జపనీస్ వాహన తయారీ సంస్థ కవాసకి.. 2026 జెడ్900ఆర్ఎస్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సంస్థ ఈ బైకులోని పవర్‌ట్రెయిన్, ఛాసిస్, ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీ వంటి వాటిని చాలా వరకు అప్డేట్ చేసింది.
2026 Z900RS బైక్ 948 సీసీ ఇన్‌లైన్ ఫోర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. అయితే కవాసకి అన్ని గేర్‌లలో ఎలక్ట్రానిక్ త్రాటెల్ వాల్వ్స్, గేర్స్ వంటి వాటిని జోడించింది. కాబట్టి ఇంజిన్ 9,300 rpm వద్ద 116 hp & 7,700 rpm వద్ద 98 Nm టార్క్ అవుట్‌పుట్ అందిస్తుంది. ఈ గణాంకాలు స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువ.
చూడటానికి.. మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో కవాసకి కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన ఐఎంయూ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ సూట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఇదీ చదవండి: కొత్త స్కూటర్ అమ్మకాల నిలిపివేత!
సస్పెన్షన్ విషయానికి వస్తే.. 41 మిమీ USD ఫోర్క్, వెనుక మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ హార్డ్‌వేర్ ముందు భాగంలో 300 మిమీ ట్విన్ డిస్క్‌లు, వెనుక భాగంలో 250 మిమీ డిస్క్ పొందుతుంది. ఈ బైక్ ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కాగా కంపెనీ ధరలను అధికారికంగా వెల్లడించలేదు.


