ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన హీరో మోటోకార్ప్ (Hero MotoCorp).. మోటోజీబీ భాగస్వామ్యంతో యునైటెడ్ కింగ్‌డమ్(UK)లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానా హంక్ 440 మోడల్ శ్రేణిని ప్రవేశపెట్టింది.
హంక్ 440 బైక్ ట్విలైట్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్, టైటానియం గ్రే అనే మూడు రంగులలో లభిస్తుంది. దీనిని కంపెనీ హార్లే డేవిడ్సన్ సహకారంతో అభివృద్ధి చేసింది. ఇందులో 440 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 6000 rpm వద్ద 27 Bhp పవర్, 4000 rpm వద్ద 36 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ధర 3,499 పౌండ్లు (సుమారు రూ. 4.08 లక్షలు).
హీరో మోటోకార్ప్ ఇటలీ, స్పెయిన్‌లలో తన ఉనికిని విస్తరించిన తరువాత యూకేలో హంక్ 440 బైకుతో అడుగుపెట్టింది. న్యూఢిల్లీకి చెందిన ఈ కంపెనీ ఇప్పుడు ఆసియా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికాలోని 51 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, 125 మిలియన్లకు పైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది.


