రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్‌సీపీఎల్) తాజాగా తమిళనాడుకి చెందిన ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. జాయింట్ వెంచర్ ఒప్పందం ప్రకారం కంపెనీలో ఆర్‌సీపీఎల్‌కి మెజారిటీ వాటాలు, సంస్థ గత ప్రమోటర్లు ఎస్. సుధాకర్, ఎస్. దినకర్‌లకు మైనారిటీ వాటాలు ఉంటాయి.
ఈ డీల్‌తో ఆర్‌సీపీఎల్ ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఉదయం బ్రాండ్ కూడా చేరినట్లయింది. ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను దశాబ్దాలుగా అందిస్తూ ఉదయం ఎంతో పేరొందిందని ఆర్‌సీపీఎల్ డైరెక్టర్ టి. కృష్ణకుమార్ తెలిపారు. ఉదయం బ్రాండ్ కింద బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ప్యాకేజ్డ్ పప్పు ధాన్యాలు మొదలైన అమ్ముడవుతున్నాయి.


