Today Tips టైగర్‌ దోమ- డెంగ్యూ ఫీవర్‌, ఈ జాగ్రత్తలు మస్ట్‌! | tip of the day Monsoon Health Care dengue threat how to stay safe | Sakshi
Sakshi News home page

Today Tips టైగర్‌ దోమ- డెంగ్యూ ఫీవర్‌, ఈ జాగ్రత్తలు మస్ట్‌!

Jul 2 2025 5:26 PM | Updated on Jul 2 2025 5:37 PM

tip of the day Monsoon Health Care dengue threat how to stay safe

Monsoon Health Care వర్షాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, వైరల్‌ ఫీవర్లు దండెత్తుతాయి. ముఖ్యంగా  డెంగ్యూ వ్యాధి వ్యాప్తికి ఈ సీజన్‌ చాలా అనుకూలమైంది. ఎందుకంటే దోమలు ఈ సమయంలో బాగా వృద్ధి చెందుతాయి. డెంగ్యూ అనేది దోమల ద్వారా వ్యాపించే ఒక వైరల్ వ్యాధి, ఇది తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాపాయం ముప్పు కూడా  ఉంది. అందుకే ఇవాల్టి టిప్‌ ఆఫ్‌ ది డేలో  భాగంగా డెంగ్యూపై అవగాహనకు సంబంధించిన టిప్స్‌ తెలుసుకుందాం.

వర్షాకాలంలో దోమల వ్యాప్తి అధికంగా ఉంటుందన్నారు.  ఏడిస్‌ జాతికి చెందిన టైగర్‌ అనే దోమ మంచి నీటిలో వృద్ధి చెంది పగటి సమయంలో దాడి చేస్తుంది. ఏడిస్ (Aedes) జాతికి చెందిన దోమలలో టైగర్ దోమ (Asian Tiger Mosquito) ఒకటి. దీని శాస్త్రీయ నామం ఏడిస్ ఆల్బోపిక్టస్ (Aedes albopictus). ఇది నలుపు, తెలుపు చారలతో ఉంటుంది, అందుకే దీనిని పులి దోమ అని కూడా పిలుస్తారు. ఈ దోమల కాటు వల్ల ప్రాణాంతక డెంగ్యూ జ్వరం వ్యాప్తి చెందుతుందన్నారు. దోమల వ్యాప్తిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని  వైద్యులు సూచిస్తున్నారు.సాధారణంగా 8-10 రోజుల పాటు వేధించే వ్యాధి.దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే చాలా వరకు డెంగ్యూ లక్షణాలు సాధారణ జ్వరాన్ని పోలి ఉండడంతో మొదట్లో గుర్తించడం కష్టంగా ఉంటుంది. అయితే నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో అది ప్రాణాపాయానికి కూడా దారి తీస్తుంది.

వర్షపు నీరు నిలిచిపోవడంతో దోమలు వృద్ధి చెందుతాయి. ఈ కాలంలో  దోమలు చాలా చురుకుగా ఉంటాయి . ఎ‍క్కడ నిల్వ నీరు, మురుగు నీరు  కనిపించినా  గుడ్లు పెట్టేస్తాయి.  సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయానికి ముందు దోమలు ఎక్కువగా యాక్టివ్ గా ఉంటాయనేది గమనించాలి.. 

డెంగ్యూ -తీసుకోవలసిన చర్యలు
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.నిలిచిపోయిన నీటిని తొలగించాలి. ప్లాస్టిక్‌ డబ్బాలు, పాత తొట్టెలు ,  బండి టైర్లలో నీళ్లు నిల్వలేకుండా చూసుకోవాలి. దోమల నివారణకు దోమతెరలు, స్ప్రేలు వాడాలి.
డెంగ్యూ వైరస్‌ సోకిన రోగిని కుట్టిన తర్వాత దోమ ఆ వైరస్‌ను తీసుకెళ్లి ఆరోగ్యంగా ఉన్న మరో వ్యక్తిని కుట్టినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది కనుక అప్రమత్తంగా ఉండాలి.
వర్షాకాలంలో వీలైనంతవరకు ఇంట్లోనే ఉంటూ, పోషకాహారాన్ని తీసుకోవాలి.  వేడి వేడి, శుభ్రమైన ఆహారాన్ని భుజించాలి. జ్వరం, ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి  

డెంగ్యూ జ్వరం లక్షణాలు:
అధిక జ్వరం
తీవ్రమైన తలనొప్పి
కను రెప్పల చుట్టూ నొప్పి
కండరాలు,  కీళ్ల నొప్పులు, చిగుళ్లలో రక్తస్రావం,
వికారం , వాంతులు,తీవ్రమైన అలసట,  చర్మంపై దద్దుర్లు

నోట్: వర్షకాలంలో జ్వరాలు, వైరల్‌ ఫీవర్లు, జలుబు, గొంతు నొప్ప సహజం. ప్రతీ చిన్న  జ్వరానికి భయపడకూడదు. అలాగని నిర్లక్ష్యమూ తగదు. జ్వరం తీవ్రత,లక్షణాలను బట్టి తక్షణమే వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లోని పిల్లలు, వృద్ధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement