హార్లే - హీరో సరికొత్త బైక్‌: త్వరలో.. | Harley And Hero Updated X440 Bike | Sakshi
Sakshi News home page

హార్లే - హీరో సరికొత్త బైక్‌: త్వరలో..

Dec 28 2024 4:55 PM | Updated on Dec 28 2024 5:17 PM

Harley And Hero Updated X440 Bike

మార్కెట్లో అప్డేటెడ్ బైకులు పెరుగుతున్న తరుణంలో.. కొత్త వెర్షన్స్‌ను పరిచయం చేసేందుకు అమెరికన్‌ బ్రాండ్‌ 'హార్లే డేవిడ్‌సన్‌'తో సహకారాన్ని విస్తరించినట్టు హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) తెలిపింది.

హీరో మోటోకార్ప్‌ & హార్లే డేవిడ్‌సన్‌ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగానే.. కొత్త వెర్షన్ హార్లే డేవిడ్‌సన్‌ ఎక్స్‌440 (Harley Davidson X440) బైక్ రానుంది. ఈ రెండు కంపెనీల సహకారంతో తయారైన తొలి మోడల్‌ 'ఎక్స్‌ 440'. ఇది గతేడాది మార్కెట్లో అడుగుపెట్టింది. మంచి అమ్మకాలను కూడా పొందుతోంది.

హీరో మోటోకార్ప్‌.. హార్లే డేవిడ్‌సన్‌ మధ్య భాగస్వామ్యం 2020 అక్టోబరులో జరిగింది. ఆ తరువాత దేశంలో హార్లే డేవిడ్‌సన్‌ బ్రాండ్‌ ప్రీమియం మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేసి హీరో మోటోకార్ప్‌ విక్రయిస్తుంది. సర్వీస్, విడిభాగాల సరఫరా బాధ్యత కూడా హీరో మోటోకార్ప్‌ చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement