ఒడిశాలోని భద్రక్ జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలో చోటు చేసుకున్న ఒక విచిత్రమైన సంఘటన చర్చనీయాంశమైంది. అక్రమ నిర్మాణాల తొలగింపు (ఎన్‌క్రోచ్‌మెంట్ డ్రైవ్) సందర్భంగా బ్యాంకు మొదటి అంతస్తు కార్యాలయానికి ఉన్న మెట్లను కూల్చివేశారు. దాంతో కస్టమర్లు, సిబ్బంది బ్యాంకు సర్వీసులు పొందడానికి తాత్కాలికంగా ట్రాక్టర్ వెనుక భాగంలో అమర్చిన నిచ్చెన ద్వారానే బ్యాంకులోకి ప్రవేశించాల్సిన పరిస్థితి నెలకొంది.
మెట్లు కూల్చివేత
భద్రక్ రైల్వే స్టేషన్ నుంచి చరంపా మార్కెట్ వరకు నవంబర్ 20, 21 తేదీల్లో పెద్ద ఎత్తున క్లియరెన్స్ ఆపరేషన్ జరిగింది. ఈ డ్రైవ్‌లో భాగంగా ఎస్‌బీఐ భవనం ముందు భాగం మెట్లతో సహా అనేక దుకాణాలు, ఇళ్లు, వాణిజ్య నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలను ఖాళీ చేయడానికి ముందుగా బహిరంగ ప్రకటనలు చేసి ఆక్రమణదారులకు రెండు రోజుల సమయం ఇచ్చామని అధికారులు చెప్పారు. చాలా మంది దుకాణదారులు స్వచ్ఛందంగా అక్రమ నిర్మాణాలను తొలగించారని తెలిపారు.
SBI, Bhadrak (Odisha).
Anti-encroachment drive demolished the bank branch's staircase.
Customers are measuring ladder which is placed over tractor-trolley to access the bank.
Several questions to ask. But .. leave it! India is not for beginners 😒 pic.twitter.com/tvAgpMZCyi— The Hawk Eye (@thehawkeyex) November 25, 2025
అయితే బ్యాంకు భవన యజమానికి అక్రమ నిర్మాణాలపై అనేక నోటీసులు వచ్చినా ఎటువంటి చర్య తీసుకోలేదని సమాచారం. సబ్ కలెక్టర్, తహసీల్దార్, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల పర్యవేక్షణలో ఈ కూల్చివేత ప్రక్రియ జరిగింది.
ఇదీ చదవండి: ఎన్వీడియాకు గూగుల్ గట్టి దెబ్బ


