డుకాటి పనిగలే V 4, ధర ఎంతో తెలుసా?

Ducati Panigale V4 launched in India  How Much Price these Bykes - Sakshi

ఇండియాలోకి డుకాటి ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌

అందుబాటులో V4, V4 S మోడల్స్‌

ధర రూ. 23 లక్షల నుంచి రూ. 28 లక్షలు  

వెబ్‌డెస్క్‌ : బైక్‌ లవర్స్‌కి శుభవార్త ! డుకాటి ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ డుకాటి ఇండియాలో అడుగు పెట్టింది. సపర్‌ స్టైలిష్‌ లుక్‌తో సాటి లేని ఇంజన్‌ సామర్థ్యంతో భారత్‌ రోడ్లపై పరుగులు పెట్టేందుకు డుకాటి పనిగలే వీ4, వీ4 ఎస్‌ మోడళ్లు రెడీ అయ్యాయి.

ధర
డుకాటి పనిగలే వీ4 ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ ధర రూ.23.50 లక్షలు ఉండగా. దీని తర్వాతి వెర్షన్‌, మోర్‌ ప్రీమియం మోడల్‌ అయిన డుకాటి పనిగలే వీ4 ఎస్‌ ధర రూ. 28.40 లక్షలుగా ఉంది.

లేటెస్ట్‌ ఫీచర్స్‌
డుకాటిలో  ప్రీమియం మోడలైన పనగలే వీ మోడళ్లకు 2020 చివరిసారి​ డిజైన్‌, ఇంజన్‌లో మార్పులు చేర్పులు చేశారు. దాని ప్రకారం న్యూ ఎయిరోడైనమిక్‌ ప్యాకేజీ, స్మాల్‌ ఇంజన్‌ ట్వీక్స్‌, హార్డ్‌వేర్‌ డిజైన్లో చేంజేస్‌ వచ్చాయి. 

భద్రత
ఈ బైక్‌పై రివ్వుమని దూసుకుపోయే రైడర్‌ భద్రత దృష్ట్యా కార్నరింగ్‌ ఏబీఎస్‌, వీలీ కంట్రోల్‌, ఇంజన్‌ బ్రేక్‌ కంట్రోల్‌, లాంచ్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. కార​‍్నర్స్‌లో బ్రేక్‌ హ్యాండ్లింగ్‌ మరింత మెరుగ్గా డిజైన్‌ చేశారు.

V4 S ప్రత్యేకతలు
అ‍ల్యుమినియం వీల్స్‌, లిథియం అయాన్‌ బ్యాటరీ, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్‌ సస్పెన్షన్‌ వంటి ఫీచర్లు డుకాటి పనగలే వీ 4 ఎస్‌లో ఉన్నాయి. ఈ ఫీచర్లు పనగలే వీ 4లో లేవు. 

పవర్‌ఫుల్‌
కాటీ పనగలే వీ 4 ఇంజన్‌ సామర్థ్యం 1103 సీసీ. త్వరలోనే డుకాటి సంస్థ క్రూజర్‌ బైక్‌ని ఇండియా మార్కెట్‌లోకి తేనుంది. 

చదవండి: మార్కెట్ లో లంబోర్గిని కొత్త లగ్జరీ కారు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top