏర్పాటు ఉంది. ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.72 లక్షలు ఉండే అవకాశం ఉంది. 

దీనితోపాటు మరో ఎనమిది మోడళ్లు 2023లో భారత్‌లో రంగ ప్రవేశం చేయనున్నాయి. ఈ బైక్‌లు రూ.10.39 లక్షల నుంచి లభిస్తాయి. 2022లో కంపెనీ భారత్‌లో ఐదేళ్ల గరిష్టం.. 15 శాతం వృద్ధి సాధించింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top