హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ‘ది కాస్కేడ్స్ నియోపోలిస్’ డెవలపర్లు చారిత్రక విజయాన్ని సాధించారు. జీహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా, అర్బన్ బ్లాక్స్ రియాల్టీ కన్సార్టియం తెలంగాణలో రెండో అత్యధిక ల్యాండ్ బిడ్‌ను గెలుచుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్వహించిన 3వ ఫేజ్ వేలంలో ఈ కన్సార్టియం నియోపోలిస్ ప్లాట్ 15ను దక్కించుకుంది. ఈ మేరకు 4.03 ఎకరాల కోసం డెవలపర్లు ఎకరానికి రూ.151.25 కోట్లు రికార్డు స్థాయిలో బిడ్ వేశారు.
ఇది తెలంగాణలో ఇప్పటివరకు ఎకరాకు నమోదైన రెండో అత్యధిక వేలంగా నిలిచింది. రాష్ట్రంలో అత్యధిక బిడ్ అక్టోబర్ 2025లో రాయదుర్గ్‌లోని నాలెడ్జ్ సిటీలో నమోదైంది. అక్కడ భూమి ఎకరానికి రూ.177 కోట్లు పలికింది. ఈ భారీ పెట్టుబడి నియోపోలిస్‌ను హైదరాబాద్ అత్యంత ప్రతిష్టాత్మక, వేగంగా అభివృద్ధి చెందుతున్న డెవలప్‌మెంట్ కారిడార్‌గా సూచిస్తుంది.
నియోపోలిస్‌లో కన్సార్టియం దృష్టి
ఈ తాజా బిడ్ నియోపోలిస్‌లో కన్సార్టియం ప్రాబల్యాన్ని బలోపేతం చేస్తుంది. ది కాస్కేడ్స్ నియోపోలిస్‌ను జూన్ 2025లో ఆవిష్కరించారు. ఇది రూ.3169 కోట్ల లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇందులో 217 మీటర్ల వరకు ఎత్తు ఉన్న ఐదు 63 అంతస్తుల టవర్లు ఉంటాయని కన్సార్టియం తెలిసింది.
ఇదీ చదవండి: క్రికెట్‌పై ఆసక్తి ఉన్నా తగ్గిన మార్కెట్.. ఎందుకంటే..


