
జపనీస్ వాహన తయారీదారు.. కవాసకి ఇండియన్ మార్కెట్లో జెడ్900 బైక్ లాంచ్ చేసిన తరువాత, 2026 వెర్షన్ వెర్సిస్ 1100 లాంచ్ చేసింది. దీని ధర రూ. 13.79 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ అడ్వెంచర్ టూరర్ ఫిబ్రవరి 2025లో భారతదేశంలో తొలిసారిగా వెర్సిస్ 1000 స్థానంలో లాంచ్ అయింది.
2026 వెర్షన్ వెర్సిస్ 1100 డిజైన్, ఫీచర్లలో ఎలాంటి మార్పులు కనిపించినప్పటికీ.. పనితీరు పెరిగిందని తెలుస్తోంది. ఇందులోని 1099 సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ ఫోర్ ఇంజన్.. 133 హెచ్‌పి పవర్, 112 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్, టార్క్ రెండూ కూడా స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువే. కాబట్టి పనితీరు మెరుగ్గా ఉంటుంది.
2026 కవాసకి వెర్సిస్ 1100 బైకులో కవాసకి ట్రాక్షన్ కంట్రోల్ (KTRC) సిస్టమ్, కవాసకి కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్ (KCMF), కవాసకి ఇంటెలిజెంట్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ (KIBS) వంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 21 లీటర్లు. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి.. లాంగ్ రైడ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.
ఇదీ చదవండి: టీవీఎస్ కొత్త అడ్వెంచర్ బైక్: ధర ఎంతో తెలుసా?