
యుక్త వయసులోనే ఉన్నట్టుండి గుండెనొప్పితో కుప్పకూలి చనిపోతున్న ఘటనలు అనేకం చేస్తున్నాయి. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నవారు కూడా ‘గుండె’ లయ తప్పుతున్న కారణంగా ఉన్న పళంగా ప్రాణాలు విడిస్తున్నారు. అయితే తిన్న వెంటనే వాకింగ్ చేస్తే గుండెపోటువచ్చే అవకాశాలు 40 శాతం వరకూ తగ్గుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అన్నం తిన్న వెంటనే నడకతో వచ్చే లాభాల గురించి తెలుసుకుందాం.
25నుంచి 30 ఏళ్ల యువత కూడా గుండెపోటుకు గురవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్, కనీస వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకర జీవనశైలి, తగినంత నిద్ర లేకపోవడం, ఊబకాయం, ఒత్తిడి వంటి అనేక కారణాలు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కానీ ఈ చిన్న అలవాటు గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
నిజానికి భోజనం చేసిన వెంటనే నడవడం వల్ల అలసట, కడుపు నొప్పి , ఇతర రకాల అసౌకర్యాలు కలుగుతాయని ఒక అపోహ ఉంది. కానీ భోజనం చేసిన తర్వాత నడవడం బరువు తగ్గడానికి తిన్న తర్వాత ఒక గంట తర్వాత నడన కంటే, వెంటనే చేసే వాకింగ్ ఎక్కువ ప్రభావ వంతంగా ఉంటుందని అధ్యయనంలో కనుగొన్నారు. భోజనం చేసిన తర్వాత ఒక గంట తర్వాత ప్రారంభించి 30 నిమిషాలు నడవడం కంటే భోజనం తర్వాత కనీసం 30 నిమిషాలు నడక అలవాటు చేసుకుంటే,కండరాలు గ్లూకోజ్‌ను వెంటనే ఉపయోగించు కోవడంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా నియంత్రణలో ఉంటుంది. అందుకే భోజనం తర్వాత వీలైనంతత్వరగా నడకను అలవాటు చేసుకోవాలి.జిమ్‌కి వెళ్లడం, కఠినమైన వ్యాయామాలు చేయడం సాధ్యంకాని వారికి ఇది నిజంగా వరం లాంటిదని చెప్పవచ్చు.
ప్రతిరోజూ భోజనం తర్వాత ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత వీలైనంత త్వరగా 30 నిమిషాలు వేగంగా నడవడం వల్ల ఎక్కువ బరువు తగ్గే అవకాశాలున్నాయి. లేదంటే ప్రతి ఆహారం గ్లూకోజ్‌గా మారి రక్తంలోకి వెళ్తుంది. ఆ సమయంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడం వల్ల రక్తనాళాల్లో వాపు, ఒత్తిడి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో రక్తనాళాల లైనింగ్‌ను దెబ్బతీసి గుండె జబ్బులకు దారి తీస్తుంది.
భోజనం చేసిన వెంటనే కూర్చుండిపోవడం, మొబైల్ చూస్తూ అలా ఉండిపోవడం, లేదంటే వెంటనే మంచంమీద వాలిపోవడం లాంటివిఆరోగ్యానికి చాలా చేటు చేస్తాయి. అలా కాకుండా కేవలం 30 నిమిషాల పాటు నడక ఎన్నో రకాల అనారోగ్యాలనుంచి తప్పించుకోవచ్చు. రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా, ఆహారం శక్తిగా మారుతుంది. కండరాలు బలపడటతాయి. బరువు కూడా అదుపులో ఉంటుంది.