రూ.45 లక్షల బీఎండబ్ల్యూ బైక్ - పూర్తి వివరాలు | Sakshi
Sakshi News home page

రూ.45 లక్షల బీఎండబ్ల్యూ బైక్ - పూర్తి వివరాలు

Published Sat, May 18 2024 3:17 PM

BMW M 1000 XR Launched In India; Check Price And Details

'బీఎండబ్ల్యూ మోటొరాడ్' దేశీయ మార్కెట్లో సరికొత్త 'ఎమ్ 1000 ఎక్స్ఆర్' బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 45 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే భారతీయ విఫణిలో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ఇది కూడా ఒకటిగా చేరింది. ఇది సీబియూ మార్గం ద్వారా ఇండియాకు దిగుమతి అవుతాయి. ఈ బైక్ బుక్ చేసుకుంటే డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి.

మంచి డిజైన్ కలిగిన ఈ బైక్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 6.5 ఇంచెస్ టీఎఫ్‌టీ డిస్ప్లే ఉంటుంది. అంతే కాకుండా ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, బ్రేక్ స్లైడ్ అసిస్ట్ ఫంక్షన్, లాంచ్ కంట్రోల్ మరియు పిట్ లేన్ లిమిటర్ ఫంక్షన్‌లు వంటి అనేక ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఎక్స్ఆర్ బైక్ 999సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 199 Bhp పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం వాడుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 278 కిమీ కావడం గమనార్హం. ఇందులో రెయిన్, రోడ్, డైనమిక్, డైనమిక్ ప్రో మరియు రేస్ ప్రో మోడ్ అనే ఐదు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement