బజాజ్ ఆటో సంస్థ తన పల్సర్ సిరీస్‌కి ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా పల్సర్ ఎన్160 కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,23,983గా ఉంది. ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ డిజైన్, లుక్‌లో కీలక మార్పులు చేసింది.
పసిడి వర్ణపు అప్‌సైడ్ డౌన్ (యూఎస్‌డీ) ఫోర్క్, స్ల్పిట్ సీట్ బదులు సింగిల్ సీట్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, పోలార్ స్కై బ్లూ, బ్లాక్ ఇలా మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. లాంచింగ్ సందర్భంగా బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సరంగ్ కనడే మాట్లాడుతూ ‘‘కస్టమర్ల అభిప్రాయాలు, డిమాండ్‌లకు అనుగుణంగా, దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ మార్పులను దృష్టిలో పెట్టుకొని గోల్డ్ యూఎస్‌బీ ఫోర్క్‌లు, సింగిల్ సీట్‌తో పల్సర్ ఎన్160ని అప్‌గ్రేడ్ చేశాము. మరింత మెరుగైన సౌకర్యాన్ని జత చేశాము. ఈ మార్పులు కొత్త తరాన్ని మెప్పిస్తాయని ఆశిస్తున్నాము’’ అన్నారు.


