
తరచుగా తలనొప్పి , మైగ్రేన్ బాధపడుతున్నారా? మందులతో విసిగిపోయారా? ఆగండాగండి యోగా మీకు తప్పకుండా సాయపడుతుంది.. లోతైన శ్వాస వ్యాయామాలతో కలిపి మైండ్‌ఫుల్ ఆసనాలు, ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడం, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం, రక్త ప్రసరణను మెరుగు పర్చుకోవడం ఉపశమనం పొందవచ్చు. ఇవాల్టీ టిప్ ఆప్ ది డేలో భాగంగా మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకునేందుకు ఉపయోగపడే కొన్నియోగాసనాల గురించి తెలుసుకుందాం.
దీర్ఘకాలిక తలనొప్పిని తగ్గించడానికి నెమ్మదిగా కదిలే, విశ్రాంతినిచ్చే యోగా ఉత్తమం. తలనొప్పి లేదా మైగ్రేన్‌తో బాధపడే ఎవరైనా వయస్సు లేదా ఫిట్‌నెస్ స్థాయితో సంబంధం లేకుండా ఈ యోగాసనాలను ప్రయత్నించవచ్చు. మైగ్రేన్ నుండి ఉపశమనం పొందడానికి సున్నితమైన, నెమ్మదిగా చేసే యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయాలి. మైగ్రేన్ నొప్పిని ప్రేరేపించని లేదా తీవ్రతరం చేయని సున్నితమైన, విశ్రాంతినిచ్చే యోగా పద్ధతులను ఎంచుకోవాలి. ముఖ్యంగా బాలాసనం, సేతు బంధాసనం, శవాసనం వంటివి మేలు చేస్తాయి. వేగవంతమైన, శక్తివంతమైన యోగా, చేయకూడదు. ఎందుకంటే అవి మైగ్రేన్‌లను ప్రేరేపించగలవు.
ప్రాణాయామం (శ్వాస వ్యాయామాలు):
అనులోమ విలోమ (ముక్కు రంధ్రాలు మార్చి చేసే శ్వాస), బ్రహ్మరి (తేనెటీగ శబ్దం చేసే శ్వాస) వంటివి మనస్సును ప్రశాంతపరుస్తాయి .ఒత్తిడిని తగ్గిస్తాయి. ధ్యానం ద్వారా మనస్సును శాంతపర్చి, ఒత్తిడిని తగ్గిస్తుంది. మెడ, భుజాలు ,వెన్నెముకలో ఉద్రిక్తత తరచుగా తలనొప్పికి దోహదం చేస్తుంది. కనుక వీటిని “సున్నితంగా సాగదీయడం ఈ కండరాలను సడలిస్తుంది, లోతైన శ్వాస మెదడుకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, హార్మోన్లను తగ్గిస్తుంది. అతి చురుకైన నరాలను శాంతపరుస్తుంది. మైండ్‌ఫుల్ అభ్యాసాలు
బాలాసనం: యోగా మ్యాట్‌మీద మోకాళ్లపై కూర్చోవాలి. తరువాత పాదాలపై పిరుదులు ఆనేలా కూర్చోవాలి. తరువాత నుదురు భాగం మ్యాట్‌కు తగిలేలా మెల్లిగా ముందుకు వంగాలి. తర్వాత రెండు చేతులను ముందుకు పూర్తిగా చాపాలి. అలా ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. 30 సెకన్ల పాటు ఈ ఆసనం వేసినా చాలు.
బాలాసనంతో ఒత్తిడిని తగ్గించి, శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మోకరిల్లి, ముందుకు మడిచి, మీ నుదిటిని నేలపై లేదా కుషన్‌పై ఉంచండి. ఇది భుజం, మెడ మరియు నుదిటి ఉద్రిక్తతను తక్షణమే తగ్గిస్తుంది.
అధో ముఖ స్వనాసన: అధో ముఖ స్వనాసన అరచేతులు , పాదాలను నేలపై ఉంచి తుంటి భాగాన్ని (సూర్య నమస్కారంలో చేసినట్టుగా)పైకి లేపడం. వెన్నెముకను బలాన్నిస్తుంది. నడుము నొప్పిని తగ్గిస్తుంది. మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరిచి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. తలకు రక్త ప్రసరణను అందించి రిఫ్రెష్ చేస్తుంది.
విపరీత కరణి: విపరీత కరణి అంటే "ప్రవాహానికి వ్యతిరేకం" అనే సంస్కృత అర్థాన్ని సూచించే యోగా భంగిమ. దీనిని "లెగ్స్ అప్ ది వాల్ పోజ్" అని కూడా పిలుస్తారు. వెల్లకిలా పడుకుని , కాళ్ళు , పాదాలను గోడకు ఆనించాలి. అరచేతులు క్రిందికి ఎదురుగా ఉండేలా చేతులను శరీరానికి దగ్గరగా ఉంచండి.
ఆలోచనకు కళ్లెం వేసి, తలనొప్పి ఒత్తిడిని తగ్గిస్తుంది.
సుప్త బద్ధ కోణాసన : ఇది పడుకుని చేసే సీతాకోకచిలుక భంగిమ. మనస్సును ప్రశాంతపరుస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని, పాదాల అరికాళ్ళను ఒకదానికొకటి తాకించి, మోకాళ్ళను పక్కలకు వంచండి. కావాలంటే వెన్నెముక కింద కుషన్ పెట్టుకోవచ్చు. ఈ భంగిమలో కొంత సమయం పాటు విశ్రాంతి తీసుకోండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆందోళనతోవచ్చిన తలనొప్పిని తగ్గిస్తుంది.
సేతు బంధాసనం: ఈ భంగిమ నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.
శవాసన (శవ భంగిమ): రిలాక్స్‌డ్, ఫ్లాట్‌గా పడుకోండి. ఈ అంతిమ విశ్రాంతి భంగిమ మీ నాడీ వ్యవస్థను రీసెట్ చేస్తుంది. విశ్రాంతి కోసం ఈ ఆసనం చాలా ముఖ్యమైనది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసుకు ప్రశాతంతనిచ్చి, నొప్పులను తగ్గిస్తుంది.
నోట్ : అవగాహనకోసం, తాత్కాలిక ఉపశమనం కోసం అందించిన చిట్కాలుమాత్రమే. మైగ్రేన్ మరింతగా బాధిస్తోంటే వైద్యుడిని సంప్రదించం మేలు, అలాగే యోగా నిపుణుని సలమా మేరకు యోగాను ప్రారంభించడం చాలా ముఖ్యం.