సూపర్‌ టిప్స్‌ : ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు! | Tip of the day Weight Loss Tips in your Busy Schedule | Sakshi
Sakshi News home page

Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!

Jul 12 2025 3:51 PM | Updated on Jul 12 2025 5:49 PM

Tip of the day  Weight Loss Tips in  your Busy Schedule

బరువు తగ్గాలంటే ఆహార అలవాట్లను మార్చుకోవాలి. వ్యాయామం చేయాలి. వీటన్నింటి కంటే ముందు అసలు మనం ఎందుకు బరువు ఎక్కువగా ఉన్నాయో విశ్లేషించుకోవాలి. అంతర్లీనంగా ఏవైనా ఆరోగ్యసమస్యలున్నాయేమో అనేది వైద్య నిపుణుల ద్వారా చెక్‌ చేసుకోవాలి. అప్పుడు వ్యాయామం, ఆహారంమీద దృష్టిపెట్టాలి. అయితే ఎక్స్‌ర్‌సైజ్‌ చేయడానికి టైం లేదబ్బా.. ఇది అందరూ  చెప్పేమాట. మరి దీనికి పరిష్కారమేంటి?  బిజీ షెడ్యూల్‌తో సతమతయ్యేవారు, అస్సలు టైం ఉండటం  లేదు అని బాధపడే వారు  ఏం చేయాలి? ఇవాల్టి ‘ టిప్‌ ఆఫ్‌  ది డే’ లో  తెలుసుకుందాం.

బిజీ బిజీ జీవితాల్లో బరువు తగ్గడంపై దృష్టి పెట్టేందుకు సమయం దొరకడం కష్టంగా అనిపించవచ్చు. కానీ మన కోసం, మన ఆరోగ్యం కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించడం చాలా అవసరం.  అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం. స్మార్ట్‌గా మన షెడ్యూల్‌ ఆధారంగా దినచర్యను అలవాటు చేసుకోవాలి.  గంటలు గంటలు జిమ్‌లో గడాల్సిన అవసరం లేకుండానే,  సింపుల్‌ చిట్కాలు, చిన్న చిన్న జీవనశైలి సర్దుబాట్లతో  ఫిట్‌నెస్‌ సాధించవచ్చు.

స్మార్ట్ ప్రిపరేషన్
బరువు తగ్గడం, ఫిట్‌గా ఉండాలి అనే విషయంలో కూడా  కమిట్‌మెంట్‌  చాలా ముఖ్యం. ప్లాన్డ్‌గా, స్మార్ట్‌గా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌నుంచే మన ప్రిపరేషన్‌ మొదలు పెట్టేద్దాం. ఇందుకు పది నిమిషాలు చాలు. ఉడికించిన గుడ్లు,  స్మూతీ, లేదా రాత్రి నానబెట్టిన ఓట్స్‌ బెస్ట్‌. వీటిని తొందరగా ప్రిపేర్‌ చేసుకోవచ్చు. పోషకాలు కూడా ఎక్కువే. ఖచ్చితంగా ఇంతే తినాలని అనుకొని, టిఫిన్‌ లేదా లంచ్‌  ప్యాక్‌ చేసుకుంటే..అతిగా తినే ముప్పు తప్పుతుంది.  

వ్యాయామం- ఆ 2 నిమిషాలు 
కనీసం వ్యాయామం శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. రోజులో కనీసం అర్థగంట వ్యాయామానికి  కేటాయిస్తే చాలు. అలాగే సుదీర్ఘ వ్యాయామం చేయలేకపోతున్నామన్న దిగులు అవసరం లేదు.  రోజంతా రెండు, రెండు నిమిషాలు మినీ వర్కౌట్‌లు చేయండి.  అంటే కాఫీ విరామాలలో స్క్వాట్‌లు, డెస్క్ స్ట్రెచ్‌లు లేదా లిఫ్ట్‌లకు బదులుగా  ఎక్కడం  లాంటివి.  డెస్క్‌ వర్క్‌ అయినా సరే.. ప్రతీ గంటకు ఒకసారి స్వల్ప విరామివ్వడం ముఖ్యం.  వీలు, సౌలభ్యాన్ని  బట్టి, చిన్న చిన్న డెస్క్‌ వ్యాయామాలు చేయవచ్చు.

అందుకే ఇటీవల చాలా ఐటీ కంపెనీల్లో స్టాండింగ్‌ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రయాణాల్లో రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌, ఎయిర్‌పోర్ట్‌లలో  సమయం ఉన్నపుడు సాధ్యమైనంత నడవడానికి, నిల్చొని ఉండడానికి ప్రయత్నించండి. ఇవి జీవక్రియను చురుకుగా ఉంచడం తోపాటు, శరీర భాగాల్లో కొవ్వు పేరుకు పోకుండా చేస్తుంది.

ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!

హైడ్రేషన్‌: ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్‌ను  వెంట తీసుకెళ్లండి. హైడ్రేటెడ్‌గా ఉండటం జీవక్రియను మెరుగు పరుస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. మరింత ఉత్సాహంకోసం నిమ్మకాయ, పుదీనా  కలిపిన నీళ్లు, లేదా పల్చని మజ్జిగ తాగండి.

“స్నాక్ స్మార్ట్”: వండుకునే టైం లేదనో టైం పాస్‌ కోసమో, ఆకలిగా ఉండనో, ఎనర్జీ డ్రింక్స్‌, ప్యాక్డ్‌ ఫుడ్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ వైపు మళ్లకండి. దీనికి బదులుగా నట్స్‌,  రోస్టెడ్‌  సీడ్స్‌, ప్రోటీన్ బార్‌లు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్ ప్యాక్‌లపై దృష్టిపెట్టండి.  వీలైతే వీటిని మీ బ్యాగ్, డెస్క్ లేదా కారులోనో ఉంచుకోండి. వీటి వల్ల పోషకాలు బాగా అందుతాయి. శక్తి లభిస్తుంది. అంతేకాదు  దీని వల్ల షుగర్‌ ఫుడ్స్‌, ఆయిలీ ఫుడ్‌, అనారోగ్యకరమైన స్ట్రీట్‌ ఫుడ్‌కి దూరంగా ఉండొచ్చు.  

వండుకోవడానికి సమయంలో లేనప్పుడు. తక్కువ సమయంలో, ఎక్కువ ప్రొటీన్డ్‌ ఫుడ్‌ తినేలా ప్లాన్‌ చేసుకోండి.  

గంటల తరబడి కుర్చీకి, సోఫాకి అతుక్కుపోవద్దు. వీలైనన్నిసార్లు లేచి నడుస్తూ ఉండాలి. ఉదా : ఫోన్‌ మాట్లాటప్పుడు,  టీవీ చూస్తున్నపుడు, పాడ్‌కాస్ట్ వింటున్నప్పుడు  నడుస్తూ ఉండాలి. అలాగే  భోజనం తరువాత కనీసం 10నిమిషాల నడక అలవాటు చేసుకోండి.ఇలా చేయడం వల్లన యాక్టివ్ఉండటంతోపాటు,రోజంతా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

చదవండి: యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్‌!

పోర్షన్ కంట్రోల్: మన తినే ఆహారంలో కొర్బ్స్‌ తక్కువ, ప్రొటీన్‌ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.  "మైండ్‌ఫుల్ ఈటింగ్" అనేది ముఖ్యం. ఎక్కువ తినకుండా పొట్ట నిండేలా ఉడికించిన కూరగాయ ముక్కలు, మొలకెత్తిన గింజలు,  పుచ్చ, బొప్పాయి లాంటి పళ్లకు చోటివ్వండి.  కొద్దిగా కొద్దిగా నెమ్మదిగా తినండి. చిన్న ప్లేట్‌లను ఉపయోగించండి. ఎందుకంటే బిజీగా ఉండేవారు ఆ హడావిడిలో వేగంగా, ఎక్కువగా తినేస్తారు. అలాగని కేలరీలను మరీ అబ్సెసివ్‌గా లెక్కించాల్సిన అవసరం లేదు. పోర్షన్ కంట్రోల్‌పై దృష్టిపెడాలి. అపుడు ఎంత తక్కువ తిన్నా కడుపు నిండిన అనుభూతినిస్తుంది. స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు తినడం మానుకోండి. ఏం తింటున్నామన్న దానిపై దృష్టి పెట్టి శ్రద్ధగా, ఆస్వాదిస్తూ తినండి.

గంట కొట్టినట్టు నిద్రపోవాలి
నిద్ర లేకపోవడం ఆకలి హార్మోన్‌లను ఉత్తేజితం చేస్తుంది.   సమయానికి నిద్రపోవాలి. వారాంతాల్లో కూడా నిద్రవేళకు ఒక నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకోండి, దానికి కట్టుబడి ఉండండి. చక్కటి విశ్రాంతి తీసుకున్న శరీరం ఎక్కువ బరువు తగ్గేలా ప్రతిస్పందిస్తుంది.  సంకల్ప శక్తి పెరుగుతుంది.

చీట్‌ మీల్‌, ఓకే 
అప్పుడప్పుడూ వ్యాయామాన్ని మిస్‌ అయినా,  కాస్త ఎక్కువ తిన్నే మరీ ఎక్కువ ఆందోళన చెందకండి. చీట్‌మీల్‌ అనుకోండి. బిజీ షెడ్యూల్‌లో అన్నీ అనుకున్నట్టు ప్రణాళిక ప్రకారం జరగవు అని సర్దుకుపోండి. మిస్‌ అయిన వ్యాయాన్ని మరునాడు సర్దుబాటు చేసుకోండి.  అంతే... అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మీ సొంతం.

నోట్‌: ఇవి అవగాహనకోసం అందించిన చిట్కాలు మాత్రమే. ఎవరి శరీరాన్నివారు అర్థం చేసుకొని, ప్రేమించాలి.  బరువు తగ్గడం అనేది ఎవరికి వారు  నిశ్చయించుకొని,  స్వీయ క్రమశిక్షణతో, పట్టుదలగా  చేయాల్సిన పని  అని మర్చిపోవద్దు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement