ఐటీ కంపెనీలూ...పారాహుషార్‌ | NASSCOM Issues Advisory to IT Companies Over West Asia Uncertainty | Sakshi
Sakshi News home page

ఐటీ కంపెనీలూ...పారాహుషార్‌

Mar 10 2026 5:18 AM | Updated on Mar 10 2026 5:21 AM

NASSCOM Issues Advisory to IT Companies Over West Asia Uncertainty

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళికరాజకీయ ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో కార్యకలాపాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీలకు ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ హెచ్చరించింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేలా ఆపరేషనల్‌ సన్నద్ధతను పెంచుకోవాలని, సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచిస్తూ తాజాగా అడ్వైజరీ జారీ చేసింది.

ప్రస్తుతానికి వ్యాపార కార్యకలాపాలు నిలకడగానే ఉన్నప్పటికీ పరిస్థితులు దిగజారితే ఎదురయ్యే అవరోధాలను అదిగమించేందుకు కంపెనీలు క్రియాశీలకంగా తమ అత్యవసర ప్రణాళికలను పునఃసమీక్షించుకుంటున్నాయని, పటిష్టమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయని నాస్కామ్‌ పేర్కొంది. కీలకమైన సరీ్వసులు దెబ్బతినకుండా సిస్టంలు పటిష్టంగా ఉండేందుకు క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లకు ప్రత్యామ్నాయ రూటింగ్‌ ఆప్షన్లను కూడా పరిశీలించాలని సూచించింది. ప్రభావిత ప్రాంతాల్లో ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, వర్క్‌ ఫ్రం హోమ్‌ వెసులుబాటు కల్పిస్తున్నాయని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను నిశిచంగా పరిశీలిస్తున్నాయని వివరించింది.  

అనిశ్చితితో సైబర్‌ దాడుల ముప్పులు 
సాధారణంగా భౌగోళికరాజకీయ అనిశ్చితి ఏర్పడినప్పుడు మూకుమ్మడి సైబర్‌ దాడులు, తప్పుడు ప్రచారాలు, మౌలిక సదుపాయాలను దెబ్బతీయడంలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయని నాస్కామ్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మల్టీ–ఫ్యాక్టర్‌ ఆథెంటికేషన్‌ని అమల్లోకి తేవడం, పశి్చమాసియా దేశాల్లో కార్యకలాపాలున్న థర్డ్‌ పార్టీ వెండార్లతో లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం తదితర చర్యలు తీసుకోవాలని సూచించింది.

యుద్ధ పరిస్థితులు, ప్రభుత్వం నుంచి అలర్టుల్లాగా మభ్యపెట్టే థీమ్‌లతో జరిగే సోషల్‌ ఇంజినీరింగ్‌ దాడులపై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నాస్కామ్‌ పేర్కొంది. పశ్చిమాసియాలో పరిణామాలను తాము కూడా నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైన మద్దతును అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement