యమహా కంపెనీ భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న XSR 155 బైకును ఇటీవలే లాంచ్ చేసింది. ఇది ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రెండు బైకుల డిజైన్, ధర, ఇంజిన్ స్పెక్స్ గురించి ఈ కథనంలో చూసేద్దాం.
ఇంజిన్ డీటెయిల్స్
యమహా XSR 155 బైక్ 155 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ద్వారా.. 10,000 rpm వద్ద 18.4 hp & 7,500 rpm వద్ద 14.1 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మంచి పనితీరును అందిస్తుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్ 349cc, ఎయిర్/ఆయిల్-కూల్డ్, జే-సిరీస్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి.. 20.2 bhp పవర్, 27 Nm టార్క్ అవుట్‌పుట్ అందిస్తుంది.
ధరలు
యమహా XSR 155 ప్రారంభ ధర రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఏడు రంగులలో లభిస్తుంది. దీని ధరలు రూ. 1.38 లక్షల నుంచి రూ. 1.16 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
ఇదీ చదవండి: వెబ్‌సైట్‌లో మాయమైన రెండు హోండా బైకులు
డిజైన్
చూడడానికి యమహా XSR 155 & రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. సీటింగ్, ఫ్యూయెల్ ట్యాంక్ వంటి వాటిలో తేడాలను గమనించవచ్చు. లైటింగ్ సెటప్, సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ వంటి వాటిలో కూడా చాలావరకు తేడాను గమనించవచ్చు. ఇంజిన్ విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉండటం గమనించవచ్చు.


