న్యూ ప్రొడక్ట్ : రోబో షూస్
‘మార్నింగ్ వాక్ మంచిది’ అనే విషయం తెలిసినా...‘మార్నింగ్ వాక్ చేయాలంటే బద్దకంగా ఉంది’ అని మీకు అనిపిస్తుందా? ‘కొంచెం దూరం కూడా పరుగెత్తలేను బాబోయ్’ అనేవారిలో మీరూ ఉన్నారా? అయితే ప్రాజెక్ట్ యాంప్లిఫై’ గురించి మీరు తెలుసుకోవాల్సిందే...ప్రాజెక్ట్ యాంప్లీఫై అనే రోబోటిక్ షూస్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది నైక్ కంపెనీ.
తక్కువ శ్రమతో, ఎక్కువ దూరం వేగంగా నడవడానికి ఈ సరికొత్త ఫుట్‌వేర్ ఉపయోగపడుతుంది. ‘నడక, పరుగు, జాగింగ్‌కు సంబంధించి ఇది సౌకర్యవంతమైన ఆవిష్కరణ’గా ప్రాజెక్ట్ యాంప్లీఫై గురించి తెలియజేసింది నైక్. తేలికైన మోటర్, డ్రైవ్‌బెల్ట్, రీచార్జబుల్ బ్యాటరీ ఈ రోబోటిక్ షూస్‌లో ఉంటాయి. నడక, రన్నింగ్, జాగింగ్‌ను సులభతరం చేయడమే కాదు... మైలుదూరాన్ని పది నుంచి పన్నెండు నిమిషాల వేగంతో అధిగమించే అథ్లెట్లకు ఈ ప్రాజెక్ట్ యాంప్లీఫై సౌకర్యంగా ఉంటుందని, ఎలక్ట్రిక్ బైక్‌లు సైక్లిస్ట్‌లకు ఎలా సహాయపడతాయో అదే విధంగా రోజువారీ కదలికలకు అదనపు శక్తిని అందించడానికిప్రాజెక్ట్ యాంప్లీఫై సహాయపడుతుందని తెలియజేసింది నైక్.
చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!


