Beauty Tip : మీ ముఖం చందమామలా మెరవాలంటే..! | Today Best Tips In Telugu check it for glowing face | Sakshi
Sakshi News home page

మీ ముఖం చందమామలా మెరవాలంటే..!

Jun 6 2025 3:14 PM | Updated on Jun 6 2025 7:36 PM

Today Best Tips In Telugu check it for glowing face

ఆరోగ్యకరమైన ఆహారం, తగినన్ని నీళ్లు,  సూర్యరశ్మి, క్రమం తప్పని వ్యాయామం,  మంచి ఆలోచనలు మంచి చర్మ , జుట్టు, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.  ఆరోగ్యాన్ని మంచిన అందం, ఆనందం మరొకటి ఉండదు.  ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అందరిలోనూ అందమైన చందమామలా  మెరిసిపోవాలని ఎవరికి ఉండదు.  అందుకే అద్భుతమైన చిట్కాలు మీకోసం..

  • పెసర పిండిలో పెరుగు కొబ్బరి నూనె కలిపి ముఖాలకు  చేతులకు పాదాలకు రాయాలి. ఆరిన తరువాత మృదువుగా శుభ్రం చేసుకుంటే.. మిల మిల మెరుపు మీ సొంతం.
  • మందార ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ బాగా సాయపడుతుంది    ఒక కప్పు నీటిలో ఒక పూవు చొప్పున వేసి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్‌ పెరుగుతుంది.
  • ముఖం మిలమిలలాడాలంటే కొబ్బరి నూనెలో కాఫీ  పౌడర్‌  వేసి ఇది పేస్ట్‌ లా తయారయ్యేంత వరకూ బాగా కలపాలి.
    ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాస్తే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు క్రమంగా తగ్గి  పోతాయి.
  • కలబంద గుజ్జు అలోవెరా జెల్‌... ఒక సహజసిద్ధమైన కండీషనర్‌. మాయిశ్చరైజర్‌ కూడా.
  • కలబంద గుజ్జును చర్మం మీద, మాడు మీద రుద్దితే, చుండ్రు సమస్యలు, చర్మ వ్యాధులు చాలా వరకు తగ్గుతాయి. 
  • కలబంతో కాలిన గాయాలు కూడా త్వరగా మాని పోతాయి మచ్చలు ఏర్పడవు
  • గోరింటాకు, జుత్తుకు సహజసిద్ధమైన రంగుగానే కాకుండా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ నివారణలోనూ బాగా తోడ్పడుతుంది. వెంట్రుకల కుదుళ్లను పటిష్టం చేయడం ద్వారా ఇది చుండ్రును, జుత్తు రాలడాన్ని నివారిస్తుంది.

ఇవీ చదవండి: Food Crisis In Gaza: రూ. 5ల బిస్కట్‌ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement