
ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా’ తన వాహన ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్లు ఎంపిక చేసుకున్న మోడల్‌ను బట్టి రూ.18,024 వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
ఆటోమొబైల్స్‌పై జీఎస్టీ తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది. ‘జీఎస్‌టీ 2.0 సంస్కరణలను స్వాగతిస్తున్నాము. పండుగ సీజన్‌లో టూవీలర్స్‌కు డిమాండ్ మరింత ఊపందుకోవచ్చు’’ అని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ ముత్రేజా అన్నారు.
ఇదీ చదవండి: మారుతీ కార్ల ధరలు తగ్గాయ్!