కాఫీ అంటే ఇష్టపడనివారు ఉండారు. అబ్బా దాని వాసనే కాఫీ తాగనివాళ్లను సైతం నోరూరిస్తుంది. అలాంటీ టేస్టీ కాఫీని ఇంత వెరైటీగా తాగాలనుకుంటే మాత్రం దెబ్బకు వాంతులు అవ్వడం కాయం. ఏమైంది అనుకోకుండి.. చైనా ఓ సరికొత్త కాఫీ టేస్ట్‌ని పరిచయం చేయనుంది. అదెలాగో తెలిస్తే ఛీ...య్యాక్ అనేస్తారు.
బీజింగ్‌లోని ఒక మ్యూజియం కాఫీని మాములు వెరైటీగా కాఫీప్రియులకు అందిచడం లేదు. అది సర్వ్ చేసే విధానం చూ బాబోయ్ అనిపించే రేంజ్‌లో..అత్యంత విలక్షణంగా అందిస్తోంది కస్టమర్లకు. ఇలాంటి ఆలోచనలు ఎక్కడ నుంచి వస్తాయ్ అబ్బా అని అనుకోకుండా ఉండరు ఎవ్వరైనా. ఇంతకీ ఎలాగంటే..బొద్దింకలను పైన జల్లి, ఎండిన పసుపు మీల్ వార్మ్‌లు కూడా జోడిస్తారు. ఆమ్యూజియం పేరు క్రిమీ మ్యూజియం అట. అందుకని ఆ పేరుకు తగ్గట్టు కస్టమర్లకు ఇలా సర్వ్ చేస్తున్నట్లు తెలిపారు.
అంతేకాదండోయ్ ఈ కాఫీ పేరు రోచ్ కాఫీ అట.కప్పు కాఫీ ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 542లు పలుకుతుందట. ఇలాంటి కాఫీ కేవలం ఆ మ్యూజియంలోనే దొరకుతుందట. అలాగే ఇలాంటి వెరైటీ పానీయాలు మరికొన్ని కూడా ఉన్నాయి. జీర్ణ రసంతో తయారు చేసిన పానీయాలు, హాలోవీన్ సందర్భంగా యాంట్(చీమల) డ్రింక్‌వంటి పలు విభిన్నడ్రింక్స్ ఉన్నాయట. అయితే ఆ మ్యూజియం వీటిని నిర్భయంగా తాగొచ్చని, ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదని కస్టమర్లకు హామీ ఇవ్వడం మరింత విశేషం.
ఆ పానీయాల తయారీకి సంబంధించిన ముడిసరకును మొత్తం సాంప్రదాయ చైనీస్ ఔషధ (TCM) మూలికా దుకాణం నుంచి కొనుగోలు చేస్తామని సదరు మ్యూజియ అధికారులు చెబుతుండటం గమనార్హం. అంతేగాదు చైనీస్ ఔషధం ప్రకారం..బొద్దింక పొడి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడేతుందట. అలాగే ప్రొటీన్ అధికంగా ఉండే మీల్‌వార్మ్‌లు రోగనిరోధక శక్తిని పెంచుతాయట. కాగా, కొందరు చీమల పానీయం పుల్లని రుచి కలిగి ఉండగా, రోచ్ కాఫీ సాధరణ కాఫీలానే ఉందని చెబుతున్నారు.
(ఆ పెయింటింగ్ ధర ఏకంగా రూ.487 కోట్లు!..అందులో ఇంత కథ ఉందా!)


