డ్రై ఫ్రూట్స్ సరైన మోతాదులో తీసుకోవడం వలన ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. కానీ కొందరు వీటిని ఆరోగ్యానికి మంచిదని అతిగా తింటుంటారు. కానీ వీటిలో అధిక చకకెర ఉండటం వలన ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన ఇది ఆరోగ్య సమస్యలను కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎంత వరకు తీసుకోవచ్చు?
డ్రై ఫ్రూట్స్ సాధారణంగా, ప్రతి రోజు 20 నుండి 30 గ్రాముల తీసుకోవడం చాలా మంచిది. ఈ మోతాదులో తీసుకోవడం వలన శరీరానికి మంచి ΄ోషకాలు అందుతాయి. కానీ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే ఇందులోని అధిక చక్కెర, ఫ్యాట్ అధికంగా ఉండి ఇవి అధికబరువుకు కారణం అవుతాయి.
ఇదీ చదవండి: 17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్‌ఆర్‌ఐ జంట, వీడియో వైరల్


