శీతాకాలంలో ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి మంచిది.ఉసిరికాయలో ఉండే పోషకాలు మనలోని రోగనిరోధక శక్తికి, చర్మం, జుట్టు, కీళ్ల ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. పులుపు, తీపి, వగరు కలిసిన ఉసిరితో టేస్టీ టేస్టీ వంటకాలు చేసుకోవచ్చు. హెల్తీ డ్రింక్స్‌తో మార్నింగ్‌ను మొదలుపెట్టవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా ఉసిరితో చేసుకోదగిన ఉత్తమ వంటకాలు చూద్దాం.
పులిహోర
కావల్సినవి: వండి, చల్లార్చిన అన్నం – 2 కప్పులు; ఉసిరి పేస్ట్ – అర కప్పు; పచ్చి మిర్చి – 3; ఎండు మిర్చి – రెండు; ఆవాలు -అర టీస్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; పల్లీలు – టేబుల్ స్పూన్; శనగపప్పు – టీ స్పూన్, జీడిపప్పు– టేబుల్ స్పూన్
తయారీ: ఉసిరికాయలోని గింజ తీసేసి, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి ∙బాణలిలో నూనె పోసి, వేడి చేయాలి. దాంట్లో శనగపప్పు, జీడిపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి, వేయించాలి పోపు దినుసులు వేగాక ఉసిరి పేస్ట్ వేసి, కలపాలి ∙పై మిశ్రమాన్ని అన్నంలో వేసి, కలపాలి.
జామ్
కావల్సినవి: ఉసిరి – 250 గ్రా.లు; బెల్లం – 200 గ్రా.లు; నీళ్లు – అర కప్పు; ఏలకులు – 2.
తయారీ: ∙ఉసిరిని ఉడికించి, గింజ తీసేసి, మెత్తగా పేస్ట్ చేయాలి ∙మరొక పాత్రలో నీళ్లు, బెల్లం వేసి మరిగించాలి. దీంట్లో ఉసిరి పేస్ట్ వేసి, ఉడికించాలి ∙మిశ్రమం ఉడుకుతుండగా, ఏలకుల పొడి వేసి కల పాలి ∙మిశ్రమ గట్టిగా అయ్యేంతవరకు ఉడికించి, దించాలి. చల్లారాక బ్రెడ్ లేదా చపాతీతో సర్వ్ చేయాలి.
చదవండి: World Vegan Day 2025 శాకాహారంతో ఆరోగ్య ప్రయోజనాలు
లడ్డు
కావల్సినవి: ఉసిరి తురుము – అర కప్పు; బెల్లం ΄పొడి – పావు కప్పు; నీళ్లు – పావు కప్పు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఏలకుల పొడి – చిటికెడు; డ్రై ఫ్రూట్స్ (బాదంపప్పు, జీడిపప్పు)– తరిగినవి.
తయారీ: ∙ఉసిరి తురుమును నెయ్యిలో కొద్దిగా వేయించుకోవాలి ∙బెల్లం సిరప్ (పావు కప్పు నీళ్లలో బెల్లం తురుము వేసి, పాకం తయారు చేయాలి) తయారు చేసి, అందులో వేయించిన ఉసిరి, డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి ∙మిశ్రమం చల్లారాక చిన్న చిన్న లడ్డూలు చేయాలి. రోజుకు ఒకటి తిన్నా ఇమ్యూనిటీకి బూస్ట్‌లా ఈ లడ్డూ ఉపయోగపడుతుంది.
ఉసిరి హనీ డ్రింక్
కావల్సినవి: ఉసిరి రసం – 2 టేబుల్ స్పూన్లు; తేనె – టేబుల్ స్పూన్; మిరియాల పొడి – చిటికెడు; అల్లం రసం – పావు టీ స్పూన్.
తయారీ: ∙అన్నింటినీ కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి ∙ఇమ్యూనిటీ పెరుగుతుంది, చర్మం నిగనిగలాడుతుంది, జీర్ణక్రియ బాగుంటుంది.
ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా?


