భారత కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్‌తో భారత రూపాయి మారక విలువ మళ్లీ పడిపోయింది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం చుట్టూ ఉన్న నిరంతర ఈక్విటీ అవుట్ ఫ్లోలు, అనిశ్చితి కారణంగా డిసెంబర్ 4న రూపాయి 22 పైసలు పడిపోయింది.
కీలకమైన రూ.90 మార్కును అధిగమించి మునుపటి సెషన్ ను ముగించిన తర్వాత డాలర్‌తో రూపాయి విలువ గురువారం రూ.90.41 వద్ద ప్రారంభమైంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిమిత జోక్యం కూడా కరెన్సీని ఒత్తిడిలో ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: రూపాయి తగ్గితే ఏమౌతుంది?


