
వర్షాకాలంలో ముఖ సౌందర్యం కోసం, జుట్టు రక్షణ చర్మంలోని తేమను నియంత్రించడం జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యంగా వాతావరణానికి అనుగుణంగా చర్మ రక్షణ పద్దతులు పాటించాలి. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా వర్షాకాలంలో అందాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం.
వానా వానా వందనం అనుకుంటూ.. వేడి వేడి బజ్జీలు లాగించేస్తూ చర్మ సంరక్షణను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. గాలిలోని ఆర్ద్రత, వర్షం వల్ల.. చర్మం జిడ్డుగా, లేదంటే పొడిగా మారే అవకాశం ఉంది. అందుకే రెయిన్ సీజన్‌లోనూ కూడా చర్మం, జుట్టు సంరక్షణలో సులభమైన, సహజమైన బ్యూటీ టిప్స్ పాటించాల్సిందే.
వర్షాకాలం పాటించాల్సిన సౌందర్య చిట్కాలు
మాయిశ్చరైజర్: వాతావరణం తేమగా ఉంటుంది కనుక చర్మరంధ్రాలు మూసుకోకుండా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి తేలికపాటి మాయిశ్చరైజర్‌ని వాడాలి.ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్‌లు లేదా మార్కెట్‌లో లభించే సురక్షితమైన ఫేస్ మాస్క్‌లను ఉపయోగించడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది
మేఘావృతమైన రోజులలో కూడా, సూర్యుని యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. అందుకే కనీస SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలి.
చర్మంలోని సహజ నూనెలను తొలగించే కఠినమైన ఉత్పత్తులకు బదులుగా మీ చర్మానికి తగినట్టుగా, సున్నితమైన, నూనె లేని సువాసన లేని క్లెన్సర్‌ను ఎంచుకోండి.
వర్షాకాలంలో మొటిమలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, మొటిమలను నివారించడానికి, చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంపిక చేసిన ఉత్పత్తులను ఉపయోగించాలి.
వర్షాకాలంలో హెవీ మేకప్ కాకుండా, తేలికపాటి, వాటర్ ప్రూఫ్ లైట్ మేకప్ ఎంచుకోవాలి. ఫౌండేషన్, కన్సీలర్‌ను సెట్ చేయడానికి సెట్టింగ్ స్ప్రే వాడితే బెటర్.
వర్షాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పటికీ, సన్‌స్క్రీన్ ఉపయోగించడం ముఖ్యం. ఇది చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తుంది. పండ్లు, కూరగాయలు మరియు ఇతర పోషకమైన ఆహారాలను తీసుకోవడం ద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, చర్మాన్ని లోపలినుంచి ఆరోగ్యంగా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగాలి.
మన జుట్టుకు తగిన షాంపూ మరియు కండీషనర్ ఎంచుకోవాలి. వర్షంలో తడిచిన తడి జుట్టును అలాగే వదిలేయకుండా సహజంగా ఆరేలా చూసుకోవడం. తప్పదు అనుకుంటే డ్రైయ్యర్ వాడాలి. జుట్టు చిట్లిపోకుండా ఉండటానికి కండీషనర్ లేదా హెయిర్ సీరమ్‌ని ఉపయోగించండి.
జిడ్డు చర్మం ఉన్నట్లయితే, టోనర్ ఉపయోగించడం మంచిది. కాఫీ, చార్‌కోల్, ఆల్కహాల్, గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్‌లు ఉన్న టోనర్‌లను వాడటం వల్ల చర్మం తాజాగా ఉంటుంది.
మురికి , బ్యాక్టీరియా బదిలీ కాకుండా ఉండటానికి ముఖాన్ని ఊరికే టచ్ చేస్తూ ఉండడం మానుకోండి.
వీటితో పాటు రోగ నిరోధశక్తిని కాపాడుకునేందుకు పౌష్టికాహారం తీసుకోవాలి. ఎందుకంటే వానాకాలంలో జలుబు, దగ్గు, వైరల్, సీజనల్ ఫీవర్లు ముసురే అవకాశాలెక్కువ. తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకోవడంతోపాటు విటమిన్ సికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది యాంటీఆక్సిడెంట్, చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్ నష్టం నుండి కాపాడుతుంది. అలాగే కనీసం వ్యాయామం కూడా చాలా అవసరం.