నవంబర్‌లో హైరింగ్‌ జోరు  | White collar hiring picks up pace in November 2025 | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో హైరింగ్‌ జోరు 

Dec 4 2025 6:28 AM | Updated on Dec 4 2025 6:28 AM

White collar hiring picks up pace in November 2025

వార్షికంగా 23 శాతం అప్‌ 

ఐటీయేతర రంగాల్లో భారీగా నియామకాలు 

వైట్‌–కాలర్‌ ఉద్యోగాలపై నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ నివేదిక 

ముంబై: దేశీయంగా నవంబర్‌లో వైట్‌ కాలర్‌ ఉద్యోగాలకు (మేనేజర్, అకౌంటెంట్, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ మొదలైనవి) సంబంధించిన నియామకాలు పుంజుకున్నాయి. వార్షికంగా 23 శాతం పెరిగాయి. నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం ముఖ్యంగా విద్య, రియల్‌ ఎస్టేట్, ఆతిథ్య, పర్యాటక, బీమా లాంటి ఐటీయేతర రంగాల్లో హైరింగ్‌ గణనీయంగా నమోదైంది. నౌకరీడాట్‌కామ్‌లో కొత్త జాబ్‌ లిస్టింగ్స్, రిక్రూటర్ల సెర్చ్‌లను విశ్లేíÙంచిన మీదట దేశీయంగా జాబ్‌ మార్కెట్‌ ధోరణులపై ఈ రిపోర్ట్‌ రూపొందింది. దీన్ని బట్టి చూస్తే గత నెల ఐటీ రంగంలో హైరింగ్‌ పెద్దగా పెరగలేదు. విద్య (44 శాతం), రియల్‌ ఎస్టేట్‌ (40 శాతం), ఆతిథ్య/పర్యాటకం (40 శాతం), బీమా (36 శాతం) రంగాల్లో అత్యధికంగా రిక్రూట్‌మెంట్‌ నమోదైంది. 

నివేదికలో మరిన్ని విశేషాలు.. 
→ యూనికార్న్‌లలో (1 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌ గల సంస్థలు) నియామకాలు 35 శాతం పెరిగాయి. అలాగే అధిక విలువ చేసే ప్యాకేజీలుండే (వార్షికంగా రూ. 20 లక్షలు) ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్‌ 38 శాతం పెరిగింది. ఈ–కామర్స్‌ సంస్థల్లో 27 శాతం, ఐటీ యూనికార్న్‌లలో 16 శాతం వృద్ధి నమోదైంది. 
→ ప్రాంతీయంగా చూస్తే చెన్నై (49 శాతం), హైదరాబాద్‌ (41 శాతం), ఢిల్లీ/ఎన్‌సీఆర్‌ (41 శాతం)లో అత్యధికంగా హైరింగ్‌ నమోదైంది. 13–16 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ల రిక్రూట్‌మెంట్‌ యూనికార్న్‌లలో 50 శాతం ఎగిసింది.  
→ దేశవ్యాప్తంగా ఎంట్రీ–స్థాయి హైరింగ్‌ 30 శాతం పెరిగింది. మెట్రోయేతర నగరాలు దీనికి సారథ్యం వహించాయి. అహ్మదాబాద్‌ (41 శాతం) అగ్రస్థానంలో ఉండగా కోయంబత్తూర్‌ (32 శాతం), జైపూర్‌ (31 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ముంబై, బెంగళూరులాంటి కీలక మెట్రో హబ్‌లు వరుసగా 29 శాతం, 26 శాతం వృద్ధి కనపర్చాయి. 
→ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లలో హైరింగ్‌ 18 శాతం పెరిగింది. ముఖ్యంగా డేటా సైంటిస్టులు (49 శాతం), సొల్యూషన్స్‌ ఆర్కిటెక్ట్‌లు (45 శాతం), ఫుల్‌ స్టాక్‌ డెవలపర్లు (36 శాతం), డేటా ఇంజినీర్లకు (33 శాతం) డిమాండ్‌ నెలకొంది. స్ట్రాటెజీ, మేనేజ్‌మెంట్‌ కన్సలి్టంగ్‌ జీసీసీల్లో హైరింగ్‌ 50 శాతం, ఐటీ రంగ జీసీసీల్లో 9 శాతం మేర నియామకాలు పెరిగాయి. 
→ చిన్న వ్యాపారాలు సైతం డిజిటల్‌ నిపుణులను నియమించుకునే ధోరణి పెరుగుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement