భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్‌లో జరిగే 'ద హండ్రెడ్' (The Hundred) 2026 సీజన్ కోసం మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో మంధాన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ విషయాన్ని సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ అధికారికంగా గురువారం ప్రకటించింది. గత సీజన్‌కు వరకు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ మాంచెస్టర్ ఒరిజినల్స్‌గా ఉండేది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా..మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులో 70% వాటాను కొనుగొలు చేశారు.
దీంతో మాంచెస్టర్ ఒరిజినల్స్ పేరును లక్నో సూపర్ జెయింట్స్‌గా మార్చారు. మాంచెస్టర్ జట్టులో మెగ్ లానింగ్, సోఫీ ఎకిల్‌స్టోన్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు. స్మృతికి 'ది హండ్రెడ్' టోర్నీలో ఆడిన అనుభవం ఉంది. గతంలో ఆమె సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది
2022 సీజన్‌లో సదరన్ బ్రేవ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా మంధాన నిలిచింది. ఇక మాంచెస్టర్ పురుషల జట్టులో జోస్ బట్లర్, హెన్రిచ్ క్లాసెన్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఇక ఈ ఏడాది సీజన్ జూలై 21 నుంచి ఆరంభం కానుంది.
చదవండి: BCB: ఆటగాళ్ల తిరుగు బాటు..! కీలక అధికారిపై వేటు వేసిన బీసీబీ


