డాలర్ల వేటలో చాలామంది విదేశాల బాటపడతారు. కానీ అన్ని దేశాల్లోనూ, అన్ని రకాలుగా మనకు సౌకర్యంగా ఉండదు. కొన్నిచోట్ల కొన్ని సమస్యలు తప్పవు. ఇందులో అక్కడి నిబంధనలు, భాషా సంస్కృతి, వాతావరణ పరిస్థితులు, జీవన స్థితిగతులు, ఆరోగ్యం ఇలా ఈ జాబితాలోనే చాలానే ఉంటాయి. కొన్ని కావాలంటే కొన్ని సర్దుబాట్లు తప్పవు అని ఎడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. కానీ అమెరిలో ఒకటిన్నర దశాబ్దానికి పైగా ఉన్న జంట ప్రవాస భారతీయ (NRI) జంట ఇండియాకు తిరిగి వచ్చేసింది.ఎందుకు? అనుకుంటున్నారా? పదండి తెలుసుకుందాం ఈ కథనంలో
అమెరికాలో ఆరోగ్య ఖర్చులు బీమా భారం కావడంతో దాదాపు 17 ఏళ్ల తరువాత అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేసింది భారతేదేశానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ జంట. వీరికి కవల పిల్లలు. యూఎస్‌లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తమ ఆర్థిక స్థితిపై ఒత్తిడి తెస్తోందని, బీమా చాలా ఖరీదైనదని, దీంతో అక్కడ హాస్పిటల్‌కి వెళ్లాలంటేనే భయం వేస్తోందని ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించారు.
అమెరికాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆరోగ్య బీమా సేవలకంటే ముందు, మీ జేబుకు చిల్లు తప్పదు. అంటే ఏ డాక్టర్ దగ్గరికెళ్లినా, ఎలాంటి పరీక్షలు చేయించుకున్నా, మినిమం డిడక్టబుల్ ఎమౌంట్ కట్టాల్సిందే అంటూ తమ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.
తాము ఎంచుకున్న చౌకైన పథకం నెలకు 1,600 డాలర్ల ప్లాన్. ఇందులో 15వేల డాలర్లు డిడక్టబుల్ ఎమౌంట్. అయితే ఈ కవర్‌లో ట్విన్స్ యాడ్ అవ్వలేదు.దీంతో పిల్లలకి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన ఖర్చులు విపరీతం, దీనికి ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. అందుకే ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించు కున్నాం. మంచి వైద్యులు, వేగవంతమైన సంరక్షణ మరియు వాస్తవానికి అందుబాటులో ఉండేలా చక్కటి వ్యవస్థ ఉంది. సమస్య నుంచి పోరిపోవడం కాదు, ఆరోగ్య సంరక్షణ భరించేదిగా ఉండటంతోపాటు, ఒంటరిగా మాతృత్వ భారాన్ని ఒంటరిగా భరించాల్సిన అవసరం లేని జీవితం వైపు పరుగెత్తడం అని వివరణ ఇచ్చారు. తాము కోల్పోతున్న సమన్వయం, మనశ్శాంతి గురించి అని పేర్కొన్నారు.
దీంతో నెటిజన్లు ఈ జంటతో ఏకీభవించారు. వారికి మద్దతుగా నిలిచారు. చక్కటి నిర్ణయం తీసుకున్న మీకు అభినందనలు అంటూ ప్రశంసించారు. అలాగే కొంత సర్దుబాటు అవవసరం అని కొందరు వ్యాఖ్యానిస్తే. ఇండియాలో 30వేలతో అయిపోయే అపెండిక్స్ ఆపరేషన్‌కు రూ. 3.74 కోట్లు అయిందంటూ ఒకరు,అక్కడ సాధారణ కట్టు , కుట్లు వేయడానికి చాలా ఖర్చవుతుంది అని మరొకరు తమ అనుభవాల్ని పంచుకున్నారు. రెండు దేశాల్లో వాటి ప్లస్‌లు మైనస్‌లూ ఉన్నాయి. కానీ చిన్న పిల్లలున్న కుటుంబాలకు ఇండియాలో మంచి ఆరోగ్య వ్యవస్థ ఉందన్నారు. ఎక్కడా పెర్‌ఫెక్ట్‌గా ఉండదు. కానీ మీకు మంచి జీవితం ఉండాలని భావిస్తున్నాను అని ఒకరు వ్యాఖ్యానించారు. వీడియో 10.6 లక్షలకు పైగా వీక్షణలు మరియు వందలాది వ్యాఖ్యలను సంపాదించింది.


