చాలామంది తమ శరీరంలోని లోపాలను అధిగమించడానికి లేదా ఆరోగ్యంగా ఉండేందుకు సప్లిమెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే భారతీయ వంటకాలు ఆరోగ్య ప్రయోజనాల నిధి అని, అనేక
సమస్యల నుండి మనల్ని కాపాడే శక్తి మన ఇంట్లోని ఆహారాల్లోనే ఉందనే విషయాన్ని మనం మరిచి΄ోతాం. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అలోక్ చోప్రా ఇటీవల ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా మన వంటగదిలోని కేవలం నాలుగు వస్తువులు అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు.
నెయ్యి: ఎ2 రకం బీటా–కేసిన్ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేసే ఆవుల పాలతో తయారు చేయబడిన స్వచ్ఛమైన నెయ్యి. కార్డియాలజిస్టుల ప్రకారం.. ఈ నెయ్యి శరీరానికి, ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.
మన వంటశాలలోని పసుపు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలను హీరోలుగా డాక్టర్ చోప్రా అభివర్ణించారు. ఇవి యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. హై బ్లడ్ షుగర్, హై కొలెస్ట్రాల్ వల్ల కలిగే కణజాల నష్టం, వాపు నుండి రక్షించడానికి ఇవి తోడ్పడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
డ్రై ఫ్రూట్స్: బాదం, వాల్‌నట్స్ వంటి ఎండిన పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కణాల మరమ్మత్తుకు సహాయపడటంతోపాటు ఐక్యూ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
చిక్కుళ్ళు – పప్పుధాన్యాలు: శాకాహారులకు ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి ఇవి గొప్ప ఎంపిక. పప్పులు, చిక్కుళ్ళను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు, కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ సహాయపడుతుందని కార్డియాలజిస్టులు తెలిపారు.
(చదవండి: Mumbai orthopaedic surgeon Reveals : ఒక సమోసా... యాభై నిమిషాల వాక్)


