
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వంటి స్పిన్నర్లు కాస్త పర్వాలేదన్పించినప్పటికి.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి ప్రధాన పేసర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు. వికెట్ల విషయం పక్కన పెడితే సరైన లైన్ అడ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు.
సరైన వేగంతో బౌలింగ్ చేయడంలో కూడా ఫాస్ట్ బౌలర్లు విఫలమయ్యారు. అరంగేట్ర బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ది సైతం ఇదే కథ. ఓ వికెట్ పడగొట్టినప్పటికి భారీ పరుగులు మాత్రం సమర్పించుకున్నాడు. భారత బౌలర్లను సునాయసంగా ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. స్టోక్స్ సేన ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో బౌలింగ్ యూనిట్‌పై భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ విమర్శల వర్షం కురిపించాడు. ముఖ్యంగా అరంగేట్ర ఆటగాడు అన్షుల్ కాంబోజ్, మహ్మద్ సిరాజ్‌లను సిద్ధూ టార్గెట్ చేశాడు.
"మాంచెస్టర్‌లో మహ్మద్ సిరాజ్, అన్షుల్ కాంబోజ్ గంటకు 120 నుంచి 130 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తున్నారు. స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా ఈ వేగంతో బౌలింగ్ చేయగలడు. కాంబోజ్ తొలి టెస్టు ఆడుతున్నప్పటికి ఈ రకమైన బౌలింగ్ చేయడం సరికాదు. వికెట్లు తీయకపోయినా కనీసం బ్యాటర్లను కట్టడి చేయాలి.
అదేవిధంగా శార్ధూల్ ఠాకూర్‌ను తిరిగి మళ్లీ జట్టులోకి ఎందుకు తీసుకున్నారో నాకు ఆర్ధం కావడం లేదు. అతడు బ్యాటింగ్‌లో 30 నుంచి 40 పరుగుల వరకు జట్టుకు అందించవచ్చు. కానీ బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు. వికెట్ల విషయం పక్కన పెడితే, ప్రసిద్ద్ కృష్ణలా 15 ఓవర్లు పాటు పరుగులు ఎక్కువగా ఇవ్వకుండా బౌలింగ్ చేయగలడా? అదేవిధంగా మూడో రోజు ఆటలో 68 ఓవర్ జడేజాతో బౌలింగ్ చేయంచడం నాకు ఆశ్చర్యం కలిగించింది.
ఎందుకంటే గత మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన సుందర్‌ను అంత అలస్యంగా ఎటాక్‌లోకి ఎందుకు తీసుకొచ్చారు? సుందర్ ఒక అద్బుతమైన స్పిన్నర్. ఈ మ్యాచ్‌లో అతడు హ్యారీ బ్రూక్‌కు వేసిన డెలివరీ నాకు దిగ్గజ స్పిన్నర్ ఎరపల్లి ప్రసన్నను గుర్తు చేసింది" అని తన యూట్యూబ్ ఛానల్‌లో సిద్దూ పేర్కొన్నాడు.