breaking news
media union leaders
-
అమెరికాలో సంక్షోభం.. రద్దు దిశగా పబ్లిక్ మీడియా..!
అమెరికాలో ప్రభుత్వ మద్దతుతో నడిచే మీడియా రంగం కుదేలైంది. ప్రజా నిధులు, ప్రభుత్వ మద్దతుతో పనిచేసే స్వతంత్ర వార్తా సంస్థలన్నీ యునైటెడ్ స్టేట్స్లో మూత పడుతున్నాయి. ప్రజలకు కచ్చితమైన వాస్తవాలను అందించే న్యూస్ ఏజెన్సీల శకం ఇక ముగియనుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో యూఎస్ పబ్లిక్ రేడియో, టెలివిజన్ స్టేషన్లకు భారీగా నిధుల కోత పెట్టడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు సంస్థలు ప్రకటించాయి.దాదాపు 60 ఏళ్ల తర్వాత కార్పొరేషన్ ఫర్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ (CPB) సంస్థను రద్దు చేయడానికి ఓటు వేసినట్లు డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. కార్పొరేషన్ ఫర్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ (CPB) డైరెక్టర్ల బోర్డు సంస్థను రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు, సీఈవో ప్యాట్రిసియా హారిసన్ ఓ ప్రకటనలో తెలిపారు. స్వీయ విధ్వంసంలోకి నెట్టకుండా సంస్థను రద్దు చేయడం ద్వారా పబ్లిక్ మీడియా వ్యవస్థ సమగ్రతను, ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే మనం చేయగల ఏకైక మార్గమని అన్నారు. పబ్లిక్ మీడియాను లక్ష్యంగా చేసుకుని వైట్ హౌస్ కాంగ్రెస్ ఫెడరల్ నిధులను నిలిపివేసిన తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ ప్రకటనతో గణనీయమైన ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాల కోత, సవాళ్లు ఎదురు కానున్నాయి. అయితే కొన్ని జాతీయ నెట్‌వర్క్‌లు అత్యవసర నిధులపై పనిచేస్తూనే ఉన్నాయి. కానీ తీవ్రమైన బడ్జెట్ కోత కారణంగా అవి పూర్తిగా మూతపడే పరిస్థితి నెలకొంది.మరోవైపు పబ్లిక్ మీడియా మనుగడ సాగిస్తుందని.. కొత్త కాంగ్రెస్ మన దేశంలో పబ్లిక్ మీడియా సమస్యను పరిష్కరిస్తుందని తాను నమ్ముతున్నానని సీపీబీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్‌వుమెన్ రూబీ కాల్వర్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎందుకంటే ఇది మన పిల్లల విద్య, చరిత్ర, సంస్కృతి, ప్రజాస్వామ్యానికి కీలకమని పేర్కొంది.కాగా.. ఈ కార్పొరేషన్ ఫర్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థను 1967లో స్థాపించారు. ఇందులో దాదాపు 1,500 పబ్లిక్ మీడియా స్టేషన్లు, దాని ప్రసార కేంద్రాల నెట్‌వర్క్‌కు వార్షిక నిధుల రూపంలో 500 డాలర్ల మిలియన్లను పంపిణీ చేసే బాధ్యత ఈ సంస్థపై ఉంది. కానీ ట్రంప్, అతని మిత్రులు చాలా కాలంగా వీటిని విస్మరించారు. ట్రంప్ పరిపాలనలో పబ్లిక్ బ్రాడ్కాస్టర్లకు నిధులను తగ్గించే ప్రణాళికలను వివరించింది. గత సంవత్సరం మే నాటికి నిధులను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ట్రంప్ ఒక మెమో పంపారు.ఇటీవలి దశాబ్ద కాలంలో సాంప్రదాయ మీడియా, ముఖ్యంగా వార్తాపత్రికలు మూసివేయబడిన దేశంలోని కొన్ని ప్రాంతాలలో స్థానిక పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ స్టేషన్లు అవసరం. సీపీబీ నిధులు పొందిన 544 పబ్లిక్ రేడియో, టీవీ స్టేషన్లలో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాలుగా పరిగణించబడ్డాయి. వీటి ద్వారా 99 శాతం అమెరికన్లకు ప్రజా సమాచారాన్ని అందిస్తున్నారు. ప్రజలకు అవసరమైన విద్యా, స్థానికంగా కంటెంట్‌ను అందించే చిన్న, గ్రామీణ స్టేషన్లు ఎక్కువగా మూసివేతలకు గురి కానున్నాయి. -
టీవీ చానళ్ల ద్వారా వ్యక్తిత్వ హననం తగదు
పంజగుట్ట: మహా న్యూస్ టీవీ చానల్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, అదే సమయంలో ఆ టీవీ చానల్లో నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరికాదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే మహాన్యూస్ చానల్లో పలువురు నేతలను కించ పర్చేలా కథనాలు ప్రసారమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ మధ్య కొన్ని టీవీ చానళ్లలో నడుస్తున్న డిబేట్లు, ప్రసారమవుతున్న కథనాలు, థంబ్‌నెయిల్స్ ద్వారా తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సిగ్నల్ టీవీ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో మీడియా, పరిణామాలు, పర్యవసానాలు’ అనే అంశంపై మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టు శివారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చి పదేళ్లు దాటింది కాబట్టి తెలంగాణ అనే పదాన్ని వాడొద్దని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి అంటున్నారని, తెలంగాణ అనే పదం లేకపోతే మనకు అస్తిత్వం ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టు సంఘాలు అన్ని ఏకమై కొన్ని టీవీ చానళ్లలో వస్తున్న తెలంగాణ వ్యతిరేక ప్రసారాలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. వీటిపై నియమ నిబంధనలు రూపొందించాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో దోషులెవరో తేలక ముందే కేసీఆర్, కేటీఆర్‌పై దాడి చేయడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ అనే పదం వాడొద్దు అన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి.. సీనియర్ పాత్రికేయుడు యోగికి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు నర్రా విజయ్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సాగర్, సీనియర్ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం
శృంగవరపుకోట: రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎస్.కోట మీడియా ప్రతినిధులు ధ్వజమెత్తారు. బుధవారం ఎస్.కోట కేంద్రంలో పనిచేస్తున్న వివిధ పత్రికలు, టీవీ చానళ్ల ప్రతినిధులంతా నిరసన తెలియజేశారు. ప్రభుత్వం సాక్షి చానల్ ప్రసారాలు నిలిపేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పత్రికాస్వేచ్ఛపై వేటు.. సిగ్గుచేటు.. సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలి అంటూ నినాదాలు చేశారు. తొలుత స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ ముక్తేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు జర్నలిస్టుల సంఘాల నాయకులు ఎం.మరియదాసు, మళ్ల సత్యారావు, శీరాపు శ్రీనివాసరావు, డబ్ల్యూఎన్ శర్మ తదితరులు మాట్లాడుతూ.. సమాజంలో నాలుగో స్తంభంలాంటి మీడియాపై ఆంక్షలు పెట్టడం నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు.


