
మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న నాలుగో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత టెస్టు జట్టులోకి యువ పేసర్ అన్షుల్ కాంబోజ్‌ను బీసీసీఐ చేర్చింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్ అందుబాటులో ఉంటారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఆకాష్ దీప్ గాయపడగా.. నాలుగో టెస్టు కోసం ప్రాక్టీస్ సందర్భంగా అర్ష్‌దీప్ చేతి వేలికి గాయమైంది. అర్ష్‌దీప్ కోలుకోవడానికి దాదాపు 10 రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్షుల్ కాంబోజ్‌కు తొలిసారి సెలక్టర్లు పిలుపునిచ్చారు.
దీంతో అతడు ఉన్నపళంగా భారత్ నుంచి లండన్‌కు బయలుదేరినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనాధికారిక టెస్టుల్లో భారత-ఎ తరపున కాంబోజ్ ఆడాడు. ఈ సిరీస్‌లో కాంబోజ్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ పేసర్ 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు.
అన్షుల్ కాంబోజ్ ఐపీఎల్-2025 సీజన్‌లో ఎంఎస్ ధోని సారథ్యంలో సీఎస్‌కే తరపున ఆడాడు. ఐపీఎల్‌లో కూడా తన బౌలింగ్ ప్రదర్శనతో కాంబోజ్ ఆకట్టుకున్నాడు. అతడికి అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. గంటకు 138-139 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరిట ఓ పది వికెట్ల హాల్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అతడి సీనియర్ జట్టులోకి తీసుకున్నారు. ఇక అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత జట్టు 2-1 తేడాతో వెనకబడి ఉంది. దీంతో నాలుగో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-1తో సమం చేయాలని గిల్ బృందం భావిస్తోంది.
చదవండి: WCL: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. అఫ్రిదిపై వేటు!