విదేశీ భూభాగాలపై కన్నేయడం చైనాకు పరిపాటి. అది పొరుగు దేశమైతే చైనా చర్యలు మరీ అతిగా ఉంటాయి. ఈ క్రమంలోనే వేరే దేశం భూభాగాన్ని తమ మ్యాప్‌లో కూడా చూపించడానికి చైనా వెనుకాడదు. ముందు ఒక రాయి వేసి.. తర్వాత ఏం జరుగుతుందో చూస్తుంది. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌ని పదే పదే చైనా తమ భూభాగంలో చూపించడం ఒక ఉదాహరణ.
అయితే ఇక్కడ భారత్ బలమైన దేశం అనేది ఒకటైతే, ఇప్పుడు చైనాకు భారత్ సాయం అవసరం ఉంది కాబట్టి వారు ఎటువంటి దుస్సాహసానికి పాల్పడటం లేదు. గత కొన్నేళ్లుగా భారత్‌పై దూకుడుగా ఉండే విషయంలో చైనా ఆచితూచి వ్యవహరిస్తోంది. అదే సమయంలో భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న చైనా.. ఇప్పుడు వేరే దేశాలపై పడింది. అందులో ఒకటి రష్యా అయితే, మరొకటి పాకిస్తాన్.
కొన్ని రోజుల క్రితం రష్యా భూభాగాన్ని తమ మ్యాప్‌లో చూపించిన చైనా.. ఇప్పుడు పాకిస్తాన్‌ను టార్గెట్ చేసింది. చైనాకు పాకిస్తాన్ మిత్రదేశమే కానీ, అవకాశం వస్తే తమకు మిత్రులు, శత్రువులు ఎవరూ ఉండరనే నైజం చైనాది. ఆ క్రమంలోనే పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ భూభాగంపై చైనా కన్నేసినట్లు కనబడుతోంది. ఎప్పుట్నుంచో పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్న బలూచిస్తాన్.. సుదీర్ఘ పోరాటం చేస్తుంది. తమ హక్కులను పాకిస్తాన్ కాలరాస్తుందని, అందుకు తమకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ ఎక్కువైంది.
పాక్‌పై ప్రేమా..యురేనియం నిల్వలే టార్గెటా?
బలూచిస్తాన్‌లో యురేనియం నిల్వలు ఉన్నాయనేది కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్న తరుణంలో చైనా ఆచితూచి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్‌కు సైనిక సాయం పేరుతో ముందుగా వారి భూభాగంలోకి ప్రవేశించాలని చైనా కుట్ర రాజకీయాలకు పాల్పడే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంటున్నారు. అందిందే జుట్ట.. అందకపోతే స్నేహం అనేది చైనా వైఖరి. ఇప్పడు భారత్ విషయంలో చైనా అదే చేస్తంది. మరి పాకిస్తాన్ విషయంలో చైనా అలా ఎందుకు ఆలోచించదని నిపుణులు చెబుతున్న మాట,. ప్రస్తుతం పాకిస్తాన్‌క సైనిక సాయం పేరుతో చైనా ఒక అడుగు ముందకేసి, ఆ తర్వాత మిగతాది చూసుకోవచ్చనే దృష్టితో ఉందని అంటున్నారు.
బలూచిస్తాన్‌లో యురేనియం నిల్వల పరిస్థితి
బలూచిస్తాన్‌లో యురేనియం నిల్వలు ఉన్నాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఇవి చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టులకు కూడా భద్రతా, భౌగోళిక రాజకీయ పరంగా ప్రభావం చూపుతున్నాయి.ప్రపంచ స్థాయి యురేనియం నిల్వల జాబితాలో పాకిస్తాన్ పేరు ఉన్నప్పటికీ, బలూచిస్తాన్‌లోని నిల్వల ఖచ్చితమైన పరిమాణం అంతర్జాతీయ నివేదికల్లో స్పష్టంగా ఇవ్వబడలేదు. ఈ వనరుల కారణంగా స్థానిక ప్రజల్లో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ అస్థిరత కారణంగా తవ్వకాలు, వినియోగం కష్టతరంగా మారాయి. ఓవరాల్‌గా చూస్తే ఈ వనరులు పాకిస్తాన్‌కు వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి. చైనా పెట్టుబడులు, స్థానిక అసంతృప్తి, మరియు అంతర్జాతీయ ఆసక్తి కారణంగా ఇవి సున్నితమైన అంశంగా మారాయి.
బలూచిస్తాన్ నేతల్లో అదే ఆందోళన..
ప్రస్తుతం బలూచిస్తాన్ నేతల్లో అదే ఆలోచన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు పాకిస్తాన్‌తో పోరాడటానికే తాము ఆపసోపాల పడుతుంటే, మరొకవైప చైనా గోల ఏమిటో వారికి అంతుపట్టడం లేదు. తమ భూభాగంలోకి చైనా సైనిక దళాలు వస్తాయనే కచ్చితమైన సమాచారంతోనే వారు భారత్ సాయాన్ని అభ్యర్థిస్తున్నారు. అందుకోసమే భారత్ సాయాన్ని పదే పదే కోరుతున్నారు. అయితే బలూచిస్తాన్‌కు సాయం విషయంలో భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ఎందుకంటే బలూచిస్తాన్‌ను కూడా పూర్తిగా నమ్మలేం. అసలే ఉగ్రవాద మూలాలున్న బలూచిస్తాన్‌కు సాయం చేస్తే తర్వాత భారత్‌కు విపత్కర పరిస్థితుల ఏర్పడవచ్చు.
అందుకోసమేనా ఎదురుచూపులు?
తమకు అవకాశం వచ్చినప్పుడల్ల పాకిస్తాన్‌తో యద్ధానికి కూడా సై అంటోంది బలూచిస్తాన్. అయితే జనాభా పరంగా చూసినా, బలూచిస్తాన్ రెబల్స్ ప్రకారం చూసినా.. ఒక దేశంతో పోరాడాలంటే వారి శక్తి సరిపోదు. ఈ తరుణంలో తమ భూభాగంలోకి చైనా వైమానిక దళాలు త్వరలో రాబోతున్నాయని బలూచిస్తాన్ అగ్రనేత మిర్ బలూచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసం భారత్ సాయాన్ని కూడా అభ్యర్థించారు. దశాబ్దాల క్రితం పాకిస్తాన్ నుంచి విముక్తి పొందిన బంగ్లాదేశ్ తరహాలో తమకు స్వాతంత్ర్యం కావాలని బలూచిస్తాన్ నేతలు కోరుకుంటున్నారు. అప్పుడు ఎలా అయితే భారత్ సాయం చేసిందో ఇప్పుడు కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటోంది. ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌కు సైతం బలూచిస్తాన్ నుంచి లేఖ వచ్చింది.
బలూచిస్తాన్ సాయం విషయంలో భారత్ ఎటువంటి దూకడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు బలూచిస్తాన్‌కు సైనిక బలం కావాలి కాబట్టి. భారత్ సాయాన్ని కోరుతుందనేది అందరికీ తెలిసిన విషయం. ఈ తరుణంలో బలూచిస్తాన్‌కు భారత్ మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. కానీ పాకిస్తాన్ నుంచి మరొకసారి ముప్పు ఎదురైన పక్షంలో భారత్ తమ ఉన్న వనురులను ఉపయోగించుకునే ముందుకెళ్తుంది. అది బలూచిస్తాన్‌కు పరోక్షంగా కలిసి వస్తుందా లేదా అనేది తర్వాత విషయం. అయితే త్వరలో ఆపరేషన్ 2.0 అని వార్త ఇప్పుడు మరొక ఆసక్తిని పెంచుతుంది. మార్చి నెలలో పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ 2.0ను చేపట్టనుందనే ఇప్పుడు దాయాది దేశం ఉగ్రవాదుల్లో గుబుల పుట్టిస్తోంది. మరొకవైపు భారత్ ఆపరేషన్ సిందూర్ 2.0 చేపడితే, సందట్లో సడేమియా అన్నట్లు తాము కూడా పాకిస్తాన్‌కు చుక్కలు చూపించాలని బలూచిస్తాన్ రెబల్స్ భావిస్తున్నారు.


