ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు! | Bengaluru IT Startup Lays Off 40 Percent Staff in a Day | Sakshi
Sakshi News home page

ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!

Mar 3 2026 3:11 PM | Updated on Mar 3 2026 3:32 PM

Bengaluru IT Startup Lays Off 40 Percent Staff in a Day

2026లోనూ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా బెంగళూరుకు చెందిన ఒక ఐటీ స్టార్టప్.. తన ఉద్యోగులలో 40 శాతం మందిని ఒకే రోజులో తొలగించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బెంగళూరులో ఒక ఐటీ స్టార్టప్‌లో పనిచేస్తున్న నా స్నేహితుల్లో ఒకరు.. ఇటీవల తన ఉద్యోగాన్ని కోల్పోయారు. అతనితో పాటు కంపెనీ ఒకేరోజు 40 శాతం మందిని తొలగించినట్లు సీఏ అర్పిత్ గోయల్ అనే ఎక్స్ (ట్విటర్) యూజర్ వెల్లడించారు.

నా స్నేహితుడు పనిచేసే ఐటీ స్టార్టప్‌లో ఏడాదికి రూ. 92 లక్షలు సంపాదిస్తున్నాడు. అయితే ప్రస్తుతం కంపెనీలు ఖర్చును తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో.. ఎక్కువ వేతనాలు పొందుతున్న ఉద్యోగులను తొలగించేస్తున్నారని అర్పిత్ గోయల్ పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇది ఉద్యోగ మార్కెట్లో పెరుగుతున్న అనిశ్చితిని స్పష్టం చేస్తోందని పేర్కొంటున్నారు.

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కలిగి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు. కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉండాలని ఒకరు పేర్కొన్నారు. రూ. 92 లక్షల జీతం అంటే.. ఒక ఐదేళ్లు జీతం తీసుకున్న వ్యక్తిని కంపెనీ తొలగించినప్పటికీ.. అది అతన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసే అవకాశం లేదని మరొకరు అన్నారు. రూ. 92 లక్షల జీతం, జీరో సేఫ్టీ అని ఇంకొకరు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement