డ్యుకాటీ డయావెల్‌ డీజిల్‌ @19.92 లక్షలు | Ducati Diavel Diesel Launched In India At ₹ 19.92 Lakh | Sakshi
Sakshi News home page

డ్యుకాటీ డయావెల్‌ డీజిల్‌ @19.92 లక్షలు

Mar 28 2017 1:46 AM | Updated on Sep 5 2017 7:14 AM

డ్యుకాటీ డయావెల్‌ డీజిల్‌ @19.92 లక్షలు

డ్యుకాటీ డయావెల్‌ డీజిల్‌ @19.92 లక్షలు

ఇటలీకి చెందిన సూపర్‌ బైక్స్‌ తయారీ కంపెనీ ‘డ్యుకాటీ’ తాజాగా లిమిటెడ్‌ ఎడిషన్‌ ‘డ్యూకాటీ డయావెల్‌ డీజిల్‌’ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌ బైక్స్‌ తయారీ కంపెనీ ‘డ్యుకాటీ’ తాజాగా లిమిటెడ్‌ ఎడిషన్‌ ‘డ్యూకాటీ డయావెల్‌ డీజిల్‌’ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.19.92 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉంది. ఈ బైక్స్‌ కోసం డ్యూకాటీ, డీజిల్‌ సంస్థలు సృజనాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.

కాగా డ్యూకాటీ, డీజిల్‌ సంస్థలు ఇదివరకు ‘డ్యూకాటీ మాన్‌స్టర్‌ డీజిల్‌’ బైక్‌ తయారీ కోసం 2012లోనూ ఒకసారి జతకాలిశాయి.  డ్యూకాటీ కంపెనీ 666 యూనిట్ల డ్యూకాటీ డయావెల్‌ డీజిల్‌ బైక్స్‌ను అంతర్జాతీయంగా కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచనుంది. దేశవ్యాప్తంగా ఉన్న డ్యూకాటీ డీలర్‌షిప్స్‌ వద్ద ప్రత్యేకమైన ఆర్డర్లు ద్వారా కస్టమర్లు ఈ బైక్స్‌ను పొందొచ్చని కంపెనీ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement