రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం | media union leaders fires on ap govt over sakshi channel stopping | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం

Jun 16 2016 11:30 AM | Updated on Aug 20 2018 8:20 PM

రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎస్.కోట మీడియా ప్రతినిధులు ధ్వజమెత్తారు.

శృంగవరపుకోట: రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎస్.కోట మీడియా ప్రతినిధులు ధ్వజమెత్తారు. బుధవారం ఎస్.కోట కేంద్రంలో పనిచేస్తున్న వివిధ పత్రికలు, టీవీ చానళ్ల ప్రతినిధులంతా నిరసన తెలియజేశారు. ప్రభుత్వం సాక్షి చానల్ ప్రసారాలు నిలిపేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పత్రికాస్వేచ్ఛపై వేటు.. సిగ్గుచేటు.. సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలి అంటూ నినాదాలు చేశారు.

తొలుత స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ ముక్తేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు జర్నలిస్టుల సంఘాల నాయకులు ఎం.మరియదాసు, మళ్ల సత్యారావు, శీరాపు శ్రీనివాసరావు, డబ్ల్యూఎన్ శర్మ తదితరులు మాట్లాడుతూ.. సమాజంలో నాలుగో స్తంభంలాంటి మీడియాపై ఆంక్షలు పెట్టడం నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement