మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్ తన ఏఐ డేటా సెంటర్లలో గూగుల్ టెన్సర్ ఏఐ చిప్‌లను వాడేందుకు బిలియన్ డాలర్లు ఖర్చు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ మెటా ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం ఏఐ కంప్యూటింగ్ రంగంలో టాప్‌లో ఉన్న ఎన్వీడియాకు గట్టి దెబ్బ తగలబోతుందని కొందరు అంచనా వేస్తున్నారు.
2027లో ఏఐ డేటా సెంటర్లలో గూగుల్ టీపీయూలు
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం మెటా తన ఏఐ డేటా సెంటర్లలో 2027 నాటికి గూగుల్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లను(TPU) ఉపయోగించేందుకు చర్చలు జరుపుతోంది. దాంతోపాటు వచ్చే ఏడాది గూగుల్ క్లౌడ్ నుంచి కూడా ఈ చిప్‌లను మెటా అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. గూగుల్ ఇప్పటికే ఆంత్రోపిక్ పీబీసీకి 1 మిలియన్ టెన్సర్ చిప్‌లను సరఫరా చేస్తోంది.
గూగుల్ టెన్సర్
ఏఐ పనుల కోసం దాదాపు 10 సంవత్సరాల క్రితం టెన్సర్ చిప్‌ను గూగుల్ అభివృద్ధి చేసింది. ఎన్వీడియా చిప్‌లపై అతిగా ఆధారపడటంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఏఎండీ వంటి ప్రత్యర్థులు ఉన్నప్పటికీ గూగుల్ టెన్సర్ చిప్స్ ఊపందుకుంటున్నాయి.
ఎన్వీడియా చిప్స్
ఎన్వీడియా బ్లాక్‌వెల్ వంటి చిప్‌లు ప్రాథమికంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌లు (GPU). ఇవి గత దశాబ్దంలో వీడియో గేమ్‌లకు కీలకంగా ఉండేవి. లార్జ్ డేటాను నిర్వహించగల సామర్థ్యం కారణంగా ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఇవి చాలా అనుకూలంగా మారాయి.
ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్.. వివరాలివే..


