అమెరికాలో ప్రభుత్వ మద్దతుతో నడిచే మీడియా రంగం కుదేలైంది. ప్రజా నిధులు, ప్రభుత్వ మద్దతుతో పనిచేసే స్వతంత్ర వార్తా సంస్థలన్నీ యునైటెడ్ స్టేట్స్‌లో మూత పడుతున్నాయి. ప్రజలకు కచ్చితమైన వాస్తవాలను అందించే న్యూస్ ఏజెన్సీల శకం ఇక ముగియనుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో యూఎస్ పబ్లిక్ రేడియో, టెలివిజన్ స్టేషన్లకు భారీగా నిధుల కోత పెట్టడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు సంస్థలు ప్రకటించాయి.
దాదాపు 60 ఏళ్ల తర్వాత కార్పొరేషన్ ఫర్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ (CPB) సంస్థను రద్దు చేయడానికి ఓటు వేసినట్లు డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. కార్పొరేషన్ ఫర్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ (CPB) డైరెక్టర్ల బోర్డు సంస్థను రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు, సీఈవో ప్యాట్రిసియా హారిసన్ ఓ ప్రకటనలో తెలిపారు. స్వీయ విధ్వంసంలోకి నెట్టకుండా సంస్థను రద్దు చేయడం ద్వారా పబ్లిక్ మీడియా వ్యవస్థ సమగ్రతను, ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే మనం చేయగల ఏకైక మార్గమని అన్నారు. పబ్లిక్ మీడియాను లక్ష్యంగా చేసుకుని వైట్ హౌస్ కాంగ్రెస్ ఫెడరల్ నిధులను నిలిపివేసిన తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ ప్రకటనతో గణనీయమైన ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాల కోత, సవాళ్లు ఎదురు కానున్నాయి. అయితే కొన్ని జాతీయ నెట్‌వర్క్‌లు అత్యవసర నిధులపై పనిచేస్తూనే ఉన్నాయి. కానీ తీవ్రమైన బడ్జెట్ కోత కారణంగా అవి పూర్తిగా మూతపడే పరిస్థితి నెలకొంది.
మరోవైపు పబ్లిక్ మీడియా మనుగడ సాగిస్తుందని.. కొత్త కాంగ్రెస్ మన దేశంలో పబ్లిక్ మీడియా సమస్యను పరిష్కరిస్తుందని తాను నమ్ముతున్నానని సీపీబీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్‌వుమెన్ రూబీ కాల్వర్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎందుకంటే ఇది మన పిల్లల విద్య, చరిత్ర, సంస్కృతి, ప్రజాస్వామ్యానికి కీలకమని పేర్కొంది.
కాగా.. ఈ కార్పొరేషన్ ఫర్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థను 1967లో స్థాపించారు. ఇందులో దాదాపు 1,500 పబ్లిక్ మీడియా స్టేషన్లు, దాని ప్రసార కేంద్రాల నెట్‌వర్క్‌కు వార్షిక నిధుల రూపంలో 500 డాలర్ల మిలియన్లను పంపిణీ చేసే బాధ్యత ఈ సంస్థపై ఉంది. కానీ ట్రంప్, అతని మిత్రులు చాలా కాలంగా వీటిని విస్మరించారు. ట్రంప్ పరిపాలనలో పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్లకు నిధులను తగ్గించే ప్రణాళికలను వివరించింది. గత సంవత్సరం మే నాటికి నిధులను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ట్రంప్ ఒక మెమో పంపారు.
ఇటీవలి దశాబ్ద కాలంలో సాంప్రదాయ మీడియా, ముఖ్యంగా వార్తాపత్రికలు మూసివేయబడిన దేశంలోని కొన్ని ప్రాంతాలలో స్థానిక పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ స్టేషన్లు అవసరం. సీపీబీ నిధులు పొందిన 544 పబ్లిక్ రేడియో, టీవీ స్టేషన్లలో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాలుగా పరిగణించబడ్డాయి. వీటి ద్వారా 99 శాతం అమెరికన్లకు ప్రజా సమాచారాన్ని అందిస్తున్నారు. ప్రజలకు అవసరమైన విద్యా, స్థానికంగా కంటెంట్‌ను అందించే చిన్న, గ్రామీణ స్టేషన్లు ఎక్కువగా మూసివేతలకు గురి కానున్నాయి.


