ఓపెన్ ఏఐ రంగంలో విజేతగా నిలవాలంటే చిన్న చిన్న సమస్యల్ని కాకుండా, పరిష్కారానికి అత్యంత కష్టంగా ఉండేవాటిని ఎంచుకోవాలని వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘టుగెదర్ ఫండ్’ కో–ఫౌండర్ మానవ్ గార్గ్ అంటు న్నారు. ఏఐ రంగంలో స్టార్టప్ పెట్టుబడుల వేటలో ఉన్నవారు తమ విజన్ ప్రపంచాన్ని ఎలా మెరుగుపరచ గలదో స్పష్టంగా చెప్పలేకపోతే వెంచర్ క్యాపిటలిస్టు లను ఒప్పించటం చాలా కష్టం అని గార్గ్ సూచిస్తు న్నారు. ఆయన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:
వస్తున్నది 100... పోతున్నది 110
‘‘ప్రస్తుతం దాదాపు అన్ని ఏఐ స్టార్టప్ కంపెనీలూ నష్టాల్లోనే నడుస్తున్నాయి. దీనర్థం ఏమిటంటే, మాకు వంద రూపాయల ఆదాయం వస్తే... కేవలం టెక్నాలజీ, కంప్యూటర్ సర్వర్ల కోసమే 110 రూపాయలు ఖర్చు అవుతోంది. ఇక మార్కెటింగ్, ఉద్యోగుల జీతాల ఖర్చులు దీనికి అదనం. అలాగని ఇది తెలివి తక్కువ తనం కాదు, ఇదొక వ్యూహం. టెక్నాలజీ ఖర్చులు రాను రానూ వేగంగా తగ్గిపోతాయి కాబట్టి, ఇప్పుడు నష్ట మైనా సరే ఎక్కువ మంది వినియోగదారులను, డేటాను సంపాదించుకునే కంపెనీలే భవిష్యత్తులో లాభాలు వచ్చినప్పుడు మార్కెట్‌ను ఏలుతాయి.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీ ఖర్చు
‘‘ఓపెన్–ఏఐ’ సంస్థ వేల కోట్లు నష్టపోతోందని వినిపి స్తోంది. వారు సుమారు 5 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూడబోతున్నారని అంచనా. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ నష్టంలో కేవలం 20 శాతం మాత్రమే కొత్త ఏఐ మోడల్స్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు వల్ల వస్తుంది. అసలైన భారీ ఖర్చంతా– దాదాపు 70 శాతం – ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసమే. పెద్ద ఎత్తున డేటాసెంటర్ల నిర్మాణం, ఎంత వ్యయమైనా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌లను కొనడం, కరెంట్ బిల్లుల చెల్లింపు వంటివి. గూగుల్ సంస్థలా సొంతంగా చిప్స్ తయారీ, సొంత డేటా సెంటర్లు ఏర్పాటు, ప్రత్యేక విద్యుత్
ఒప్పందాలు ఉన్నప్పుడు మాత్రమే ఇంత పెద్ద స్థాయిలో ఏఐ వ్యాపారాన్ని లాభదాయకంగా నడపడం సాధ్య మవుతుంది.
యాప్స్ స్థానంలో ఏఐ ఏజెంట్లు!
‘‘మనం ఇప్పుడు వాడుతున్న సాధారణ యాప్స్ భవి ష్యత్తులో మెల్లగా మరుగునపడిపోతాయి. రాబోయే కాల మంతా ‘ఏఐ ఏజెంట్’ (ఒక పర్సనల్ అసిస్టెంట్ లాంటి సాఫ్ట్‌వేర్)లదే. మనం గంటల కొద్దీ బ్రౌజింగ్ చేయటం ఉండదు. ఈ ఏఐ ఏజెంట్లకు మీ ఇష్టానిష్టాలు తెలు స్తాయి. మీ తరఫున అవి పనులు చేస్తాయి. మీ క్యాలెండర్ లేదా మీరు ధరించే వాచీలు వగైరాల నుంచి సమా చారాన్ని తీసుకుని ఎప్పటికప్పుడు మీకు సాయపడ తాయి. ఒక్కసారి ఊహించండి:
నా పర్సనల్ ఏఐ
ఏజెంట్ నేరుగా అమ్మకాలు జరిపేవారి ఏఐ ఏజెంట్‌తో మాట్లాడుతుంది. నా బడ్జెట్ ప్రకారం బేరమాడుతుంది, నా ఆరోగ్యానికి తగిన, నా సమయానికి అనుకూలమైన వస్తువును ఎంచుకుంటుంది. ఆపై నేరుగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఇదంతా నేను ఒక్క వెబ్‌సైట్ కూడా ఓపెన్ చేయకుండానే జరిగి పోతుంది.
కొత్తవాటిపై కసరత్తు చేయాలి!
‘‘మీరు ఏఐ రంగంలో విజేతగా నిలవాలంటే, అందరికీ తెలిసిన చిన్న చిన్న సమస్యలు కాకుండా, పరిష్కరించ డానికి కష్టంగా ఉండే కొత్త సమస్యలను ఎంచుకోవాలి. అప్పుడే మీ పోటీదారులు మిమ్మల్ని త్వరగా కాపీ కొట్ట లేరు. మీ దగ్గర ఉన్న ప్రత్యేకమైన డేటా ఆధారంగా ఇతరులు సులభంగా తయారు చేయలేని విధంగా మీ వ్యాపారాన్ని నిర్మించుకోవాలి.
ఏఐ రేసులో భారతదేశం శక్తిని చాలామంది తక్కువగా అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఓపెన్–ఏఐ’ని ఎక్కువగా వాడు తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దగ్గర అద్భుతమైన ఇంజనీర్లు ఉన్నారు. అంతేకాకుండా, ఇక్కడ చాలా రకాల వ్యాపారాలు ఇంగ్లిష్‌లోనే జరుగు తాయి కాబట్టి, భారతీయ కంపెనీలు మొదటి రోజు నుండే ప్రపంచ స్థాయిలో కొత్త ఏఐ ఉత్పత్తులను తయారు చేసే గొప్ప అవకాశం ఉంది.
-ఎడిటోరియల్ టీమ్


