భారత్‌లో పాతికేళ్ల ప్రయాణం సందర్భంగా స్కోడా ఆటో ఇండియా సరికొత్తగా ‘ఆక్టేవియా ఆర్‌ఎస్’ మోడల్‌ను తిరిగి తీసుకొచ్చింది. స్పోర్టీ డిజైన్, అధునాతన సాంకేతికత, ట్రాక్–బ్రెడ్ ఇంజనీరింగ్ అంశాల సమ్మేళనంగా రూపొందించారు. ఎక్స్‌షోరూం ధర రూ.49,99,000గా నిర్ణయించారు. ప్రీ బుకింగ్స్ ప్రారంభమైన తొలి 20 నిమిషాల్లో మొత్తం కార్లు అమ్ముడయ్యాయి. ఇది పరిమిత ఎడిషన్ కావడంతో కేవలం 100 యూనిట్లు మాత్రమే విక్రయానికి ఉంచారు.
డెలివరీలు నవంబర్ 6న ప్రారంభమవుతాయి. ఏరోడైనమిక్ లైన్స్, యాగ్రెసివ్ ఫ్రంట్ గ్రిల్, రెడ్ బ్రేక్ క్యాలిపర్స్, సిగ్నేచర్ ఆర్ బ్యాడ్జ్ ఇవన్నీ కలిసి మోడల్ లుక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి. ఇంటీరియర్‌లో స్పోర్ట్స్ సీట్స్, టచ్ర్‌స్కీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇందులో 2.0–లీటర్ టీఎస్‌ఐ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజిన్ అమర్చబడి ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 245బీహెచ్‌పీ పవర్, 370ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 7–స్పీడ్ జీఎస్‌జీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జత చేశారు. కేవలం 6.4 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చు.
పది ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీల ఏరియా వ్యూ కెమెరా వంటి ఆధునిక భద్రతా ఫీచర్లున్నాయి. అయిదు అద్భుతమైన రంగుల్లో లభిస్తుంది. ఈ మోడల్‌కు నాలుగేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ, నాలుగేళ్ల పాటు కాంప్లిమెంటరీ రోడ్–సైడ్ అసిస్టెన్స్ ఉంటాయి.


