
భారతదేశంలో అత్యంత చౌకగా లభించే తృణధాన్యం.దీన్నే ఆంగ్లంలో ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు.
ఈ చిరు ధాన్యాలలో కాల్షియం, ఇనుము , విటమిన్లు బి1 నుండి బి3 లాంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా రాగా మాల్ట్ లేదా రాగి జావ ఎలా తయారు చేయాలో చూద్దాం.
మొలకలతో పిండి
రాగి మాల్ట్ తయారు చేయడానికి రాగులను నానబెట్టి, మెత్తని బట్టలో కట్టిపెట్టి, మొలకెత్తించి, నీడలో ఎండబెట్టి, పిండిగా తయారు చేసుకోవాలి. మొలకెత్తిన రాగులతో తయారుచేసిన రాగి మాల్ట్ మరింత పోషకమైనది, సులభంగా జీర్ణమయ్యేది కాబట్టి. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా దీన్ని నిస్సంకోచంగా తీసుకోవచ్చు.
రాగి మాల్ట్ తయారీ
స్టవ్ మీద పాన్ లేదా కుండలో రెండు కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ లోపు ఒక కప్పు నీళ్లలో రాగుల పిండి జారుగా కలుపుకోవాలి.నీళ్లు మరుగుతున్నపుడు కలిపిన రాగిపిండిని పోసి, ముద్దలు లేకుండా తరచుగా కలుపుతూ ఉడికించుకోవాలి.
మిశ్రమం కాస్త చిక్కగా గరిటె జారుగా అయ్యేలా చూసుకోవాలి.ఇందులో మజ్జిగ, ఉప్పు కలుపుకొంటే కమ్మటి రాగి జావ రెడీ.
ఇందులో ఇష్టమున్న వారు బెల్లం, నెయ్యికలుపుకొని తాగవచ్చు.
అలాగే ఉడికించే నీళ్లలో కొంచెం పాలనుకూడా కలుపుకోవచ్చు.ఇంకా బాదం పౌడర్ లేదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ లేదా సన్నగా తరిగిన ముక్కలతో గార్నిష్‌తో చేస్తే పిల్లలకు చాలామంచిది.

రాగుల జావ, ఆరోగ్య ప్రయోజనాలు
రాగి జావలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది బాడీకి శక్తినిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రాగి జావలో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, సాయ పడుతుంది.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది: రాగి జావలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
రాగి జావలో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలను బలపరుస్తుంది.
రాగి జావలో ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనతను నివారిస్తుంది.
రాగి జావలో ఉండే పోషకాలు జుట్టు రాలడం నివారించడంలో సహాయపడతాయి.
రాగి జావలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
రాగి జావను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం మంచిది. లేదా, భోజనానికి ముందు లేదా తర్వాత తాగవచ్చు.