kitchen
-
మాదాపూర్: శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థల (Sri Chaitanya Educational Institutions) సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్(Food Safety Department) రద్దు చేసింది. శుక్రవారం ఈ కిచెన్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ కిచెన్ నుంచే గ్రేటర్ హైదరాబాద్‌లోని చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడ వండే భోజనాన్ని హాస్టళ్లలోని వేల మంది విద్యార్థులకు రోజూ అందజేస్తున్నారు.వేల మందికి భోజనాన్ని తయారు చేస్తున్న కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్‌లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్టు గుర్తించారు. సుమారు 125 కిలోల గడువు తీరిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులను అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్ చేస్తున్నట్టు గుర్తించారు.కిచెన్, స్టోర్ రూమ్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు.. కిచెన్‌ను సీజ్ చేయడంతో పాటు ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు అధికారులు మాదాపూర్(ఖానామెట్)లోని చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కిచెన్‌లో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఉత్తర్వులు ఉల్లంఘించి వంట తయారు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఇదీ చదవండి: ఎలా ఇవ్వరో మేమూ చూస్తాం: మంత్రి పొన్నం -
బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వంటగది ఇంటీరియర్ డిజైన్..!
రోజులో సగకాలం గడిచేది వంటింట్లోనే! అది ఎంత శుచిగా.. ఆహ్లాదంగా ఉంటే వంటలు అంత రుచిగా చవులూరిస్తూంటాయి. అలాంటి వంటల్లో.. ఆ వంటగది ఇంటీరియర్‌లో ఇండియన్ స్టయిలే వేరు! ఆ అలంకరణను మీ కిచెన్‌లో సెట్చేసుకోవడానికి లక్షలు ఖర్చుపెట్టాలేమో అనుకునేరు.. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఆ గ్రేస్‌ను తీసుకురావచ్చు!కుండలు, టెర్రకోట వస్తువులు, బుట్టలు, ఇత్తడి పాత్రలతో కిచెన్‌కు సంప్రదాయ, ఆధునికతల ఫ్యూజన్‌ను అద్దవచ్చు. మన ఇళ్లల్లోని తరతరాల పాత్రల వైభవాన్నీ కొలువుదీర్చవచ్చు.ఉపయోగంలో లేని పాత్రలకు పెయింట్ వేసి వాటిల్లో మొక్కల తొట్లను పెట్టి.. వంటిగదికి ప్రకృతి శోభతో గార్నిష్ చేయవచ్చు.కిచెన్‌లోనూ, డైనింగ్ టేబుల్‌పైనా చక్కటి డిజైన్ల హ్యాండ్లూమ్ క్లాత్స్‌ను పరచి కొత్త కళతో మెరిపించవచ్చు. సంప్రదాయ మండల డిజైన్లు, ప్రకృతి దృశ్యాల కళాకృతులతో డెకరేట్ చేయవచ్చు.గాజు జాడీలతో ఉన్న ఓపెన్ షెల్ఫ్‌లు అందంగానే కాదు.. వంటకు కావల్సిన దినుసులు అందుకోవడానికీ అనువుగా ఉంటాయి.– ఎన్.ఆర్ (చదవండి: అలనాటి రాణుల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే కంగుతింటారు..!) -
కృత్రిమ మేధాజాలం వంటింట్లో మయాజాలం
‘రేపటికి పాల ప్యాకెట్ వేయించుకోవాలి రాత్రికి ఇడ్లీ పిండి నానబెట్టుకోవాలి రెండు రోజుల్లో జామకాయలు పాడైపోతాయి నాలుగు రోజుల్లో బియ్యం అయిపోతాయి’ఇవన్నీ మన అమ్మో, అమ్మమ్మో గుర్తుచేసే మాటలు కావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కిచెన్ అలర్ట్స్. ఇవే కాదు, ఏం తినాలి? ఏం తింటే మంచిది?తింటున్న ఆహారం ఎంతవరకు ఆరోగ్యకరం? ఇంట్లో ఏమేం కూరగాయలు మిగిలి ఉన్నాయి?వాటితో రేపు ఏం కూర చేసుకోవచ్చు? ఇలా ఎన్నో సలహా సూచనలు వినొచ్చు. మనం ఆఫీస్‌కి వెళ్లినా, ఔటింగ్‌కి వెళ్లినా, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నా, వినోదాల్లో మునిగి తేలుతున్నా వంటింటిని భద్రంగా చూసుకునే బాధ్యత ఇకపై ఏఐదేనట!∙సంహిత నిమ్మనప్రతి ఇంటికి వంట తప్పనిసరి పని. కట్టెల పొయ్యిలు, బొగ్గుల కుంపట్ల నుంచి గ్యాస్‌స్టవ్‌ల వరకు సాగిన వంటింటి ప్రస్థానం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. వంటిళ్లు ‘స్మార్ట్’గా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్‌లు, ఇండక్షన్ స్టవ్‌లకు కూడా తొందర్లోనే కాలం చెల్లిపోయే రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో (ఏఐ) పనిచేసే స్మార్ట్ పరికరాలు వంటిళ్లలోకి చేరుతున్నాయి. వీటిలో స్మార్ట్ స్టవ్‌లు, ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు సహా నానా రకాలు ఉంటున్నాయి. వంటింటి పనిని ఇవి మరింత సునాయాసం చేయనున్నాయి.రోజూ ఉదయాన్నే కిచెన్‌లోకి వెళ్లేసరికి, ‘హాలో మేడమ్/సర్! మీ వంటశాలకు స్వాగతం. ఈరోజు మీకు ఏం టిఫిన్ కావాలి? భోజనంలో ఏం స్పెషల్ కావాలి? డిన్నర్ ఏం ప్లాన్ చేయమంటారు?’ అంటూ అడిగి తెలుసుకుని మరీ వండిచ్చే సౌలభ్యం ఉంటే ఎంత బాగుంటుందో కదా? ఈ ఊహ అదిరింది కదా? కానీ ఫ్యూచర్లో దీన్నే నిజం చేయబోతుంది ఏఐ. అందుకు ఇప్పటికే రొబోటిక్ కిచెన్ మెషిన్స్ సాయంతో తొలి అడుగులు ప్రారంభమయ్యాయి.అంచెలంచెలుగా మనిషి సాధించిన ఆధునిక సాంకేతికతకు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తోడైంది. ఏఐతో ప్రపంచ ఊహాచిత్రమే పూర్తిగా మారబోతుంది. ఈ కృత్రిమ మే«ధ, మానవ మేధను తలదన్నే స్థాయికి ఎదుగుతోంది. ఇప్పటికే వైద్యరంగం నుంచి వాణిజ్యరంగం వరకూ ప్రతి రంగమూ ఏఐ అధీనంలోకి వచ్చేసింది. ఇక భవిష్యత్తులో ఏఐనే మీ వంటింటి మహారాణి కాబోతుందంటే నమ్ముతారా? నమ్మితీరాలి!అహో, అద్భుతం! అనుకున్న 3జీ, 5జీల కాలాన్ని మించిందే ఈ ఏఐ కాలం. ఏ విషయంలోనైనా తొందరపడి, ఆత్రం కనబరిస్తే, ‘తినకముందే రుచి దేనికి?’ అంటుంటారు పెద్దలు. కానీ తినబోయే ముందే రుచి చూపిస్తాననడం ఏఐ స్పెషాలిటీ. మనిషి ఊహలకు రూపాన్నిస్తూ, నిమిషాల్లోనే కళ్లప్పగించేలా మాయాజాలం చేయగలదు ఏఐ. త్వరలో ఏఐ రోబోలు ఇంటి మనుషులుగా మారి వండి వారుస్తాయి. షెఫ్‌గా, సర్వెంట్‌గా ఇలా రకరకాల పాత్రల్లో సేవలను అందిస్తాయి. ఆ సేవలు ఎలా ఉండబోతున్నాయి? కిచెన్‌ను ఏ దిశగా ఏఐ తీసుకెళ్తుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.సాధారణంగా వంటగదిలో కావాల్సిన ముఖ్యమైన యంత్రాలు నాలుగే నాలుగు రకాలు. ఒకటి: వండి వార్చేవి. రెండు: వంటకు కావాల్సిన పొడులను, గుజ్జులను సిద్ధం చేసేవి. మూడు: వండిన వాటిని నిల్వ చేసేవి. నాలుగు: వండిన పాత్రలను శుభ్రం చేసేవి. అయితే వండివార్చే వాటిలో ఓవెన్స్, కుకర్స్, స్టవ్స్, గ్రిల్స్, బ్రెడ్ అండ్ పిజ్జా మేకర్స్, కాఫీ అండ్ టీ మేకర్స్ ఇవన్నీ ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాగే వంటకు కావాల్సిన పదార్థాలను తయారు చేసేవాటిలో మిక్సీలు, చాపర్స్, గ్రైండర్స్, బ్లెండర్స్, జ్యూసర్స్ ఇవన్నీ లెక్కకొస్తాయి. ఇక వండిన వాటిని, వండని వాటినీ నిల్వ చేసేందుకు రిఫ్రిజిరేటర్, వంటపాత్రలను శుభ్రం చేయడానికి డిష్వాషర్ ఇవన్నీ లగ్జరీ కిచెన్‌కి అవసరమయ్యే యంత్రాలే! ఈ యంత్రాలన్నిటినీ ఏఐకి అనుసంధానం చేయగలిగితే, వంటింటిని రోబోటిక్ కిచెన్‌లా మార్చేయవచ్చు. అందుకు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సాధించిన విజయాలకు ఈ ఏఐ గాడ్జెట్స్ మచ్చుతునకలు. రానున్న రోజుల్లో ప్రపంచమంతా ప్రతి రంగాన్నీ ఏఐతో కలిపి చూడటం అనివార్యం కానుంది. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు తమ యూజర్స్‌కి ఏఐ సేవలను మిళితం చేసి, అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్‌ను అందించడానికి ముందుకొస్తున్నాయి. అందులో భాగంగానే ‘థింక్యూ కేర్’ అనే యాప్‌తో ఎల్జీ స్మార్ట్ వర్షన్స్కి ఏఐను అనుసంధానం చేస్తోంది ఎల్జీ కంపెనీ. ఇక స్మార్ట్ ఎల్జీ గాడ్జెట్స్ వేటిని కొన్నా యాప్ సాయంతో ఏఐ సేవలను పొందవచ్చు. గాడ్జెట్ సేవల్లో అంతరాయాలను అంచనా వేయడానికి, నిర్వహణను మెరుగుపరచడానికి ఏఐ సహకరిస్తుంది. సాంకేతికతతో కూడిన అధునాతన జీవనశైలిని అలవాటు చేస్తుంది. వంటగదిని ఏఐ సాంకేతికతతో అమర్చుకుంటే, మొత్తం ఇల్లే ‘స్మార్ట్ హోమ్’లా మారిపోతుంది. హైటెక్ కిచెన్ గాడ్జెట్స్‌తో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ఏఐ మరింత బలోపేతం చేస్తుంది. ఇలానే చాలా కంపెనీలు తమ సొంత యాప్స్‌ను పరిచయం చేస్తూ, లేటెస్ట్ టెక్నాలజీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడిస్తున్నాయి.పాకశాస్త్రంలో ఏఐ ప్రవేశం కొత్త సవాళ్లకు నాంది అంటున్నారు కొందరు నిపుణులు. భవిష్యత్తులో వంటశాలలన్నీ ఏఐ వశమైతే.. డేటా గోప్యతకు భంగం వాటిల్లడం, ఉద్యోగ భద్రతకు భరోసా లేకపోవడం, వంటల తయారీలో మానవ ప్రాధాన్యం తగ్గడం, మనుషుల మధ్య ఆర్థిక, సామాజిక అంతరాలు పెరగడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తవచ్చని సామాజికవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆ సవాళ్లను ఏఐ అధిగమిస్తుందని కూడా చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నారు.సిగ్నేచర్ కిచెన్ సూట్స్ ట్రాన్సిషనల్ సిరీస్ ఓవెన్ ఈ ఓవెన్ లో కెమెరాలు అమర్చి ఉంటాయి. ఇది ఏఐ సాంకేతికతను ఏకం చేస్తూ, పని చేస్తుంది. వంట ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి అబ్జర్వేషనల్ అసిస్టెంట్‌గా పని చేయడంతో పాటు స్వయంగా వివిధ పదార్థాలను గుర్తిస్తుంది. వంటకాలను సూచిస్తుంది. ఇంట్లో వంట చేసేవారు వంటగదిలో కొత్త వంటకాలు, పదార్థాలు, పద్ధతులను ప్రయత్నించడానికి ఈ ఓవెన్ నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది. ఇది రోజువారీ వంట ప్రక్రియలను మెరుగుపరుస్తుంది. అలాగే జూన్ ఇంటెలిజెంట్ ఓవెన్ అనే మరో ఏఐ కిచెన్ గాడ్జెట్‌కి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ నడుస్తోంది. దానిలో 85 రకాల వంటకాలను గుర్తించే అంతర్నిర్మిత వ్యవస్థ ఉంది. ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేసుకోవడంతో దానిలో వంట చేసుకోవచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌తో అనుసంధానం చేసుకోవచ్చు.కుకింగ్ రోబోవంటను వేగవంతం చేయడం, రకరకాల రెసిపీలతో వండిపెట్టడమే లక్ష్యంగా చేసుకుని రూపొందిన ‘కోడీ 29’ కుకింగ్ రోబో ఆప్షన్ ్సని బట్టి 1500 వంటకాలను అందిస్తుంది. ఇది 21 రకాల మోడ్స్‌తో పని చేస్తుంది. అంతర్నిర్మితంగా ఉన్న డిస్ప్లేతో కృత్రిమ మేధస్సు సాయంతో ఇది చక్కగా యూజ్ అవుతుంది. ఫంక్షన్ ్స, పార్టీస్ ఉన్నప్పుడు ఈ రోబో భలే చక్కగా సహకరిస్తుంది. మల్టీఫంక్షనల్, స్మార్ట్ ఆప్షన్ ్సతో ఇది ఉపయోగపడుతుంది. హ్యాండ్స్–ఫ్రీ యూజర్లా ఆకట్టుకుంటుంది. వాయిస్ కమాండింగ్స్తో యూజర్ ఫ్రెండ్లీగా పనిచేస్తుంది.హెస్టన్ క్యూ స్మార్ట్ కుకింగ్ సిస్టమ్ఇది ఏఐతో అనుసంధానమైన పవర్డ్ పాన్. లేదా ఇండక్షన్ బర్నర్. ఇది ‘స్మార్ట్’ సాంకేతికతతో వంట ప్రక్రియను మెరుగుపరుస్తుంది. వంట ఎలా చేసుకోవాలో, ఏ పదార్థం ఎప్పుడు వేయాలో చెబుతూ, మనతోనే మరింత మహత్తరంగా వంట చేయిస్తుంది. వంట రానివారికి ఇది బెస్ట్ గైడ్‌గా నిలుస్తుంది. టెంపరేచర్, టైమ్ అడ్జస్ట్మెంట్లతో ఇది చక్కగా శ్రమ తెలియనీయకుండా పనిచేస్తుంది. వంటకాల కోసం ఇంటరాక్టివ్ వీడియోలను కూడా అందిస్తుంది. కొత్త పద్ధతులను నేర్చుకోవాలనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్ఇది స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ కోసం ఏఐ ఫీచర్లతో కూడిన స్మార్ట్ సామ్సంగ్ రిఫ్రిజిరేటర్. దీనిలో కెమెరాలు ఉంటాయి. అవి ఫుడ్ ఇన్వెంటరీని ట్రాక్ చేసి ఏవి ఎన్ని ఉన్నాయి? ఏవి నిల్వ ఉంటాయో, ఏవి ఉండవో కనిపెడుతుంటాయి. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్‌లతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాంతో ఈ రిఫ్రిజిరేటర్ కారణంగా చాలా ప్రయోజనాలుంటాయి. ఇది ఇంటి కిరాణా అవసరాలపై ఓ అవగాహన కల్పిస్తుంది.న్యూట్రిబుల్లెట్ బ్యాలెన్ ్స స్మార్ట్ బ్లెండర్ఈ డివైస్‌తో ఆరోగ్యకరమైన స్మూతీస్‌ను సులభంగా చేసుకోవచ్చు. వినియోగదారులకు సులభంగా సహాయపడటానికి ఏఐ పవర్డ్ న్యూట్రిషనల్ ట్రాకింగ్‌తో కూడిన బ్లెండర్ ఇది. దీనికి అంతర్నిర్మిత బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇందులో జ్యూస్ ఐటమ్స్ లేదా చట్నీలకు కావాల్సిన ఆహార పదార్థాలను జోడించేటప్పుడు, వాటికి సంబంధించిన పోషకాహారాల వివరాలను తెలియజేస్తుంది. ఫిట్నెస్ లక్ష్యంగా ఆహార ప్రాధాన్యాన్ని చెబుతుంది. తమ ఆరోగ్యానికి తగిన కేలరీలను తీసుకునే వారికి ఈ బ్లెండర్ చక్కగా ఉపయోగపడుతుంది.సీర్ పర్ఫెక్టా గ్రిల్ బార్బెక్యూ ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో పనిచేసే గ్రిల్ ఇది. ఆటోమేటెడ్ పద్ధతిలో చాలా రకాల రెసిపీలను సిద్ధం చేయగలదు. వంట ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి ఆన్ బోర్డ్ సెన్సర్లను, ప్రత్యేక సాంకేతికతను వినియోగిస్తుంది. ఆహారాలను మారినేట్ చేసి సిస్టమ్‌కి అందిస్తే సరిపోతుంది. గ్రిల్ రెండు వైపుల నుంచి అధిక ఉష్ణోగ్రతలను అందిస్తూ ఇన్ ఫ్రారెడ్ కుకింగ్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. స్వయంచాలక పద్ధతిలో ఆహారాన్ని వండడానికి అధునాతన సాంకేతికతను ఉపయోగించే ఈ గ్రిల్ ఏఐ ఆదేశాలతో చక్కగా పని చేస్తుంది.స్టెయిన్లెస్ స్టీల్ ఏఐ స్లో జ్యూసర్హురోమ్ ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ ఏఐ స్లో జ్యూసర్.. చాలా అప్డేటెడ్ వర్షన్ లో పని చేస్తుంది. 200 వాట్ల శక్తిమంతమైన ఏఐ మోటార్‌తో సుదీర్ఘమైన వారంటీతో ఆకట్టుకుంటున్న ఈ గాడ్జెట్.. పల్ప్ కంట్రోల్ ఆప్షన్స్‌తో వినూత్నంగా ఉపయోగపడుతుంది. స్క్వీజింగ్ స్క్రూ 60 రిజల్యూషన్ తో, స్పిన్నింగ్ బ్రష్ నిమిషానికి 23 సార్లు తిరుగుతూ జ్యూస్‌ను అందిస్తుంది. కాస్త వంపు కలిగిన దీని ట్యాప్ నుంచి జ్యూస్‌ను గ్లాసులోకి లేదా పాత్రలోకి తీసుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్‌లో డిప్స్, చట్నీస్, స్మూతీస్, మిల్క్‌షేక్స్‌తో పాటు డ్రై మసాలాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ డివైస్‌లో జ్యూసర్ యూనిట్‌తో పాటు రెండు రకాల ఫిల్టర్స్, జ్యూస్ కంటైనర్, పల్ప్ కంటైనర్, క్లీనింగ్ బ్రష్‌లు, రెసిపీ బుక్ ఇలా చాలానే లభిస్తాయి.ఫుడ్ స్కానర్ఈ గాడ్జెట్, ఆహారాన్ని స్కాన్ చేసి ఏది తినడానికి పనికొచ్చేది, ఏది పనికిరానిది, ఏది పాడైపోయినది? ఏది ఇంకా నిల్వ ఉండే పరిస్థితుల్లోనే ఉంది? లాంటి ఎన్నో వివరాలను అందిస్తుంది. ఈ నువిలాబ్ ఏఐ ఫుడ్ స్కానర్ 3.0 వర్షన్ ఆహార వ్యర్థాలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు తగిన సూచనలను జారీ చేస్తుంది. ఈ స్కానర్ వినియోగించే యూజర్స్‌కి పోషకాహారానికి సంబంధించిన సలహాలను అందిస్తుంది. న్యూట్రిషనల్ హెల్త్‌కేర్‌కి ఏ ఆహారం సరైనదో తెలియజేస్తుంది.త్వరలోనే ఏఐ రోబో షెఫ్!మనిషి శ్రమను ప్రతి స్థాయిలోనూ తగ్గించడానికి రోబోల తయారీలో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పాఠాలు చెప్పే టీచర్ల దగ్గర నుంచి యుద్ధం చేసే సైనికుల వరకు ప్రతి రంగంలోనూ మనిషి కష్టానికి రీప్లేస్మెంట్ కావాలంటే, అది రోబోతోనే సాధ్యమన్నట్లుగా దూసుకునిపోతోంది టెక్నాలజీ. నిజానికి ఒక బరువైన వస్తువును ఒక చోట నుంచి మరోచోటకి తరలించడం ఒక పని. ఆమ్లెట్ లేక దోసెను పెనంపై వేసి, కాల్చడమూ ఒక పనే! పాలలో కాఫీ పొడి వేసి, కలిపి కాఫీ పెట్టడమూ ఒక పనే! అయితే మనిషి సామాన్యంగా చేయగలిగే ఈ పనులన్నింటినీ ఒక మరబొమ్మ నేర్చుకోవడమంటే మాటలు కాదు. అందుకోసమే శాస్త్రవేత్తలు.. మనిషికి, మెషిన్‌కి అనుసంధానంగా ఏఐని ఎంచుకున్నారు. సాధారణ పనులను ఏవిధంగా చెయ్యాలో ఇప్పుడు రోబోలు ఏఐ సాయంతో సులభంగా నేర్చుకోగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోబోలకు శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే ఓపెన్ స్టోర్ సిస్టమ్‌ని రూపొందించారు. మనిషి చేయగల సాధారణ పనులను ఓ డేటాలా మార్చి, దాన్ని వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రోబోలకు తెలియజేస్తూ వస్తున్నారు. దాంతో రోబోలకు దాదాపు ఇంటి పనులపై కనీస అవగాహన ఉందని, వీటికి చాలా అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని, ఆ శిక్షణతో ఏమాత్రం పరిచయంలేని వంటింట్లో కూడా రోబోలు అలవోకగా పనిచేసే స్థాయికి రూపాంతరం చెందుతున్నాయని అంటున్నారు. ఇక భవిష్యత్తులో ఏఐ రోబో వంటింటికి వస్తే, మనం వంటగదిలోకి అడుగుపెట్టాల్సిన పనే ఉండదు. హోటల్స్‌లో ఆర్డర్ ఇచ్చినట్లు మెనూ చూసుకుని, ఆర్డర్ ఇచ్చుకోవడమే! ఏఐనా మజాకా! -
టీనేజ్ పిల్లలకు ఈజీగా వంట నేర్పించండిలా..!
ఇల్లు అంటే మొదట చెప్పుకోవాల్సింది వంటిల్లే. ఇల్లు ఎంత పెద్దదైనా చిన్నదైనా ప్రధానంగా ఉండాల్సిన గది వంటగది. ఆ వంటగదిలోకి అడుగుపెట్టకుండా పెద్దయిపోయే పిల్లల తరం కాదిది. సరదాగా వంటగదిలో ప్రయోగాలు చేస్తున్న కొత్త యువతరం మొదలైంది. రాబోయే ఏడాది యూత్ ట్రెండ్ అంతా వంటగది కేంద్రంగా ఉండబోతోంది. అలాగే టీనేజ్‌లో ఉన్న పిల్లలకు తల్లితో అనుబంధం పెరిగేది వంటగదిలోనే. ఇందుకోసం చదువుకున్న తల్లి పాటిస్తున్న నాలుగు సూత్రాలివి. పిల్లలను వంటగదిలోకి ఆహ్వానించేటప్పుడు, వారి చేత వంట చేయించేటప్పుడు వాళ్లకు ఇష్టమైన వంటనే చేయాలి, వారి చేత చేయించాలి. వంటల పుస్తకం లేదా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోమని సూచించాలి. ఇంటికోసం వంట చేయడమే కాకుండా చారిటీ కోసం వంట చేయడం అలవాటు చేయాలి. ఏదైనా వండి వాటిని అమ్మగా వచ్చిన డబ్బును అనాథలకు ఇవ్వడం ఒక పద్ధతి. అలాగే అనాథాశ్రమం, వృద్ధాశ్రమంలో ఉండే వాళ్ల కోసం వండి తీసుకెళ్లి పంచడం అలవాటు చేయాలి. తల్లి తనతోపాటు పిల్లలను కూడా కుకరీ క్లాసులకు తీసుకెళ్లడం ద్వారా అందరూ కలిసి ఒక కొత్త వంటను నేర్చుకోవడం, కలిసి వండడం గొప్ప అనుభూతి. అనుబంధాల అల్లిక కూడా. పిల్లలకు ఒక మోస్తరుగా వంట వచ్చిన తర్వాత ఓ చిట్కా పాటించవచ్చు. ఒక రోజు పూర్తిగా లంచ్‌కి అవసరమైన మెనూ అంతా వాళ్లే సిద్ధం చేయాలి. అంటే ఆ ఒక్కరోజుకు చెఫ్‌గా నియామకం అన్నమాట. ఏం వండాలో నిర్ణయించుకుని, అవసరమైన వాటిని మార్కెట్ నుంచి తెచ్చుకుని, వండి, వడ్డించడం వరకు వారిదే బాధ్యత అన్నమాట. ఆ రోజు సర్వీస్‌కి గాను బయటి నుంచి వచ్చిన షెఫ్కి ఇచ్చినట్లే పిల్లలకు కూడా పేమెంట్ ఇవ్వాలి. మోడరన్ ఉమెన్ చాలామంది ఇలా పిల్లలను వారానికోరోజు షెఫ్ డ్యూటీకి సిద్ధం చేస్తున్నారు కూడా. ఏం వెతికారో తెలుసా? మన యువత 2024లో కూడా ఇంటర్నెట్లో వంటల కోసం విపరీతంగా సెర్చ్ చేసినట్లు చె΄్తోంది గూగుల్. ఇంతకీ ఈ ఏడాది ఏయే వంటకాల కోసం వెతికారో తెలుసా? పోర్న్‌స్టార్ మార్టినీ... దీని పేరు మీద అనేక అభ్యంతరాలున్నాయి. కానీ అదే పేరుతో వ్యవహారంలో ఉంది. ఈ లండన్ లోకల్ డ్రింక్‌ని వెనీలా వోడ్కా, ఫ్రూట్ లిక్కర్, వెనీలా షుగర్లతో చేస్తారు. రెండవ స్థానంలో మన మామిడికాయ పచ్చడి ఉంది. మూడవ స్థానంలో ఉత్తరాది వంటకం ధనియా పాంజిరి ఉంది. ధనియాల పొడి, చక్కెర, నెయ్యి, రకరకాల గింజలతో చేస్తారు. ఇది కృష్ణాష్టమి రోజు చేసే నైవేద్యం. ఆయుర్వేదం సూచించిన ఆరోగ్య మూలికలతో చేసే ఔషధాహారం. నాలుగో స్థానంలో ఉన్న మన ఉగాది పచ్చడే. ఐదవస్థానంలో ఉన్న ఆహారం ఉత్తరాది రాష్ట్రాల చర్నామృత్. పాలు, చక్కెర, పెరుగు, తేనె, నెయ్యి, తులసి ఆకులు, డ్రై ఫ్రూట్స్, కుంకుమపువ్వుతో చేస్తారు. మన పంచామృతం వంటిది. పూజాదికాలలో భగవంతునికి నివేదన చేసి ప్రసాదంగా పంచుతారు. ఆరో స్థానంలో ఉన్నది భూటాన్ వాళ్ల ఇమాదత్శీ. మీగడ పెరుగులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు నానబెట్టి తింటారు. ఆహారప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. ఇక ఉదయాన్నే తాగే వెచ్చటి కాఫీ కోసం అది కూడా రెస్టారెంట్ స్టైల్ క్రీమీ కాఫీ ఎలా చేయాలోనని సెర్చ్ చేశారు. ఎనిమిదో స్థానంలో ఉన్నది కంజి. ఇది ఉత్తరాదిన హోలీ సందర్భంగా తాగే డ్రింక్లాంటిదే. బీట్రూట్, క్యారట్, ఆవాలు, ఇంగువతో చేసి రాత్రంతా పులియ బెడతారు. యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోబయాటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. జీర్ణశక్తిని పెంచుతుంది. శక్కర్ పారా... ఇది మహారాష్ట్ర వంటకం. గోధుమ పిండి, చక్కెర కలిపి చేస్తారు. గోధుమ పిండిలో చక్కెర బదులు ఉప్పు, జీలకర్ర కలిపి కూడా చేస్తారు. పిల్లలకు చక్కటి చిరుతిండి, పెద్దవాళ్లకు టీ టైమ్ స్నాక్. ఇక పదవ వంటకం చమ్మంతి... ఇది కేరళ కొబ్బరి పచ్చడి. మన తెలుగు వాళ్లకు కూడా అలవాటే. కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండుతో చేస్తారు. ఇడ్లీ, దోశె, అన్నంలోకి కూడా బాగుంటుంది. గూగుల్ ఇచ్చిన లిస్ట్ చూస్తే ఈ వంటకాల గురించి సెర్చ్ చేసింది యూత్ అని చెప్పకతప్పదు. ఎందుకంటే ఇవన్నీ సులువుగా చేయగలిగిన వంటలే. పండుగల సమయంలో మాత్రమే చేసే ధనియా పాంజిరి, ఉగాది పచ్చడి, చర్నామృత్ల కోసం సెర్చ్ చేశారంటే వాళ్లు వంటలో చెయ్యి తిరిగిన వాళ్లు కాదని ఒప్పుకోవాల్సిందే. అలాగే మామిడికాయ పచ్చడి, కొబ్బరి పచ్చడి కూడా. ఇక మనవాళ్లు ఆసక్తిగా బయటి వంటకాల కోసం తొంగి చూసింది లండన్ డ్రింక్, క్రీమీ కాఫీల విషయంలో మాత్రమే. ఇవి కూడా యూత్ ఇంటరెస్ట్ జాబితాలోనివే. మరో విషయం... బాదం పప్పులు నానబెట్టి రోజూ తినడానికి కారణాలు, ప్రయోజనాలను తెలుసుకున్నారు. అలాగే ఆలివ్ ఆయిల్ గురించి కూడా. -
భాగ్యనగరాన్ని.. కమ్మేస్తున్న క్లౌడ్స్..
దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో.. విభిన్న ఆహార రుచులకు కేంద్రమైన నగరాల్లో హైదరాబాద్ కూడా ప్రముఖమైనది. ప్రస్తుత కాంటినెంటల్ వంటకాలే కాదు నిజాం కాలం నాటి స్థానిక సాంస్కృతిక వంటకాలతోనూ మన భాగ్యనగరం ‘బౌల్ ఆఫ్ డెలీíÙయస్ డిష్’గా గుర్తింపు పొందింది. ఇందులో భాగంగా నగరంలో స్థానిక వంటకాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన రుచులు కూడా ఆదరణ పొందుతున్నాయి. ఈ రుచుల కోసమే ప్రత్యేకంగా రెస్టారెంట్లు కూడా వెలిశాయి. అయితే కరోనా అనంతరం ఈ రంగంలో పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా క్లౌడ్ కిచెన్. ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడంతో మొదలైన ఈ కల్చర్.. వెళ్లే అవకాశమున్నా ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టేంతగా మార్పు చెందింది. నగరంలో విభిన్న రుచులు విభిన్న సంసంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తుంది. హైదరాబాద్ బిర్యానీ మొదలు ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ వరకూ అన్ని రుచులూ ఆన్లైన్, డిజిటల్ వేదికగా ఒక్కొక్క ఆర్డర్‌తో అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్థానిక వంటకాలే కాదు చైనీస్, కొరియన్, మొగలాయి, కరాచి వంటి రుచులను అందించే రెస్టారెంట్లు తమ డోర్ స్టెప్ సేవలను అందిస్తున్నాయి. వీరికి వారధులుగా స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ వేదికలు ఉన్నాయన్న విషయం విధితమే. అయితే.. ఈ కోవలోకి స్టార్ రెస్టారెంట్లు కాస్త విముఖతను ప్రదర్శించాయి. నాణ్యత, బ్రాండ్ వాల్యూ విషయంలో ఈ సేవలు అందించలేదనేది నిపుణుల మాట. కానీ ప్రస్తుతం నగరంలోని టాప్ 5 స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు సైతం క్లౌడ్కిచెన్కు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటి పాకశాస్త్ర నైపుణ్యాలతో నాణ్యత, ప్యాకింగ్, బ్రాండ్ వాల్యూ వంటి అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ సేవలు ప్రారంభిస్తున్నాయి. విలాసవంతమైన జీవితాల్లో ఈ లోటును పూడ్చడానికి స్టార్ హోటళ్ల యాజమాన్యం ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా గమనించాలి. జూబ్లిహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల డిజిటల్ ఫుడ్ సేవలు ఊపందుకున్నాయి. అందరూ అదే దారిలో.. డైనింగ్‌తో పాటు ఈ క్లౌడ్ కిచెన్‌లో కూడా మంచి లాభాలు వస్తుండటంతో పలు రెస్టారెంట్లు ఈ డిజిటల్ ఇన్నోవేషన్‌కు సై అంటున్నాయి. కానీ స్టార్ హోటళ్లు మాత్రం అంతగా ఆసక్తి చూపించలేదు. అయితే గత కొంత కాలంగా 5 స్టార్ హోటళ్లు సైతం క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించాయి. వాటి బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూనే, పాకశాస్త్ర నైపుణ్యాలను డిజిటల్ వేదికతో అనుసంధానం చేస్తూ సేవలందిస్తున్నాయి. ఇక క్లౌడ్ కిచెన్ సేవలను నగరవాసులు ఆస్వాదిస్తున్న తీరు అద్భుతం. ఈ నేపథ్యంలో వారికి మా సేవలను సైతం అందంచాలనే లక్ష్యంతో ఐటీసీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫుడ్‌టెక్ సేవలు ప్రారంభించాం. స్విగ్గీ, జొమాటో వంటి వేదికలతో అనుసంధానమై మా పసందైన రుచుల పండుగను ఆహార ప్రియుల వద్దకే చేర్చుతున్నాం. ముఖ్యంగా మా ప్రయత్నంలో అధిక–నాణ్యత భోజనాన్ని అందించడంతో పాటుగా పర్యావరణహితమైన ప్యాకింగ్‌ను కొనసాగిస్తున్నాం. డిజిటలీకరణతో అద్భుత ఫలితాలు ఫుడ్, హోటల్స్ రంగంలో అధునాతన డిజిటలీకరణ అద్భుత ఫలితాలను అందిస్తుంది. ఫుడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్‌లో పాకశాస్త్ర నిపుణులైన స్టార్ హోటల్ చెఫ్‌లు, కిచెన్ మేనేజర్లు విశేషమైన శిక్షణ ఉండటంతో ఈ విధమైన క్లౌడ్ కిచెన్‌కు మంచి ఆదరణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా వివిధ దశల్లో ఆహార పదార్థాల తనిఖీ, తయారీ విధానంలోనూ అధునాతన సాంకేతికత వినియోగించడంతో పాటు శాటిలైట్ కిచెన్లలో ఉపయోగించే యాప్‌లు ఈ వంటలకు మరింత నాణ్యతను, ఖచి్చతత్వాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ ఫుడ్ టెక్ సేవలలో సుస్థిరతే ప్రధాన లక్ష్యంగా స్టార్ హోటల్స్ ప్యాకింగ్‌ను వినూత్నంగా చేపడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, మారే ఉష్ణోగ్రతలు ఆహారాన్ని పాడు చేయకుండా స్పిల్లేజ్ ప్రూఫ్ కంటైనర్లను ఉపయోగిస్తుండటం విశేషం. ఫుడ్ లవర్స్ అభిరుచికి అనుగుణంగా.. నగరంలోని ఫుడ్ లవర్స్ ఇష్టపడే రుచులకు అనుగుణంగా, మా నాణ్యతా ప్రమాణాలను పెంచుకుంటూ 3 రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇందులో భాగంగా ప్రముఖ మాస్టర్ చెఫ్‌లచే రూపొందించబడిన దాల్ మఖీ్న, కబాబ్‌లు, ర్యానీలతో సహా గౌర్మెట్ నార్త్ ఇండియన్ వంటకాలను అందించడానికి ‘ఐటీసీ మాస్టర్ చెఫ్ క్రియేషన్స్’, ఆరోగ్యానికి హితమైన మిల్లెట్ కిచిడీ, ఇంటి వంటలను తలపించే చపాతీలు, అన్నం వంటి వాటికోసం ‘ఐటీసీ ఆశీర్వాద్ సోల్ క్రియేషన్స్’, క్రోసెంట్స్, బేగెల్స్, గౌర్మెట్ బ్రెడ్లు వంటి బేకరీ ఐటమ్స్ కోసం ‘ఐటీసీ సన్‌ఫీస్ట్ బేక్డ్ క్రియేషన్స్’ సేవలు ఉన్నాయి. ఈ మూడు రకాల సేవలను హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నైలోని 19 క్లౌడ్ కిచెన్లలో ప్రారంభించాం. – రోహిత్ భల్లా, ఫుడ్ టెక్ బిజినెస్ హెడ్, ఐటీసీ లిమిటెడ్. -
లిటిల్ చెఫ్స్: వంటలు నేర్చుకోవడం వల్ల పిల్లలు..!
ఉన్నత లక్ష్యాలను సాధించే తెగువే కాదు.. ప్రాథమిక అవసరాలను తీర్చుకునే నైపుణ్యమూ తెలుసుండాలి! వాటిల్లో వంట మొదటిది! అందుకేనేమో ఇప్పుడు పదసంపదలోకి ఫుడ్ లిటరేట్స్ అనే పదం చేరింది! చదువు, ఆట, పాటలతో పాటు పాకం కూడా తప్పక నేర్చుకోవలసిన విద్య అయింది! అర్బన్ స్కూళ్లలో, న్యూక్లియర్ కుటుంబాల్లో కుకింగ్ అనేది జెండర్ – న్యూట్రల్ యాక్టివిటీ అయింది! ఇదివరకు.. ఏ ఇంట్లో అయినా ఆడుకోవడానికి ఆడపిల్లలకైతే వంట పావులు.. మగపిల్లలకైతే కార్లు, బ్యాట్, బాల్ బొమ్మలుండేవి. ఇప్పుడు ఆ సీన్ అంతగా కనపడట్లేదు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో.. కరోనా తర్వాత. కరోనా లాక్ డౌన్ అందరికీ అన్నీ వచ్చుండాలనే పాఠం నేర్పింది. ఎమ్సెట్ ఎంట్రెన్స్ కంటే ముందు కిచెన్‌లోకి ఎంటర్ కావాలని చెప్పింది. అందుకే కరోనా తర్వాత చాలా కార్పొరేట్ స్కూళ్లు కుకింగ్నీ సిలబస్‌లో చేర్చాయి. అయితే లింగవివక్షను చెరిపేయడానికి చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్ (విద్యారణ్యతోపాటు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు) వంటి నగరాల్లోని చాలా స్కూళ్లు ఎప్పటి నుంచో కుకింగ్ క్లాసెస్‌ను తమ కరిక్యులమ్‌లో భాగం చేశాయి. కరోనా కష్టంతో పట్టణాలు, మధ్యతరగతి కుటుంబాలూ ఈ విషయంలో అలెర్ట్ అయ్యాయి. ఊహ తెలిసినప్పటి నుంచే పిల్లలకు వంట గదిని పరిచయం చేస్తున్నాయి. వంటసామాగ్రితో స్నేహం చేయిస్తున్నాయి. దీనివల్ల పిల్లల పదసంపద పెరుగుతుంది. ప్రయోగాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. వస్తువులను గుర్తించే జ్ఞానం అలవడుతుంది. కొలతలు అర్థమవుతాయి. మోతాదు మించినా, తగ్గినా వచ్చే ఫలితాల పట్ల అవగాహన కుదురుతుంది. బాధ్యత, బ్యాలెన్స్‌లు తెలుస్తాయి. సర్దుబాటు అలవాటవుతుంది. టీమ్ వర్క్, ఆ స్పిరిట్ బోధపడతాయి. ఎదుటివారికి సాయపడే గుణం అబ్బుతుంది. ఇతరులను జడ్జ్ చేయకూడదనే స్పృహా కలుగుతుంది. ఇలా కిచెన్ ఇటు అకడమిక్స్‌కు, అటు జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను బోధిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కాస్మోపాలిటన్, మెట్రో నగరాల్లో కొన్ని సంస్థలు పిల్లల కోసం కుకింగ్ వర్క్ షాప్స్‌ని కూడా నిర్వహిస్తున్నాయి. లిటిల్ షెఫ్స్‌తో టీవీ చానళ్లు కుకింగ్ షోస్‌నూ ప్రసారం చేస్తున్నాయి. అల్లరి పిల్లల్ని సంభాళించడానికి కిచెన్‌ని మించిన ప్లేస్ లేదంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఇల్లు పీకి పందిరేసే పిల్లలను పేరెంట్స్ తమ అసిస్టెంట్స్‌గా వంటగదిలోకి పట్టుకెళ్లి.. వారి ముందు క్యాబేజ్ లాంటి కూరగాయలను పెట్టి.. దాని ఆకులను వేరు చేయమని పురమాయించాలని చెబుతున్నారు. అలాగే ఒక టబ్‌లో వాళ్ల చేత నీళ్లు పోయించి, అందులో కాసింత ఉప్పు వేయించి.. వాళ్ల చేతికి కూరగాయలిచ్చి ఆ టబ్‌లో వేయించాలి. వాళ్ల చిట్టి చిట్టి అరచేతులతో చిన్న చిన్న ఉల్లిపాయలను ప్రెస్ చేయించాలి. తడిపిన చపాతి పిండిని వాళ్ల ముందు పెట్టి.. చిన్న చిన్న లడ్డూలు చేయమనాలి. ఈ యాక్టివిటీస్‌తో వాళ్లు కుదురుగా ఉండటమే కాకుండా చాలా విషయాలు నేర్చుకుంటారు. చిన్నపాటి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అవుతుందంటున్నారు నిపుణులు. అలా చిన్నప్పుడే వంటింట్లో గరిట పట్టుకుని, తమ వంటల ఘుమఘుమలతో ఇంట్లో వాళ్లనే కాదు ఇరుగు పొరుగునూ ఆశ్చర్యపరుస్తున్న ఆ బాలనలభీములను పరిచయం చేసుకుందాం.. వైభవి మెహ్రోత..ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్‌కు చెందిన ఈ అమ్మాయికిప్పుడు పదహారేళ్లు. కానీ తొమ్మిదేళ్ల వయసులోనే అమ్మ చేయి పట్టుకుని వంటింట్లోకి అడుగుపెట్టింది.. వంటలో అమ్మకు చేయందించేందుకు. పోపు దినుసుల దగ్గర్నుంచి పసుపు, ఉప్పు, కారం వంటివన్నీ ఎంత మోతాదులో పడితే వంటకు రుచి వస్తుందో పర్ఫెక్ట్గా తెలుసుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కూర ఉడుకుతుండగానే దాని వాసన చూసి చెప్పగలదు అందులో ఏం తక్కువైంది, ఏం ఎక్కువైందన్నది! బేకింగ్‌లో వైభవీని మించిన వారు లేరు. ‘లాక్డౌన్ టైమ్‌లోనే నాకీ పర్ఫెక్షన్ వచ్చింది. లాక్డౌన్లో మా చుట్టుపక్కల వాళ్లకు, చుట్టాలకు కేక్స్ చేసి పంపేదాన్ని సరదాగా! ఆ ప్రాక్టీస్‌తో కేక్స్ చేయడంలో పర్ఫెక్ట్ అయిపోయాను. నా ఫేవరిట్ అండ్ కంఫర్ట్ ఫుడ్ చాక్లెట్ కేక్!’ అని చెబుతుంది వైభవీ. హోమ్ బేకరీ, తర్వాత ఒక కేఫ్నీ పెట్టాలనేది ఈ యంగ్ షెఫ్ ఆలోచన, లక్ష్యం! ’ 'vabhavi's bake diaries' పేరుతో ఆమెకో యూట్యూబ్ చానల్ కూడా ఉంది. సునిధి మెహతా..మహారాష్ట్ర, పుణేకి చెందిన ఈ అమ్మాయికిప్పుడు పద్నాలుగేళ్లు. కానీ నాలుగేళ్ల వయసులోనే వంట మీద ఆసక్తి పెంచుకుంది. సునిధి వాళ్ల మేనత్త బ్రౌనీస్ చేస్తుంటే కళ్లింతింత చేసుకుని చూస్తుండేదట. ఆ పిల్ల ఇంట్రెస్ట్ గమనించిన మేనత్త ఆ అమ్మాయి చేయి పట్టుకుని అన్నీ చేయించేదట. ఇదంతా చూసి సునిధి వాళ్ల నాన్న .. కూతురికి అక్షరజ్ఞానం వచ్చాక వంటల పుస్తకాన్ని తెచ్చిచ్చాడట. ‘అదే నా ఫస్ట్ అండ్ ఫరెవర్ ఫేవరిట్ గిఫ్ట్’ అంటుంది బ్రౌనీలు, బిస్కట్స్, స్వీట్స్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన సునిధి. ‘బ్రౌన్ సుగర్, దాల్చిన నాకిష్టమైన ఇన్‌గ్రీడియెంట్స్. నా ఫేవరిట్ అండ్ కంఫర్ట్ ఫుడేమో పానీపూరీ. ఎప్పటికైనా కేక్ అండ్ కాఫీ స్టోర్ పెట్టాలన్నదే నా గోల్’ అని చెబుతుంది. రణవీర్ కల్బాగ్..మహారాష్ట్ర, పుణేకి చేందిన రణ్వీర్కిప్పుడు పద్నాలుగేళ్లు. కానీ అయిదేళ్ల వయసులోనే సాస్ తయారీకి ఏప్రాన్ వేసుకున్నాడు. రణ్వీర్ వాళ్ల నాన్న ప్రొఫెషనల్ చెఫ్. ప్రతి ఆదివారం ఇంట్లో వాళ్ల నాన్నే వంట చేస్తాడు. దాంతో రణ్వీర్ కూడా నాన్నకు సాయంగా వంటింట్లోకి దూరేవాడు. అలా వంట మీద ఇష్టం ఏర్పడింది ఆ అబ్బాయికి. ‘మాస్టర్ బేకింగ్ లేదా మిక్సాలజిస్ట్.. నా ఎయిమ్’ అని చెబుతాడు. స్వీట్స్ అంటే ప్రాణం పెడతాడు. ‘అందుకే బటర్ అండ్ సుగర్ అంటే చాలా ఇష్టం. అవి రెండు కలిసి చేసే మ్యాజిక్ అలాంటిది మరి!’ అంటాడు.మేధా భట్..కర్ణాటక, మంగళూరుకు దగ్గర్లోని ఆర్యపు అనే చిన్న పల్లెటూరికి చెందిన ఈ అమ్మాయికిప్పుడు పదిహేనేళ్లు. కానీ మూడవ తరగతిలో ఉన్నప్పుడే డిసైడ్ అయింది పెద్దయ్యాక రెస్టరటర్ అవ్వాలని. తను పెట్టబోయే హోటల్‌కి పేరు కూడా రెడీచేసి పెట్టుకుంది ‘తందురుస్తీ హోటల్’ అని. ఆమెకు స్ఫూర్తి వాళ్లమ్మ చూసే యూట్యూబ్ వంటల చానళ్లు. ఆ చానళ్లలో రకరకాల దినుసులన్నీటితో చక్కటి డిష్‌ని తయారుచేయడం చూసి ఆశ్చర్యపోయేదట మేధా. ‘చిటికెడు ఉప్పుతో వాళ్లు బాండిడు కూరకు రుచి తేవడం నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉండేది’ అంటూ ఇప్పటికీ సర్ప్రైజ్ అవుతుంది. మేధా తన ఎనిమిదో ఏట పోపుల పెట్టె పట్టుకుంది. ‘నిజానికి మేధా హైపర్ యాక్టివ్ కిడ్. వంట వల్లే తను నెమ్మది అయింది. ఇప్పటికీ మేధాను చూస్తుంటే నాకు వండరే! ఒక్క క్షణం కాలు నిలువని పిల్ల.. అంత ఓపిగ్గా వంట ఎలా చేయగలుతుంది అని!’ అంటుంది మేధా వాళ్లమ్మ. చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్‌డేలకు కస్టమైజ్డ్ కేక్స్ చేస్తున్న మేధాకు చాక్లెట్, బంగాళదుంప అంటే ఇష్టం. (చదవండి: ఐదేళ్లకే పుస్తకాన్ని రచించి రికార్డు సృష్టించింది..!) -
వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్‌కు మించి బ్యాక్టీరియా
వంట చేయడం ఒక ఎత్తయితే...అంట్ల గిన్నెలను తోమడం, కడగడం అంతకు రెండింతలు. శుభ్రంగా తోమాలి. ఎలాంటి మరకలు లేకుండా కడగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఆరోగ్యానికి చేటే. మన ఇంటిల్లు ఎంత శుభ్రంగా ఉంటే మన ఇంటికి, ఒంటికీ అంత మంచిది. కానీ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే వంట గిన్నెల్ని శుభ్రం చేసే స్క్రబ్బర్, స్పాంజ్‌ల కారణంగా ప్రాణాంతక వ్యాధులు సోకవచ్చని తాజా పరిశోధనలో తేలింది. ప్రస్తుతం కాలంలో వంట పాత్రల్ని శుభ్రం చేసేందుకు ఎక్కువగా స్టీల్ స్క్రబ్బర్‌ని, లేదా స్పాంజ్‌ని వాడుతూ ఉంటాం కదా. ఈ డిష్ స్క్రబ్బింగ్ స్పాంజ్ హానికరమైన బాక్టీరియాకు హాట్‌స్పాట్ అంటే నమ్ముతారా? ఇది టాయిలెట్ బౌల్ కంటే ఎక్కువ ప్రమాదాలను కలిగిస్తుందని తాజా స్టడీ తేల్చింది. కిచెన్ స్పాంజ్లు ఎందుకు ప్రమాదకరం?డ్యూక్ యూనివర్శిటీకి చెందిన బయోమెడికల్ ఇంజనీర్లు స్పాంజ్లు తేమతో కూడిన నిర్మాణం కారణంగా సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని అందిస్తాయని ధృవీకరించారు. ఒక చిన్న క్యూబిక్ సెంటీమీటర్ స్క్రబ్బర్లో 54 బిలియన్ల బ్యాక్టీరియా ఉంటుంది. 5 శాతం వరకు సాల్మొనెల్లాను కలిగి ఉండవచ్చు. దీంతో తేలికపాటి గ్యాస్ట్రోఎంటెరిటిస్ మాత్రమే కాకుండా మెనింజైటిస్, న్యుమోనియా, అధిక జ్వరాలు, బ్లడీ డయేరియా, ప్రాణాంతక బ్లడ్ పాయిజిన్లాంటి తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఉన్నాయి. ఫుడ్ పాయిజనింగ్తో ఆహార సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. వీటికి చికిత్స చేయకపోతే ప్రాణాంతక సమస్యలు వస్తాయి. అంతేకాదు అందులో ఉండే రకరకాల బ్యాక్టీరియాలతో కిడ్నీ సంబంధిత సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఈ స్పాంజ్‌లలో వృద్ధి చెందే ఈ-కొలి కారణంగా మూత్రపిండ వైఫల్య ప్రమాదం కూడా ఉంది. దీన్నే హిమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ అంటారు. ఇది ఆహార కాలుష్యం వల్ల వస్తుంది. స్టెఫిలోకాకస్ అనేది స్పాంజ్‌లలో కనిపించే మరొక వ్యాధికారకం. చర్మ వ్యాధులకు, ఇంపెటిగో, సెల్యులైటిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు కారణమవుతుంది. పరిష్కారం ఏమిటి? ఏం చేయాలి. పాత్రలను శుభ్రం చేసే స్పాంజ్లు,స్క్రబ్బర్లు తరచుగా మారుస్తూ ఉండాలి. అలాగే ఏరోజుకారోజు శుభ్రంగా క్లీన్ చేయాలి. తడి లేకుండా బాగా పిండేసి, తర్వాత వాటిని గాలిలో ఆరనివ్వాలి. మాంసం కంటైనర్లు, ఇతర పాత్రలు..ఇలా అన్నింటికి ఒకటే కాకుండా వేరు వేరువస్తువులను శుభ్రం చేయడానికి వేరు వేరు స్పాంజిని ఉపయోగించాలి. బాక్టీరియా ప్రమాదాన్ని నివారించేందుకు స్పాంజ్‌లను తడిపి రెండు నిమిషాలు మైక్రోవేవ్‌లో ఉంచాలి.డిష్ గ్లోవ్స్ ధరించడం వల్ల కలుషితమైన స్పాంజ్లతో వచ్చే చర్మ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించు కోవచ్చు. స్పాంజ్లకు ప్రత్యామ్నాయాలుప్లాస్టిక్ స్పాంజ్‌లను తరచుగా వాడి పారేయడం పర్యావరణ అనుకూలమైనది కాదు, కాబట్టి సెల్యులోజ్ ఆధారిత స్పాంజ్ లాంటి ప్రత్యామ్నాయాలుఎంచుకోవాలని పరిశోధకులు సూచించారు. స్పాంజ్‌లను ఉపయోగించడంలో అసౌకర్యంగా ఉన్నవారు, స్క్రబ్ బ్రష్‌లు, సిలికాన్ బ్రష్‌లు, సింగిల్ యూజ్ మెటల్ స్క్రబ్బీలు, డిష్వాషర్లు లాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలింటున్నారు. -
కొంచెం స్మార్ట్‌గా..అదిరిపోయే వంటింటి చిట్కాలు
వంట చేయం అనుకున్నంత ఈజీకాదు. భయపడినంత కష్టమూ కాదు. కాస్త స్మార్ట్‌గా ముందస్తు ప్రిపరేషన్ చేసుకుంటే చాలు. అన్నం వండాలా,చపాతీ చేయాలి అనేక ముందు నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి ఎలాంటి కూరలు చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. చపాతీ అయితే, పప్పు, లేదా మసాలా కూర చేసుకుంటే సరిపోతుంది. అదే అన్నం అయితే, పప్పు, కూర, పచ్చడి, సాంబారు లేదా చారు, ఇంకా వడియాలు అప్పడాలు ఇలా బోలెడంత తతంగం ఉంటుంది. అంతేకాదు వీటికి సరిపడా కూరగాయలు, ఉల్లిపాయలు కట్ చేయడం ఒక పెద్ద పని. అయితే ఎలాంటి పని అయినా, ఇబ్బంది లేకుండా కొన్ని చిట్కాలతో సులువుగా చేసుకోవచ్చు. అలాంటివి మచ్చుకు కొన్ని చూద్దాం.చిట్కాలుపచ్చిమిర్చి కట్ చేసినపుడు చేతులు మండకుండా ఉండాలంటే కత్తెరతో కట్ చేసు కోవాలి. చాకుతో కోసినపుడు చేతుల మండుతోంటే పంచదారతో చేతులను రుద్దుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలను కట్ చేయాలంటే, వాటిని ముందు కొంచెం సేపు చల్లని నీటిలో ఉంచాలి.ఉల్లిపాయలు కట్ చేసిన అనంతరం చేతులు ఉల్లి వాసన రాకుండా ఉండాలంటే, నిమ్మరసం చేతులకు పట్టిస్తే ఉల్లి వాసన పోతుంది.చపాతీగాని, పరోటాగాని, మెత్తగా ఉండాలంటే 1 స్పూన్ మైదా, ఒక స్పూన్ పెరుగుని గోధుమ పిండిలో వేసి తడిపితే మెత్తగా వస్తాయి.చిటికెడు సోడా వేసి గోధుమ పిండిని తడపితే పూరి మెత్తగా, రుచిగా ఉంటుంది. పచ్చకూరలు వండేటప్పుడు చిటికెడు సోడా వేసి వండితే చూడ్డానికి కంటికి మంచి ఇంపుగా కనబడ్డమే కాకుండా రుచిగా ఉంటాయి.పంచదార జార్లో రెండు లవంగాలు వేస్తే చీమల దరి చేరవు.కోడిగుడ్లను ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే వాటిని చన్నీళ్ళలో వేసినా పెంకు సులభంగా వస్తుంది టమోటా ఫ్రెష్‌గా ఉండాలంటే ఉప్పునీటిలో ఒక రాత్రంతా ఉంచితేచాలు.ఒక్కోసారి గ్లాస్లు, స్టీల్ గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయి భలే ఇబ్బంది పెడతాయి. ఆ సమయంలో కంగారుపడి, కిందికి మీదికి కొట్టకుండా, పై గ్లాసును చల్లటి నీటితో నింప్పి వేడి నీటిలో కాసేపు ఉంచితే ఇరుక్కున్న గ్లాసు ఈజీగా వచ్చేస్తుంది. శుభ్రమైన వాతావరణంలో శుభ్రం చేసుకున్న చేతులతో వంటను పూర్తి చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఇదీ చదవండి : విడాకుల తరువాత పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా? -
Vinayaka Chavithi 2024: బుజ్జి గణపయ్యకు.. బొజ్జ నిండా!
రేపే వినాయక చవితి. ఉదయం చంద్రుడిని చూడవద్దు. చందమామ లాంటి కుడుములు చేద్దాం. వినాయకుడికి నివేదన చేద్దాం. ఓ బొజ్జ గణపయ్యా! నీ బంటు నేనయ్యా!! ఉండ్రాళ్లపై దండు పంపమని స్తోత్రం చదువుదాం!!ఉండ్రాళ్లు..కావలసినవి..బియ్యపు రవ్వ– కప్పు;నీరు – 2 కప్పులు;పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు;నెయ్యి– టీ స్పూన్;ఉప్పు – పావు టీ స్పూన్;పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు (ఇష్టమైతేనే)తయారీ..– శనగపప్పును కడిగి 20 నిమిషాల సేపు నీటిలో నానబెట్టి నీటిని వంపేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి అందులో శనగపప్పు వేసి వేయించాలి.– శనగపప్పు దోరగా వేగిన తర్వాత అందులో నీరు పోసి ఉప్పు వేసి మూత పెట్టాలి.– నీరు మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి, రవ్వ వేసి ఉండలు లేకుండా గరిటెతో కలపాలి.– కొబ్బరి తురుము వేసి సమంగా కలిసే వరకు కలిపి నీరు ఆవిరైపోయి రవ్వ దగ్గరగా అయిన తర్వాత దించేయాలి.– వేడి తగ్గిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని గోళీలుగా చేస్తే ఉండ్రాళ్లు రెడీ.పూర్ణం కుడుములు..కావలసినవి..బియ్యప్పిండి– కప్పు;నీరు – కప్పు;నెయ్యి – టీ స్పూన్;ఉప్పు – చిటికెడు. పూర్ణం కోసం... పచ్చి శనగపప్పు – అర కప్పు; నీరు – కప్పు;బెల్లం పొడి– ముప్పావు కప్పు;పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు;యాలకుల పొడి– అర టీ స్పూన్‌తయారీ..– శనగపప్పును కడిగి రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, చల్లారిన తర్వాత నీటిని వంపేసి శనగపప్పును మిక్సీలో వేసి పొడి చేయాలి.– ఈ పొడి డ్రైగా ఉండదు, కొద్దిపాటి తడిపొడిగా ఉంటుంది.– ఒక పాత్రలో బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి కరిగే వరకు మరిగించాలి.– కరిగిన తర్వాత మరొకపాత్రలోకి వడపోయాలి.– బెల్లం నీటిలో శనగపప్పు పొడి, కొబ్బరి తురుము వేసి గరిటెతో కలుపుతూ మిశ్రమం దగ్గరగా అయ్యే వరకు మరిగించాలి.– చివరగా యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి.– చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఎనిమిది భాగాలుగా చేసి, గోళీలుగా చేస్తే పూర్ణం రెడీ.ఇక కుడుముల కోసం..– ఒక పాత్రలో కప్పు నీరు పోసి అందులో ఉప్పు, నెయ్యి వేసి వేడి చేయాలి.– నీరు మరిగేటప్పుడు స్టవ్ ఆపేసి బియ్యప్పిండి వేసి గరిటెతో కలపాలి.– వేడి తగ్గిన తరవాత చేత్తో మర్దన చేస్తూ చపాతీల పిండిలా చేసుకుని ఎనిమిది భాగాలు చేయాలి.– ఒక్కో భాగాన్ని గోళీలాగ చేసి పూరీలా వత్తాలి.– ఇందులో పూర్ణం పెట్టి అంచులు మూసేయాలి. ఇలాగే అన్నింటినీ చేసుకోవాలి.– ఒక వెడల్పు పాత్రకు నెయ్యి రాసి పూర్ణకుడుములను అమర్చాలి.– ప్రెషర్ కుకర్‌లో నీరు పోసి కుడుముల పాత్ర పెట్టి మూత పెట్టి ఎనిమిది నిమిషాల సేపు ఉడికించి స్టవ్ ఆపేయాలి.– చల్లారిన తర్వాత తీసి వినాయకుడికి నివేదన చేయాలి. -
ఈ కిచెన్వేర్స్ని నిమ్మకాయతో అస్సలు క్లీన్ చేయకూడదు !
వంటగదిలో క్లీన్ చేయడానికి లేదా శుభ్రంగా ఉంచడానికి మొట్టమొదటగా ఉపయోగించేది నిమ్మకాయలనే. దీనిలోని ఆమ్లత్వం, తాజా సువాసన కారణంగా వీటిని మిరాకిల్ క్లీనర్‌గా పిలుస్తుంటారు. చెప్పాలంటే ఏదైనా చెడు వాసన పోగొట్టేందుకు, క్రిమిసంహారక క్లీనర్‌గానూ నిమ్మకాయాలు బెస్ట్. ఈ నిమ్మకాయలు క్లీనింగ్‌కి, సువాసన కోసం ఉపయోగించినప్పటికీ కిచెన్‌లోని ఈ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయలతో క్లీన్ చేయకూడదు. నిమ్మకాయలకు దూరంగా ఉంచాల్సిన వంటగది వస్తువులు ఏవంటే..మార్బుల్, గ్రానైట్ కౌంటర్‌టాప్‌లు: ఇళ్లలోని ఫ్లోర్ ఎక్కువగా మార్బుల్ లేదా గ్రానైట్ రాయిని వినియోగిస్తున్నారు. వీటిని క్లీన్ చేసేందుకు నిమ్మకాయలను ఉపయోగించకూడదు. దీనిలోని అధిక ఆమ్లత్వం కారణంగా నష్టం వాటిల్లుతుందే తప్ప అవి క్లీన్ అవ్వవు. పైగా వాటికి ఉండే సహజ మెరిసే గుణం పోతుంది. వీటిని క్లీన్ చేసేందుకు పీహెచ్ తటస్థ క్లీనర్లను ఎంపిక చేసుకుంటే అవి మెరుస్తుంటాయి. కాస్ట్ ఐరన్ పాన్లు: తొందరగా వేడేక్కే బెస్ట్ పాన్లు. వీటిని కూడా నిమ్మకాయలతో క్లీన్ చేయకూడదు. ఎందుకంటే దీనిలోని ఆమ్లత్వం తుప్పు పట్టేలా చేస్తుంది. పైగా పాన్లపై నూనెకు సంబంధించిన జిగటను నిరోధించే రక్షిత పొరకు నష్టం వాటిల్లేలా చేస్తుంది. వీటిని శుభ్రం చేసేందుకు బ్రష్, వేడి నీటిని ఉపయోగించండి. కత్తులు వంటి వాటికి..కత్తులు వంటి పదునైన వస్తువులను క్లీన్ చేసేందుకు నిమ్మకాయను అస్సలు వాడకూడదు. ఇది రియాక్షన్ చెంది ఆక్సీకరణం చేయడంతో కత్తులు తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇది క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ వీటిని శుభ్రపరిచేందుకు ఉపయోగించకపోవడమే మంచిది. ఇలాంటి పదునైన వస్తువులను క్లీన్ చేసేందుకు డిష్ సబ్బును ఉపయోగించండి, క్లీన్ చేసిన వెంటనే తడి లేకుండా ఆరనివ్వాలి. ఇలా చేస్తే వాటి పదును పోదు, ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. చెక్క పాత్రలు, చెక్క కట్టింగ్ బోర్డులు..చెక్ పాత్రలు, చెక్ కట్టింగ్ బోర్డులు నిమ్మకాయతో క్లీన్ చేస్తే గనుక..దీనిలోని ఆమ్లత్వం పొడిగా అయిపోయి పగళ్లు తెప్పిస్తుంది. పైగా బ్యాక్టీరియాను ఆశ్రయించేలా చేస్తుంది. వీటిని క్లీన్ చేసేందుకు తేలికపాటి సబ్బును ఉపయోగించండి. మంచిగా ఉండేందుకు నూనె అప్లై చేయండి.అల్యూమినియం పాత్రలు..అల్యూమినియం పాత్రలను నిమ్మకాయలతో శుభం చేయడం హానికరం. ఎసిడిటీ వల్ల రంగు మారడం, మెరుపు కోల్పోవడం జరుగుతుంది. అంతేగాదు ఆ పాత్ర ఉపరితలంపై చిన్న రంధ్రాలను కూడా ఏర్పరుస్తుంది. వీటిని క్లీన్ చేసేందుకు డిస్ సోప్ వినియోగించండి. కొత్తగా కనిపించేలా చేసేందుకు స్పాంజ్‌తో క్లీన్ చేయండి. (చదవండి: ఎర్ర బచ్చలికూరతో అధిక బరువుకి చెక్!) -
రుచులతో ప్రయాగాలు చేయడం.. కబితా సింగ్ అభిరుచి!
రుచులతో ప్రయాగాలు చేయడం కబితా సింగ్ అభిరుచి. అందులో ఆమెకు అపారమైన ప్రజ్ఞ ఉంది. కబితా గరిట పట్టిందంటే చాలు నలభీమ పాకం ఇలాగే ఉంటుందేమో అన్నంత టేస్టీగా ఘుమఘుమలాడిపోతుంది ఆ వంటకం. అలా తను చేసే డిఫరెంట్ వంటకాల గురించి లోకానికి చెప్పాలనుకుంది.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయితే పర్ఫెక్ట్ అనుకుంది. అందుకే 2014లో Kabita's Kitchen పేరుతో యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేసింది. అందులో ఆమె చేప్పే 10 మినిట్స్ ప్రెషర్ కుకర్ రెసిపీస్ నుంచి స్ట్రీట్ ఫుడ్ దాకా, నాన్ ఆయిలీ ఆలూ పాలక్ నుంచి పాస్తా, పిజ్జా, సాలిడ్స్, సూప్స్ దాకా అన్ని రకాల వంటలకు ఊహించని రీతిలో రెస్పాన్స్ మొదలైంది. 2017కల్లా మిలియన్ల వ్యూస్‌కి చేరుకుంది. ఇప్పుడు ఆమె చానెల్‌కి (2023 లెక్కల ప్రకారం) కోటీ 34 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు.ఈ పాపులారిటీ వల్ల ఆమె చానెల్‌కి బ్రాండ్ ప్రమోషన్స్ పెరిగాయి. 2023 గణాంకాల ప్రకారం యాడ్స్ వల్ల ఆమె ఏడాదికి 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆర్జిస్తోందని అంచనా. అకార్డింగ్ టు వేరియస్ వెబ్‌సైట్స్ Kabita's Kitchen వాల్యూ 5 నుంచి 6 కోట్లు ఉండొచ్చట. చూశారా.. తిరగమోతకూ తిరుగులేని విలువుంటుంది. అందుకే వంటలో నైపుణ్యాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి!ఇవి చదవండి: Sharvari Wagh: అది సినిమానా? ఓటీటీనా? టీవీ సీరియలా అని చూడను.. -
ఆ ఉత్తరం ఈ దక్షిణం అన్ని రుచులూ అద్భుతః
మన వంటగదికి పొరుగింటి రుచిని అద్దుదాం. కేరళ కొబ్బరితో బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం. పెరుగుతో పంజాబీ కడీ చేద్దాం. శనగలతో జైసల్మీర్ చనే కూడా ట్రై చేద్దాం. పిల్లలకు అన్ని రుచులూ అలవాటైతే... పై చదువులకు ఏ రాష్ట్రానికి వెళ్లినా సరే... మన ఇంట్లో భోజనం చేసినట్లే ఉంటుంది.కేరళ పాలాపం..కావలసినవి..బియ్యం– పావు కేజీ;పచ్చి కొబ్బరి తురుము – యాభై గ్రాములు;నీరు– వంద మిల్లీలీటర్లు;చక్కెర – అర స్పూన్;ఉప్పు – అర స్పూన్;బేకింగ్ సోడా– చిటికెడు.తయారీ..బియ్యాన్ని శుభ్రంగా కడిగి మంచినీటలో ఐదు గంటల సేపు నానబెట్టాలి.మిక్సీలో బియ్యంతోపాటు కొబ్బరి తురుము కూడా వేసి తగినంత నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.ఇది ఆపం పిండి ∙బాణలిలో నీటిని పోసి, అందులో పై మిశ్రమాన్ని ఒక కప్పు వేసి గరిటెతో కలుపుతూ మరిగించి దించేయాలి.మిశ్రమం చల్లారిన తర్వాత ఆపం పిండిలో వేసి కలపాలి.ఈ పిండిని ఎనిమిది గంటల సేపు కదిలించకుండా ఉంచాలి. రాత్రి గ్రైండ్ చేసి పెడితే ఉదయానికి పొంగుతుంది.ఇందులో చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా వేసి గరిటెతో బాగా కలపాలి.మిశ్రమం గరిటె జారుడుగా ఉండాలి. అవసరాన్ని బట్టి మరికొంత నీటిని వేసుకోవచ్చు.ఆపం పెనం వేడి చేసి ఒక గరిటె పిండి వేసి అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పితే పిండి దోశెలాగ విస్తరిస్తుంది.మీడియం మంట మీద కాల్చాలి. కాలే కొద్దీ అంచులు పైకి లేస్తాయి.అట్లకాడతో తీసి ప్లేట్లో పెట్టాలి. దీనిని రెండవ వైపు కాల్చాల్సిన పని లేదు, కాబట్టి తిరగేయకూడదు.ఈ ఆపం అంచులు ఎర్రగా కరకరలాడుతూ మధ్యలో దూదిలా మెత్తగా ఉంటుంది.నూనె వేయాల్సిన పని లేదు. ఆపం పెనం లేకపోతే దోశె పెనం (ఫ్లాట్‌గా కాకుండా కొంచెం గుంటగా ఉండే పెనం) మీద ప్రయత్నించవచ్చు.పంజాబీ కడీ..కావలసినవి..– శనగపిండి మిశ్రమం కోసం: శనగపిండి– కప్పు;పెరుగు– 2 కప్పులు;నీరు– 4 కప్పులు;పసుపు– చిటికెడు.– కడీ కోసం: ఆవనూనె లేదా వేరుశనగ నూనె– టేబుల్ స్పూన్;పసుపు – అర టీ స్పూన్;ఇంగువ– పావు టీ స్పూన్;ఆవాలు – టీ స్పూన్;జీలకర్ర – టీ స్పూన్;మెంతులు – అర టీ స్పూన్;లవంగాలు – 3;ఎండుమిర్చి – 2;కరివేపాకు – 3 రెమ్మలు;ఉల్లిపాయ – 1 పెద్దది (తరగాలి);అల్లం– అంగుళం ముక్క (తరగాలి);వెల్లుల్లి– 4 రేకలు (తరగాలి);మిరపొ్పడి– అర టీ స్పూన్;ధనియాల పొడి –2 టీ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్;గరం మసాలా– అర టీ స్పూన్;ఆమ్చూర్ పౌడర్– 2 టీ స్పూన్లు లేదా పచ్చి మామిడి గుజ్జు టేబుల్ స్పూన్;కసూరీ మేథీ (ఎండిన మెంతి ఆకుల పొడి)– 2 టీ స్పూన్.– తడ్కా కోసం: నూనె – టేబుల్ స్పూన్;ఎండుమిర్చి– 2;కశ్మీరీ మిర్చిపౌడర్– అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు– టేబుల్ స్పూన్‌తయారీ..ఒక పెద్ద పాత్రలో పెరుగు, శనగపిండి వేసి బాగా కలిసేటట్లు చిలకాలి. అందులో పసుపు వేసి, నీరు పోసి మళ్లీ చిలికి అరగంట సేపు పక్కన ఉంచాలి.స్టవ్ మీద మందపాటి పాత్ర పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ వేసి వేగనివ్వాలి.అవి వేగిన తర్వాత మిర్చిపౌడర్, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలపాలి.ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి– పెరుగు మిశ్రమాన్ని పోసి ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి.ఐదు నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికిన తర్వాత మంట తగ్గించి మూత పెట్టి పది నిమిషాల సేపు ఉడికించిన తర్వాత ఆమ్చూర్ పౌడర్, కసూరీ మేథీ, గరం మసాలా పొడి వేసి కలిపి దించేయాలి.బాణలి పెట్టి నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి, కశ్మీరీ మిర్చిపౌడర్ వేసి వేగిన తర్వాత ఉడికించిన కడీ మిశ్రమాన్ని పోసి చివరగా కొత్తిమీర చల్లితే పంజాబీ కడీ రెడీ.ఇది అన్నంలోకి బాగుంటుంది. పంజాబీ కడీలో నీరు ఎక్కువగా కలిపి పలుచగా చేసుకుని సూప్‌లా కూడా తాగుతారు.వర్షాకాలం, చలికాలం ఈ సూప్ తాగుతుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తేలిగ్గా, హాయిగా ఉంటుంది.జైసల్మీరీ చనే..కావలసినవి..ముడి శనగలు – కప్పు;నెయ్యి – టేబుల్ స్పూన్;ఇంగువ – చిటికెడు;జీలకర్ర– అర టీ స్పూన్;జీలకర్ర పొడి– టీ స్పూన్;ధనియాల పొడి – 2 టీ స్పూన్లు;మిరపొ్పడి – టేబుల్ స్పూన్;పసుపు– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;పెరుగు– ఒకటిన్నర కప్పులు;శనగపిండి –3 టేబుల్ స్పూన్లు;కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..శనగలను శుభ్రంగా కడిగి ఆరింతలుగా నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి.ఉదయం నీటిని వంపేసి మరోసారి కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి నాలుగు కప్పుల నీటిని పోసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.దించేసిన తర్వాత చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఒక వెడల్పు పాత్రలో శనగపిండి, పెరుగు, పసుపు, మిరపొ్పడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.పెనంలో నెయ్యి వేడి చేసి జీలకర్ర, ఇంగువ వేయాలి.జీలకర్ర చిటపట పేలిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి, పెరుగు మిశ్రమాన్ని వేసి అడుగుపట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.ప్రెషర్‌కుకర్‌లో ఉడికించి సిద్ధంగా ఉంచిన శనగలను నీటితో సహా ఉడుకుతున్న శనగపిండి, పెరుగు మిశ్రమంలో వేసి కలిపి మరో ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ జైసల్మీరీ చనే కర్రీ రోటీ, పుల్కాలతోపాటు అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది.ఇవి చదవండి: ఇంట్లో కూర్చుని.. త్రీడీ కిటికీలు ఎప్పుడైనా చూశారా? -
వర్షాకాలంలో కిచెన్ క్లీన్‌గా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వర్షాకాలం అనంగానే సీజనల్ వ్యాధులు పగబట్టినట్లుగా మనుషులపై దాడి చేస్తాయి. అందుకు ప్రధాన కారణం బ్యాక్టీరియా, వైరస్‌లే. వాతావరణంలోని తేమ కారణంగా సులభంగా బ్యాక్టీరియా, ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కిచెన్‌లోని వస్తువులు పాడవ్వడం లేదా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో కిచెన్‌ని ఎంత పరిశుభ్రంగా ఉంచితే అంత ఆరోగ్యం ఉంటాం. నిత్యం మన ఉపయోగించే కిచెన్‌లోని వస్తువులు పాడవ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సినవి సవివరంగా తెలుసుకుందామా..!వర్షాకాలంలో కిచెన్‌ని సురక్షితంగా ఉంచేలా పాటించాల్సినవి ఇవే..కిచెన్ చిమ్నీ, ఎగ్జాస్ట్ ఫ్యాన్: వంటగదిలో సూర్యరశ్మి వచ్చేలా, తేమ చేరకుండా ఉండేలా చూసుకోమని చెబుతుంటారు పెద్దలు. కానీ వర్షాకాలంలో అలా అస్సలు కుదరదు. ఎండ అనేది పెద్దగా ఉండదు, పైగా వాతావరణంలోని తేమ కారణంగా కిచెన్‌ను పొడిగా ఉంచడం కాస్త ఇబ్బందే. అలాంటప్పుడూ కిచెన్‌కి ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్లను శుభ్రపరిచి ఆన్ చేసి ఉంచాలి. అలాగే వంటగది చిమ్నీ కూడా డెస్ట్ లేకుండా ఉంచుకుంటే తేమ చేరకుండా కాపాడుకోగలుగుతాం. కిచెన్ కూడా పొడిగా ఉంటుంది.అలాగే వంటగదిలో సరుకులు పాడవ్వకూడదంటే గాలి చొరబడిన క్లోజ్డ్ కంటైనర్లలో భద్రపరుచుకోండి. సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులను తేమ, బ్యాక్టీరియా చేరకుండా ఉండేలా గాలి చొరబడిని గాజు పాత్రలో ఉంచాలి. ఇక వంటగదిలో పంచదార, కొన్ని రకాలు పొడులు అవి పాడ్వకుండా ఉండేందుకు వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులతో సమస్యను నివారించండి. దాల్చిన చెక్క, లవంగాలు వంటి వాటిని నిల్వ ఉంచే పొడులకు చేర్చితే పాడవ్వకుండా ఉంటాయి. సింక్ పైపులను శుభ్రంగా ఉంచండి: వంటగదిలోని సింక్పైపులు చక్కగా ఉండేలా చూడండి. ఎలాంటి లీక్‌లు లేవనేది నిర్థారించుకోండి. దీనివల్ల దోమలు, ఈగలు రాకుండా కాపాడుకోగలుగతాం. ఈ సీజన్ ప్రారంభమయ్యే ముందే ఈ జాగ్రత్తలను తప్పనసరి తీసుకోవాలి. అలాగే కాలానుగుణ పండ్లను, కూరగాయలను తీసుకోండి. వాటిని తాజాగా నిల్వ ఉంచుకునేలా తగు జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా బయటపడగలుగుతారు అని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: యూకేలో భారతీయ కిరాణ సరుకులు ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!) -
ఇంకు, తుప్పు వంటి మొండి మరకలు సైతం తొలగించాలంటే..? ఇలా చేయండి..
ఇంట్లోని ఇలాంటి చిన్న చిన్న వస్తువులను మన్నికగా, శుభ్రంగా ఉంచడంలో ఇబ్బంది పడుతున్నరా!? అయితే ఈ సూపర్ కిచెన్ టిప్స్ మీకోసమే.బట్టల మీద పడిన ఇంక్ మరకలు పోవాలంటే.. ఇంక్ మరకలపై కొద్దిగా నీళ్లు చల్లాలి. ఇప్పుడు టూత్ పేస్టును అప్లై చేసి బ్రష్‌తో రుద్ది నీటితో వాష్ చేస్తే ఇంక్ మరకలు ఇట్టే పోతాయి.మినరల్ వాటర్ క్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు, టీస్పూను బేకింగ్ సోడా, ఒక నిమ్మకాయ రసం, కొద్ది గోరువెచ్చని నీళ్లు పోసి పదిహేను నిమిషాలు నానబెట్టాలి. తరువాత క్యాన్‌ను పైకీ కిందకు బాగా గిలకొట్టాలి. పది నిమిషాలపాటు ఇలా గిలకొట్టి రెండుమూడుసార్లు నీటితో కడగాలి. తరువాత డిష్ వాష్ లిక్విడ్‌తో వాటర్ క్యాన్ బయటవైపు తోముకుంటే క్యాన్ మురికి వదిలి కొత్తదానిలా మెరుస్తుంది.స్ప్రే బాటిల్లో టేబుల్ స్పూను బేకింగ్ సోడా, టేబుల్ స్పూను వెనిగర్, టీ స్పూను డిష్ వాష్ లిక్విడ్, రెండు గ్లాసులు నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కిచెన్ ΄్లాట్ఫాం, స్టవ్ మీద చల్లుకుని తుడుచుకుంటే ఎటువంటి క్రిములూ దరిచేరవు. దీనిలో ఎటువంటి రసాయనాలు లేవు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే.ఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్.. -
పాఠ్యపుస్తకాల్లో లింగసమానత్వ చిత్రాలు
కొచ్చి: వంటగది అనగానే అమ్మ వండుతున్నట్లు చూపే ఫొటోలు పాఠ్యపుస్తకాల్లో ముద్రిస్తుంటారు. ఇలాంటి ధోరణికి చెల్లుచీటి ఇస్తూ కేరళ ప్రభుత్వం లింగసమానత్వ చిత్రాలకు పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చోటు కలి్పంచింది. అమ్మ అంటే ఉద్యోగం చేయదని, ఇంట్లోనే ఉంటుందనే భావన బడిఈడు పిల్లల్లో నాటుకుపోకుండా ఉండేందుకు, సమానత్వాన్ని వారి మెదడులో పాదుకొల్పేందుకు కేరళ సర్కార్ కృషిచేస్తోంది. ఈ ప్రయత్నానికి ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడో తరగతి మలయాళం మాధ్యమం పాఠ్యపుస్తకం పేజీలను కేరళ సాధారణ విద్యాశాఖా మంత్రి వి.శివాన్కుట్టి సోషల్‌మీడియాలో షేర్చేశారు. తండ్రి వంటింట్లో కూర్చుని పచ్చి కొబ్బరి తురుము తీస్తున్నట్లు ఒక పేజీలో డ్రాయింగ్ ఉంది. తన కూతురు కోసం తండ్రి అల్పాహారం సిద్ధంచేస్తున్నట్లు మరో పేజీలో డ్రాయింగ్ ఉంది. ఇంటి పనిలో పురుషులు ఎంత బాధ్యతగా ఉండాలని ఈ చిత్రాలు చాటిచెబుతున్నాయని నెటిజన్లు మెచ్చుకున్నారు. -
లైఫ్‌లో మర్చిపోలేని వంటింటి చిట్కాలివిగో!
వంట చేసేటపుడు వంటకు చక్కటి రుచి రావాలన్నా, వంటను సులభంగా పూర్తి చేయాలన్నా, వంట ఇంట్లో పనులను ఈజీగా చక్కబెట్టుకోవాలన్నా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కచ్చితంగా తెలియాలి. అలాంటి వాటిల్లో కొన్నింటిని ఇక్కడ చూద్దాం! బెండకాయలు ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండాలంటే వాటి చివర్లను కట్ చేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు బియ్యంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం పువ్వులా ఉడుకుతుంది.యాలకుల తొడిమలను పొడి చేసి టీ చేసేటప్పుడు చక్కెరతోపాటు అందులో వేయాలి. టీ రుచి అద్భుతంగా, సువాసనగా ఉంటుంది.పూరీలు తెల్లగా రావాలంటే వేయించేటప్పుడు నూనెలో కొన్ని జామ ఆకులు వేయాలి.అప్పడాలు ఎక్కువ నూనె పీల్చకూడదు అనుకుంటే వేయించే ముందు కాసేపు ఎండలో పెట్టాలి.పెరుగు పులిసిపోకుండా ఉండాలంటే చిన్న కొబ్బరి ముక్కలు అందులో వేయండి.బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలోఉంచితే తొందరగా మెత్తబడవు. కూరగాయల్ని, లేదా ఆకుకూరల్ని తరిగే ముందు ఉప్పు, పసుపు వేసిన నీటిలో కడిగితే క్రిములు పైకి తేలతాయ. అపుడు సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.కారంపొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్క ఉంచితే తొందరగా పురుగుపట్టదు.నెయ్యి కాచేటపుడు రెండు లవంగాలుగానీ, తమలపాకు గానీ వేస్తేమంచి వాసన వస్తుంది. పాలు గడ్డగా తోడుకోవాలంటే.. పాలు బాగా మరిగించి, కాస్త వేడిగా ఉండగానే మజ్జిగ లేదా ఉండలులేని పెరుగు వేసి బాగా కలపాలి.అల్లం వెల్లుటి పేస్ట్ తయారు చేసేటపుడు, అల్లం, వెల్లుల్లి పొట్టు తొందరగారావాలంటే నీళ్లలో నానబెడితే మంచిది.ఇడ్లీ, దోసె పిండి, ఎక్కువ రోజులుతాజాగా ఉండాలంటే..పైన రెండు తమలపాకులు వేయండి. -
మొబైల్లో ఆర్డర్‌చేసి కిచెన్‌లోకి వెళితే వంట రెడీ!
వై-ఫైతో అనుసంధానమయ్యే గ్యాడ్జెట్లు మన హాల్ నుంచి తిన్నగా వంట గదిలోకి ప్రవేశిస్తున్నాయి. ఎలాగంటారా.. కిచెన్‌లోనూ స్మార్ట్ పరికరాల సంఖ్య పెరుగుతోంది. హాల్లో ఎక్కువగా స్మార్ట్ టీవీ, స్మార్ట్ హోం థియేటర్, స్మార్ట్ ఫ్యాన్, సెన్సార్ డోర్లు.. వంటి పరికరాలు వాడుతుంటాం. మరి కిచెన్‌లోనూ వై-ఫైతో అనుసంధానమయ్యే ఏఐ పరికరాలు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కరెంట్ లేకపోయినా ఇండక్షన్ కుకర్ పనిచేస్తే.. మనకేం కావాలో మొబైల్లో ఆర్డర్ పెట్టి కిచెన్‌లోకి వెళితే వంట సిద్ధంగా ఉంటే.. మైక్రోఓవెన్లో పెట్టే పదార్థాలు ఎంత సమయంలో వేడి అవుతాయో ముందుగానే తెలిస్తే.. ఊహించుకుంటేనే ఆహా అనిపిస్తుంది కదా. ఇటీవల సీయాటెల్లో జరిగిన స్మార్ట్ కిచెన్ సమ్మిట్(ఎస్కేఎస్)లో కంపెనీలు ఇలాంటి పరికరాలనే ప్రదర్శించాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.మొబైల్లో ఆర్డర్‌పెట్టి కిచెన్‌లోకి వెళితే..స్మార్ట్ కిచెన్ సమ్మిట్‌లో చెఫీ అనే కంపెనీ కొత్తరకం పరికరాన్ని పరిచయం చేసింది. కంపెనీకు చెందిన యాప్‌లో మనకు కావాల్సిన వంటను ఆర్డర్‌పెట్టి కాసేపయ్యాక కిచెన్‌లోకి వెళితే ఆ వంట సిద్ధంగా ఉంటుంది. ఎలాగంటారా.. కిచెన్‌లో వంటచేసే స్మార్ట్ పరికరాన్ని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. అందులో వంటకు కావాల్సిన కూరగాయలు, పప్పులు, ఇతర ధాన్యాలు, బియ్యం..వంటివాటిని ఏర్పాటుచేసుకోవాలి. ట్రేల్లో వాటికి కేటాయించిన ప్రత్యేక సెటప్‌లో పెట్టుకోవాలి. కిచెన్‌లోని పరికరం వై-ఫైకు అనుసంధానమై ఉంటుంది. దాంతో యాప్ ద్వారా మనకు కావాల్సిన పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే అందుకు తగ్గట్టుగా ముందే ఉంచిన ట్రేల్లోని ముడి పదార్థాలను ఉపయోగించుకుని వంట సిద్ధం చేస్తుంది. ఈమేరకు కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Chefee Robotics (@chefeerobotics)బ్యాటరీతో పనిచేసే ఇండక్షన్ కుకర్ఇంపల్స్ ల్యాబ్స్ తయారుచేసిన ఇండక్షన్ కుక్‌టాప్ కరెంట్ లేకపోయినా పనిచేస్తుంది. ముందుగా వినియోగించినపుడు విద్యుత్ ద్వారా కుకర్‌లో ఉండే బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. కరెంటులేని సమయంలో తిరిగి ఆ బ్యాటరీల ద్వారా కుకుర్ను వేడిచేసి వంట చేసుకునే వీలుంటుంది.ముందే సమయాన్ని చెప్పే థర్మామీటర్మైక్రోఓవెన్లో ఏదైనా పదార్థాన్ని వేడి చేయాలనుకున్నప్పుడు కంబషన్ కంపెనీ తయారుచేసిన థర్మామీటర్ ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా మనం వేడి చేయాలనుకున్న ఆహారంపై థర్మామీటర్ ఉంచాలి. అందులోని ఎనిమిది సెన్సార్లు అది ఎలాంటి పదార్థమే గుర్తించి తినడానికి అనువుగా వేడి అవ్వాలంటే ఎంతసమయం పడుతుందో తెలియజేస్తుంది.ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి పోలీసులకు చిక్కారా..? మీకోసమే ‘డిజీలాకర్’స్మార్ట్ కిచెన్ సమ్మిట్‌లో కలినరీ టెక్నాలజిస్ట్ స్కాట్ హెమెండెంగర్ మాట్లాడుతూ..‘ఈ సమ్మిట్‌లో ఎన్నో అద్భుతమైన ప్రాడక్ట్స్ ప్రదర్శించారు. ఇవన్నీ చూస్తుంటే కొద్ది రోజుల్లోనే మన కిచెన్లు స్మార్ట్గామారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. Wife అయితే గరిటెను ఎలా అయినా వాడుతుంది. కానీ Wi-Fi మాత్రం గరిటెను స్మార్ట్ కిచెన్ కోసమే వాడుతుంది’ అన్నారు. -
కిచెన్‌ని కళాత్మకంగా సర్దుకోండిలా..!
వంటిల్లు అంటే నూనె జిడ్డు, మాడు వాసన కాదు. వంటిల్లు అంటే.. సమతూకంలో ఉడికే దినుసుల కమ్మదనం, ఆరోగ్యాన్ని వడ్డించే నైపుణ్యం! మనసుండాలే కానీ కిచెన్కూ కళాత్మకతతో పోపు పెట్టొచ్చు ఇలా..ఇండిపెండెంట్ ఇంట్లో సరే.. అపార్ట్మెంట్లలోనూ కిచెన్‌కి బాల్కనీ ఉంటుంది చిన్నదో పెద్దదో! ఇందులో తులసి సరే.. కొత్తిమీర, మెంతి, పుదీనా, పాలకూర, బచ్చలి వంటివి వేసి.. దీన్ని హెర్బల్ గార్డెన్‌గా మలచుకోవచ్చు. తాజా ఆకు కూరలతో ఆరోగ్యమే కాదు.. పచ్చదనంతో మనసూ మురుస్తుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో వంటిల్లూ మెరుస్తుంది. కాస్తోకూస్తో ఖర్చూ కలిసొస్తుంది. అందమైన పాత్రలు ఇప్పుడు మళ్లీ రాగి, ఇత్తడి పాత్రలకు డిమాండ్ పెరుగుతోంది. యాంటిక్ డిజైన్‌లో దొరికే ఆ పాత్రలతో అరలను సర్దితే.. రాజసం ఉట్టిపడుతుంది వంటిల్లు. పింగాణీ పాత్రలతో దీనికి టచప్ ఇవ్వొచ్చు. ఫుడ్ థీమ్ ఆర్ట్కిచెన్ వాల్స్‌ని షెల్వ్స్తో నింపేయకుండా.. ఒక్క చోటనైనా ఖాళీగా ఉంచాలి. దాన్ని నచ్చిన వంటకాలు లేదా నట్స్.. లేదా ఫ్రూట్స్.. వెజిటబుల్స్ పెయింటింగ్స్‌తో అలంకరించాలి. కుక్ బుక్స్వంటింట్లో వంట సామాగ్రికే కాదు వంటకు సంబంధించిన పుస్తకాలకూ స్పేస్ ఇవ్వొచ్చు. స్థానిక సంప్రదాయ వంటల పుస్తకాల నుంచి వరల్డ్ ఫేమస్ షెఫ్‌లు రాసిన కుక్ బుక్స్ దాకా అన్నిటినీ ర్యాక్స్‌లో పేర్చుకుంటే.. కిచెన్‌కి ఇంటలెక్చువల్ లుక్ వస్తుంది. వెరైటీ వంటకాల పట్ల మనకు ఇంట్రెస్టూ పెరుగుతుంది. తెలుసు కదా.. కుకింగ్ అనేది ఆర్టే కాదు.. స్ట్రెస్ బస్టర్ కూడా! వంటలకు రుచెంతో.. అలంకరణకు అభిరుచీ అంతే! సో.. టేస్ట్‌కి తగ్గట్టు సర్దుకోండిక!.(చదవండి: 'లంగ్స్ ఆఫ్ చత్తీస్‌గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్‌మ్యాన్..) -
కిచెన్‌ని క్లీన్‌గా ఉంచడంలో టూత్‌పేస్ట్ ఎలా పనిచేస్తందో తెలుసా..!
టూత్‌పేస్ట్ దంతాలు శుభ్రంగా ఉంచుకోవడానికే కాదు. మన కిచెన్‌ని శుభ్రంగా ఉంచుకోవడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతుంది. ముఖ్యంగా స్టీల్ సింక్లు, ట్యాప్‌లు, ఎంత ఘోరంగా ఉంటాయో తెలిసిందే. అలాంటి వాటిపై ఉండే మొండి మరకలను క్లీన్ చేయడంలో టూత్‌పేస్ట్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఎలా ఈ టూత్ పేస్ట్ మన కిచెన్‌లో ఉన్న వస్తువులను క్లీన్‌గా ఉంచుతుందో సవివరంగా తెలుసుకుందాం.! మన ఇంట్లో వేస్ట్‌గా మిగిలిపోయిన పాత పేస్ట్‌లు వస్తువులను శుభ్రం చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నీటిలోని ఫ్లోరైడ్ కారణంగా కొన్ని రకాల స్టీల్ వస్తువులపై తెల్లటి మరకలు ఉండిపోతాయి. అవి ఓ పట్టాన పోవు. అలాంటి వాటిని వదలగొట్టడంలో టూత్‌పేస్ట్ అద్భతంగా పనిచేస్తుంది. అలాంటి వాటిని క్లీన్ చేయడంలో ఎలా సహకరిస్తుందంటే..స్టెయిన్లెస్ స్టీల్ సింక్లు..వంటగదిలోని సింక్ మిలమిల మెరుస్తు కాంతిగా ఉండాలంటే టూత్‌పేస్ట్‌ని ఉపయోగించటం మంచిది. దానిపై పడు గీతలు, ఒక విధమైన తెల్లటి మరకలను వదలగొట్టడంలో టూత్ పేస్ట్ భలే పనిచేస్తుంది. స్పాంజ్ సాయంతో కాస్త ప్రెజర్ ఉపయోగించి క్లీన్ చేస్తే సులభంగా మరకలు, గీతలు వదిలిపోతాయి. కుళాయిలు..నీటి కుళాయిలపై ఉండు మచ్చలు, మరకులతో కాస్త అసహ్యంగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిని టూత్‌పేస్ట్‌ని పూసి క్లాత్‌తో క్లీన్ చేస్తే చక్కగా మెరుస్తూ అందంగా ఉంటుంది. గ్లాస్ అండ్ సిరామిక్ స్టవ్‌లు..గ్లాస్ అండ్ సిరామిక్ స్టవ్ టాప్‌లపై మరకలు, వండిన పదార్థాల అవశేషాలను నీటిగా వదలించడంలో టూత్‌పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. మగ్స్‌పై కాఫీ, టీ మరకలు..కొన్ని రకాల టీ కప్పుల్లో కాఫీ, టీ మరకలు ఓ పట్టాన వదలవు. అలాంటప్పడు టూత్‌పేస్ట్‌ని ఉపయోగిస్తే నీటిగా వదిలిపోతాయి. కటింగ్ బోర్డ్..కూరగాయలు కోసే కటింగ్ బోర్డ్‌లు వివిధ రకాల ఆహార పదార్థాల వాసనలతో, మరకలతో ఉంటాయి. వాటిని టూత్‌పేస్ట్‌తో శ్రభం చేస్తే చూడటానికి అందంగానే గాకుండా మంచి సువాసనతో ఉంటుంది. టూత్పేస్ట్ల్ ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, రాపిడి వాసనలను తొలగించి ఉపరితలాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.(చదవండి: ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..) -
చూడడానికి పాములా భయపెడుతుంది.. కానీ చల్లగా కాపాడుతుంది..
పొట్లకాయ.. స్నేక్‌గార్డ్. చూడడానికి పాములా భయపెడుతుంది. కానీ.. ధైర్యంగా నమిలి మింగేస్తే సరి. పొట్టలోకి వెళ్లి చల్లగా కాపాడుతుంది. సమ్మర్ గార్డ్ ఫ్యామిలీలో ఇదీ ఒకటి. పొట్టను కాపాడే కాయ.. పొట్లకాయ. వేడి నుంచి రక్షించే.. కూరగాయ ఇది. దీనినే ఎన్నో రకాలుగా వండవచ్చు. ఎంతో రుచిగా మార్చవచ్చు. అలాగే పచ్చడి చేసి నిల్వ చేయవచ్చు కూడా. మరి ఈ పొట్లకాయ రుచుల తీరేంటో తెలుసుకుందాం.. పొట్లకాయ పెసరపప్పు.. కావలసినవి.. పొట్లకాయ ముక్కలు– 2 కప్పులు; పెసరపప్పు – అర కప్పు ; కొబ్బరి తురుము – అర కప్పు ; ఆవాలు – టీ స్పూన్ ; మినప్పప్పు – 2 టీ స్పూన్లు ; ఎండుమిర్చి – 2 ; కరివేపాకు – 2 రెమ్మలు ; ఇంగువ– పావు టీ స్పూన్ ; నూనె లేదా నెయ్యి – టేబుల్ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; చక్కెర – టీ స్పూన్. తయారీ.. బంగాళాదుంపను శుభ్రం చేసి నిలువుగా కోసి గింజలను తొలగించిన తర్వాత ముక్కలు చేయాలి. పెసరపప్పు కడిగి పక్కన పెట్టాలి. పాత్రలో రెండు కప్పుల నీటిని పోసి మరిగేటప్పుడు పొట్లకాయ ముక్కలు, పెసరపప్పు వేసి ఉడికించాలి. పప్పు ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత ఉప్పు కలిపి పొట్లకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. ముక్కలు ఉడకడానికి నీరు సరిపోకపోతే మరికొంత నీటిని చిలకరించి ఉడికించాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. మినప్పప్పు వేగిన తర్వాత చక్కెర, ఉడికించి సిద్ధంగా ఉంచిన పొట్లకాయ – పెసరపప్పును వేసి కలపాలి. తేమ ఆవిరి అయ్యే వరకు కలియబెడుతూ వేయించి చివరగా కొబ్బరి తురుము వేసి కలపాలి. కొబ్బరి రుచి కూరగాయ ముక్కలకు పట్టడం కోసం ఓ నిమిషం పాటు గరిటెతో కలియబెడుతూ వేయించి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గే కొద్దీ కూర రుచి ఇనుమడిస్తుంది. ఇది సాంబార్, రసం అన్నంలోకి సైడ్ డిష్‌గా రుచిగా ఉంటుంది. పొట్లకాయ పెసరపప్పు, పొట్లకాయ పొరిచ్చ కొళంబు పొట్లకాయ పొరిచ్చ కొళంబు.. కావలసినవి: కందిపప్పు – అరకప్పు; పొట్లకాయ ముక్కలు – 3 కప్పులు ; సాంబారు పొడి – టీ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నిమ్మకాయ రసం – ఒక టేబుల్ స్పూన్. పొడి కోసం: ధనియాలు – 2 టీ స్పూన్లు; పచ్చి శనగపప్పు – 2 టీ స్పూన్లు ; ఎండుమిర్చి – 2; మినపప్పు– టీ స్పూన్ ; ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు ; ఇంగువ – చిటికెడు ; నూనె – టీ స్పూన్. పోపు కోసం: నూనె – టీ స్పూన్ ;ఆవాలు – టీ స్పూన్ ; మినప్పప్పు – టీ స్పూన్ ; కరివేపాకు– 2 రెమ్మలు. తయారీ.. కందిపప్పును శుభ్రంగా కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి తగినంత నీటిని పోసి ఉడికించి పక్కన ఉంచాలి. పొడి కోసం తీసుకున్న దినుసులను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. పొట్లకాయను శుభ్రంగా కడిగి తరిగి గింజలు తొలగించి ముక్కలను సిద్ధం చేసుకోవాలి. ఒక పాత్రలో ఉప్పు, సాంబారు, పొట్లకాయ ముక్కలు వేయాలి. ముక్కలు మునిగేటట్లు నీటిని పోసి మెత్తగా ఉడికించాలి. ఉడికిన కందిపప్పు చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులో ఉడికించిన పొట్లకాయ ముక్కలను, మసాలా పొడి వేసి నీరు పోసి కలిపి ఉడికించాలి. పప్పు, కూరగాయ ముక్కలు, మసాలా పొడి అన్నింటి రుచి కలిసే వరకు ఉడికించి, నిమ్మరసం కలిపి దించేయాలి. రుచి చూసి అవసరమైతే ఉప్పు, నిమ్మరసం మరికొంత చేర్చుకోవచ్చు పోపు కోసం మందపాటి పాత్ర తీసుకోవాలి. పాత్రలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత మినప్పప్పు వేయించి కరివేపాకు వేసి ముందుగా ఉడికించి సిద్ధంగా ఉంచిన కందిపప్పు కూరగాయ ముక్కల మిశ్రమాన్ని పోసి కలిపి దించేయాలి. ఘుమఘుమలాడే పొట్లకాయ పొరిచ్చ కొళంబు రెడీ. ఇది అన్నంలోకి బాగుంటుంది. పొట్లకాయ పచ్చడి కావలసినవి: పొట్లకాయ ముక్కలు – కప్పు; ఎండుమిర్చి –3 ; మినప్పప్పు – టేబుల్ స్పూన్ ; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్ ; వేరు శనగపప్పు లేదా నువ్వులు లేదా కొబ్బరి తురుము – పావు కప్పు ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నెయ్యి లేదా నూనె – టేబుల్ స్పూన్; చింతపండు– అంగుళం ముక్క ; బెల్లం పొడి– టీ స్పూన్ (ఇష్టమైతేనే). పోపు కోసం: నూనె– టేబుల్ స్పూన్ ; ఆవాలు– టీ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్ ; ఎండుమిర్చి– ఒకటి; ఇంగువ– చిటికెడు ; కరివేపాకు– 2 రెమ్మలు. తయారీ.. మందపాటి బాణలిలో నెయ్యి లేదా నూనె వేడి చేసి మినప్పప్పు, పచ్చి శనగపప్పు, నువ్వులు, ఎండుమిర్చిని దోరగా వేయించి మరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాలి. అదే బాణలిలో పొట్లకాయ ముక్కలను వేసి పచ్చిదనం తగ్గేవరకు వేడి చేసి ఆపేయాలి. చల్లారిన తరవాత మిక్సీలో గ్రైండ్ చేయాలి, అందులోనే చింతపండు, బెల్లం, ఉప్పు కలిపి మరో రౌండ్ తిప్పాలి. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసి మరొక పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేసి వేగిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేయించి పచ్కడిలో వేసి కలపాలి. ఇది అన్నంలోకి ఇడ్లీ, దోసెల్లోకి కూడా రుచిగా ఉంటుంది. పొట్లకాయ పచ్చడి, పొట్లకాయ వేపుడుకూర పొట్లకాయ వేపుడుకూర.. కావలసినవి: పొట్లకాయ ముక్కలు – పావుకేజీ ; ధనియాల పొడి– టీ స్పూన్ ; జీలకర్ర– టీ స్పూన్ ; పసుపు– పావు టీ స్పూన్ ; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; ఇంగువ– చిటికెడు ; కారం – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నెయ్యి– టేబుల్ స్పూన్ ; నీరు– పావు కప్పు ; వేరుశనగ పప్పుల పొడి లేదా శనగపిండి– టేబుల్ స్పూన్. తయారీ.. బాణలిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ధనియాలపొడి, కారం పొడి, పసుపు, ఇంగువ వేసి కలపాలి. పచ్చిదనం పోయిన తర్వాత ఇందులో ఉప్పువేసి, కొద్దిగా నీటిని పోసి కలపాలి. మసాలా పొడులన్నీ సమంగా కలుస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి బాణలిలో పొట్లకాయ ముక్కలు వేసి మసాలా సమంగా పట్టేటట్లు కలపాలి. ముక్కలకు మసాలా సమంగా పట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ముక్కల్లో నీటిని పోసి కలిపి మంట తగ్గించి మూత పెట్టాలి. రెండు నిమిషాలకోసారి మూత తీసి గరిటెతో ముక్కలను కలిపి మళ్లీ మూత పెడుతుండాలి. పది నిమిషాలకు ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి. ముక్కలు ఉడకలేదనిపిస్తే కొద్దిగా నీటిని చిలకరించి మళ్లీ మూత పెట్టి ఉడికించాలి. చివరగా వేరుశనగపప్పు పొడి లేదా శనగపిండి చల్లి బాగా కలిపి దించేయాలి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి రుచిగా ఉంటుంది. ఇవి చదవండి: Beauty Tips: చర్మం మృదువుగా.. ముడతలు లేకుండా ఉండాలంటే..? -
యాక్టర్ ఆలీ చేతులమీదగా అతియాస్ కిచెన్ గొప్ప ప్రారంభం (ఫొటోలు)
-
'ఇఫ్తార్' విందుకై.. ఇంట్లోనే సులువుగా చేయండిలా..
పగలంతా రోజాతో అల్లా ధ్యానం. రాత్రికి ఇఫ్తార్‌తో ఆరోగ్యధ్యానం. నీరసించిన దేహానికి శక్తి కావాలి. ఆ శక్తి దేహానికి తక్షణం అందాలి. ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. గార్నిషింగ్తో పదార్థం రుచి పెరగాలి. రుచి.. ఆరోగ్యానికి మేళవింపు కావాలి. ఇఫ్తార్ కోసం పొరుగు దేశాలు ఏం వండుతున్నాయి? దహీ చికెన్‌ను బ్రెడ్‌లో పార్సిల్ చేశాయి. నాలుగు పప్పులు.. రెండు ధాన్యాలు.. కలిపి హలీమ్ వండుతున్నాయి. అచ్చం మనలాగే. చికెన్ బ్రెడ్ పార్సిల్.. కావలసినవి: చికెన్ బోన్‌లెస్ – 200 గ్రా. మారినేషన్ కోసం.. మిరియాల పొడి – టీ స్పూన్; మిరపొ్పడి – టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – అర టీ స్పూన్; వెనిగర్ – టేబుల్ స్పూన్; వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; తందూరీ మసాలా పొడి – టేబుల్ స్పూన్; పెరుగు– అర కప్పు. పోపు కోసం.. నూనె – టేబుల్ స్పూన్; ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు; క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు. పార్సిల్ కోసం.. మిల్క్ బ్రెడ్ – 10 స్లయిస్‌లు; మైదా – టేబుల్ స్పూన్; కోడిగుడ్లు – 2; లెట్యూస్ – నాలుగు ఆకులు (క్యాబేజ్‌ని పోలి ఉంటుంది); నూనె – వేయించడానికి తగినంత. తయారీ.. చికెన్‌ను శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పాత్రలో వేసి మారినేషన్ కోసం తీసుకున్న దినుసులన్నింటినీ వేసి సమంగా కలిసే వరకు కలిపి (మారినేషన్) అరగంట సేపు కదిలించకుండా పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేడి చేసి మారినేట్ చేసిన చికెన్ వేసి కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికించాలి. మూత తీసి చికెన్ ముక్క ఉడికిందో లేదో చూసుకుని అవసరమైతే మరికొంత సేపు చిన్న మంట మీద ఉంచాలి. ఉప్పు కూడా సరి చూసుకుని అవసరాన్ని బట్టి మరికొంత వేసుకోవచ్చు. చికెన్ ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలిపి రెండు నిమిషాల సేపు (తేమ పోయే వరకు) వేయించి స్టవ్ ఆపేయాలి ఒక కప్పులో మైదా పిండి తీసుకుని తగినంత నీటితో గరిట జారుడుగా కలుపుకోవాలి కోడిగుడ్లను పగుల గొట్టి ఒక పాత్రలో వేసి, అందులో మిరియాల పొడి వేసి చిలికి సిద్ధంగా ఉంచుకోవాలి బ్రెడ్ స్లయిస్ల అంచులు చాకుతో కట్ చేసి తీసేయాలి. బ్రెడ్‌ను అప్పడాల కర్రతో వత్తాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ పొడి పొడిగా రాలిపోకుండా చికెన్ స్టఫ్ పెట్టి నూనెలో వేయించడానికి అనువుగా మారుతుంది. ఇలా చేసుకున్న బ్రెడ్ స్లయిస్లో ఒక స్పూన్ చికెన్ స్టఫ్ పెట్టి, కర్రీ బయటకు రాకుండా బ్రెడ్ అంచులకు మైదా పిండి ద్రవం రాసి అతికించాలి. నలుచదరంగా ఉండే బ్రెడ్ స్లయిస్ సాండ్విచ్లాగ త్రిభుజాకారపు పార్సిల్ తయారవుతుంది. ఇలా అన్నింటినీ చేసుకుని పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఒక్కో బ్రెడ్ పార్సిల్‌ను కోడిగుడ్డు సొనలో ముంచి నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేయించి తీసి టిష్యూ పేపర్ మీద వేయాలి. నూనె వదిలిన తరవాత ఈ బ్రెడ్ పార్సిళ్లను, టొమాటో కెచప్, లెట్యూస్‌తో కలిపి సర్వ్ చేయాలి. చికెన్ హలీమ్.. కావలసినవి: ఎర్ర కందిపప్పు – టేబుల్ స్పూన్; బాసుమతి బియ్యం– టేబుల్ స్పూన్; గోధుమలు– టేబుల్ స్పూన్; బార్లీ– టేబుల్ స్పూన్; కందిపప్పు– టేబుల్ స్పూన్; పచ్చి శనగపప్పు– టేబుల్ స్పూన్; అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌లు– ఒక్కొక్కటి టేబుల్ స్పూన్; చికెన్ (బోన్‌లెస్)– పావు కేజీ; చికెన్ స్టాక్ – అరకప్పు; హలీమ్ మసాలా పొడి– టేబుల్ స్పూన్; ఉల్లిపాయ ముక్కలు – కప్పు; మిరప్పొడి – అర టీ స్పూన్; పసుపు– అర టీ స్పూన్; పెరుగు – అర కప్పు; ఉప్పు – అర టీ స్పూన్. పోపు కోసం.. నెయ్యి– అర కప్పు; జీలకర్ర– టీ స్పూన్; వెల్లుల్లి– 10 రేకలు; పుదీన ఆకులు – టేబుల్ స్పూన్. గార్నిషింగ్ కోసం.. జీడిపప్పు – పావు కప్పు; నిమ్మకాయ– ఒకటి (పలుచగా తరగాలి); అల్లం తరుగు– టేబుల్ స్పూన్; కొత్తిమీర తరుగు – కప్పు. తయారీ.. బియ్యం, కందిపప్పులు, పచ్చి శనగపప్పు, బార్లీ, గోధుమలను ఒక పెద్ద పాత్రలో వేసి శుభ్రంగా కడిగి, మూడింతలు మంచి నీటిని పోసి పది నిమిషాలసేపు నానబెట్టాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్టులు వేసి కలిపి, పప్పులు, ధాన్యాలు మెత్తబడే వరకు ఉడికించాలి. వేడి తగ్గిన తర్వాత వీటిని మెత్తగా మెదపాలి. గింజలు ఉడికేలోపు బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించి తీసి పక్కన సిద్ధంగా ఉంచుకోవాలి చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేసి అందులో హలీమ్ మసాలా పొడి, మిరప్పొడి, పసుపు, ఉప్పు, పెరుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, చికెన్ స్టాక్‌ను (చికెన్ స్టాక్ లేకపోతే మంచి నీటిని పోయాలి) వేసి ఉడికించాలి. చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత అందులోని నీటిని పప్పులు, ధాన్యాలు ఉడికించిన మిశ్రమంలోకి వంపి చికెన్ ముక్కలను మాత్రమే పాత్రలో ఉంచి ఆ ముక్కలను మెదపాలి. మెదిపిన చికెన్‌ను కూడా ధాన్యాలు, పప్పులు ఉడికించిన మిశ్రమంలో వేసి కలిపి మంట తగ్గించి అన్నింటి రుచి కలవడం కోసం మళ్లీ ఉడికించాలి ఉల్లిపాయ ముక్కలు వేయించిన బాణలిలో మిగిలిన నేతిలో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పుదీన వేసి అర నిమిషం పాటు వేయించి ఈ పోపును చిన్నమంట మీద ఉడుకుతున్న చికెన్, పప్పులు, ధాన్యాల మిశ్రమంలో వేసి కలిపితే హలీమ్ రెడీ గార్నిష్ చేయడానికి ఒక పాత్రలో కొత్తిమీర తరుగు, అల్లం తరుగు, జీడిపప్పులు, ఎర్రగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పులో వేడి వేడి హలీమ్ వేసి పై గార్నిష్ కోసం సిద్ధం చేసిన మిశ్రమాన్ని కొద్దిగా చల్లి, నిమ్మకాయ ముక్క పెట్టి సర్వ్ చేయాలి. ఇవి చదవండి: కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? ఈ వీడియో చూడండి! -
ఇంగువతో ఇన్ని లాభాలా? బరువును తగ్గించే మ్యాజిక్ డ్రింక్
అసాఫెటిడా, హింగ్ లేదా ఇంగువగా ప్రసిద్ధి చెందింది. రుచి , ఘాటైన వాసనతో ఉండే భారతీయ వంటకాల్లో వాడే కీలకమైన సుగంధ ద్రవ్యం. పూర్వకాలం నుంచే భారతీయులు సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఇంగువను ప్రతిరోజు వంటకాలలో ఉపయోగిస్తే శరీరానికి మంచిదని ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు గురించి తెలుసుకుందాం. సాంబారు, పప్పు, పులుసుకూరలు, పచ్చడి తాలింపులలో మాత్రమే వాడుతారు అనుకుంటే పొరపాటే. మంచి వాసన, రుచితోపాటు, ఇంగువ అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఇంగువ ఆరోగ్య ప్రయోజనాలు బరువు తగ్గడానికిమ్యాజిక్ డ్రింక్: ఇంగువ నీరు తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. ఇంగువలో ఫైబర్, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఐరన్, కాల్షియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇంగువ నీరు మ్యాజిక్‌లా పనిచేస్తుందని చెబుతారు. ♦జీర్ణక్రియనుమెరుగుపరుస్తుంది గ్యాస్, ఉబ్బరం, అపానవాయువు వంటి కడుపు రుగ్మతల నివారణలో ఉపయోగపడుతుంది. కడుపు పూత,కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడేవారు ఇంగువ వాడి, దీన్ని అధిగమించవచ్చు. ఛాతీపై పూయడం వల్ల ఆస్తమా, కోరింత దగ్గు, ఊపిరితిత్తుల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. ♦ యాంటీవైరల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న కారణంగా ఇది ఉబ్బసం, బ్రోన్కైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. ♦ ఇంగువ సహజ యాంటిడిప్రెసెంట్.ఒత్తిడి ,ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడేవారికి ఇంగువ మంచి మందు. ♦లైంగిక సమస్యలకు: నపుంసకత్వ సమస్యలలో బాధపడుతున్న పురుషులకు ఇది బాగా సహాయపడుతుంది. అకాల స్కలన సమస్యకు కూడా బాగా పనిచేస్తుందని అని నిపుణులు చెబుతున్నారు. స్త్రీ,పురుషుల్లో లైంగిక వాంఛను గణనీయంగా పెంచుతుందట కేన్సర్ ప్రమాదం: కేన్సర్ కణితి, పరిమాణాన్ని తగ్గించడంలో ఇంగువ బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. కేన్సర్ వ్యాప్తిని అరికడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కేన్సర్ కణాలతో పోరాడుతాయి. ♦ఊపిరితిత్తులు, కాలేయం ,మూత్రపిండాలలో మెటాస్టాసిస్ నివారణలో పనిచేస్తుంది. మెదడులోని రక్త నాళాలలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయ పడుతుంది. తలనొప్పిని తగ్గిస్తుంది. ♦ యాంటీ ఏజింగ్: చర్మం ముడతలు, కళ్ల క్రింద నల్లటి వలయాలు ముఖంపై ముడతలను కూడా తొలగిస్తుంది. ఇందులోని టైరోసిన్ నిస్తేజమైన చర్మానికి మెరుపునిస్తుంది. ♦ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది కీళ్ల నొప్పి, వాపు తగ్గించే అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ,రిలాక్సింగ్ లక్షణాలను కలిగి ఇంగులో ఉన్నాయి. ♦ పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి లేదా తిమ్మిరితో బాధపడుతుంటే ఇంగువ దివ్యవౌషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే మూలకాలు బహిష్టు సమయంలో నొప్పిని తగ్గించడంతో పాటు ఇతర సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ♦ పంటి నొప్పికి కూడా ఇంగువ మంచి ఫలితాలనిస్తుంది.ఇంగువలో నొప్పి నివారణ గుణాలు అలాగే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పి తగ్గించి ఉపశమనాన్ని అందిస్తాయి. -
వంట దినుసులే కదా అని తేలిగ్గా తీసుకోకండి!
మన వంట గదే ఔషధాల నిలయం. మనకు తెలియకుండానే మన పూర్వీకులు, పెద్ద వాళ్లు అలవాటు చేసిన, చెప్పిన పద్దతుల ద్వారా కొన్ని ఆరోగ్యకరమైన దినుసులు, మసాలాలను వాడుతుంటాం. ముఖ్యంగా పసుపు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు ఇలా ప్రతిదీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే! ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉండటంతో పాటు, వాడాల్సిన పద్దతిలో వీటిని వాడితే అదనపు రుచిని అందిస్తాయి. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. అలాంటి వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. పసుపు: అనేక యాంటి బయోటిక్ గుణాలు, పోషకాలు ఇందులో ఉన్నాయి. అందుకే ప్రతీ కూరలోనూ చిటికెడు పసుపు వేయడం మన భారతీయులకు అలవాటు. పసుపులో ఉండే కర్కుమిన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలైన వాటి నుంచి కాపాడుతుంది. జలుబు చేసినపుడు పసుపు ఆవిరిపట్టడం, పసుపు,పాలు తాగడం, గాయాలకు పూయడం లాంటివి కూడా మంచిదే. అల్లం: రోజువారీ వినియోగంలో అల్లం పాత్ర చాలా పెద్దదే. అల్లంలో ఉండే జింజెరాల్ అనే సమ్మేళనం శ్వాసకోశ మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థకు మేలు జరుగుతుంది. శ్లేష్మం తగ్గించడంలో సాయపడుతుంది. శ్వాస ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లంతో శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్ని టీలో అల్లం కలుపుకుని తింటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా మంచిదే. వెల్లుల్లి: వెల్లుల్లి వంటలకు రుచి, వాసనను అందిచడమే కాకుండా జీర్ణ ప్రక్రియను సులభ తరం చేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటితోపాటు వెల్లుల్లి రెబ్బను తింటే,జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు శరీర బరువు కూడా తగ్గించేందుకు దోహద పడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బీలు వ్యాధులకు నివారణలో పని చేస్తాయి. ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది. అలోసిన్-సల్ఫర్ సమ్మేళనం వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఒరేగానో: వంటకాల్లో ఉపయోగించే ఒరేగానో హెర్బ్, యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంది. దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ వాపు, క్షయవ్యాధి నివారణకు సహాయపడుతుంది. రుమాటిజం, తిమ్మిరి, మైగ్రేన్లు, ఉబ్బరం, ఆకలి లేకపోవడం, విరేచనాలు, కామెర్లు , వంటి ఇతర కాలేయ వ్యాధులకు ఒరేగానోను ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో పాలీ ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. జలుబు, దగ్గు మొదలైన బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే సమస్యల నుంచి రక్షించడంలో సాయపడుతుంది. -
మన దేశంలోని టాప్ మహిళా చెఫ్‌లు వీరే!
ఇంతవరకు రెస్టారెంట్లో పురుషులే చెఫ్‌లుగా రాణించడం గురించి విన్నాం. అదీగాక మన పురాణాల్లో కూడా నల భీములు పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి కథలుగా విన్నాం. అందుకు తగ్గట్టుగానే పురుష చెఫ్‌లు ఈ రంగంలో సత్తా చాటారు, వారే ఈ రంగంలో మహారాజుల్లా ఏలుతున్నారు. అలాగే టీవీ షోల్లో కూడా ప్రముఖ రెస్టారెంట్ చెఫ్‌లు సంజయ్ కపూర్ వంటి దిగ్గజ చెఫ్‌లను చూశాం. అయితే ఇదే రంగంలో సత్తా చాటుతున్న టాప్ మహిళా చెఫ్‌లు ఉన్నారు. అంతేగాదు వాళ్లే రెస్టారెంట్లను స్వయంగా నిర్వహించి కిచెన్ క్వీన్స్‌లా రాణిస్తున్నారు. ఆ టాప్ మహిళా చెఫ్‌లు ఎవరంటే..? గరీమా ఆరోరా ఉత్తర భారతదేశానికి చెందిన ఈమె మనదేశంలో టాప్ -10 ఫీ మేల్ చెఫ్ లలో ఒకరు.. బ్యాంకాక్ లో 'గాతో' అనే పేరుతో ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇది సూపర్ సక్సెస్ కావడంతో మిచెలి స్టార్ పేరుతో మరో రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేసింది. ఈమెకు పాక శాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉంది. అందుకే రెస్టారెంట్ల వ్యాపారంలో శరవేగంగా దూసుకుపోతోంది. 'గాతో' రెస్టారెంట్‌కు బ్యాంకాక్‌లో మంచి ఫేమ్ ఉంది. View this post on Instagram A post shared by Vikas Khanna (@vikaskhannagroup) అనహిత దొండి పార్సికి చెందిన యువతి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకుంటా అంటే కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆమె ఇష్టాన్ని తెలుసుకొని గౌరవించారు. హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసిన వెంటనే ఆమెనే సొంతంగా రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. పార్సి వంటకాలను తన కస్టమర్లకు పరిచయం చేశారు. అందులోనూ కొత్త కొత్త రకాలను సృష్టించి కస్టమర్ల నోటికి సరికొత్త రుచులు అందిస్తున్నారు. ఔత్సాహిక చెఫ్ గా అనహిత దొండి పేరు గడించారు. రీతు దాల్మియా పాత తరం మహిళ చెఫ్‌లలో ఈమెకు అగ్ర తాంబూలం దక్కుతుంది. పురుషాధిక్యమైన హోటల్ బిజినెస్ లో.. ఈమె ప్రవేశించి సత్తా చాటారు. తన కస్టమర్లకు తానే స్వయంగా వంట వండి పెడతారామే. ముఖ్యంగా నార్త్ ఇండియన్ వంటకాలు చేయడంలో ఈమె దిట్ట. పెద్ద పెద్ద వ్యాపారులు ఈమె వంటకు డైలీ కస్టమర్లు అంటే అతిశయోక్తి కాదు. శిఫ్రా ఖన్నా నార్త్ ఇండియాకు చెందిన ఈ యువతికి వంట చేయడం అంటే చాలా ఇష్టం. అలా అనేక రకాల వంటలను ఆమె సృష్టించింది.. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని రకాల వంటల్లోనూ ప్రయోగాలు చేసింది. ఏకంగా మాస్టర్ చెఫ్ రెండవ సీజన్లో విజేతగా నిలిచింది. టీవీ హోస్ట్‌గా కూడా పనిచేస్తోంది. ఈమెకు ఒక క్లౌడ్ కిచెన్ ఉంది. కాకపోతే అందులో వెస్ట్రన్ డిషెస్ మాత్రమే లభిస్తాయి. పంకజ్ బదౌరియా మనదేశంలో మాస్టర్ చెఫ్ మొదటి సీజన్ విజేతగా పంకజ్ బదౌరియా నిలిచింది. సంప్రదాయ వంటలకు ఆధునిక మేళవింపు అద్దడంలో పంకజ్ ముందు వరుసలో ఉంటుంది. అలా వంట చేస్తుంది కాబట్టే ఆమె మాస్టర్ చెఫ్ మొదటి సీజన్ విజేత అయింది. ప్రస్తుతం ఈమె ఒక రెస్టారెంట్ నిర్వహిస్తోంది.. అందులో అన్ని రకాల వంటకాలూ లభిస్తాయి. పూజా దింగ్రా ఈమె టాప్ పేస్ట్రీ చెఫ్‌లలో పూజా ఒకరు. పేస్ట్రీ తయారీలో తనకు ఉన్న నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ధైర్యంగా ఓపెద్ద పేస్ట్రీ తయారీ యూనిట్ నెలకొల్పింది. అలా రకరకాల పేస్ట్రీలు తయారుచేసి యువతను బాగా ఆకట్లుకున్నారు. అంతేగాదు వెస్ట్రన్ పేస్ట్రీస్ కోసం ఏకంగా మకరాన్ అనే పేరుతో పెద్ద హోటల్ కూడా ఏర్పాటు చేసింది.. బనీ నందా మన దేశానికి ఫ్రెంచ్ డిసర్ట్స్‌ను పరిచయం చేసిన ఘనత బని నందాకు దక్కుతుంది. ఇటీవల అంబానీ ఇంట్లో వేడుకలు జరిగినప్పుడు.. ఈమె రెస్టారెంట్ నుంచే అక్కడికి ఫ్రెంచ్ వంటకాలు వెళ్లాయి. Le cordn bleu పేరుతో ఆమె రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. తేజస్వి చండేలా యూరోపియన్ వంటకాలు వండటంలో తేజస్వీకి మంచి ప్రావిణ్యం ఉంది. యూరోపియన్ పేస్ట్రీలకు మోడ్రన్ టచ్ ఇచ్చి అద్భుతంగా తయారు చేయగల నేర్పరితనం ఈమె సొంతం. ఈమె తయారు చేసే పేస్ట్రీలకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఆమె తయారుచేసే విధానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంజిలత్ ఫాతిమా నవాబ్ అవధ్ కుటుంబానికి చెందిన మహిళ ఈమె. నవాబు వంటకాలను వండటంలో ఫాతిమాకు మంచి ప్రావిణ్యం ఉంది. అందువల్లే ఆమె పలు రెస్టారెంట్లు ఓపెన్ చేసి కస్టమర్లకు నవాబుల వంటకాలను రుచి చూపిస్తున్నారు. బిర్యానీలో రకాలు మాత్రమే కాకుండా, చికెన్, మటన్‌తో తయారు చేసే ప్రత్యేకమైన వంటకాలను కస్టమర్లకు అందిస్తోంది. (చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!) -
నిమ్మచెక్కతో వంటిటి సమస్యలకు ఇలా చెక్‌పెట్టండి!
వంటిట్లో పనిచేస్తున్నప్పుడూ కొన్ని సమస్యలు తరుచుగా ఎదురవ్వుతుంటాయి. ఓ పట్టాన వాటిని వదిలించుకోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా చేపలు, వెల్లుల్లి వంటి వాటిని బాగు చేస్తున్నప్పడూ చేతుల వాసన ఓ పట్టాన వదలదు. ఎంతలా సబుతో రుద్ది కడిగినా వదలదు. అలాగే కూరగాయాలు తరిగే చెక్క, కుళాయిలపై ఉండే మరకలు కూడా అస్సలు వదలవు. అలాంటి సమస్యలకు జస్ట్ నిమ్మకాయతో చెక్పెట్టేయొచ్చట. పైగా క్రిములు చేరవు ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..\ చేపలూ, ఉల్లిపాయ, వెల్లుల్లి.. వంటివి తరిగినప్పుడు వాటి వాసన చేతులకు అంటుకుంటుంది. అప్పుడు టీపొడిని కొద్దిగా రాసుకుని ఐదు నిమిషాలయ్యాక సబ్బుతో కడిగేస్తే చాలు. కాయగూరలు తరిగే చెక్కని నిమ్మచెక్కతో రుద్ది కాసేపయ్యాక కడిగేయండి. మరకలు పోతాయి. ఎప్పుడైనా దానిపై మాంసం కోసినా.. నిమ్మచెక్కతో రుద్దితే క్రిములు వృద్ధి చెందకుండా ఉంటాయి నిమ్మచెక్కలని సన్నగా తరిగి కాసిని నీళ్లలో వేసి ఆ పాత్రని మైక్రో ఓవెన్లో కొన్ని నిమిషాలు ఉంచి తీసేయండి. అలా చేస్తే దుర్వాసనలు తొలగిపోవడంతో పాటూ లోపల పడి ఉన్న పదార్థాలని శుభ్రం చేయడం కూడా తేలికవుతుంది. ఫ్రిజ్‌లో ఓ మూలగా నిమ్మచెక్కని పెట్టి చూడండి. అందులోంచి వచ్చే దుర్వాసనలు పోతాయి. స్టీలు కుళాయిలపై నీటిమరకలు పడుతుంటాయి. అవి తెల్లగా మారాలంటే వాటిని నిమ్మచెక్కతో రుద్ది కడిగితే చాలు. వేపుడు కూరలనగానే నూనె గుర్తొచ్చి భయం వేస్తుంది. కానీ ఇలా చేస్తే నూనె తక్కువగా రుచికరమైన వేపుడు కూరలను ఆస్వాదించవచ్చు. బెండకాయ వేపుడులో నూనె తగ్గిస్తే జిగురు అడుగున నల్లగా పట్టేస్తుంటుంది. కాబట్టి అడుగు పట్టకుండా వేగడానికి నూనె ఎక్కువ వేయాల్సి వస్తుంది. బెండకాయ ముక్కల్లో ఒక స్పూన్ పెరుగు లేదా మజ్జిగ లేదా పాలు వేస్తే జిగురు విరిగిపోయి ముక్కలు అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి, తక్కువ నూనెతో చక్కగా వేగుతాయి. దొండకాయ వేపుడు చేసేటప్పుడు ధనియాల పొడి వేస్తే నూనె ఎక్కువ వేయాల్సిన పని ఉండదు. (చదవండి: స్కూల్లో ఏఐ పంతులమ్మ పాఠాలు! అచ్చం ఉపాధ్యాయుడి మాదిరిగా..) -
ఫ్యామిలీ వ్యాన్ లైఫ్
ఒక ఎస్యువి ఉంటే భ్రమణకాంక్ష ఉన్న జీవిత భాగస్వామి దొరికితే ఆ వెహికల్‌నే ఇల్లుగా మార్చుకుని దేశంలోని అందమైన ప్రకృతిని చూస్తూ గడిపేయవచ్చా? చిక్కి, కపిల్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ప్రయాణాలకు తగ్గట్టుగా మార్చుకున్న వాహనంలో ఇలాగే తిరుగుతున్నారు. వైరల్ అయిన వారి ‘ఫ్యామిలీ వ్యాన్ లైఫ్’ గురించి... తిరిగే వాళ్లు ఎలాగైనా తిరుగుతారు. కాని కొందరు స్పెషల్. సొంతగా క్రెటా, మహింద్రా 400, ట్రైబర్... లాంటి పెద్ద బండి ఉంటే దానిని కస్టమైజ్డ్ ఇంటీరియర్స్‌తో క్యాంపర్ వ్యాన్‌గా మార్చుకుని కుటుంబం మొత్తం తిరిగే బృందాలు ఇప్పుడు ఇండియాలో పెరిగాయి. క్యాంపర్ వ్యాన్ ఉంటే రిజర్వేషన్లు అక్కర్లేదు. హోటల్ రూమ్‌లు అవసరం లేదు. సమయానికి చేరుకోకపోతే ఫ్లయిట్ మిస్ అవుతామన్న ఆందోళనా లేదు. బండే బస. బండే ప్రయాణ సాధనం. చిక్కి, కపిల్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సొంత ఫ్యామిలీ వ్యాన్‌లో దేశమంతా తిరుగుతూ, ‘ఘుమ్మక్కడ్ బగ్స్’ పేరుతో యూట్యూబ్ చానల్లో వీడియోలు పోస్ట్ చేస్తూ పాపులర్ అయ్యారు. వీరికి ఐదు లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. మహింద్రా 500 వాహనం డిక్కీని వీరు పూర్తి స్థాయి కిచెన్‌గా తయారు చేయించుకున్నారు. లోపలి సీట్లను బెడ్స్‌గా మార్చుకునేలా ఆల్టర్ చేయించారు. ఇవి కాకుండా హాల్ట్ చేసిన చోట బండి మీద టాప్ టెంట్ వేసుకుంటారు. బండికి ఆనుకుని చేంజింగ్ రూమ్ ఫాలిథిన్ కవర్స్‌తో ఏర్పాటు చేసుకుంటారు. దూరంగా గుంత తవ్వి చుట్టూ పాలిథిన్ çకవర్స్‌తో లావెటరీ ఏర్పాటు చేసుకుంటారు. బండిలోనే గ్యాస్, వంట దినుసులు, కూరగాయలు అన్నీ పెట్టుకునే వీలుంటుంది. కపిల్ బండి నడిపితే ఆగిన చోటల్లా చకచకా వంట ముగిస్తుంది చిక్కి. బయటి తిండి వల్ల ఆరోగ్యం పాడవడం ఒక్కటే కాదు.. సమయానికి తిండి దొరక్కపోతే ఇబ్బంది కనుక ఈ ఏర్పాటు. అందుకే వీరు దిగులూ చింతా లేకుండా తిరుగుతూ ఉంటారు. వీరి పాపులారిటీ చూసి మరికొన్ని కుటుంబాలు తమ క్యాంపర్ వ్యాన్లతో వీరిని కలుస్తుంటాయి. అందరూ కలిసి గ్రూప్ క్యాంపింగ్ చేసి సరదాగా వొండుకుంటూ, ప్రకృతిని చూస్తూ. అక్కడే నిద్రపోతూ హాయిగా గడిపేస్తుంటారు. జీవితం అంటే అందమైన ప్రయాణం. చిక్కి, కపిల్ వీడియోల మీద ఆదాయం గడించడమే కాదు... గ్రూప్ క్యాంపింగ్ నిర్వహిస్తూ అలా కూడా డబ్బు గడిస్తున్నారు. టెన్ టు ఫైవ్ ఆఫీసుకు వెళుతూ సంపాదించేవారు ఎక్కువ మందైతే ఇలా రోజుకో కొత్త ప్రాంతంలో గడుపుతూ సంపాదించడం భిన్నమే కదా. -
హైదరాబాద్ శరత్ సిటీ మాల్ లో అత్యాధునిక థీమ్ తో A19 క్లబ్, కిచెన్ ప్రారంభం (ఫొటోలు)
-
చెట్టినాడు ఘుమఘుమలు!
'చెట్టినాడు రుచుల్లో కరివేపాకు ప్రధానం. తోడుగా కొబ్బరి కూడా ఉంటుంది. అన్నంలోకి అధరవుగానూ ఉంటాయి. సాయంత్రాలకు స్నాక్‌గా కుదురుతాయి. కడుపు నిండుగా ఆరోగ్యం మెండుగా ఉంటాయి.' ఉర్లయ్ రోస్ట్.. కావలసినవి: బేబీ పొటాటోలు – అరకిలో; మసాలా పొడి కోసం: ఎండుమిర్చి – 4; ధనియాలు – టీ స్పూన్; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; యాలక్కాయ – 1; లవంగం– 1; సోంపు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; మిరియాల పొడి– టీ స్పూన్; కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు. పోపు కోసం: వేరుశనగ నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూన్; మినప్పప్పు – అర టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు; ఉల్లిపాయలు – 2 (మీడియం సైజువి, తరగాలి); పచ్చిమిర్చి – 2 (చీరాలి); అల్లంవెల్లుల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్; మిరపొ్పడి– టీ స్పూన్; ధనియాల పొడి – రెండు టీ స్పూన్లు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్. తయారీ: తయారీ.. బంగాళాదుంపలను ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టాలి బాణలి వేడి చేసి మసాలా పొడి కోసం తీసుకున్న దినుసులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా వేసి వేగి చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టాలి బాణలిలో ఆయిల్ వేడి చేసి ఆవాలు వేయాలి వేగిన తర్వాత మినప్పప్పు, కరివేపాకు వేయాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి తరుగు వేసి వేగిన తర్వాత మసాలా పొడిని చల్లాలి ఆ తరవాత మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి కలిపి ఉడికించి తొక్క తీసి సిద్ధంగా ఉంచిన బంగాళాదుంపలను వేసి మసాలా సమంగా పట్టేవరకు వేయించాలి చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి దీనిని ఈవెనింగ్ స్నాక్‌గానూ, అన్నంలోకి సైడ్ డిష్‌గానూ తినవచ్చు. గమనిక: ఉర్లయ్ అంటే బంగాళాదుంప. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల బంగాళాదుంపను ఉర్లగడ్డ అంటారు. చెట్టినాడు ఫిష్ ఫ్రై.. కావలసినవి: చేప ముక్కలు – నాలుగు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; టొమాటో ముక్కలు – పావు కప్పు; కరివేపాకు – 2 రెమ్మలు; చింతపండు రసం– టేబుల్ స్పూన్; ఆవాలు – టీ స్పూన్; వెల్లుల్లి రేకలు – 8 (తరగాలి); అల్లం తరుగు – టీ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; సోంపు గింజలు– టీ స్పూన్; మిరియాలు – పది; మిరపొ్పడి– టీ స్పూన్; పసుపు– టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. తయారీ.. చేప ముక్కలను శుభ్రం చేసి పక్కన పెట్టాలి బాణలి వేడి చేసి కరివేపాకు, వెల్లుల్లి, ధనియాలు, సోంపు, మిరియాలు వేయించి చల్లారిన తర్వాత పొడి చేయాలి పొడి చేసేటప్పుడు కొద్దిగా నూనె వేయాలి ఇప్పుడు చింతపండు రసం, టొమాటో ముక్కలు, అల్లం, పసుపు, మిరపొ్పడి, ఉప్పు కలిపి గ్రైండ్ చేయాలి ఈ పేస్ట్‌ను ఒకసారి రుచి చూసి అవసరమైతే ఉప్పు మరికొంత కలుపుకోవాలి ఇందులో మసాలా పొడిని కూడా కలిపి ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించాలి ఇరవై నిమిషాల తర్వాత బాణలిలో నూనె వేడి చేసి చేప ముక్కలను నూనెలో అమరేటట్లు ఒకదాని పక్కన ఒకటిగా పెట్టాలి ఐదు నిమిషాల సేపు మీడియం మంట మీద కాలిన తర్వాత ముక్కలను జాగ్రత్తగా తిరగేయాలి చేప ముక్కల అంచులు కరకరలాడే వరకు వేగిన తర్వాత తీసి నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. నారియల్ సోయా పనీర్ వడ.. కావలసినవి: తురిమిన పనీర్– 4 కప్పులు; తురిమిన టోఫూ – 2 కప్పులు; అల్లం తరుగు – 3 టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి తరుగు – టేబుల్ స్పూన్; వెల్లుల్లి తరుగు – 3 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; గరం మసాలా పొడి– టీ స్పూన్; దాల్చిన చెక్క పొడి– టీ స్పూన్; మిరియాల పొడి– టీ స్పూన్; కొబ్బరి పొడి– 5 టేబుల్ స్పూన్లు; మైదా లేదా కార్న్‌ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్లు; బ్రెడ్ పొడి– 10 టేబుల్ స్పూన్లు; నూనె – వేయించడానికి తగినంత. తయారీ.. టోఫూ, పనీర్లను పలుచని క్లాత్‌లో కట్టి నీరు కారిపోవడానికి కనీసం ఓ అరగంట సేపు ఉంచాలి ఇప్పుడు పనీర్, టోఫూ తురుముని ఒక పాత్రలో వేసి మెత్తగా చిదమాలి అందులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, గరం మసాలా, దాల్చినచెక్క పొడి, మిరియాల పొడి, కొబ్బరి పొడి వేసి కలపాలి ఈ మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకుని పక్కన పెట్టాలి మైదా లేదా కార్న్‌ఫ్లోర్‌లో తగినంత నీటిని పోసి జారుడుగా కలుపుకోవాలి పనీర్ మిశ్రమం గోళీలను వడల్లా వత్తి కార్న్‌ప్లోర్ లో ముంచి ఆ తర్వాత బ్రెడ్ పొడిలో వేసి వడ అంతటికీ బ్రెడ్ పొడి పట్టేటట్లు రోల్ చేయాలి ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఒక్కో వడను జాగ్రత్తగా నూనెలో వేసి తిరగేస్తూ రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత తీసి టిస్యూ పేపర్ మీద వేయాలి నూనె వదిలిన తర్వాత సర్వ్ చేయాలి. ఇవి చదవండి: కలిసి మీరూ రాయండి -
కొండెక్కిన వెల్లుల్లి ..ఈ చిట్కాలు ఫాలోకండి!
దేశంలో ఇటీవల కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో ఉల్లి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. మొన్నమొన్నటి నుంచి తగ్గుతూ రాగా, ఇప్పుడు వెల్లుల్లి ధరలు అమాంతం కొండెక్కాయి. మార్కెట్లో ప్రస్తుతం కిలో వెల్లుల్లి ధర రూ.400 నుంచి రూ. 500 వరకు పలుకుతుంది. ఇలాంటప్పుడూ మహిళలు స్పైసీ కూరలు ఎలా వండి పెట్టగలం అన్న సందిగ్ధంలో పడిపోతారు. పైగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని తాలింపుల దగ్గరి నుంచి ప్రతి దాంట్లోని తప్పనిసరిగా వాడేస్తుంటారు. అలాంటిది వెల్లుల్లి వాడకం లేకుండా గడపడం అంటే..కొందరికి చాల కష్టం. అలాంటివారు ప్రత్యామ్రాయంగా ఇలాంటి వాటితో వెల్లుల్లి ప్లేస్‌ని భర్తీ చేసుకోవచ్చు. వెల్లుల్లి బదులుగా ఏం ఉపయోగించొచ్చంటే.. సింపుల్ చిట్కాలు.. ముందుగా మీ కిచెన్ కప్‌బోర్డ్‌లో ఎన్ని వెల్లులిపాయలు ఉన్నాయో చూడండి. వాటిని పాయలుగా విడదీయండి. ఆ తర్వాత చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో పెట్టి బాగా ఎండనివ్వండి. ఇక వాటిని చక్కగా పొడి చేసుకుని పాడవ్వకుండా చిన్న లవంగ మొగ్గ వేసి గాలి చొరబడి డబ్బాలో నిల్వ ఉంచండి. ఈ పొడి వెల్లులి మాదిరి రుచిని సువాసనను తెప్పిస్తుంది కూరకి. ఇది మంచి ప్రత్యామ్నాయం. అలాగే ఈ వెల్లుల్లి పొడికి కాస్త ఉప్పు చేరిస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అయితే కూరల్లో ఈ పొడిని ఉపయోగిస్తున్నట్లయితే కాస్త ఉప్పు తగ్గించండి. అప్పుడు కూర రుచికి వెల్లుల్లికి దగ్గదగ్గరగా మంచి రుచిని అందిస్తుంది. అస్సలు ఇంట్లో వెల్లుల్లి లేదంటే పచ్చి ఉల్లిపాయాలను ఎండలో ఎండబెట్టి చక్కగా పొడి చేసుకుంటే వెల్లులి మాదిరిగా టేస్ట్ వస్తుంది కూరకి. అయితే కూరలో తక్కువ ఉల్లిపాయలను ఉపయోగిస్తే సరిపోతుంది. ఆర్థిక పరంగా సమస్య రాకుండా కొద్దిపాటి చిట్కాలతో ఇంటిని చక్కగా చక్కబెట్టుకుంటే ఆరోగ్యానికా ఆరోగ్యమే గాక ధరల సమస్యకు చెక్ పెట్టొచ్చు. (చదవండి: కళ్లు కలువ పువ్వుల్లా పెద్దవిగా ఉండాలంటే.. ఈ ఐ బ్యాండ్ ఉంటే చాలు!) -
కొత్తిమీర తాజాగా, పకోడీలు క్రిస్పీగా, క్రంచీగా: ఈ టిప్స్ పాటించండి!
వంట చేసేటపుడు కొన్ని చిట్కాలు పాటించడమో, లేదా కొన్ని ఇంగ్రీడియంట్స్ అదనంగా కలపడమో తప్పని సరి. లేదంటే ఎంత కష్టపడి చేసిన వంట అయినా రుచిని కోల్పోతుంది. అలాగే ముఖ్యమైన పోషకాలను కోల్పోతాం. లేదా ఒక్కోసారి అసలు టేస్టే లేకుండా పోతుంది. అందుకే ఈ టిప్స్ ఒకసారి చూడండి. ♦ పకోడీలు మెత్తబడకుండా ఎక్కువ సేపు కరకరలాడుతూ ఉండాలంటే పావు కేజీ శనగపిండిలో గుప్పెడు మొక్కజొన్న పిండి కలపాలి. ♦ పూరీలు నూనె తక్కువ పీల్చుకుని, పొంగి కరకరలాడాలంటే పూరీలు వత్తేటప్పుడు బియ్యప్పిండి చల్లుకోవాలి. ♦ కూరగాయలను తొక్క తీసి, తరిగిన తర్వాత నీటిలో శుభ్రం చేస్తే అందులోని పోషకాలు నీటిలో కరిగిపోతాయి. ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లను నష్టపోతాం. కాబట్టి తొక్క తీయడమైనా, తరగడమైనా నీటితో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. అలాగే తరిగిన వెంటనే వండాలి. పై నియమాన్ని వంకాయలకు పాటించడం కష్టం. ఎందుకంటే తరిగిన వెంటనే నీటిలో వేయకపోతే వంకాయ ముక్కలు నల్లబడడంతోపాటు చేదుగా మారతాయి. కాబట్టి ముందుగా వంకాయలను ఉప్పు నీటిలో కడిగి ఆ తర్వాత తరిగి మళ్లీ నీటిలో వేయాలి. ♦ యాపిల్‌ను కట్ చేసి, ఆ ముక్కలను ప్లేట్లో అమర్చి సర్వ్ చేసే లోపే ముక్కలు రంగు మారుతుంటాయి. కాబట్టి కట్ చేసిన వెంటనే ఆ ముక్కల మీద నిమ్మరసం చల్లితే ముక్కలు తాజాగా ఉంటాయి. చాకును నిమ్మరసంలో ముంచి కట్ చేయడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. ♦ కొత్తిమీరను పలుచని క్లాత్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచితే ఆకులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. -
దినుసులన్నీ కలిపితే.. ఈ రకరకాల 'రుచి కారము పొడులు' మీకే!
'సంక్రాంతి రుచుల తియ్యటి రుచి బయటపడాలనిపిస్తోందా! నోటికి కారంగా, పొట్టకు తేలిగ్గా ఉండే ఆహారం తినాలనిపిస్తోందా! ఉన్నది ఆరు రుచులే.. కానీ జిహ్వ మరింత రుచిని కోరుకుంటుంది. నాలుకకు మమకారం మాత్రమే కాదు రుచి కారమూ ఇష్టమే. పోపుల పెట్టెలో దినుసులన్నీ కలిపి రకరకాల కారం పొడులు చేద్దాం.' నువ్వుల పొడి.. కావలసినవి: తెల్ల నువ్వులు – వంద గ్రాములు; ఎండు మిర్చి– 10; మినప్పప్పు – అర టేబుల్ స్పూన్; పచ్చి శనగపప్పు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; ఇంగువ – అర టీ స్పూన్; ఉప్పు– రుచికి తగినంత. తయారీ.. మందపాటి బాణలిలో నువ్వులు వేసి మీడియం మంట మీద దోరగా వేయించి పక్కన పెట్టాలి. మరొక బాణలిలో ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేయించి చివరగా జీలకర్ర వేసి దించేయాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో నువ్వులు, పోపు దినుసులు, ఇంగువ, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఈ పొడిని అన్నం, ఇడ్లీ, ఉప్మాల్లో తినవచ్చు. కూరల్లో కలుపుకోవచ్చు. వేపుళ్లలో పైన చల్లుకోవచ్చు. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి వారంలో కనీసం మూడు రోజులు ఆహారంలో ఈ పొడి ఉండేలా చూసుకోవడం మంచిది. కొబ్బరి పొడి.. కావలసినవి: ఎండుకొబ్బరి తురుము – వంద గ్రాములు; పచ్చి శనగపప్పు – టీ స్పూన్; వేయించిన శనగపప్పు – టీ స్పూన్; మిరప్పొడి– టేబుల్ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; వెల్లుల్లి రేకలు – 4; ఇంగువ – అర టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. తయారీ.. బాణలిలో పచ్చి శనగపప్పు వేసి దోరగా వేగిన తర్వాత వేయించిన శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ, కొబ్బరి తురుము వేసి కలిపి దించేయాలి. వేడి తగ్గిన తర్వాత అన్నింటినీ మిక్సీ జార్లో వేసి మిరప్పొడి, ఉప్పు కలిపి పొడి చేయాలి. ఇడ్లీ, దోశెలు, అన్నంలోకి బాగుంటుంది. వేపుళ్లలో ఒక టేబుల్ స్పూన్ పొడి కలిపితే రుచి ఇనుమడిస్తుంది. కరివేపాకు పొడి.. కావలసినవి: కరివేపాకు– వందగ్రాములు (మంచి నీటిలో శుభ్రం చేసి ఆరబెట్టి ఈనెలు తీసిన ఆకులు); ఎండు మిర్చి– పది; ఆవాలు– అర టీ స్పూన్; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్; మినప్పప్పు – టేబుల్ స్పూన్; వేరుశనగపప్పు – అర టేబుల్ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; మిరియాలు – అర టీ స్పూన్; చింతపండు – అర అంగుళం పాయ; వెల్లుల్లి రేకలు – 4; ఇంగువ పొడి– పావు టీ స్పూన్; నూనె – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత. తయారీ.. బాణలిలో నూనె వేడి చేసి వేరు శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ధనియాలు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు దోరగా వేయించాలి. అవి వేగిన తర్వాత మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఆకులో పచ్చిదనం పోయే వరకు చిన్న మంట మీద వేయించాలి. ఆకు వేగిన తర్వాత చింతపండు, ఇంగువ, వెల్లుల్లిరేకలు, ఉప్పు వేసి దించేయాలి. చల్లారే కొద్దీ ఆకు పెళపెళలాడుతుంది. పూర్తిగా చల్లారిన వెంటనే మిక్సీలో వేసి పొడి చేయాలి. రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవాలి. ఈ పొడి వేడి అన్నం, ఇడ్లీ, దోశెల్లోకి రుచిగా ఉంటుంది. ఆకలి మందగించినప్పుడు, నోటికి ఏదీ రుచించనప్పుడు ఈ పొడి తింటే జీర్ణవ్యవస్థ క్రమబద్ధమవుతుంది. గమనిక: చల్లారిన వెంటనే పొడి చేయకపోతే ఆలస్యమయ్యే కొద్దీ ఆకు మెత్తబడి పోతుంది. సరిగ్గా మెదగదు. అవిశె గింజల పొడి.. కావలసినవి: అవిశె గింజలు – వందగ్రాములు; ఎండు మిర్చి – పది; ఆవాలు – అర టీ స్పూన్; మిరియాలు– అర టీ స్పూన్; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; వేరు శనగపప్పు – అర టేబుల్ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; ఇంగువ– అర టీ స్పూన్; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. తయారీ.. బాణలిలో అవిశె గింజలను మీడియం మంట మీద వేయించి పక్కన పెట్టుకోవాలి. మరొక బాణలిలో ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, వేరు శనగపప్పు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, కరివేపాకు వేసి వేయించాలి. దినుసులన్నీ చక్కగా వేగి మంచి వాసన వచ్చేటప్పుడు అవిశె గింజలు, ఇంగువ వేసి కలిపి దించేయాలి. వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఉప్పు కలిపి పొడి చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరోగ్యకారకం. గుండె వ్యాధుల నివారణ, డయాబెటిస్ నియంత్రణకు డాక్టర్లు అవిశె గింజలను సూచిస్తున్నారు. రుచి కోసం చూడకుండా రోజూ ఒక స్పూన్ అన్నంలో లేదా బ్రేక్‌ఫాస్ట్‌లలో ఏదో ఒకరకంగా తీసుకోవడం మంచిది. ఇవి చదవండి: ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్‌మెంట్‌ని చూపించిన ప్రదాని మోదీ! -
‘బంగారం’లాంటి కలగన్నాడు.. మృత్యువు ఒడికి చేరాడు!
ప్రతీ మనిషి కల కంటాడు. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అవి నెరవేరితే.. సంతోషం. నెరవేరకపోతే!. అయితే.. ఆ కల ఆధారంగా అత్యాశకి పోతేనే అసలు సమస్య మొదలయ్యేది. ఆ ప్రయత్నంలో.. ప్రాణం కూడా పోవచ్చు. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. పేరాశకు పోయి ప్రాణం పొగొట్టుకున్నాడు ఇక్కడో పెద్దాయన. ఆయన వయసు ఏడు పదులపైనే. ఓరోజు నిద్రలో తన ఇంటి నేల కింద బంగారం ఉన్నట్లు కలగన్నాడట. అంతే.. అప్పటి నుంచి వంట గదికే పరిమితం అయ్యాడు. ఏడాది కాలం అదే పనిగా ఆ గదిలో తవ్వుకుంటూ పోయాడు. అలా.. 130 అడుగుల లోతుదాకా పోయాడు. ఈ మధ్యలో రాళ్లు అడ్డుపడితే డైనమెట్లను కూడా ఉపయోగించాడట. దీంతో చుట్టుపక్కల వాళ్లకు విషయం తెలిసింది. అది ప్రమాదకరమని హెచ్చరించినా.. అధికారులతో చెప్పించినా ఆ పెద్దాయన వినలేదు. చివరకు.. ఆ భారీ గొయ్యిలోనే అదుపు తప్పి పడిపోయి ప్రాణం విడిచాడు. దాదాపు 12 అంతస్థుల భవనం లోతు ఉన్న గొయ్యలో పడి తల పగిలి.. కాళ్లు చేతులు విరిగి అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అలా.. కలను నిజం చేసుకోవాలని.. అదీ ఈ వయసులో అత్యాశకు పోయి ప్రాణం విడిచిన ఆ పెద్దాయన పేరు జోయో పిమెంటా. ఊరు.. బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్. అందుకే.. పేరాశ ప్రాణాంతకం అని ఈయనలాంటి పెద్దలు ఊరికే అనలేదు. ఇదీ చదవండి: మాల్దీవులు-భారత్ వివాదం.. ఇదే మార్గం! -
సంక్రాంతి మాధుర్యం మన వంటింట్లోనే..
'కాలం మారింది.. అరిశె కోసం జనవరి వరకు ఎదురు చూడక్కర్లేదు. స్వగృహ ఫుడ్స్ ఏడాదంతా అందిస్తున్నాయి. అయినా సరే.. సంక్రాంతి వస్తోందంటే ఇంట్లో బెల్లం కాగాల్సిందే. పాకం వాసనకు పక్కింటి వాళ్ల నోరూరించాల్సిందే. కాలం ఎంత మారినా సరే.. అసలైన అరిశె రుచి అంటే.. మన వంటింటి అరిశె రుచే. మరి అవేంటో చూద్దాం!' పూతరేకులు.. కావలసినవి: బెల్లం పొడి – కేజీ; సగ్గుబియ్యం– ముప్పావు కేజీ; జీడిపప్పు, పిస్తా – పావుకేజీ (చిన్న పలుకులు చేయాలి); ఏలకుల పొడి– 5గ్రా.; నెయ్యి– 100 గ్రా. తయారి.. సగ్గుబియ్యాన్ని ఉడికించి చిక్కటి గంజి చేసుకోవాలి. పూత రేకు చేయడానికి మంద పాటి నూలు వ్రస్తాన్ని నలుచదరంగా కత్తిరించి సిద్ధం చేసుకోవాలి. కుండను మంట మీద బోర్లించి వేడెక్కిన తరువాత వ్రస్తాన్ని సగ్గుబియ్యం గంజిలో ముంచి కుండ మీద అతికించినట్లు పరిచి వ్రస్తాన్ని తీసేయాలి. గంజి కుండకు అంటుకుని వేడికి పలుచని పొరలాగా వస్తుంది. ఆ పొర చిరిగిపోకుండా అట్లకాడతో జాగ్రత్తగా తీయాలి. ఇలా ఎన్ని రేకులు కావాలంటే అన్నింటికీ ఇదే పద్ధతి. రేకు ఏ సైజులో కావాలంటే క్లాత్‌ను ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఒకపాత్రలో బెల్లం పొడి, జీడిపప్పు, పిస్తా పలుకులు, ఏలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రేకులను రెండు పొరలు తీసుకుని వాటికి నెయ్యి రాయాలి. ఆ తర్వాత బెల్లం పొడి, జీడిపప్పు పలుకులు, ఏలకుల పొడి మిశ్రమాన్ని పలుచగా వేసి పైన మరొక పొర రేకును వేసి మడత వేయాలి. ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి. బెల్లపు అరిశెలు కావలసినవి: బియ్యం – ఒకటింపావు కిలో; బెల్లం – కిలో; నువ్వులు, గసగసాలు– కొద్దిగా; నెయ్యి లేదా నూనె– కాల్చడానికి సరిపడినంత తయారి.. బియ్యాన్ని ముందు రోజు రాత్రి శుభ్రంగా కడిగి, మునిగేటట్లు నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను వంపేసి తడిగా ఉన్నప్పుడే దంచాలి. దంచిన పిండిని సన్నని రంధ్రాలున్న జల్లెడతో జల్లించాలి. జల్లించేటప్పుడు పిండి ఆరి΄ోకుండా జాగ్రత్త తీసుకోవాలి. గాలికి ఆరకుండా ఎప్పటికప్పుడు ఒక పాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి. పిండి సిద్ధమయ్యాక బెల్లాన్ని పాకం పట్టాలి. పెద్దపాత్రలో ఒక గ్లాసు నీటిని, బెల్లం ముక్కలను వేసి పాకం వచ్చేదాకా మరగనిచ్చి బియ్యప్పిండి కలుపుకుంటే పాకం పిండి సిద్ధం. ఇప్పుడు బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి. పాకంపిండిని పూరీకి, చపాతీకి తీసుకున్నట్లుగా తీసుకుని గోళీ చేసి గసాలు లేదా నువ్వులలో లేదా రెండింటిలోనూ అద్దాలి. ఇలా అద్దినట్లయితే అవి పిండికి చుట్టూ అంటుకుంటాయి. ఆ పిండిని పాలిథిన్ పేపర్ మీద పెట్టి వేళ్లతో వలయాకారంగా అద్ది, కాగిన నూనెలో వేసి రెండువైపులా దోరగా కాలిన తర్వాత తీసి అరిశెల పీట మీద వేసి అదనంగా ఉన్న నూనె కారిపోయేటట్లు వత్తాలి. అరిశెల పీటకు బదులుగా రంధ్రాలున్న చెక్కలుంటాయి. వీటితో బాణలిలో నుంచి తీసేటప్పుడే నూనె వదిలేటట్లు వత్తేయవచ్చు. గమనిక: అరిశె నొక్కులు పోకుండా వలయాకారంగా అంతా ఒకే మందంలో రావాలంటే చేతితో అద్దడానికి బదులుగా పూరీ ప్రెస్సర్ వాడవచ్చు. అరిశె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడే బియ్యప్పిండి కలుపుకోవాలి. గట్టిగా ఎక్కువ తీపిగా, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ముదరు పాకం పట్టాలి. ఒక ప్లేటులో నీళ్లు పోసి ఉడుకుతున్న బెల్లం మిశ్రమాన్ని స్పూనుతో కొద్దిగా తీసుకుని నీటిలో వేయాలి. దీనిని చేత్తో నొక్కి రౌండ్ చేయాలి. జారిపోకుండా రౌండ్ వచ్చిందంటే పాకం వస్తున్నట్లు. ఆ రౌండ్‌ను పైకెత్తి ప్లేటు మీద వేసినప్పుడు మెత్తగా జారిపోకుండా అలాగే ఉంటే పాకం వచ్చినట్లు. ముదురు పాకం కావాలనుకుంటే ఆ పాకం బాల్ ప్లేటుకు తగిలినప్పుడు ఠంగున శబ్దం వచ్చే దాకా మరగనివ్వాలి. ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి. తినేటప్పుడు పెనం మీద సన్న సెగకు వేడి చేస్తే అప్పటికప్పుడు చేసిన అరిశెలాగా వేడిగా, మెత్తగా వస్తాయి. ఒవెన్ ఉంటే తినే ముందు ఒక మోస్తరుగా వేడి చేసుకుంటే అప్పుడే చేసిన అరిశెల్లాగా తాజాగా ఉంటాయి. చక్కెర అరిశెలు చేయాలంటే బెల్లం బదులు చక్కెరతో పాకం పట్టాలి. కొబ్బరి బూరెలు కావలసినవి: బియ్యప్పిండి– అరకేజీ; బెల్లం – 300గ్రా.; పచ్చికొబ్బరి– ఒక చిప్ప; ఏలకులపొడి – ఒక టీ స్పూను; నెయ్యి– టేబుల్ స్పూన్; నూనె – కాలడానికి సరిపడినంత. తయారి.. బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరిసెలకు చేసుకున్నట్లే తడిబియ్యాన్ని దంచుకోవాలి. జల్లించి పిండి ఆరిపోకుండా మూతపెట్టి పక్కన ఉంచాలి. పచ్చికొబ్బరిని తురిమి సిద్ధంగా ఉంచాలి. బెల్లాన్ని పాకం పట్టాలి. బూరెలకు పాకం ముదరకూడదు. లేతపాకం సరిపోతుంది. పాకం వచ్చిన వెంటనే కొబ్బరి తురుము వేసి కలపాలి. కొబ్బరి కలిసిన తరువాత మూడు – నాలుగు గుప్పెళ్ల బియ్యప్పిండి వేసి మంట మీద నుంచి దించేయాలి. ఇప్పుడు ఏలకుల పొడి, మిగిలిన బియ్యప్పిండిని వేసి ఉండలు కట్టకుండా సమంగా కలిసే వరకు కలిపి పైన నెయ్యి వేసి అద్ది మూత పెట్టాలి. కొబ్బరి బూరెల పిండి సిద్ధం అన్నమాట. బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. ఈ లోపుగా బూరెల పిండి చిన్న గోళీ అంత తీసుకుని అరచేతిలో కాని పాలిథిన్ పేపరు మీద కాని అరిసెలాగా వేళ్లతో ఒత్తి కాగిన నూనెలో వేయాలి. రెండు వైపులా దోరగా వేగిన తరువాత తీయాలి. తీసిన పదినిమిషాలకు వేడి తగ్గి బూరె రుచి ఇనుమడిస్తుంది. ఇవి చదవండి: మన ఫుడ్ అంతా కార్బోహైడ్రేట్స్ మయమా? అదే సుగర్‌కి కారణమా? -
డబుల్ సైడ్ మల్టీమేకర్! నూనె లేకుండా..
శ్రమ లేకుండా సౌకర్యాలను అందించడంతో పాటు.. కిచెన్‌కి లగ్జరీ లుక్‌నీ ఇచ్చే ఈ డబుల్ సైడ్ హీటింగ్ బేకింగ్ మెషిన్.. యూజర్ ఫ్రెండ్లీగా డిమాండ్‌లో ఉంది. ఇందులో ఇండిపెండెంట్ టెంపరేచర్ కంట్రోల్, డబుల్ పాల్ గ్రిల్లింగ్, త్రీ టైప్స్ ఆఫ్ బేకింగ్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. మూడు లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్ మేకర్.. రకరకాల రుచులను నిమిషాల్లో సిద్ధం చేస్తుంది. ఈ మేకర్లో గ్రిల్ లేదా ఫ్రై చేసుకోవాలంటే నూనె చాలా తక్కువ మోతాదులో సరిపోతుంది. క్లీన్ చేసుకోవడమూ సులభమే. ఇది రోజువారీ వంటకాలకే కాకుండా పార్టీలు, ఫంక్షన్స్‌లో వెరైటీ వంటకాలు చేసుకోవడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో కూరలు, సూప్స్ వంటివి సిద్ధం చేసుకోవడంతో పాటు.. పాన్ కేక్స్, కట్లెట్స్ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. దీనితో షార్ట్ సర్క్యూట్ సమస్య రాదు. దీనికి అటాచ్డ్ మూతతో పాటు ఒక ట్రాన్స్పరెంట్ మూత విడిగా లభిస్తుంది. (చదవండి: ఈ కొత్త రకం కుక్కర్ లో వంటలు చాలా సులభం) -
సర్దుకు పోవద్దు.. సర్దుకుందాం ఇలా..!
కిచెన్‌ను శుభ్రంగా ఉంచుకోవడంలో మొదటి మెట్టు... వంట పూర్తి కాగానే.. కిచెన్ ప్లాట్‌ఫామ్, స్టౌను వెంటనే శుభ్రం చేసేసుకోవడం. స్టవ్ మీద, ప్లాట్‌ఫామ్ మీదా మనం వండిన వంటలోని చిందులు, నూనె మరకలు పడటం సహజం. అలాంటి వాటిని వంట అవగానే వెంటనే తుడిచేయాలి. గోరువెచ్చటి నీళ్లలో వెనిగర్ కలిపి శుభ్రం చేస్తే.. క్రిములు తొలగిపోతాయి. స్టౌ మీద పడిన నూనె మరకలను తొలగించడానికి, కిచెన్ ప్లాట్‌ఫామ్ శుభ్రం చేయడానికి యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్‌ని ఉపయోగించచ్చు. అవి కాసింత ఖరీదైనవి కావడం వల్ల చాలామంది కిచెన్ టవల్స్నే వాడతారు. ఒకోసారి కిచెన్‌లో నూనె ఒలికిపోతుంటుంది. వెంటనే ఆ నూనె మీద గోధుమ పిండి లేదా బియ్యప్పిండిని చల్లి కాసేపటి తరువాత పేపర్‌తో తుడిస్తే జిడ్డులేకుండా శుభ్రపడుతుంది. కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై మరకలు ఉంటే.. వంటసోడా వేసిన నీళ్లతో కిచెన్ ప్లాట్‌ఫామ్ తుడిస్తే చాలు. అంతేకానీ బ్లీచింగ్, అమోనియా లాంటివి వాడటం వల్ల క్యాబినెట్కున్న రంగులు, టైల్స్ దెబ్బతింటాయి. కూరగాయలు తరగడం పూర్తయిన వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయకపోతే అక్కడున్న తేమ, కాయగూరల అవశేషాలు వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల్ని త్వరగా ఆకర్షిస్తాయి. తరిగేటప్పుడే ఓ డబ్బా పెట్టుకొని, తొక్కలు, తొడిమల్లాంటివి దాంట్లో వేసి తర్వాత చెత్తడబ్బాలో పడేస్తే.. శుభ్రంగా ఉంటుంది. కిచెన్ టవల్స్‌ను కూడా... కిచెన్ ప్లాట్‌ఫామ్‌ని, స్టవ్నీ క్లీన్ చేసేందుకు ఉపయోగించే కిచెన్ టవల్ని సరిగా శుభ్రం చేయకపోతే దానికి ఉండే బ్యాక్టీరియా వల్ల అంతవరకు మనం చేసినదంతా నిరర్థకమవుతుంది. కిచెన్ టవల్స్ జిడ్డుగా ఉంటే గోరువెచ్చని నీటిలో సర్ఫ్, వాషింగ్ లిక్విడ్ వేసి కాసేపు నానబెట్టిన తర్వాత బట్టలుతికే బ్రష్‌తో క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతాయి. కిచెన్ క్యాబినెట్ కిచెన్ ప్లాట్‌ఫామ్ కింద లేదా పైన సామాన్లు పెట్టుకోవడం కోసం ఉంచిన ర్యాక్స్, క్యాబినెట్ పుల్స్, హ్యాండిల్స్‌పై కూడా సూక్ష్మక్రిములు ఉంటాయి. వాటిని క్రిమిసంహారక వైప్‌తో క్లీన్ చేస్తే మంచిది. వెనిగర్‌ని క్లాత్‌పై స్ప్రే చేసి వాడండి. దీనివల్ల వేలిముద్రలు, నీటి గుర్తులు పోయి తెల్లగా మెరుస్తాయి. ఫ్రిజ్ క్లీన్‌గా.. ఫ్రిజ్‌లో మనం చాలా స్టఫ్ పెడుతుంటాం. కానీ, దానిని ఎప్పుడో ఓసారి క్లీన్ చేస్తుంటాం. అలా కాకుండా దీనిని కూడా మరకలు లేకుండా శుభ్రంగా తుడవడం మంచిది. ఫ్రిజ్ కింద, డోర్స్, లోపల గ్లాసెస్.. ఇలా అన్నింటిని తడిగుడ్డతో తుడిస్తే త్వరగా క్లీన్ అవుతుంది. ఇక మిగిలిపోయిన ప్రతిదానిని ఫ్రిజ్‌లో తోసేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం చాలా మంచిది. సింక్ క్లీన్.. కిచెన్ క్లీన్ చేయాలంటే ముందుగా సింక్‌ని క్లీన్ చేయాలి. సింక్ బేసిన్ నీట్‌గా ఉందో లేదో చూసుకోండి. కౌంటర్ చుట్టూ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల వైరస్, బ్యాక్టీరియా వంటివి దూరమవుతాయి. అందుకే, ముందు దీనిని క్లీన్ చేయండి. సింక్ సరిగ్గా లేకపోతే అందులో నుంచే ఎక్కువ బొద్దింకలు, వాటి ద్వారా వ్యాధులు వస్తాయి. కొద్దిగా బ్లీచింగ్ పౌడర్, డిష్‌వాష్, బేకింగ్ సోడాతో క్లీన్ చేస్తే సరి. సింక్‌లో మాంసాహారం కడిగిన తర్వాత దాన్ని సోప్ వాటర్‌తో శుభ్రం చేసేస్తే సింక్ దుర్వాసన రాకుండా ఉంటుంది. కాస్త తీరిక దొరికినప్పుడు ఓ క్లాత్ తీసుకుని వాటర్ స్ప్రే చేస్తూ కిచెన్ గోడలు, కౌంటర్స్‌ని క్లీన్ చేయండి. ఇందుకోసం మార్కెట్లో దొరికే స్ప్రేలను కూడా ఉపయోగించవచ్చు.. ఇప్పుడు డోర్ ఫ్రేమ్స్‌ని క్లీన్ చేయండి. వంటగదిని అన్ని వస్తువులు సులభంగా దొరికేలా సర్దుకుంటే వంట చేయడం ఈజీ అవుతుంది. ఎలాగో చూద్దాం... ట్రాన్స్పరెంట్ డబ్బాలు వంట చేసుకునేప్పుడు ఏ డబ్బాలో ఏముందా? అని వెతుక్కోవడానికే సమయం వృథా అవుతుంది. అలా కాకుండా షెల్ఫుల్లో ట్రాన్స్పరెంట్గా ఉండే ప్లాస్టిక్ డబ్బాలు లేదా స్టీల్ డబ్బాలూ గాజు సీసాలూ అందుబాటులో ఉంటాయి. వాటిని ప్రయత్నించి చూడండి. పని సులభం అవుతుంది. సరుకులనూ వేరు చేయడం వంట గదిలో షెల్ఫులలో అన్ని సరుకుల్ని అన్ని షెల్ఫుల్లో సర్దేయకుండా ఎక్కువగా వంటకు వాడే వాటిని ఒకచోట, తక్కువగా వాడే పదార్థాల్ని వేరే షెల్ఫులో, బేకింగ్ సామగ్రిని మరో దగ్గర పెట్టుకోవడం వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. (చదవండి: కార్ డిజైనర్ థార్ డిజైనర్!) -
మొన్న తల్లిదండ్రులు.. నిన్న కుమారుడు.. అనాథగా మారిన కూతురు!
హైదరాబాద్: ఫిలింనగర్‌లోని మహాత్మాగాంధీ నగర్ వడ్డెర బస్తీలో మూడ్రోజుల క్రితం వంట గ్యాస్ లీకై దంపతులు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి కుమారుడు గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మహాత్మాగాంధీ నగర్ వడ్డెర బస్తీలో నివసించే మిర్యాల రమేష్.. ఇంట్లోని వంట గ్యాస్ లీకై న విషయాన్ని గ్రహించకుండా.. కరెంటు స్విచ్ వేయడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకొని గాయాలపాలయ్యారు. అదే రోజు రమేష్ మృతి చెందాడు. మరుసటి రోజు ఆయన భార్య శ్రీలత ఆస్పత్రిలో కన్నుమూసింది. తీవ్ర గాయాలపాలైన కుమారుడు హర్షవర్ధన్ గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనతో వడ్డెర బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోదరుడు మృతి చెందడంతో చెల్లెలు అనాథగా మారింది. ప్రస్తుతం ఈ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
పన్నీర్ పాడవ్వకుండా ఉండాలంటే..ఇలా చేయండి!
కొన్ని కిచెన్‌లో ఉపయోగించే సరుకులు పాడవ్వకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తులు తీసుకోవాలో తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొసారి పాడేపోతాయి. దీనికి తోడు ఆయా సీజన్లు కూడా తోడైతే కొన్నింటిని నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారకోసమే ఈ వంటింటి చిట్కాలు ఇక మీరు ఆ విధమైన సమస్యల నుంచి ఈజీగా బయటపడండి. పచ్చిమర్చి తాజాగా ఉండాలంటే.. మార్కెట్ నుంచి తెచ్చిన పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తడిలేకుండా ఆరిన మిరపకాయల తొడిమలు తీసేసి టిష్యూపేపర్లో వేసి చుట్టి, జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి రిఫ్రిజిరేటర్లో ్చనిల్వ చేయాలి. ఇలా పెట్టిన పచ్చి మిరపకాయలు నెలరోజులపాటు పాడవకుండా చక్కగా ఉంటాయి. ఇంట్లో చేసే నూడుల్స్ రెస్టారెంట్లలోలాగా పొడిపొడిగా రావాలంటే... నీటిలో రెండు టీస్పూన్ల నూనె, కొద్దిగా ఉప్పువేసి నూడుల్స్‌ను మరిగించాలి. నూడుల్స్ చక్కగా ఉడికిన తరువాత వేడి నీటి నుంచి తీసి చల్లటి నీటితో కడగాలి. నీరంతా పోయేలా వంపేసి నూడుల్స్ పైన టీస్పూన్ నూనెను వేసి కలుపుకుంటే నూడుల్స్ పొడిపొడిగా వస్తాయి. వీటికి మసాలా జోడిస్తే ఎంతో రుచిగా ఉంటాయి. పనీర్‌ను నీటిలో వేసి, పైన కాటన్ వస్త్రాన్ని కప్పి ఉంచి రిఫ్రిజిరేటర్లో ఉంచితే రెండు మూడు వారాలపాటు తాజాగా ఉంటుంది. పనీర్ ముక్కలు మునిగే అన్ని నీళ్లు పోయాలి. ఈ నీటిని రెండు మూడు రోజులకొకసారి మార్చుకుంటూ ఉంటే మరిన్ని రోజులపాటు తాజాగా ఉంటుంది. (చదవండి: మట్టి పాత్రల్లో వండటం మంచిదే! కానీ..) -
మణికేరళం
ఎక్కడి కేరళ? ఎక్కడి మణిపుర్? అయితే మానవత్వానికి భౌగోళిక సరిహద్దులతో పనిలేదు అని నిరూపించే విషయం ఇది. కేరళ కోచిలోని ఆర్సీపీ రెస్టారెంట్లో మణిపుర్‌కు చెందిన సుస్మిత పనిచేస్తుంది. సర్వీస్ స్టాఫ్‌లో ఒకరైన సుస్మిత ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. మూడుసార్లు ‘బెస్ట్ ఎంప్లాయీ’గా అవార్డ్ కూడా అందుకుంది. అలాంటిది... ఓ రోజున సుస్మిత డల్‌గా ఉండడం చూసి ‘ఏమైంది?’ అని అడిగాడు జనరల్ మేనేజర్. తన రాష్ట్రం మణిపుర్లో జరుగుతున్న అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తల్లి, సోదరి గురించి ప్రస్తావిస్తూ ‘వారికేమైనా అవుతుందేమో’ అంటూ భయపడింది. విషయం తెలిసిన చెఫ్ పిళ్లై, అతని టీమ్ మణిపుర్ నుంచి ఆమె తల్లి, సోదరిలను రప్పించి కోచిలో బస ఏర్పాటు చేశారు. సుస్మిత తల్లి ఇబెంచదేవి, సోదరి సర్ఫిదేవిలకు ‘ఆర్సీపీ కోచి కిచెన్’లో ఉపాధి కల్పించారు. ఈ స్టోరీ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. -
కొత్త మార్గంగా డబ్బావాలా క్లౌడ్ కిచెన్!
ముంబై డబ్బావాలా.. తెల్లటి యూనిఫాంలో లంచ్‌బాక్సులను సైకిల్స్‌పై రైల్వే స్టేషన్లకు, రైల్వే స్టేషన్ల నుంచి ఆఫీసులకు అందజేస్తూ బిజీబిజీగా గడిపేవారు. సైకిళ్ల మోత, లంచ్ బాక్సుల చప్పుళ్లతో ఆ రోజులన్నీ కళకళలాడేవి. కోవిడ్ ముంబైని తాకింది. తెల్లగా మెరిసే వారి డబ్బాలు కార్పొరేట్ కార్యాలయాల నుంచి అదృశ్యమయ్యాయి. దుమ్ము పేరుకుపోయిన డబ్బాలు, తుప్పు పట్టిన సైకిళ్లు మిగిలిపోయాయి. వారి తెల్లటి యూనిఫాంలు, గాంధీ టోపీలు అల్మారాలో ముడుచుకున్నాయి. కరోనా ప్రభావం వివిధ వర్గాలతోపాటు వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయాలకు లంచ్ బాక్స్‌లు చేసే డబ్బావాలాలపైనా తీవ్రంగా చూపింది. లాక్‌డౌన్‌కు ముందు ముంబైలో సుమారు 5000కుపైగా డబ్బావాలాలుండేవారు. వివిధ కారణాలవల్ల ఈ సంఖ్య రెండు వేలకు చేరింది. ప్రస్తుతం ముంబైలో కేవలం 1,500 డబ్బావాలాలున్నారు. ఈ సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడం వారిని కలవర పెడుతోంది. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్‌లో ముంబైలో డబ్బావాలాలు కనుమరుగయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్‌తో.. ఒకప్పుడు మేనేజ్మెంట్ గురుగా ప్రపంచంలో గుర్తింపు పొందన ముంబై డబ్బావాలాల ఉనికి ప్రమాదంలో పడింది. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ ప్రభావం డబ్బావాలాలపై తీవ్రంగా చూపింది. లాక్డౌన్ సమయంలో రవాణా సదుపాయంలేక వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహించారు. అప్పుడు డబ్బావాలాల అవసరమే లేకపోయింది. వారికి అసలు ఉపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మెరుగుపడ్డాయి. ట్యాక్సీలు, బస్సులు, లోకల్ రైళ్లు తదితరా రవాణ వ్యవస్థలు యథాస్థితికి వచ్చాయి. అయినప్పటికీ అనేక మంది ఉద్యోగులు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కొన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. పని చేస్తున్న మరికొన్ని కార్యాలయాల్లో క్యాంటీన్లు ప్రా రంభించారు. కొందరు ఉద్యోగులు ఇంటి నుంచి లంచ్ బాక్స్‌లు వెంట తీసుకొస్తున్నారు. కొందరు ఉ ద్యోగులు ఆన్లైన్లో ఆర్డర్చేసుకుంటున్నారు. దీంతో డబ్బావాలాల అవసరం లేకుండా పోయింది. లక్ష నుంచి 50 వేలకు.. ఒకప్పుడు ప్రతీరోజు రెండు లక్షల లంచ్‌బాక్స్‌లు చేరవేసిన ఈ డబ్బావాలాలు ఇప్పుడు 40 నుంచి 50 వేల వరకు మాత్రమే అందజేస్తున్నారు. ఫలితంగా వారి ఆదాయానికి గండిపడింది. ఒకప్పుడు ఒక్కో డబ్బావాలా నెలకు రూ.20 నుంచి 25 వేలు సంపాదించేవాడు. లంచ్ బాక్స్‌ల సంఖ్య తగ్గడంతో ఇప్పుడు రూ.12 నుంచి 15 వేలు ఆదాయం రావడం కూడా గగనమైపోయింది. అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం కష్టతరంగా మారింది. ఫలితంగా ఈ మార్గాన్ని వదులుకుని మరో ఉద్యోగ వేటలో పడ్డారు. డబ్బావాలాల సంఖ్య తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణమైంది. దివాలో నివసించే 40 ఏళ్ల సచిన్ గావ్డే డబ్బావాలాగా జీవితాంతం పేరు తెచ్చుకున్నాడు. అతని ముత్తాతలు 1952 నుండి ముంబైలో డబ్బాలను పంపిణీ చేస్తున్నారు. అదే అతని గుర్తింపు, జీవనాధారం. వర్క్ ఫ్రమ్ హోమ్ తమ జీవితాలను పూర్తిగా తలకిందులు చేసిందని చెబుతున్నాడు. క్లౌడ్ కిచెన్.. ఆన్లైన్ ఆర్డర్స్ అయితే.. దీన్ని ఎదుర్కోవడానికి డబ్బావాలాల నాల్గోతరం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇటీవలే క్లౌడ్ కిచెన్‌ను మొదలుపెట్టారు. చాలామంది ఇంటి నుంచే పనిస్తుండటంతో లంచ్ బాక్స్‌లను డెలివరీ చేసే తమ సంప్రదాయ వ్యాపారం క్షీణించింది. ఈ నేపథ్యంలో మరింత మంది కస్టమర్లను చేరుకోవడానికి వంట చేయడం, హోమ్‌స్టైల్ మీల్స్ డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు. మొదట సాకినాకాలో సెంట్రల్ కిచెన్‌ను స్థాపించాలని ప్లాన్ చేశారు. ఒక స్థలం నుంచి నగరవ్యాప్తంగా భోజనాన్ని పంపిణీ చేయడం సవాలుగా మారుతుందని భావించి వికేంద్రీకృత విధానాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం ముంబయిలోని వివిధ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలతో డబ్బావాలాలు భాగస్వాములు అవుతున్నారు. కొంతమంది మహిళలు కలిసి వండిన ఆహారాన్ని ఆయా ప్రాంతాల దగ్గర్లోని ఆర్డర్లకు సప్లై చేస్తున్నారు. దీనివల్ల మహిళలు జీవనోపాధి పొందడంతోపాటు డబ్బావాలాలకు ఉపాధి ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఆన్లైన్ ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఆన్లైన్ మెనూని బ్రౌజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు. శాఖాహార, మాంసాహార భోజనం ఉంటుంది. ధర పరిమాణాన్ని బట్టి రూ. 95 నుంచి ప్రారంభమై రూ.120 వరకు ఉంటుంది. రోజువారీ లేదా నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకోవచ్చు. ముందు రోజు సాయంత్రంలోపు ఆర్డర్ చేస్తే లంచ్ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల మధ్య డెలివరీ చేస్తున్నారు. (చదవండి: వెదురుతో వండే కూర గురించి విన్నారా? దాని టేస్టే వేరు..!) -
'కిచెన్ క్వీన్స్'..వంటగదితోనే వ్యాపారం సృష్టించారు!
కొందరూ మహిళలు మహమ్మారీ కాలాన్ని చెడు కాలంగా ఫీలై గదులకే పరిమితమైపోలేదు. అవరోధంగా భావించకుండా అవకాశంగా మలుచుకున్నారు. వ్యాపారాన్ని సృష్టించుకునేందుకు అనువైనం కాలంగా క్యాష్ చేసుకున్నారు. వ్యాపారవేత్తలుగా మారి స్త్రీ సత్తా ఏంటో చూపించారు. నిజానికి కరోనా కాలం ఎంత భయానకంగా ఉందో చెప్పనవసరం లేదు. ఆ రోజులు గుర్తొచ్చిన బాబోయ్..! అనిపిస్తుంది. కానీ ఈ మహిళలు దాన్నే వరంగా మార్చుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంతో కుటుంబ ఆదాయన్ని సృష్టించుకుంటే. మరికొందరూ ఆ సక్సెస్ ఇచ్చిన స్థైర్యంతో తమ వ్యాపారాన్ని మరింత విస్తరింప చేసేలా చేసుకున్నారు. ఈ మేరకు లక్నోలో ఉండే 51 ఏళ్ల మీనాక్షి ఆర్య వంటపై తనకున్న ఆసక్తనే అవకాశంగా మలిచుకుంది. ఆ వంటిల్లునే చిన్నపాటి వాణిజ్యసంస్థగా మార్చింది. 'పంజాబీ కధై' అనే పేరుతో వివిధ రుచులను పరిచయం చేసింది. కోవిడ్ రోగులకు ఆహారాన్ని అందించడం ద్వారా ప్రారంభమైన బిజినెస్ కాస్త మరింతగా విస్తరించింది. ఆ టైంలో 'క్లౌడ్ కిచెన్' పేరుతో మహిళలు ఇంటి దగ్గరే స్వయంగా తయారు చేసిన ఆహారాలు అందుబాటులోకి వచ్చాయి. అవే చాలామందికి ఆధారం అయ్యింది. ఎందుకంటే లాక్డౌన్ కారణంగా హోటల్స్, రెస్టారెంట్ మూసేయడంతో ఇది ఆ మహిళలకు వరమై మంచి ఆధాయ వనరుగా మారింది. ఇక అప్పుడు ఆ టైంలో ఫుడ్‌ని మీనాక్షి భర్తే డెలీవరీ చేసేవాడు. ప్రస్తుతం మాత్రం ఆమె ఉబర్‌లో పనిచేసే వ్యక్తి సాయంతో ఆర్డర్లు డెలివరీ చేస్తూ వ్యాపారాన్ని దిగ్విజయంగా నడుపుతోంది. అదేబాటలో నడిచింది శిక్షా ఖండేల్వాల్ ఆమె కూడా తన ఇంటి నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసి డెలివరి చేసింది. ఆమె ఎక్కువగా కొరియర్ సర్వీస్‌లపై ఆధారపడింది. అదీగాక ఆ టైంలో టెక్కీ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఉద్యోగాలు పోయి వీధిలో నిలబడి పోయే స్థితిలో ఆమెకు కూడా ఈ క్లౌడ్ కిచెన్ ఆధారమైంది. ఇదే కోవలోనే కోలకతాకు చెందని మాజీ ఐటీ ప్రోఫెషనల్ శిక్ష అత్యంత విజయవంతమైన 'కస్ట్మైజ్డ్ క్లౌడ్ కిచెన్'ని నడుపుతోంది. అదే ఆమె ఆధాయానికి బాసటయ్యింది. అలాగే తనలా ఇబ్బంది పడుతున్న ఐటీ వాళ్లకు కూడా ఈ వ్యాపారాన్ని పరిచయం చేసి..తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించే యత్నం చేస్తోంది. ఆమె శాఖాహారం, మాంసహారాన్ని ఎలాంటి డెలీవరీ చార్జీలే లేకుండానే అందిస్తున్నారు. వాటి తోపాటు పచ్చళ్లు, మురబ్బా, పాపడ్, తదితర వాటిని కూడా విక్రయిస్తుంది. ఏదీ ఏమైనా మనసు ఉండాలే గానీ చెడుకాలాన్ని కూడా చెడుగుడు ఆడేలా చక్కటి అవకాశం మార్చుకోవచ్చు అని నిరూపించారు ఈ మహిళలు. (చదవండి: కార్యాలయాల్లో ఓన్లీ 'వై' బ్రైక్!ఏంటంటే ఇది!) -
ఈ కెటిల్‌ను.. వండుకున్నాక మడతెయ్యొచ్చు..
గ్రేడ్ సిలికాన్ బాడీతో స్టెయిన్ లెస్ స్టీల్ బాటమ్తో రూపొందిన ఈ ఫోల్డబుల్ కెటిల్.. గ్యాస్ స్టవ్ మీదైనా, ఇండక్షన్ స్టవ్ మీదైనా చక్కగా పని చేస్తుంది. దీని సామర్థ్యం సుమారుగా రెండు లీటర్ల వరకు ఉంటుంది. దీన్ని ఫోల్డ్ చేస్తే చిత్రంలో ఉన్న విధంగా చాలా చిన్నగా మారిపోతుంది. ఇది అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. అలాగే.. హీట్ ఇన్సులేషన్ హ్యాండిల్, యాంటీ–స్కాల్డ్ లిడ్‌తో క్యాంపింగ్‌కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో 3 నుంచి 5 నిమిషాలలో ఓట్ మీల్ లేదా కాఫీ లేదా టీ వంటివి తయారు చేసుకోవచ్చు. గుడ్లు, జొన్నకండెలు, చికెన్, మటన్, కూరగాయలు ఇలా వెజ్, నాన్‌వెజ్ అని తేడా లేకుండా అన్నింటినీ ఇందులో కుక్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డబుల్ కెటిల్ ధర 194 డాలర్లు (రూ.15,972). -
సంక్షోభం నేర్పిన పాఠం! నగరాల్లోకి 'పెరటి తోటలొచ్చాయ్'!
కోవిడ్–19 మహమ్మారి ప్రభావాల నుంచి కోలుకుంటున్న దశలో శ్రీలంకను 2022లో మరో సంక్షోభం చుట్టుముట్టింది. ఆహారం, ఇంధన కొరతతో కూడిన పెద్ద ఆర్థిక సంక్షోభం దేశాన్ని కుదిపేసింది. రసాయనిక ఎరువులను దిగుమతి చేసుకోవడానికి డబ్బులేకపోయింది. ఈ సంక్షోభం తీవ్రత ఎంతంటే.. ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి వచ్చింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంచనా ప్రకారం సంక్షుభిత శ్రీలంకలో ప్రజలు భోజనాల సంఖ్యను 37% తగ్గించుకున్నారు. తినే ఆహారాన్ని 40% తగ్గించుకున్నారు. తక్కువ ఇష్టపడే ఆహారాలను తినటం 68% తగ్గించుకోవాల్సి వచ్చింది. కొలంబో మున్సిపల్ కౌన్సిల్(సీఎంసీ) ఆవరణలో పచ్చికను తొలగించి కూరగాయలు సాగు చేస్తున్న దృశ్యం బయటి నుంచి ఆహారోత్పత్తులు నగరానికి రావటం తగ్గినప్పుడు ఉన్న పరిమితులకు లోబడి నగరంలోనే కూరగాయలు, పండ్లు వంటివి పండించుకోవటం తప్ప వేరే మార్గం లేదు. దేశ రాజధాని కొలంబో అతిపెద్ద నగరమైన కొలంబో(అప్పటి) మేయర్ రోసీ సేననాయక (మార్చి 19న ఆమె పదవీ కాలం ముగిసింది) ఈ దిశగా చురుగ్గా స్పందించారు. కొలంబో మునిసిపల్ కౌన్సిల్ (సీఎంసీ) మద్దతుతో నగరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఆహార పంటలను పండించేలా చొరవ చూపారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కూరగాయలు, పండ్ల సాగు ప్రారంభమైంది. కొలంబో విస్తీర్ణం 37 చ.కి.మీ.లు. జనాభా 6.26 లక్షలు (2022). నిజానికి ప్రజల స్థాయిలో టెర్రస్ కిచెన్ గార్డెనింగ్ ప్రయత్నాలకు కొలంబో గతం నుంచే పెట్టింది పేరు. అయితే, పాలకులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. సెంట్రల్ కొలంబోలో కూరగాయల మొక్కలతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ కరోనాకు ఆర్థిక/ఆహార సంక్షోభం తోడైతే తప్ప కొలంబో మున్సిపల్ కౌన్సిల్(సీఎంసీ)కి, శ్రీలంక ప్రభుత్వానికి అర్బన్ అగ్రికల్చర్ ప్రాధాన్యత ఏమిటో తెలిసిరాలేదు. నగరంలో ఖాళీ స్తలాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నంతలో ఆకుకూరలు, కూరగాయల సాగుకు కౌన్సిల్ పచ్చజెండా చూపటమే కాదు.. మొదటి పెరటి తోట కొలంబో టౌన్ హాల్ చుట్టూ ఉన్న పచ్చిక బయలు లోనే ఏర్పాటైంది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత 30 సంవత్సరాల క్రితం క్యూబాలోని హవానాలో కూడా ఇలాగే జరిగింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట పచ్చికను తొలగించి కూరగాయ పంటల సాగుకు శ్రీకారం చుట్టిన సందర్భం అది. ఉపయోగించని ప్రతి అంగుళం ఖాళీ స్తలాల్లో ఇంటి పెరటిలో, బాల్కనీలలో, ఇంటి పైకప్పులలోనూ కూరగాయలు పండించమని నివాసితులను, పాఠశాల విద్యార్థులను సీఎంసీ ప్రోత్సహించింది. కొలంబో సిటీ కౌన్సిల్ ఆవరణలో సాగవుతున్న కూరగాయలను పరిశీలిస్తున్న మాజీ మేయర్ రోసీ సేననాయక తదితరులు Good morning from our rooftop terrace #SriLanka #naturelovers #GoodMorningTwitterWorld pic.twitter.com/SkFGeLFr6V— Devika Fernando (@Author_Devika) June 28, 2023 60%గా ఉన్న అల్పాదాయ వర్గాల ప్రజలకు అర్బన్ అగ్రికల్చర్ చాలా అవసరమని సీఎంసీ భావిస్తోంది. కోవిడ్డ మహమ్మారికి ముందు నగరంలో కూరగాయల సాగు ఆవశ్యకతను సీఎంసీలో ఏ విభాగమూ గుర్తించ లేదు. ఇప్పుడు వచ్చిన మార్పు గొప్పది. ఈ సానుకూల ప్రయత్నాలకు శ్రీలంక కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులందరూ పంటలు పండించడానికి శుక్రవారం ఇంట్లోనే ఉండేందుకు వీలు కల్పించింది. సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి, నగర పరిసరాల్లో పడావుపడిన వరి పొలాలు, ఖాళీ ప్రభుత్వ స్తలాలను సాగు చేయడానికి సైన్యాన్ని కూడా నియోగించారు. ప్రైవేటు సంస్థలు కూడా కదిలాయి. సెంట్రల్ కొలంబోలో పూర్తిగా వివిధ కూరగాయ మొక్కలతో రూపొందించిన క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేశారు. పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: దుబాయ్ సిగలో 'రూఫ్‌టాప్ సేద్యం) -
కిచెన్ క్వీన్ శశికళ.. ఈమె వంటలకు విదేశీయులు కూడా ఫిదా
ఉదయ్‌పూర్ కిచెన్ క్వీన్ శశికళ మనదేశంలో కంటే విదేశాల్లో బాగా ఫేమస్. ఆమె గరిట తిప్పిందంటే ఎవరైనా ఆహా అనాల్సిందే. ఆమె వంట చేస్తే నలభీములు సైతం వంక పెట్టలేరు. పాకశాస్త్రంలో అద్భుతమైన ప్రావీణ్యం ఆమె సొంతం. అందుకే ఆమె దగ్గర వంటలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి వస్తుంటారు. ఒకప్పుడు భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న శశికళ ఇప్పుడు ఎంతోమంది విదేశీయులకు వంటలు నేర్పిస్తూ, వ్యాపారవేత్తగానూ ఆదర్శంగా నిలుస్తుంది. రాజస్థాన్‌కు చెందిన శశికళ జీవితం ఒకప్పుడు సాధాసీదాగానే ఉండేది. క్యాన్సర్ కారణంగా భర్తను కోల్పోయి చిన్నాచితక పనిచేసుకుంటూ ఒంటరిగా కాలం వెళ్లదీసేది. కానీ అనుకోకుండా ఆమె దశ తిరిగింది. ఒకప్పుడు ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా రాని అతి సామాన్యురాలైన శశికళ ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తుంది. ఆమె దగ్గర వంటలు నేర్చుకోవడానికి 30 దేశాలకు చెందిన వాళ్లు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటున్నారంటే ఆమె వండే వంటలు ఎంత స్పెషలో ఈపాటికే అర్థమైపోయింటుంది. ఓసారి ఐరీష్ నుంచి వచ్చి దంపతులకు శశికళ మన భారతీయ వంటలు వండి వడ్డించింది. ఆ రుచికి ఫిదా అయిన ఆ దంపతులు వెంటనే శశికళతో కుకింగ్ క్లాసెస్ ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతుంది. మొదట్లో ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది పడేది శశికళ. కానీ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతూ అదరగొడుతుంది. శశికళ వద్ద కుకింగ్ పాఠాలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి స్వయంగా ఉదయ్‌పూర్ వస్తుంటారు. -
టమాటా ధర పెరిగిందని టెన్షన్ వద్దు.. ఆ లోటుని ఇలా భర్తీ చేయండి!
ప్రస్తుతం కూరగాయాల ధరలు అమాంతం పెరిగి సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఏం కొనలేం తినలేం అన్నట్లు ఉంది పరిస్థితి. గడిచిన నెలలో ఎండల తీవ్రత.. దీనికి తోడు అకాల వర్షాలు..వీటన్నింటి కారణంగా సరైన దిగుబడి లేకుండా పోయింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో దిగుమతులు కూడాలేవు. దీంతో మొన్నటి వరకు సాధారణ స్థితిలో ఉన్న కూరగాయాల ధరలు కాస్తా ఒకేసారి సామాన్యుడు కొనలేనంతగా పైకి ఎగబాకాయి. అందులోనూ.. టమాట ధర సెంచరీ కొట్టేసింది. మొన్నటి వరకు కిలో రూ. 20, రూ. 40గా ఉన్నాయి వంద రూపాయాలు పైనే పలుకుతోంది. అన్ని కూరల్లోనూ గ్రేవీ కోసం టమాటాలను విరివిగా వాడటం సర్వసాధారణం. అలాంటిది ఇప్పుడూ కొనాలన్నా, ఉపయోగించాలన్న ఆలోచించాల్సిన స్థితి. టమాట వేస్తే ఆ కూర రుచే వేరే. ఆఖరికి రెస్టారెంట్లు, హోటళ్ల వాళ్లు సైతం కస్టమర్లకు గ్రేవీతో కూడిన కూర సర్వ్ చేయాలంటే.. అక్కడ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. కానీ గృహణులు ఇలాంటి సమయంలోనే తమ పాక శాస్త్ర ప్రావిణ్యాన్ని వెలికితీసి టమాటాకే డౌటు తెప్పించే రుచిగా వండాలి. ఈ ప్రత్యామ్నాయాలతో ఆ కొరతను భర్తీ చేసుకుంటూ టమాటా లాంటి రుచిని తెప్పించి చూపించ్చొఉ. అందుకు కాస్త తెలివిని ఉపయోగిస్తే చాలు. ఇంతకీ అవేమిటో చూద్దామా!. టమాటాలకు అల్ట్రనేటివ్గా వేటిని ఉపయోగించాలంటే.. ►టమాటా వేయగానే కాస్త పులుపు తీపి మిక్సింగ్‌లతో కూర రుచి అదిరిపోతుంది కదా. దాని ప్లేస్‌లో చింతపండును చక్కగా ఉపయోగించవచ్చు. అది కూడా కూరకు సరిపడగా పులుపు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడితే ఆ కూర రుచి అదర్స్ అనే చెప్పాలి. ►మార్కెట్లో దొరికే టమాటో పేస్ట్‌తో కూడా ఆలోటును సులభంగా భర్తి చేసుకోవచ్చు. తాజా టమాటాలు అందుబాటులో లేనప్పుడూ, కొనలేని స్థితిలో ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఇవి మార్కెట్లో కూడా సరసమైన ధరలోనే అందుబాటులో ఉంటాయి. ►ఇక రెడ్ బెల్ పెప్పర్ కూడా టమాటా మాదిరిగా కూరకు రుచిని ఇవ్వగలదు. పైగా కూర మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ►ఇంకోకటి ఆలివ్‌లు వీటిని ఉడికించి లేదా నేరుగా ఉపయోగించవచ్చు. పండిన ఆలివ్‌లు అయితే టమాటకు బెస్ట్ ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు ►అలాగే ఉసిరి కూడా మంచి పులుపు వగరుతో కూడిని స్వీట్‌ని అందిస్తుంది. దీనిలో ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు దీనిలో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ కారణంగా క్యాన్సర్-నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ చిన్న ఆకుపచ్చ ఉసిరికాయ ఆకుపచ్చ టమాటాలను గుర్తుకు తెచ్చే పుల్లని రుచిని అందిస్తుంది. గృహుణులు ఇలాంటి ప్రత్నామ్నాయ చిట్కాలతో టమాటాకు ప్రత్యామ్నాయంగా వాడటం తోపాటు కుటుంబసభ్యులందరికి ఆరోగ్యకరమైన భోజనం పెట్టినవాళ్లం అవుతాం. సో మహిళలు మేథస్సు మన సోంతం. తెలివిగా ఇలాంటి చిట్కాలతో పెరుగుతున్న ధరలకు చెక్‌పెట్టేలా ఇలా ఇంటిని చక్కబెట్టుకోండి. (చదవండి: మసాల మజ్జిగా ఇలా ట్రై చేస్తే..మైమరిచి తాగేస్తారు) -
వాట్ ఏ క్రియేషన్! కప్పులో దీపాలు!
కప్పులో టీ కామన్.. టీ కప్పులో తుఫాను.. ఒక ఎక్స్ప్రెషన్! టీ కప్పు దీపాలు.. ఇక్కడ విశేషం!! ఇప్పుడు ఇంటి అలంకరణలో ఈ టీ కప్పు దీపాలూ కాంతులీనుతున్నాయి! ఎలాగంటే.. మైనం రంగులు: టీ, కాఫీల్లో ఎన్ని రకాల రుచులు ఉంటాయో.. అన్ని రకాల రంగులు ఉంటాయి. ఆ థీమ్‌తోనే మైనాన్ని తీసుకొని, కొన్ని రంగులను జత కలిపి.. కప్పులో పోస్తున్నారు. వాటిలో వత్తి వేసి, అందంగా ముస్తాబు చేస్తున్నారు. సువాసనల దీపం: మైనం రంగుల ఎంపికలే కాదు.. వీటికి రకరకాల సువాసనలను జోడిస్తున్నారు. దీంతో ముచ్చటైన వెలుగులు.. ఆ వేడికి కరిగిపోతూ వెదజల్లే రోజ్, జాస్మిన్.. ఫ్లోరల్ పరిమాళాలనూ ఆఘ్రాణించవచ్చు. రీ యూజ్: కప్పులు పాత బడిపోయినా, పగుళ్లు బారినా వాటిని పడేస్తుంటాం. అభిరుచికి పదునుపెడితే పాత టీ కప్పులను మైనపు దీపాలుగా మార్చుకోవచ్చు. డిజైన్ బట్టి ధర: పింగాణీ కప్పుల ధర, ఎంపిక చేసుకున్న పరిమళాలు.. వెలుగులను బట్టి వీటి ధరలు వందల రూపాయల నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. ఆన్లైన్ మార్కెట్లోనూ కొనుక్కునే వీలుంది. (చదవండి: ఆత్మవిశ్వాసాన్ని బహుమానంగా గెలుచుకున్నారు) -
వారేవా... వంటల రోబో!
వంట చేయడం కొందరికి ఎంతో హాయి. కొందరికి మాత్రం అయ్ బాబోయ్! ఇలాంటి వారి కోసం వచ్చిందే వంటలు వండే రోబో! నటి, బ్లాగర్ షెహనాజ్ ట్రెజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఏఐ–పవర్డ్ నోష్ రోబోట్ వీడియో వైరల్ అయింది. రోబోట్‌కు షెహనాజ్ ఆర్డర్ ఇవ్వగానే చకచకమని పెస్టో పనీర్ చేసి పెట్టింది. ఈ రోబోట్‌లో ఇన్‌గ్రేడియెంట్స్ యాడ్ చేయడానికి స్లాట్స్ ఉంటాయి. ‘ఏఐ రోబోట్స్ ఇప్పుడు ఇండియన్ కిచెన్లలోకి వచ్చేశాయి’ అని ప్రకటించింది షెషనాజ్. ‘ఈ రోబోట్ చేసే వంట అమ్మ చేసే వంట కంటే బాగుంటుంది’ అనే మాటపై మాత్రం చాలామంది భగ్గుమన్నారు. ‘అవసరమే ఆవిష్కరణకు తల్లిలాంటిది’ అంటారు. ఒక యువకుడు తన ఊరికి దూరంగా వృత్తిరీత్యా బెంగళూరులో ఉన్నప్పుడు అమ్మ చేసే వంటకాలను బాగా మిస్ అయ్యాడు. ఆ లోటు నుంచే ఈ ఏఐ రోబోట్‌ను సృష్టించాడు! -
ఫన్నీ వీడియో: నీ వంట.. నీ మంట.. నీ ఇష్టం..నేను నా బిడ్డ జంప్
-
టీటీకే ప్రెస్టీజ్ ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్ ఎక్స్చేంజీ ఆఫర్
ముంబై: వంటగది ఉపకరణాల తయారీ సంస్థ టీటీకే ప్రెస్టీజ్ ‘ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్’ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రెస్టీజ్ ఉత్పత్తుల ధరపై 24–66% వరకు తగ్గింపుతో ఈ ఆకర్షణీయమైన ఎక్స్చేంజీ ఆఫర్‌ను పొందేందుకు కస్టమర్లు తమ పాత వంట సామాగ్రిని తీసుకొచ్చి వాటిని మార్పిడి చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఈ అద్భుతమైన ఆఫర్ జూన్ 30 వరకు కొనసాగుతుంది. ‘‘మా కస్టమర్లు బ్రాండ్‌కు విధేయులు. ఈ బంపర్ ఆఫర్ ద్వారా వారితో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఆకర్షణీయమైన డీల్స్‌లో అత్యుత్తమ ఉత్పత్తులు అందిస్తున్నాము’’ అని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ గార్గ్ తెలిపారు. -
ఆగ‘మేఘాల’ ఘుమ ఘుమల.. ఓ వంటిల్లు.. వందలాది కస్టమర్లు
సాక్షి, హైదరాబాద్: ఆకర్షణీయమైన పరిసరాలు.. అద్భుతమైన ఆహా్వనం.. అభిరుచికి తగిన ఆహారం.. అతిథి దేవోభవ అనిపించే సేవలు.. భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు రెస్టారెంట్లు పడే తాపత్రయం అంతాఇంతా కాదు. గతంలో హోటల్‌కు వెళ్లి తినడాన్ని జనం అంతగా ఇష్టపడేవారు కాదు. కొందరు అదేదో లగ్జరీగా భావించేవారు. ఇప్పుడు వీకెండ్లో కుటుంబంతో సహా రెస్టారెంట్‌కు వెళ్లడం సాధారణంగా మారిపోయింది. ఆన్లైన్ డెలివరీలు పెరిగిన నేపథ్యంలో.. వారంలో రెండు మూడుసార్లన్నా బయట ఆర్డర్ చేసి తెప్పించుకోవడమూ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ బిజినెస్ లాభదాయకమనే భావన ఉన్నప్పటికీ..ఆశించిన ఆదరణ లభించకపోతే భారీ నష్టాన్ని మూటగట్టుకోవడం మాత్రం ఖాయం. ఈ నేపథ్యంలోనే ఫుడ్ బిజినెస్‌కు సంబంధించి ఓ సరికొత్త ట్రెండ్ మొదలైంది. అదే క్లౌడ్ కిచెన్. దేశ, విదేశాల్లో ఎప్పట్నుంచో ఉన్న ఈ క్లౌడ్ కిచెన్లు ఇప్పుడు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ప్రారంభమవుతూ ఆదరణ పొందుతున్నాయి. ఒక వంటిల్లు.. వందలాది కస్టమర్లు అన్నట్టుగా క్లౌడ్ కిచెన్ల హవా సాగుతోంది. కరోనా సమయంలో ఇవి ఎక్కువగా పుంజుకున్నాయి.మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో పాతిక మించి లేని క్లౌడ్ కిచెన్లు ఇప్పుడు వందల సంఖ్యకు చేరాయి. విలాసవంతమైన రెస్టారెంట్లు..లేదు లేదు అసలు రెస్టారెంట్ అన్న భావనకు ఇది పూర్తిగా భిన్నం. హంగూ ఆర్భాటాలు ఏమీ ఉండవు. రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిలో 1/3 వంతు సరిపోతుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ సిబ్బంది, తక్కువ వ్యయ ప్రయాసలు..స్పష్టంగా చెప్పాలంటే ఒక్క వంటిల్లు మాత్రమే ఉంటుంది. నో డైన్ ఇన్..ఓన్లీ డెలివరీ. కూర్చుని తినడానికి వీలుండదు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సప్లై చేస్తారు..అంతే. క్లిక్ అయితే ఎక్కువ లాభాలు. ఆదరణ లభించకపోయినా అంతంత మాత్రంగానే నష్టం..ఇదే క్లౌడ్ కిచెన్ మూల సూత్రం. షార్ట్ టైమ్.. ఫుల్ పికప్.. జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ యాప్స్ సృష్టించిన ఈ ట్రెండ్ కరోనా విజృంభణ సమయంలో పట్టును దక్కించుకుంది. ఇంటర్నెట్ విస్తృత వ్యాప్తి, వ్యాపారంలో సాంకేతికత, ప్రత్యేక యాప్‌ల పెరుగుదల ఇందుకు దోహదపడింది. పెరుగుతున్న యువ జనాభా ఆదాయం, మారుతున్న జీవనశైలి, సులభమైన.. సురక్షితమైన చెల్లింపు మార్గాలు, వంటింట్లో బిజీబిజీ పరిస్థితి నుంచి కాస్త ఉపశమనం ఇత్యాదివన్నీ కూడా వీటికి ఆదరణ పెరగడానికి కారణాలుగా పేర్కొనవచ్చు. ఇంట్లో వండినట్టుండే ఆహారం నుంచి స్పెషాలిటీ లగ్జరీ డిన్నర్ల వరకు ప్రతిదానిని అందించడం ద్వారా క్లౌడ్ కిచెన్లు ఈ రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తక్కువ రేటుతో, నాణ్యమైన భోజనం, నిమిషాల్లో ఇంటి ముందు ప్రత్యక్షమవుతుండటంతో నానాటికీ వీటికి ఆదరణ పెరుగుతోంది. 2019లో దేశంలో 400 మిలియన్ల డాలర్లుగా ఉన్న క్లౌడ్ కిచెన్ల వ్యాపారం 2024 నాటికి 2 బిలియన్ల డాలర్లకు చేరుతుందని ఎఫ్ అండ్ బీ (ఫుడ్ అండ్ బివరేజెస్) పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తుండటం గమనార్హం. ఒకేచోట 100కు పైగా.. శాకాహార, ఆరోగ్యకరమైన వంటకాలు, ప్రాంతీయ రుచికరమైన వంటకాలు వంటివి అందించే ఆఫ్‌లైన్ రెస్టారెంట్ల సంఖ్య పెరగడాన్ని.. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ క్లౌడ్ కిచెన్ల ఏర్పాటును ఈ ఏడాది చూడవచ్చునని నిపుణులు అంటున్నారు. స్విగ్గీ, జొమాటో వంటివి..క్లౌడ్ కిచెన్లకు ఆధారంగా ఉన్నప్పటికీ, భారీ కమీషన్ల ఫలితంగా, కొన్ని క్లౌడ్ కిచెన్లు తమ సొంత యాప్‌లు, సెల్ఫ్ డెలివరీ ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. నాగచైతన్య వంటి సినిమా తారలను సైతం ఈ క్లౌడ్ కిచెన్స్ ఆకర్షిస్తున్నాయి. నగరంలోని డీఎల్ఎఫ్ ఏరియా లాంటి ఒకేచోట 100కు పైగా క్లౌడ్ కిచెన్లు ఉన్నాయంటే వీటికి లభిస్తున్న ఆదరణను అర్ధం చేసుకోవచ్చు. సినీహీరో నాగచైతన్య ఏర్పాటు చేసిన ‘షోయు’ ఇప్పటికే బాగా ట్రెండింగ్‌లో ఉంది. ట్రెండ్‌ను మేం ముందే ఊహించాం.. పాతికేళ్లుగా మేం మిఠాయిల తయారీలో ఉన్నాం. ఈ ట్రెండ్‌ని ముందే ఊహించి సహదేవ్‌రెడ్డి టిఫిన్స్ పేరుతో క్లౌడ్ కిచెన్ అందరికీ తెలిసే సమయానికే మేం ప్రారంభించాం. సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్, చాట్ వంటివన్నీ డెలివరీ చేస్తాం. మా కిచెన్ దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంది. తెల్లవారుజాము 4 గంటలకే స్టార్ట్ చేసి అర్ధరాత్రి ఒంటిగంట వరకూ నిర్వహిస్తాం. సిటీలోని అన్ని ప్రాంతాల నుంచీ ఆర్డర్స్ వస్తున్నాయి. వ్యయ ప్రయాసల పరంగా చూస్తే ఇది చాలా మంచి వ్యాపారం. గృహిణులు, యువత దీన్ని బాగా అందిపుచ్చుకుంటున్నారు. –పి.అభి షేక్‌రెడ్డి, సహదేవ్‌రెడ్డి టిఫిన్స్ దూకుడు పెరగడం ఖాయం మొదట్లో కొన్ని ఐటమ్స్‌కే పరిమితమైనా ఇప్పుడు రెస్టారెంట్లో దొరికే వెరైటీలన్నీ అందిస్తున్నాయి. బిర్యానీల కోసం ఒకటి, పరోటాల కోసం ఒకటి, బర్గర్స్, పిజ్జాల కోసం, స్వీట్స్, పేస్ట్రీల కోసం.. ఇలా దేనికదే ప్రత్యేక కిచెన్స్ వచ్చేశాయి. అపరిమితమైన కస్టమర్స్ బేస్ అవకాశాల వల్ల వీటి దూకుడు ఇంకా పెరగడం తథ్యం. –సంకల్ప్, హైదరాబాద్ ఫుడీస్ క్లబ్ హైదరాబాద్ టాప్... గత కొంత కాలంగా రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్న మేం లగ్జరీ డైనింగ్‌ను కెఫెల ద్వారా అందిస్తున్నాం. మా బ్రాండ్‌కు ముంబయి, బెంగళూరు, చెన్నై సహా ప్రతిచోటా క్లౌడ్ కిచెన్స్ కూడా ఉన్నాయి. అయితే హైదరాబాద్‌లో మాకు ఆదరణ చాలా స్పీడ్‌గా పెరిగింది. బంజారాహిల్స్, గచ్చిబౌలి , ఎల్బీనగర్... ఇలా 4 చోట్ల మా కిచెన్స్ నిర్వహిస్తున్నాం. –భాను, లూయిస్ బర్గర్స్ -
చేతిలో నుంచి జారి సల సల మరిగే నూనెలో పడ్డ ఫోన్.. తర్వాత ఏమైందంటే?
రెస్టారెంట్ కిచెన్లలో సిబ్బంది మొబైల్ ఫోన్లు వాడకుండా ఆంక్షలు విధిస్తారు యజమానులు. వేడి వాతావరణం, గ్యాస్ లీకైతే పేలుడు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ముందుజాగ్రత్తగా ఫోన్లు తీసుకురావొద్దని చెబుతారు. అయితే ఓ మహిళ మాత్రం ఈ రూల్‌ను పక్కనపెట్టింది. మొబైల్ ఫోన్‌ను రెస్టారెంట్ కిచెన్‌లోకి తీసుకెళ్లింది. ఫ్రై చేస్తున్న సమయంలో ఫోన్లో ఏదో నోటిఫికేషన్ రావడంతో ఆమె దృష్టిమళ్లింది. వెంటనే జేబులోనుంచి ఫోన్ తీసి చూసింది. అయితే అనుకోకుండా ఆ ఫోన్ ఆమె చేతిలోనుంచి జారి సలసల మరిగే నూనెలో పడిపోయింది. దీంతో షాకైన ఆమె వెంటనే పట్టుకారుతో ఆ ఫోన్‌ను నూనెలోనుంచి బయటకు తీసింది. కానీ అప్పటికే అంతా అయిపోయింది. ఆ ఫోన్ దేనికి పనికిరాకుండా పోయింది. ఆ మహిళ ఫేస్‌లో ఎక్స్ప్రెషన్ చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది. Oops pic.twitter.com/acPOyFARHU — cctv ediots 📷 (@cctv_videos) March 2, 2023 ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. ఆ ఫోన్‌ను వెంటనే బియ్యంలో పెట్టారా? అలా చేస్తే పనిచేస్తుంది కదా? అని ఓ నెటిజన్ చలోక్తులు విసిరాడు. మరో యూజర్ స్పందిస్తూ.. ఫోన్ సంగతి సరే.. ఆ నూనెను మార్చాల్సి వస్తుందని వారు బాధపడుతున్నారేమో? సలసల మరిగే నూనెలో సెల్‌ఫోన్ పడితే ఎలాంటి కెమికల్స్ విడుదలవుతాయో ఆ దేవుడికే తెలియాలి అని రాసుకొచ్చాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఫోన్ నూనెలో పడగానే నేనింకా ఆమె చేతితో దాన్ని బయటకు తీస్తుందేమో అనుకున్నా.. అని నవ్వులు పూయించాడు. చదవండి: దారుణ అకృత్యానికి రెడీ అవుతున్న పుతిన్! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్ -
ఇంట్లోనే ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసే అదిరిపోయే గాడ్జెట్స్.. ధర ఎంతంటే?
పర్యావరణానికి అతిపెద్ద బెడద ప్లాస్టిక్ చెత్త. ప్లాస్టిక్ చెత్త సమస్య పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు రకరకాల ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. వాటిలో భాగమే ప్లాస్టిక్ రీసైక్లింగ్. ఇప్పటివరకు ప్లాస్టిక్ రీసైక్లింగ్ భారీగా పారిశ్రామిక స్థాయిలోనే అరకొరగా జరుగుతోంది. అయితే, ఇంటిపట్టునే ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే యంత్రం తాజాగా అందుబాటులోకి వచ్చింది. అమెరికన్ బహుళజాతి సంస్థ ‘క్లియర్డ్రాప్’ ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసే ‘సాఫ్ట్ ప్లాస్టిక్ కాంపాక్టర్’ను రూపొందించింది. వాషింగ్ మెషిన్లా కనిపించే ఈ యంత్రంలో ప్లాస్టిక్ సంచులు వంటి మెత్తని ప్లాస్టిక్ చెత్తను పడేసి, స్విచాన్ చేస్తే, నిమిషాల్లోనే రీసైక్లింగ్‌కు పనికొచ్చే ఇటుకలుగా తయారు చేస్తుంది. ఈ యంత్రం పనిచేసేటప్పుడు ఎలాంటి పొగ వెలువడదని, దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని తయారీదారులు చెబుతున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి రానుంది. ధరను ఇంకా ప్రకటించలేదు. -
బిజీ లైఫ్‌కి బెస్ట్ ఛాయిస్.. ఏ వంటైనా నిమిషాల్లో రెడీ!
బీజీ లైఫ్‌లో వేళకు వంట కావాలన్నా.. వండిన వంటకం రుచికరంగా ఉండాలన్నా.. ఈ మల్టీఫంక్షనల్ డివైజ్‌ని వంటింట్లో పెట్టుకోవాల్సిందే. ఇందులో చాలా వెరైటీలను నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. ఒక వైపు శాండ్విచ్, ఆమ్లెట్స్, వాఫిల్స్, చికెన్ ఫ్రై.. మరోవైపు గుడ్లు ఉడికించుకోవడంతో పాటు తక్కువ మోతాదులో నూడుల్స్, రైస్ ఐటమ్స్, కర్రీస్, సూప్స్ వంటివీ చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగా బౌల్స్, ట్రేస్, గ్రిల్ ప్లేట్స్ ఇలా చాలానే డివైజ్‌తో పాటు లభిస్తాయి. ఇందులో పాలు కూడా కాగబెట్టుకోవచ్చు. స్వీట్స్, కేక్స్ వంటి ఎన్నో వెరైటీలను చేసుకోవచ్చు. ఇంకా ఈ డివైజ్ పింక్, మిల్కీ వైట్ రంగుల్లో కూడా లభిస్తున్నాయి. ఇది చూడటానికి కూడా.. మీ వంటగదికి ప్రత్యేకమైన లుక్‌ని తెచ్చిపెడుతుంది. ఇందులో ఫ్రైడ్ ఎగ్ ఒకే ఒక్క నిమిషంలో, కుడుములు 8 నిమిషాల్లో, శాండ్విచ్ 3 నిమిషాల్లో.. ఇలా ఒక్కో ఐటమ్ చాలా వేగంగా సిద్ధమవుతుంది. చదవండి: ‘ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు భారీ షాక్’ -
అదృష్టం అంటే ఇది.. కిచెన్‌లో బంగారు నాణేలు.. ఊహించని ధరతో షాక్!
అదృష్టం ఆవగింజంత, దురదృష్టం దబ్బకాయంత అనే సామెత తెలిసే ఉంటుంది. అయితే, యూకేలోని ఓ కుటుంబానికి మాత్రం అది వర్తించలేదు. వారికి అదృష్టం కూడా దబ్బకాయంత పట్టుకుంది. పదేళ్లుగా నివాసం ఉంటున్న తమ ఇంటిలో భారీ ఎత్తున బంగారు నాణేలు లభించిన వార్త సెప్టెంబరు నెలలో చదివే ఉంటారు! తాజాగా ఆ వార్త తాలూకు మరో విషయం వైరల్‌గా మారింది. ఇంటి వంటగదిలో మరమ్మతులు చేస్తుండగా క్రీ.శ.1700 ప్రారంభ కాలానికి చెందిన 254 గోల్డ్ కాయిన్స్ బయల్పడిన సంగతి తెలిసిందే. అయితే, వాటిని అమ్మితే సుమారు రూ.2.3 కోట్లు (2,50,000 యూకే పౌండ్లు) రావొచ్చని అంచనావేశారు. కానీ, ఆ అంచనా తప్పయింది. అంతకు మూడింతలు అంటే సుమారు రూ.7 కోట్లు ఆ సంపద ధర పలికిందని లండన్‌కు చెందిన వేలం సంస్థ స్పింక్ అండ్ సన్ ప్రతినిధి గ్రెగరీ ఎడ్మండ్ తెలిపారు. ఫెర్న్లీ-మాయిస్టర్స్ కాలానికి చెందిన నాణేలు కావడంతో అంత విలువ చేకూరిందని తెలిపారు. 292 ఏళ్ల పూర్వ కాలానికి చెందిన ఈ సంపదను చేజిక్కిచ్చుకునేందుకు ప్రపంచంలోని చాలామంది ఔత్సాహికులు పోటీ పడ్డారని ఆయన వెల్లడించారు. ముందుగా అనుకున్నదానికంటే మూడు రెట్లు అధికంగా ధర రావడం ఇంతకుముందెప్పుడూ చూడలేదని అన్నారు. కాగా, పాతకాలానికి చెందిన ఆ బంగారు సంపదను చిన్న మొత్తాల్లో విక్రయించారని మెట్రో నివేదిక పేర్కొంది. (చదవండి: ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి!) -
TIPS: రోజూ వాడే పాలప్యాకెట్లను పడేస్తున్నారా.. ఇలా వాడుకోవచ్చు
పాలు నిల్వచేయడానికి వాడే ప్యాకెట్ గట్టిగా ఉంటుంది. అందువల్ల ప్యాకెట్లన్నింటిని వెడల్పుగా కత్తిరించి శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టాలి. బాగా ఆరిన తరువాత ఒకదానితో ఒకటి కలిపి చిన్న చిన్న బుక్స్‌కు అట్టలుగా, ప్యాకింగ్ కవర్లుగా వాడుకోవచ్చు. దీనివల్ల నోట్‌బుక్స్, ప్యాకింగ్ చేసిన వస్తువులు తడవకుండా ఉంటాయి. ►పాలప్యాకెట్లను గరాటు ఆకారంలో రోల్ చేసి ఊడకుండా టేప్‌తో గట్టిగా అతికించాలి. ఈ గరాటులో ఫుడ్క్రీమ్, మెహిందీ వేసి నచ్చిన విధంగా డిజైన్లు వేసుకోవచ్చు. ∙ఇంట్లో చాలా పాల ప్యాకెట్లు ఉన్నప్పుడు అన్నింటిని కలిపి మ్యాట్లా కుట్టు్టకుని వాడుకోవచ్చు. ►ప్యాకెట్లతో విసనకర్రలా తయారు చేసి వాడుకుంటే చల్లటి గాలి వస్తుంది. ►కుండీల్లో మొక్కలు పెంచే స్థలం లేనప్పుడు పాలప్యాకెట్లలో మొక్కలను పెంచుకోవచ్చు. ప్యాకెట్స్‌లో కొద్దిగా మట్టి పోసి విత్తనాలు వేసి చిన్నచిన్న మొక్కలు పెంచుకోవచ్చు. -
వంటింటి చెత్తను ఎరువుగా మార్చే డస్ట్ బిన్! ధర ఎంతంటే!
చూడటానికి ఇదేదో కొత్తరకం పీపాలా ఉంది కదూ! అటూ ఇటుగా పీపా ఆకారంలోనే ఉన్న చెత్తబుట్ట ఇది. అలాగని సాదాసీదా చెత్తబుట్ట కాదు, హైటెక్ చెత్తబుట్ట. వంటింటి వ్యర్థాలను ఇది గంటల వ్యవధిలోనే ఎరువుగా మార్చేస్తుంది. ఇందులో రెండులీటర్ల పరిమాణం వరకు వంటింటి ఆహార వ్యర్థాలను వేసుకోవచ్చు. దీని వేగాన్ని ఎంపిక చేసుకునేందుకు నాలుగు బటన్లు, లోపల ఎంతమేరకు ఖాళీ ఉందో తెలుసుకోవడానికి వీలుగా ఎల్సీడీ డిస్ప్లే, ట్రాన్స్పరెంట్ మూత ఉంటాయి. స్టాండర్డ్ మోడ్ ఎంచుకుంటే, నాలుగు గంటల్లోనే ఇందులో వేసిన చెత్తంతా ఎరువుగా తయారవుతుంది. హైస్పీడ్ మోడ్ ఎంచుకుంటే, రెండు గంటల్లోనే పని పూర్తవుతుంది. ఫెర్మెంట్ మోడ్ ఎంచుకుంటే, ఎరువు తయారీకి దాదాపు ఆరుగంటల సమయం పడుతుంది. అయితే, ఈ మోడ్ ఎంపిక చేసుకుంటే, విద్యుత్తు తక్కువ ఖర్చవుతుంది. ఇందులో తయారైన ఎరువును పెరటి మొక్కల కోసం వాడుకోవచ్చు. తక్కువ ధరకు బయట ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఈ హైటెక్ చెత్తబుట్ట ఖరీదు 269 డాలర్లు (రూ.21,336). -
సిటీలో ఊపందుకున్న క్లౌడ్ కిచెన్ ట్రెండ్.. నాగచైతన్య, రానా కూడా..
జొమాటో, స్విగ్గీల వంటి ఫుడ్ యాప్‌లకు హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో కస్టమర్ బేస్ ఉంది. సదరు ఖాతాదారులకు నాణ్యమైన రుచికరమైన ఆహార పదార్థాలు కోరుకుంటారు. ఫుడ్ యాప్‌లకు రెస్టారెంట్లుండవు. వారు సిటీలోని పలు రెస్టారెంట్లపై ఆధారపడతారు. ఈ నేపథ్యంలో వారు కోరుకున్న రుచులు శరవేగంగా అందించేందుకు పుట్టుకొచ్చినవే క్లౌడ్ కిచెన్స్. స్పీడ్.. క్లౌడ్.. ∙భోజన ప్రియులను కూర్చోబెట్టి ఆతిథ్యం అందించే రెస్టారెంట్ తరహా వసతులేవీ లేకుండా కేవలం ఆన్లైన్ ఆర్డర్లు తీసుకుని వండి సరఫరా చేసేవే క్లౌడ్ కిచెన్లు. అలా చాలా రెస్టారెంట్లు సరఫరా చేస్తున్నప్పటికీ, ధర, టైమ్, నాణ్యత, రుచి లో కూడా క్లౌడ్ కిచెన్లు మరింత మెరుగ్గా ఉంటున్నాయంటున్నారు సిటిజనులు. నగరంలో డైన్ ఇన్ సేవలు అందించే కొన్ని పేరొందిన రెస్టారెంట్స్ తమ కిచెన్‌కు అనుబంధంగా ఈ తరహా క్లౌడ్ కిచెన్లను నిర్వహిస్తుండగా కొన్ని ఇతర బ్రాండ్లకు అద్దెకు ఇస్తూ ఆదాయం పొందుతున్నాయి. కేవలం 100 గజాల స్థలం ఉంటే చాలు కిచెన్ ఏర్పాటు చేసి నిపుణులను నియమించుకుని బిజినెస్ ప్రారంభించేసే అవకాశం ఉండడం అనేక మందిని ఆకర్షిస్తోంది. జాతీయ స్థాయిలో పేరొందిన రెబల్ ఫుడ్స్ నగరంలో 30కిపైగా కిచెన్స్‌ను నిర్వహిస్తుండగా.. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా ఈ రంగంలో అడుగుపెట్టాడు. ఇక మన టాలీవుడ్ నటుడు నాగచైతన్య షోయు పేరుతో స్విగ్గీపై తన క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాడు. మరో నటుడు రానా సైతం ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాడు. కోవిడ్.. క్లౌడ్ దౌడ్... ∙కోవిడ్ ఉద్ధృతి టైమ్‌లో, ఆ తర్వాత కూడా నగరవాసులు రెస్టారెంట్స్‌లో తినే అలవాటు తగ్గించుకున్నారు. దీంతో డైన్ ఇన్ రెస్టారెంట్స్ బాగా దెబ్బతిన్నాయి. (నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2021లో రెస్టారెంట్ పరిశ్రమ 53 శాతం కుదేలైంది.) ఆ పరిస్థితిలోనే క్లౌడ్ కిచెన్ల ఊపందుకున్నాయి. ∙క్లౌడ్ కిచెన్ల నిర్వహణలో భాగంగా మార్కెటింగ్, డిజిటల్ బ్రాండింగ్‌పై తప్పనిసరి. ఆహారం ఆర్డర్లు మోసుకొచ్చే జొమాటో, స్విగ్గీ వంటి మధ్యవర్తులకు కమీషన్లు చెల్లించాలి. ఇంట్లో వండే అలవాటు తగ్గుతున్న మధ్య తరగతి వల్ల భవిష్యత్తులోనూ ఈ తరహా కిచెన్లు మరిన్ని రావడం తధ్యమని ఆన్లైన్ రెస్టారెంట్ల పరిశ్రమలో అతిపెద్ద సంస్థ రెబల్ ఫుడ్స్‌కి చెందిన కల్లోల్ బెనర్జీ అంటున్నారు. ఒకటే కిచెన్ ఆరు బ్రాండ్స్.. అంతకు ముందు నుంచే ఉన్నప్పటికీ...కోవిడ్ సమయంలో క్లౌడ్ కిచెన్స్‌కు బాగా ఆదరణ పెరిగింది. మేం ప్రస్తుతం 2 బ్రాండ్స్ పేరిట చైనీస్ ఫుడ్, బిర్యానీలు ఆన్లైన్ సప్లయి చేస్తున్నాం గతంలో 6వరకూ అందించిన అనుభవం ఉంది. ఆకట్టుకునే ప్యాకేజీ, అందుబాటు ధర, నాణ్యత మూడూ ఈ బిజినెస్‌లో చాలా ముఖ్యమైనవి. – రుత్విన్ రెడ్డి, దావత్ క్లౌడ్ కిచెన్స్ పెద్ద ప్లేస్ అక్కర్లేదు. వెయిటర్స్, ఫ్రంట్ డెస్క్ స్టాఫ్ అవసరం లేదు. పార్కింగ్ స్పేస్ ఇవ్వక్కర్లేదు. ఏసీలూ, ఫర్నిచరూ.. వగైరాలూ తప్పనిసరి కాదు. పెట్టుబడి కూడా స్వల్పమే. కానీ ఓ పెద్ద రెస్టారెంట్‌కి పోటీ ఇవ్వొచ్చు. అదే రెస్టారెంట్‌కి ఆదాయ వనరుగా కూడా మారొచ్చు. ఊపందుకుంటున్న ఆ వ్యాపారం పేరే క్లౌడ్ కిచెన్. నాగచైతన్య, రానా వంటి సినీ తారలు కూడా ఈ ట్రెండీ బిజినెస్‌కు మేము సైతం అంటున్నారు. చదవండి: అలా జరిగింది.. రూపాయితో 20 వేలు! -
కిచెన్‌లోకి వెళ్లిన భార్య ఒక్కసారిగా భయంతో..
శివమొగ్గ(బెంగళూరు): శివమొగ్గ నగరంలోని చాలుక్య నగర్లో మంజునాథ్ అనే వ్యక్తి ఇంటిలో ఓ నాగుపాము వంట గదిలో దూరింది. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో మంజునాథ్ భార్య వంట చేయడానికి పాత్రలు తీస్తుండగా ఒక్కసారిగా బుసలు కొట్టడంతో ఆమె భయంతో పరుగు తీసింది. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న స్నేక్ కిరణ్ అక్కడికి చేరుకుని పామును పట్టుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మరో ఘటనలో.. బూదిపడగ గ్రామంలో శిలాయుగం నాటి సమాధులు మైసూరు: చామరాజనగర జిల్లా బూదిపడగ గ్రామంలో పురాతన సమాధులు బయటపడ్డాయి. మైసూరు వర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు శాఖ విభాగం సహాయ ప్రాధ్యాపకురాలు వి.శోభ నేతృత్వంలోని అధికారుల బృందం గ్రామ సమీపంలో సుమారు 300 మీటర్ల దూరంలో తవ్వకాలు చేపట్టింది. సుమారు 9 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో ఉన్న కట్టడాలు బయట పడ్డాయి. వీటిని పరిశీలించగా సమాధులుగా గుర్తించారు. ఇవి క్రీ.పూ.1,500 లేదా అంతకంటే ముందునాటివి అయి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. చదవండి: ఎస్ఐ పరీక్షలో అక్రమాలు.. హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు -
క్రాంప్టన్ గ్రీవ్స్ చేతికి బటర్‌ఫ్లై
న్యూఢిల్లీ: బటర్‌ఫ్లై బ్రాండ్‌తో కిచెన్ అప్లయెన్సెస్ విక్రయించే గంధిమతి అప్లయెన్సెస్‌ను ప్రయివేట్ రంగ దిగ్గజం క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ సొంతం చేసుకోనుంది. గంధిమతిలో మెజారిటీ వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా షేరుకి రూ. 1,403 ధరలో 55 శాతం వాటాను చేజిక్కించుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 1,380 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా బటర్‌ఫ్లై వాటాదారులకు షేరుకి రూ. 1,434 ధరలో ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. సెబీ నిబంధనల ప్రకారం 26 శాతం వాటావరకూ కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 667 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. వెరసి గంధిమతి అప్లయెన్సెస్ కొనుగోలుకి రూ. 2,077 కోట్లవరకూ వెచ్చించనుంది. టాప్–3లో ఒకటి..: బటర్‌ఫ్లై బ్రాండుతో గంధిమతి అప్లయెన్సెస్ మిక్సర్ గ్రైండర్లు, టేబుల్ టాప్ వెట్ గ్రైండర్లు, ప్రెజర్ కుకర్లు, ఎల్పీజీ స్టవ్‌లు, నాన్‌స్టిక్ కుక్వేర్, స్టెయిన్లెస్ స్టీల్ వ్యాక్యూమ్ ఫ్లాస్క్‌లు తదితరాలను విక్రయిస్తున్న విషయం విదితమే. ఈ విభాగంలో దేశీయంగా టాప్–3 కంపెనీలలో ఒకటిగా నిలుస్తున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ పేర్కొంది. డీల్ వార్తల నేపథ్యంలో బటర్‌ఫ్లై షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 1,396 వద్ద నిలవగా.. క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు 7.5 శాతం జంప్‌చేసి రూ. 409 వద్ద ముగిసింది. -
అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించిన సీఎం జగన్
-
డబ్బావాలాల కొత్త వ్యాపారం సెంట్రల్ కిచెన్
సాక్షి, ముంబై: కరోనా కారణంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న ముంబై డబ్బావాలాలు ప్రత్యామ్నాయ వేటలో పడ్డారు. అందులో భాగంగా ‘డబ్బావాల సెంట్రల్ కిచెన్’అనే కొత్త పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాలని ముంబై డబ్బావాలాలు నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. కొత్త వ్యాపారం ద్వారా ప్రతీరోజు సుమారు 70 వేల వినియోగదారులకు భోజన సౌకర్యం కల్పించనున్నారు. 130 ఏళ్ల నుంచి లంచ్ బాక్స్‌లు చేరవేత మేనేజ్మెంట్ గురుగా పేరు సంపాదించుకున్న ముంబై డబ్బావాలాలు స్వాతంత్య్రానికి ముందు అంటే సుమారు 130 ఏళ్ల నుంచి ముంబైలోని వివిధ కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు లంచ్‌బాక్స్‌లు చేరవేస్తున్నారు. ఇదివరకు లంచ్ బాక్స్‌లు తారుమారైన సంఘటనలు లేవు. కార్యాలయాల్లో లంచ్ టైమ్‌కు ముందే ఉద్యోగుల చెంతకు లంచ్ బాక్స్‌లు చేరవేసేవారు. క్రమశిక్షణలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కాని కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం 2020 మార్చిలో లాక్డౌన్ అమలు చేసింది. అప్పటి నుంచి ముంబై డబ్బావాలాల వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. చదవండి: (భార్య చనిపోతే.. మరో కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు..) కార్యాలయాలన్నీ మూసివేయడంతో ఉపాధి కరువైంది. అనేక డబ్బావాలాల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. గత్యంతరం లేక కొందరు సెక్యూరిటీ గార్డులుగా మారారు. మరికొందరు మంది స్వగ్రామాలకు తరలిపోయి అక్కడ వ్యవసాయ కూలీలుగా, మరికొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు. అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఎవరు, ఎక్కుడున్నారో తెలియదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఆంక్షలు వి«ధించడంతో ఎవరు, ఎçప్పుడు విధులకు వస్తున్నారో తెలియని ఆయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో డబ్బావాలాలకు ఇప్పటికీ ఉపాధి లేకుండా పోయింది. దీంతో ప్రత్యామ్నాయంగా సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేసి ఉపాధి పొందాలని నిర్ణయం తీసుకున్నారు. -
నయా ఇంగ్లిష్: ఘోస్ట్ కిచెన్ అంటే?
కస్టమర్ల కోసం ఇండోర్ సీటింగ్ ఉండదు. వెయిటర్లు ఉండరు. డైనింగ్ రూమ్ ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఫుడ్ డెలివరీ వోన్లీ తరహా రెస్టారెంట్లను ‘ఘోస్ట్ కిచెన్’ అంటారు. truthiness అంటే? అమెరికన్ టెలివిజన్ కమెడియన్ స్టిఫెన్ కోల్బర్ట్ ఈ టెర్మ్‌ను కాయిన్ చేశాడు. సాక్ష్యాలు, ఆధారాలతో సంబంధం లేకుండా ఒక విషయాన్ని గట్టిగా నమ్మడం... ట్రూతినెస్. sobercurious అంటే? ఆల్కహాల్ ముట్టకుండా ఒక నిర్ణితమైన కాలాన్ని ప్రయోగాత్మకంగా గడపడం. (చదవండి: పూజను 70 లక్షల మంది ఫాలో అవుతున్నారు.. ఎందుకంటే!) హైపర్బొలి అనగా... ఏదైనా విషయాన్ని కాస్త అతిశయంగా చెప్పడమే హైపర్బొలి. భావాన్ని యథాతథం గా తీసుకోవద్దు. కవితల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. ఉదా: అతని కళ్లు కన్నీటి సముద్రాలు అయ్యాయి. convolution అంటే ఒక విషయం కష్టంగా, సంక్లిష్టంగా ఉండడం. ‘మనం సృష్టించకపోతే పదాలు ఎలా పుడతాయి!’ అనేది ఒక పాలసీ. పాత పదాలనే కొత్తగా కాయిన్ చేయడం అనేది మరో పద్ధతి. ‘ఒరిజనల్ సెన్స్ ఆఫ్ ది వర్డ్’కు దగ్గరగా తమాషా పదాలను సృష్టించడమే aptagram -
వంటింట్లో పాలు పొంగిపోతున్నాయా?.. ఈ చిట్కా బాగుందే
How To Stop Milk Boiling Over: సాధారణంగా కొత్త ఇల్లు కొన్నవారు గృహప్రవేశ సమయంలో గిన్నెలో పాలు వేసి వాటిని వేడిచేస్తూ పొంగించంటం చేస్తుంటారు. అయితే అది సంప్రదాయంలో భాగంగా చేస్తుంటారు. కానీ సాధారణ సమయంలో స్టవ్ మీద వేడి చేస్తున్నప్పుడు గిన్నెలోని పాలు పొంగిపోవటం చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది. అయితే గృహిణీలు చాలా మంది స్టవ్ మీద పాలు పెట్టామన్న విషయాన్నే మర్చిపోయి ఇరుగుపొరుగువారితో కబుర్లలో మునిగిపోతారు. కొంత మంది టీవీకే అతుక్కుపోతారు. దీంతో పాలు కిందిపోయి గృహిణీలకు సమస్య మారుతుంది. అయితే తాజాగా పాలు పొంగటాన్ని నియంత్రించే ఓ వంటింటి చిట్కాకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రచయిత, డాక్టర్ నందితా అయ్యార్ తాజాగా ఈ వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు. వీడియోలో పాత్రలోని పాలు పొంగిపోకుండా ఓ చెక్క గరిట నియంత్రిస్తుంది. ‘చెక్క గరిట పాల గిన్నెపై ఉండటం వల్ల పాలు పొంగి కిందపోకుండా ఉంటాయన్న విషయం మీకు తెలుసా?’ అని కామెంట్ చేశారు. పాలు మరిగించినప్పుడు వెలువడే ఆవిరి చెక్క గరిటకు తగలటంతో పాలు మరిగే ఒత్తిడి తగ్గుతుందని ఆమె తెలిపారు. దీంతో పాలు గిన్నె నుంచి పొంగిపోయి కిందకు పడకుండా ఉంటాయనిపేర్కొన్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘ఇంతవరకు ఈ చిట్కా తమకు తెలియదని.. నమ్మలేకపోతున్నాము’ అని ఆశ్చర్యంగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ చిట్కా బాగుంది.. అదేవిధంగా ప్రెజర్ కుక్కర్ విజిల్స్‌ను లెక్కించడానికి కూడా ఎవరైనా ఓ చిట్కా కనిపెట్టాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఈ చిట్కా కొన్నేళ్ల క్రితమే తెలిసి ఉండాల్సింది.. పాలు పొంగిపోయిన ప్రతిసారి మా అమ్మ నాపై గట్టిగా అరిచేది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరి మనం కూడా ఒకసారి ట్రై చేసి ఇది పని చేస్తుందో లేదో చూద్దామా? Did you know keeping a wooden ladle over the milk pan prevents the milk from boiling over? #Cookingtip pic.twitter.com/hDC5mb51iV — Nandita Iyer (@saffrontrail) November 10, 2021 -
కిచెన్‌లో మహిళ నెత్తిన మంటలు.. వీడియో వైరల్
-
షాకింగ్: కిచెన్‌లో మహిళ నెత్తిన మంటలు.. వీడియో వైరల్
కిచెన్‌లో పని చేస్తుండగా పొరపాటున గిన్నెలు, వంటకాలు జారి కింద పడిపోవడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు గ్యాస్ పేలడం వంటి ప్రమాదాలు కూడా జరగవచ్చు. అందుకే వంటగదిలో ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. తాజాగా కిచెన్‌లో వంట చేస్తున్న ఓ మహిళ నెత్తిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ షాకింగ్ ఘటన సెప్టెంబర్ 16 చోటుచేసుకుంది. చదవండి: ‘లంచం ఇస్తే తీసుకోండి.. కానీ’.. వివాదాస్పదంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు వీడియోలో.. ఓ మహిళ వంటగదిలో వంట చేస్తోంది. ఓ వంటకం కోసం కొన్ని పదార్థాలను తీసుకోవడానికి కిందకు వంగి ఓ ప్లేట్ తీసుకుంది. ఆ సమయంలోనే స్టవ్ మంట వద్ద మహిళ జుట్టు తాకడంతో ఆకస్మాత్తుగా ఆమె జుట్టులో మొదట పొగ రావడం కనిపించింది. కానీ దానిని మహిళ గుర్తించలేదు. అప్పుడే కొన్ని వస్తువులు కిందపడదడంతో వాటిని తీసుకొనేందుకు మరోసారి కిందకు వంగారు. అప్పటికీ మంటను గమనించకుండా కిచెన్ అంతా తిరుగుతూ తన పని చేసుకుంటూ పోయారు. చదవండి: అక్కడికి వెళ్తే ఈ స్వీట్ తినడం మాత్రం మర్చిపోకండి.. అద్భుతం.! ఇలా 45 సెకన్ల తరువాత ఆమె తలపై వేడిగా అనిపించడంతో మహిళ జుట్టపై మంటలు అంటుకున్నాయిని గుర్తించారు. వెంటనే ఆమె మంటలను ఆర్పి వేసి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రశాంత్ సాహూ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. వంటగదిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చదవండి: వైరల్: ఇదేం వింత.. ఆ బాలిక ఏడిస్తే కంట్లోంచి రాళ్లు వస్తాయట! -
Viral: అనుకోని అతిథి.. మామూలు నష్టం కాదు
ఏనుగులు మనుషులపై దాడులు చేయడం తరచూ చూస్తుంటాం. మావటి వాళ్లకు, మచ్చిక చేసుకునే వాళ్లకు తప్ప ఎవరీకి అవి లొంగవు. అలాంటిది ఓ అడవి ఏనుగు.. థాయ్‌లాండ్‌లో వింతగా ప్రవర్తిస్తోంది. వాసన పసిగట్టి.. ఇళ్లలోకి దూరి కడుపు నిండా లాంగిచేస్తోంది. ఈమధ్య ఓ ఇంటి వంటగది గోడను బద్ధలు కొట్టి.. వంట గదిలో ఉన్న తిండిని లాగించేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. థాయ్‌లాండ్‌లో చలెర్మ్కియాపట్టణా గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ శబ్దం రావడంతో ఉలిక్కి పడ్డ ఆ ఇంటి యజమాని రాచధవన్.. వంటగదిలో గజరాజు నిర్వాకం చూసి షాక్ తింది. ఆ వెంటనే ఆ ఘటనను వీడియో తీసింది. కిచెన్ గోడను అమాంతం పలగొట్టేసిన ఆ గజరాజు.. తొండాన్ని అక్కడున్న ర్యాకుల్లోకి పోనిచ్చి చిరు తిండ్లను తీసుకుంది. బస్తా బియ్యాన్ని అమాంతం మింగేసింది. ఈ క్రమంలో వస్తవుల్ని నాశనం చేసిందిక ఊడా. ఆ నష్టం లక్ష రూపాయల దాకా ఉందని అధికారులు అంచనా వేశారు. నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆమెకు హామీ ఇచ్చారు. A wild elephant in Thailand bursts its head through a kitchen wall to steal a bag of rice!#animals #wildworld #elephant #viralvideo #shocking #thailand #thailandnews pic.twitter.com/UJwFniXH1W — Newsflare (@Newsflare) June 21, 2021 కాగా, బూన్చుయే అనే ఆ మగ ఏనుగు.. ఇలా వ్యవహరించడం కొత్తేం కాదు. కయెంగ్ క్రాచన్ నేషనల్ పార్క్‌లో ఉండే ఈ ఏనుగు.. తరచూ ఊరి మీదకు వస్తుంటుంది. అయితే అది ఇప్పటిదాకా వయొలెంట్‌గా ప్రవర్తించలేదని పార్క్ నిర్వాహకులు చెప్తున్నారు. సైలెంట్‌గా వెళ్లి తిండిని తీసుకుంటుందని, ఎవరైనా తరిమినా అక్కడే కూర్చుని మారం చేస్తుందని, జనాలు కూడా ఆ ఆసియా ఏనుగు పట్ల సానుభూతితోనే వ్యవహరిస్తారని చెప్తున్నారు. చదవండి: రాక్షసుల కన్నా దారుణంగా వ్యవహరించారు -
మనవరాళ్లతో కలిసి వంట చేసిన మెగాస్టార్
లాక్డౌన్.. అందరికి ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్తా విశ్రాంతి అందించింది. సెలబ్రిటీల నుంచి సాధారణ పౌరుని వరకు ఇంట్లో తమ కుటుంబంతో కొంత సమయం గడిపేందుకు అవకాశం లభించింది. ఖాళీ సమయం దొరకడంతో తమకు నచ్చిన వ్యాపకాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో లాక్డౌన్లో మెగాస్టార్ చిరంజీవి వంటింట్లోకి చేరి తనలోని నలభీముడిని ప్రదర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. నోరూరించే ఉప్మా పెసరెట్టు వేసిన ఆయన అనంతరం మరి కొన్ని వంటకాలను చేసి కుటుంబానికి రుచి చూపించారు. తాజాగా మరోసారి కిచెన్‌లోకి వెళ్లిన మెగాస్టార్ తన మనవరాళ్లతో కలిసి ఓ స్పెషల్ వంటకాన్ని తయారు చేశారు. దాని పేరు ఫేమస్ కేఎఫ్‌సీ చికెన్. చదవండి: నాగబాబు బర్త్‌డేకు చిరంజీవి భావోద్వేగ ట్వీట్ కూతుళ్ల పిల్లలు సంహిత, నివ్రితితో కలిసి కేఎఫ్‌సీ చికెన్ వంటకాన్ని చేసిన చిరంజీవి దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి ‘వంట చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. ముఖ్యంగా పక్కన ఇలాంటి అల్లరి పిల్లలు ఉంటే అది మరింత ఆనందంగా ఉంటుంది. ఇక ఈ వంటకం ఎలా ఉందో చుద్దాం..’ అనే క్యాషన్‌తో షేర్ చేశారు. ఈ వీడియోలో ముందుగా పిల్లలను ఈ రోజు బోర్ కొడుతుంది ఏం చేద్దాం అని అడుగుతారు. దీంతో సంహిత తనకు కేఎఫ్‌సీ చికెన్ తినాలని ఉందని చెప్పింది. దీంతో కోవిడ్ సమయంలో బయట నుంచి తీసుకురావడం అంత సురక్షితం కాదని, ఇంట్లనే తయారు చేద్దాం అంటూ తనకు పిల్లలు ఇద్దరు సహాయం చేయాలని కోరారు. దీనికి వాళ్లు ఒకే చెప్పడంతో మెగాస్టార్ వెంటనే చెఫ్‌గా మారి అద్భుతమైన ఫ్రైడ్ చికెన్ చేసి పెట్టారు. చదవండి: ‘కరోనా’ నేర్పిన పాఠం ఇదే.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చిరంజీవి వంటకాన్ని పొగడ్తలతో ముంచెత్తిస్తున్నారు. అటు యాక్టింగ్‌లోనే కాకుండా ఇటు వంటింట్లోనూ చిరంజీవి మెగాస్టార్ అని ప్రశంసిస్తున్నారు. ‘మా అన్నయ్య వంట చేస్తే నోరూరాల్సిందే’నని కామెంట్ చేస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను చేస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ తెలుగు రీమేక్‌లో నటించనున్నారు. ఈ సినిమాను వివి వినాయక్ తెరకెక్కిస్తున్నారు. -
టీటీడీ వంటశాలలో ప్రమాదం
సాక్షి, తిరుమల : శ్రీవారి ఆలయంలోని వంటశాల(పొటు)లో ప్రమాదం సంభవించింది. చింతపండు రసం తయారు చేసే విద్యుత్ బాయిలర్ పగిలి అందులోని వేడి నీరు ఐదుగురు పోటు కార్మికులపై పడడంతో గాయాల పాలైయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వారిని తిరుమలలోని ఆశ్విని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. గాయపడ్డ కార్మికులను టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి పరామర్షించారు. టీటీడీలో ఇప్పటివరకు ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదని పోటు ఇంచార్జ్ వరద రాజులు అన్నారు. వారం రోజులకు ఓసారి అధికారులు మాస్ క్లీనింగ్ నిర్వహిస్తారని, ప్రమాదవశాత్తే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఎలాంటి ప్రాణహాని జరగకుండా ఆ స్వామివారు కాపాడారని అన్నారు. (ఘనంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ) -
నాలో మంచి కుక్ ఉందని తెలుసుకున్నా!
లాక్‌డౌన్‌తో దొరికిన ఖాళీ సమయం తమన్నాను వంటగదికి దగ్గర చేసింది. తనలో ఓ మంచి కుక్ దాగి ఉందని తమన్నా తెలుసుకునేలా చేసింది. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘లాక్‌డౌన్‌కు ముందు షూటింగ్స్‌తో ఫుల్æబిజీగా ఉండేదాన్ని. మా ఇల్లు నాకు హోటల్లానే అనిపించేది. సినిమాల షూటింగ్స్ మధ్యలో కాస్త విరామం దొరికినా నేను మా ఇంట్లో ఉండేది మూడు రోజులే. అసలు మా ఇంట్లో ఏయే వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో? అవి నాకు ఎంత ఉపయోగపడతాయో? అని కూడా నేనెప్పుడూ ఆలోచించలేదు. ఈ లాక్డౌన్లో అవన్నీ తెలుసుకున్నాను. అవసరానికి మించిన వస్తువులు ఉన్నాయని గ్రహించాను. ఇదివరకు నేను ఎప్పుడూ వంట చేయలేదు. లాక్డౌన్ వల్ల చాలా సమయం దొరకడంతో వంటలు చేశాను. నాలో ఓ మంచి కుక్ ఉందని నాకు తెలిసింది ఈ సమయంలోనే. అయితే నేను వంట స్టార్ట్ చేసిన మొదట్లో కిచెన్ రూమ్‌లో టీ పొడి ఎక్కడుంది? పంచదార ఏ డబ్బాలో ఉంది? అనే విషయాలు తెలియక మొత్తం అల్మరా అంతా వెతికేదాన్ని. ఫస్ట్ టైమ్ వంట చేసినప్పుడు చాలా గందరగోళంగా అనిపించింది. ఆ తర్వాత మెల్లిగా అన్నీ తెలుసుకున్నాను. వంట చేయడం అంటే వంటకాలను రుచిగా చేయడమే కాదు. ఆ వంటలు వండిన పాత్రలను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. వంట రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి’’ అన్నారు తమన్నా. -
ఊరంతా కిచెన్ గార్డెన్
ప్రకృతిని, ఊరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి 84 ఏళ్ల ఓ బామ్మ పలుగూ, పార చేత బట్టింది. వంటిళ్లని పచ్చని కూరగాయలతో నింపడానికి నిత్యం శ్రమిస్తోంది. రకరకాల కూరగాయల నారుపోసి, మొక్కలను పెంచి, వాటిని ఉచితంగా గ్రామ వాసులకు అందిస్తోంది. బామ్మపనికి ముగ్దులైన ఊరి ప్రజలు ‘సూపర్ మామ్మ’ అంటున్నారు. తమిళనాడుకు చెందిన 84 ఏళ్ల నుంజమాల్ ఈ కరోనా టైమ్‌లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందాలని, అది కిచెన్‌లో తయరయ్యే వంటకాల నుంచే వస్తుందని, ఇంటిపంట అలవాటును అందరిలోనూ ప్రోత్సహించడానికి నడుము కట్టింది. రాష్ట్రమంతా కూరగాయల మొక్కలను పంపిణీ చేయాలని ఉందనే ఈ మామ్మ. ‘సొంతంగా కూరగాయలను పండించుకోవడం ద్వారా సేంద్రీయ పద్ధతులను అవలంబిస్తారు. దీనివల్ల పర్యావరణానికీ మేలు కలుగుతుంద’ని చెబుతోంది. ఇప్పుడు నుంజమాల్ అందరిళ్లకు వెళ్లి ఎవరింట్లో ఎన్ని మొక్కలు, ఎలా పెంచుతున్నారు అనే విషయాన్ని స్వయంగా కనుక్కుంటూ తీరికలేకుండా ఉంది. తనే స్వయంగా మొక్కలను నాటి, పాదులు తీసి నీళ్లు పోసి వస్తుంది. ఆమె కృషికి ఏపుగా పెరుగుతున్న కూరగాయల తోటలే నిదర్శనం. ఈ బామ్మ పెరటి తోటలను తయారు చేయడాన్ని మెచ్చుకుంటూ ఒక వార్తాసంస్థ ఆమె ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఆ వెంటనే ఈ బామ్మకు మద్దతుగా రీట్వీట్ల వరద మొదలైంది. -
కిచెన్‌లో బాత్రూమ్: ‘ఓనర్‌ను జైలులో వేయాలి’
సిడ్నీ : ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన శైలిలో ఇంటిని నిర్మించుకోవాలనుకుంటారు. అలాగే ప్రతి గదిని ప్రత్యేకంగా కట్టుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇంటిని వినూత్నంగా నిర్మించాడు. కిచెన్‌లో గోడలు లేకుండా బాత్రూమ్ను నిర్మించుకున్నాడు. ఈ వింత నిర్మాణం ఆస్ట్రేలియాలో జరిగింది. సాధారణంగా సిడ్నీ నగరం ఖరీదైన రియల్ ఎస్టేట్‌కు మారుపేరు. అక్కడ స్థలాన్ని ఆదా చేసేలా భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం ఉంటుంది. కానీ సర్రిహిల్స్లో అపార్ట్మెంట్లో మాత్రం ఇంటిని వినూత్నంగా కట్టించాడు. వంట గదిలో గోడలు లేకుండా గాజు గ్లాస్‌తో బాత్రూమ్ను(టాయిలెట్, షవర్) నిర్మించారు. ఇక వంటగదిని బాత్రూమ్ను కేవలం గాజు గ్లాస్ మాత్రమే వేరుచేస్తుంది. ఇటాలియన్ డిజైనర్ ‘మాడ్రన్ కిచెన్’గా రూపొందించిన ఈ ఫ్లాట్‌ను ప్రస్తుతం అద్దెకు పెట్టారు. ఒకవేళ ఇది ఎవరికైనా నచ్చితే వారానికి దాదాపు రూ.18 వేల చెల్లించి అద్దెకు ఉండొచ్చు. (‘ఆరోగ్య సేతు’ భద్రతా సమస్య.. కేంద్రం క్లారిటీ ) అయితే దీనికి సంబంధించిన ఫోటోను ఓ వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇవి చూసిన నెటిజన్లు ‘టాయిలెట్ ఇన్ ది కిచెన్ లే అవుట్’ భయంకరంగా ఉందంటున్నారు. బాత్రూమ్ ఎవరికైనా వ్యక్తిగత ప్రదేశమని, అయితే కిచెన్‌లో బాత్రూమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని నిర్మించిన వారిని, ఇంటి యాజమానిని జైలులో వేయాలని మండిపడుతున్నారు. కాగా ఈ ఇంటిపై అనేక ప్రతికూల కామెంట్లు వచ్చినప్పటికీ దీనిపై యాజమాని మాట్లాడుతూ.. ఈ ఇంటిపై అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. ఒంటరి వ్యక్తులు, ప్రేమికులు, ఇద్దరు అబ్బాయిలు వంటి వారు అపార్ట్‌మెంట్‌ను అద్దెకు కావాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. (వినూత్నం: గోడలు లేని బాత్రూమ్) -
కిచెన్‌లో బయటపడ్డ విషపూరిత పాము
కాన్బెర్రా: కొన్నిసార్లు మనకు అనుకోని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన మైకేల్ హిల్లియార్డ్ కూడా తనకెదురైన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుని బతుకుజీవుడా అనుకున్నాడు. వివరాల్లోకి వెళితే మైకేల్.. ఎప్పటిలాగే కిచెన్‌లో వంట పూర్తి చేసుకున్నాక పాత్రలు కడిగేద్దాం అనుకున్నాడు. వెంటనే ట్యాప్ ఆన్ చేసి పాత్రలు తోమడం ప్రారంభించగా సింక్‌లో బుసలు కొడుతూ కనిపించిన పాము చూసి షాక్ కొట్టినంత పనైంది. వెంటనే స్నేక్గార్డులకు సమాచారం అందించి పాము కదలికలను మన్ను కొట్టిన పాములా చూస్తుండిపోయాడు. అప్పటివరకు దాని విన్యాసాలను కెమెరాలో బంధించాడు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. (బిడ్డల కోసం రాళ్లు వండుతున్న తల్లి) "దేవుడి దయ వల్ల ఆ పాము నన్నేమీ చేయలేదం"టూ గాఢంగా నిట్టూర్పు విడిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'అంత విషపూరితమైన పాము కిచెన్‌లోకి ఎలా వచ్చిందబ్బా!' అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండగా, 'అది కాటు వేసుంటే మరోసారి వంట చేసేందుకు ఆ పెద్ద మనిషి ఉండేవాడు కాద'ని కామెంట్లు చేస్తున్నారు. అతని కిచెన్‌లో బయటపడ్డ పాము ప్రపంచంలోనే రెండో అత్యంత విషమైన "ఈస్టర్న్ బ్రౌన్ పాము". అది కానీ కాటు వేసిందంటే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఆస్ట్రేలియాలో ప్రతి యేటా ఈ పాము కాటు వల్ల ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. (ఇంట్లో గుట్టలు గుట్టలుగా పాములు ) -
కిచెన్ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్
లాక్డౌన్..నగరవాసిని ఇంటికే పరిమితం చేసింది. దీంతో కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఎప్పుడూ దొరకని ఇంత తీరిక ఇప్పుడు లభించడంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. తమకు ఇష్టమైన పనులు చేస్తూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, సినీ, టీవీ నటులు అందరూ ఇలా లాక్డౌన్ టైంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఆయన మాటల్లో మీరే వినండి. (న్యూ కట్) నేను ఇంట్లో ఏం చేస్తున్నానో తెలిస్తే మీకు మంచి వినోదం అవుతుంది. ఉదయం టిఫిన్ నా భార్య చేస్తుంది. మధ్యాహ్నం కూరగాయలు అన్నీ కట్ చేసి, నేనే వంట చేస్తున్నా. కృష్ణాజిల్లా పాలకూర చేయడంలో నేను స్పెషలిస్ట్.. అందుకే ఎక్కువగా చేస్తున్నాను. ‘వద్దండి.. నాకు బోర్ కొడుతోంది, నేను చేస్తా’ అని మా ఆవిడ అంటున్నా, వినకుండా నేనే చేస్తున్నా. బీరకాయ పాలకూర, టమోటా రోటి పచ్చడి, (టమోటాలు కొనే పని కూడా లేదు.. ఇంట్లోనే చెట్లు ఉన్నాయి.. కోయడం చేయడమే). (లాక్డౌన్: విరుష్కలు ఏం చేస్తున్నారో చూశారా?) ఈ విధంగా వంటిల్లుని నేను స్వాధీనపరచుకున్నా.. ఇప్పుడు యోధుణ్ణి నేను. ‘అదేంటండి? అంటుంది’ మా ఆవిడ. పనీ పాటా లేదు. ఏదో ఒక పని చేయకపోతే తిన్నది అరగదు అన్నాను. ‘అయితే పనిమనిషి రాలేదు.. బయట ఊడవండి’ అంది. నేను ఊడవను అన్నాను. సరే.. కారు కడగండి అంది. నన్ను డామినేట్ చేసి మా అబ్బాయి బాలాజీ అప్పటికే కారు కడిగేస్తున్నాడు.. సో.. నాకు వంట పని ఒక్కటే కనిపించింది.. చేస్తున్నా. చూడండి మగాళ్లలారా. పని లేదు.. పని లేదు అని ఏడవడం కాదు. నీకు వచ్చిన పనిని సిగ్గు లేకుండా, మొహమాట పడకుండా చేయాలి. నా వ్యక్తిగత అనుభూతి ఏంటంటే వంట చేసేటప్పుడు చాలా రిలాక్స్ అయిపోతున్నాను.. ఆ సమయంలో నా ఒత్తిడి అంతా తగ్గిపోతోంది. – రాజేంద్రప్రసాద్ వంటింట్లో అమ్మకు సాయం చేస్తూ... ఈ ఖాళీ సమయంలో వంటింట్లో అమ్మకు సాయం చేస్తున్నా. శనివారం బెండకాయ వేపుడు చేశా. కనీసం ఈ మూడు వారాలైనా తన తల్లికి సహాయ పడాలని ఆమెపై కొంత పనిభారం తప్పించాలనే ఉద్దేశంతోనే వంటలకు శ్రీకారం చుట్టా. అంతేకాదు ఈ రోజు ఇల్లు కూడా శుభ్రం చేశా. మీరంతా కనీసం ఈ 21 రోజులైనా ఇళ్ళల్లో ఉండి తల్లికి ఇంటి పనుల్లో సాయపడండి. – ప్రదీప్, యాంకర్ (కరోనా ఎఫెక్ట్: ‘ఆమె మాట’కే ఇప్పుడు క్రేజ్) -
రెస్టారెంట్ కిచెన్‌లో స్నానం: ‘నీకేమైనా పిచ్చా’!
-
రెస్టారెంట్ కిచెన్‌లో స్నానం: ‘నీకేమైనా పిచ్చా’!
మిచిగాన్: టిక్‌టాక్ పిచ్చి ముదిరి పాకాన పడింది. ఓ రెస్టారెంట్ ఉద్యోగి కోతి చేష్టలతో ఉన్న జాబ్ కూడా పోగొట్టుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని జరిగింది. మిచిగాన్‌లోని వెండీస్ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఉద్యోగి స్నానం చేయడానికి వేరే మార్గమే లేదన్నట్లు సరాసరి కిచెన్‌లో దూరి అక్కడి సింక్‌లో సబ్బు నురగ, నీళ్లు నింపి బాత్‌టబ్‌లా మార్చేశాడు. వెంటనే అందులోకి దిగి స్నానం చేశాడు. ‘ఇది హాట్ టబ్లా అనిపిస్తుంది. దీన్ని నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను’ అంటూ పేర్కొనడంతో అక్కడి వాళ్లంతా ఘొల్లున నవ్వారు. మరో ఉద్యోగి ‘నిన్ను నువ్వు తోముకో’ అంటూ ఓ వస్తువును సింక్‌లోకి విసరడంతో అతను నిజంగానే ఒళ్లు రుద్దుకోవడం ప్రారంభించాడు. (వేయించిన గబ్బిలాన్ని ఆర్డర్ చేసి..) ఇక దీన్నంతటినీ వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్లోడ్ చేయగా అది విపరీతంగా వైరల్ అయింది. మిగతా సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వీడియో ప్రత్యక్షం కాగా, నెటిజన్లు ఉద్యోగి తీరుపై తీవ్రంగా స్పందించారు. ‘ఇది ఎంతో అసహ్యకరం. అందరికీ చెప్పేదేంటంటే, దయచేసి ఎవరూ ఇకపై ఆ రెస్టారెంట్‌కు వెళ్లకండి’ అని ఓ నెటిజన్ సూచించాడు. ‘సింక్ దగ్గరలోనే వంటకు ఉపయోగించే సామాగ్రి ఉంది. ఇది నిజం కాకపోతే బాగుండు’ ‘నీకేమైనా పిచ్చా.. కస్టమర్లకు ఇదేనా నువ్విచ్చే గౌరవం’ అంటూ ఘాటుగా కామెంట్లు చేశారు. ఇక ఈ వీడియోను టిక్‌టాక్ నుంచి తొలగించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతని చేష్టలకు ఆగ్రహించిన యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. (రెస్టారెంట్లో గొడవ.. దుస్తులిప్పి చితకబాదారు) -
బొద్దింకల నుంచి రక్షించుకుందాం!
ఈ లోకంలో దొరికే సమస్త పదార్థాలన్నింటినీ తిని హారాయించుకునే ఏకైక జీవులు బొద్దింకలు. అవి ఎంతకూ అంతరించిపోవట. అందుకే... అణుయుద్ధం సంభవించి జీవజాతులన్నీ అంతరించిపోయినా బొద్దింకలు బతికే ఉంటాయని ఒక అంచనా. అంతేకాదు... బొద్దింక తలను తొలగించినా... అది తొమ్మిది రోజులు బతుకుతుంది. చివరికి మెదడు లేనందకవి మరణించవు గానీ... తల లేకపోవడంతో ఆహారం అందని కారణంగానే అవి చనిపోతాయట. అంతటి పవర్ఫుల్ బొద్దింకలు పెరిగే ప్రధాన ప్రదేశాలు మన వంటిళ్లు. ఈ ప్రపంచంలోని ఏ కిచెన్ కూడా బొద్దింకలకు మినహాయింపు కాదంటే అది అతిశయోక్తి కాదు. ఈ బొద్దింకలనుంచి ఆరోగ్యాలకు వచ్చే ప్రమాదలేవీ వెనువెంటనే రావు. కానీ మన వంటింట్లోని ఆహార పదార్థాలన్నింటినీ అవి కలుషితం చేస్తాయి. ప్రధానంగా రాత్రిపూట మనం వంటింట్లోకి వెళ్లినప్పుడు మనం దాచిన ఆహారపదార్థాలపై అవి స్వైరవిహారం చేస్తూ కనిపిస్తాయి. మళ్లీ పగటిపూట అవి ఎక్కడిదొంగలు అక్కడేలా గప్‌చిప్‌గా ఉండిపోతాయి. క్రితం రాత్రి సైలెంట్‌గా సంచరించిన ఆ బొద్దింకల ప్రభావం కారణంగా మనకు నీళ్ల విరేచనాలు వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. వటితో మనకు వచ్చే మరో అనర్థం ఏమిటంటే... బొద్దింకలు అలర్జీని, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అందువల్ల ఆస్తమా రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వెరసి ఆస్తమా, అలర్జీ రోగులు తమ ఇళ్లలో బొద్దింకల నుంచి వచ్చే ప్రమాదాలను రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మరి బొద్దింకల నుంచి రక్షించుకోవడం ఎలా? బొద్దింకలను తుదముట్టించడానికి మార్కెట్లో దొరికే విషపదార్థాలున్న ద్రావణాలను పిచికారి చేయడం మరింత ప్రమాదం. దాని వల్ల మన కిచెన్‌ను మనమే విషపూరితం చేసుకునే ప్రమాదం ఉంటుంది. ఈ విషాల్లో సంచరించిన బొద్దికలు మళ్లీ మన ఆహారాలపై తిరిగితే అది మరల మనకే హాని చేసే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మనం తినగా మిగలిగిన ఆహార పదార్థాలను మెష్ ఉండే కప్‌బోర్డుల వంటి సురక్షితమైన చోట ఉంచుకోవాలి. ఇక బొద్దింకలు బాగా తేమగా, తడిగా, వెలుగు అంతగా ప్రసరించని చోట పెరుగుతాయి. కాబట్టి ఇంట్లోని ప్రతి ప్రదేశమూ పొడిగా, వెలుతురూ, గాలీ ధారాళంగా వచ్చేలా చూసుకుంటే బొద్దింకలు పెద్దగా పెరగవు. బొద్దింకల సంఖ్య తక్కువగా ఉండేలా చూసుకుంటే వాటితో కలిగే అనర్థాలను సాధ్యమైనంతగా తగ్గించవచ్చు. -
వంటగదిని శుభ్రం చేశారా!
దీపావళి పండగకు ముందుగా ఇళ్లు మొత్తం శుభ్రం చేసుకోనిదే మనసుకు సంతోషం అనిపించదు. అమ్మ, బామ్మ.. ఇంట్లోని ప్రతీ గదిని వరసగా శుభ్రం చేసుకుంటూ దుమ్మ దులపడాన్ని మన చిన్ననాటి రోజుల నుంచి చూస్తున్నదే. శుభ్రం చేసిన తర్వాత కొత్త హంగులతో అలంకారాలతో ఇంటిని ముస్తాబు చేస్తారు. ఇంటి శుభ్రత లేకుండా పండగ పనులేవీ ముందుకు కదలవు. అన్ని గదుల కన్నా వంటగది శుభ్రత కష్టంగా అనిపిస్తుంటుంది. సులువుగా, మరింత శుభ్రంగా వంటగదిని ఎలా ఉంచాలో చూద్దాం... ►బేకింగ్ సోడా, డిష్‌వాషింగ్ సోప్, వేడినీళ్లు, వెనిగర్, కిచెన్‌ను శుభ్రం చేసే టవల్.. ముందు వీటిని సిద్ధం చేసుకోవాలి. వీటితో కిచెన్ జిడ్డును వదిలించడంలో పని సులువు అవుతుంది. ►వంటగదిలో ఎప్పుడూ ఉండే సమస్య క్రిములు. అలాగే చిన్న చిన్న పురుగుల నుంచి బొద్దింకల వరకు అప్పుడప్పుడైనా కనిపిస్తుంటాయి. వీటికి విరుగుడుగా షాపుల్లో పెస్ట్ కంట్రోల్ స్ప్రే లభిస్తుంది. కిచెన్ షెల్ఫ్‌లో వంటసామానంతా పక్కన పెట్టేసి ఆ పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేయాలి. ►వెచ్చని నీటిలో వెనిగర్, డిష్వాషర్ సోప్ కలుపుకోవాలి. సిద్ధంగా ఉంచుకున్న టవల్ని ఆ నీళ్లలో ముంచి, నీళ్లు కారకుండా పిండి దాంతో షెల్ఫ్‌లు, కప్‌బోర్డ్స్ ఉంటే ఆ పై భాగాలను శుభ్రంగా తుడవాలి. దీంతో దుమ్ము, జిడ్డు మరకలన్నీ శుభ్రం అవుతాయి. ►ఆ తర్వాత డబ్బాల్లో మూడు నాలుగు నెలలుగా ఉండిపోయిన దినుసులు ఉంటాయి. ముఖ్యంగా మసాలా దినుసులు.. మరికొన్ని డబ్బాల్లో వాడని, పురుగు పట్టినవి కూడా ఉంటాయి. వాటిని పూర్తిగా తీసేయాలి. ►స్టోర్ నుంచి తెచ్చి, ఇంకా వాడని సరుకుల ప్యాకెట్లపైన ఉన్న తేదీని బట్టి సరిచూసుకొని, షెల్ఫ్‌ల్లో సర్దుకుంటే వాడడమూ సులువు అవుతుంది. ►ఫ్రిజ్‌ను శుభ్రం చేయడం పెద్ద పని. వారానికి ఒకసారి శుభ్రం చేసినా లోపలిభాగంలో కొన్ని పదార్థాల మరకలు అలాగే ఉండిపోతుంటాయి. వెనిగర్ కలిపిన వెచ్చని నీటిలో టవల్‌ను ముంచి ప్రిజ్ లోపలి భాగం అంతా గట్టిగా రుద్దుతూ తుడవాలి. వెనిగర్ లేదంటే నిమ్మరసం కలిపిన నీటితో అయినా తుడిచి, మళ్లీ పొడి టవల్‌తో తుడవాలి. ►ఉన్న వస్తువులన్నింటితో కిచెన్ షెల్ఫ్‌లను నింపేయకుండా అంతగా ఉపయోగించని వస్తువులను పైషెల్ఫ్లో సర్దేయాలి. ఏవి ఎంత వరకు అవసరమో ముందే అవగాహన ఉంటుంది కాబట్టి, ఆ మేరకు మాత్రమే సర్దుకుంటే వంటగది పండగకు శుచిగా, అందంగా కనిపిస్తుంది. -
హైటెక్ కిచెన్
బంజారాహిల్స్: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో అత్యాధునిక సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన మోడ్రన్ కిచెన్‌ను సినీ నటి నమ్రతా శిరోద్కర్ ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కెఎల్.నారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ కిచెన్‌ను పూర్తి ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఇక్కడ సౌకర్యాలపై నమ్రతా శిరోద్కర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్సీసీ ఉపాధ్యక్షుడు ముళ్లపూడి మోహన్, కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ హరిప్రసాద్, కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ, శైలజ, సుష్మ పాల్గొన్నారు. -
కిచెన్‌లో నాగుపాము
సాక్షి, కందుకూరు(రంగారెడ్డి జిల్లా): టీ పెట్టేందుకువంటగదిలోకి వెళ్లిన ఓ మహిళ నాగుపాము బుసలు కొడుతూ కనిపించడంతో హడలిపోయింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని నేదునూరులో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన చిప్ప మనోహర్ భార్య నాగమణి ఆదివారం సాయంత్రం ఇంట్లో టీ పెట్టేందుకు వంటగదిలోకి వెళ్లింది. బుస్బుస్మని శబ్ధం రావడంతో పరీక్షించి చూడగా వంటగది ప్లాట్ఫారం మీద నాగుపాము పడగ విప్పి కనిపించడంతో హడలిపోయింది. దీంతో కుటుంబసభ్యులు వచ్చి పామును ఇంట్లోంచి బయటకు వెళ్లగొట్టేందుకు దాదాపు గంటసేపు కష్టపడాల్సి వచ్చింది. -
దోసేస్తారు!
షూటింగ్‌లు, ప్రమోషన్లు, కొత్త సినిమా స్క్రిప్ట్‌లు వినడం... ఇలా ఆర్టిస్టుల లైఫ్ బిజీ బిజీగా ఉంటుంది. ఎప్పుడో కానీ కాస్త టైమ్ దొరకదు. ఆ టైమ్‌లో ఎవరికి నచ్చిన పని వారు చేస్తూ పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతుంటారు. సోనమ్ కపూర్, శ్రుతీహాసన్ లాంటి హీరోయిన్లు ఖాళీ సమయాల్లో బొమ్మలు వేస్తారు. శ్రియ, దిశా పాట్నీ, పరిణీతి కేటగిరీ వారు సముద్రతీరాలకు వాలిపోతారు. మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం వంటింట్లోకి దూరి గరిటె చేత పట్టుకుని దోశలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ యాప్‌లో షేర్ చేసుకున్నారు. మరి.. దోశ టేస్ట్ ఎలా ఉందనే విషయం మాత్రం ఈ బ్యూటీనే అడగాలి. వెండితెరపై తన అందం, అభినయంతో ప్రేక్షకులు మనసులు దోచేసిన తమన్నా ఇప్పుడు కావాల్సినవాళ్లకు ఇంట్లో దోసెలు వేసి, వారి మనసుని కూడా దోసేస్తున్నారేమో! ఇక సినిమాల విషయానికి వస్తే.. సౌత్‌లో వరుస సినిమాలకు సైన్ చేస్తూ జోష్ మీద ఉన్న ఈ బ్యూటీ ఇటీవల ‘బోలే ఛూడియా’ అనే హిందీ సినిమాకు సైన్ చేశారు. -
చవులూరిస్తున్న ‘తెలంగాణ స్పైసీ కిచెన్’
చిన్నప్పుడు అమ్మమ్మ, నాన్నమ్మ చేసిన వంటకాలు గుర్తొస్తే ఇప్పటికీ నోరూరుతూ ఉంటుంది. మళ్లీఆ రుచుల కోసం నాలుక తహతహలాడుతూ ఉంటుంది. మరి ఆనాటిఆ వంటకాలను రుచి చూడాలంటే పల్లెకు పరుగెత్తాల్సిందే. అలాంటి గ్రామీణ వంటకాలను సిటీ ప్రజలకు అందిస్తుంది‘తెలంగాణ స్పైసీ కిచెన్’రెస్టారెంట్. ఓసారి ఇక్కడికి మనమూ వెళ్లొద్దామా..ఆ రుచులను ఆస్వాదిద్దామా.. హిమాయత్‌నగర్ : కరీంనగర్‌కు చెందిన ‘రోహిత్‌రావు, వికాస్‌రావు, హర్ష, ఉదయ్’లు బంధువులు, స్నేహితులు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రసిద్ధి చెందిన వంటకాలతో నగరంలో రెస్టారెంట్‌ను పెట్టాలనుకున్నారు. ఈ ఏడాది మే 28న జూబ్లిహిల్స్‌లో ‘తెలంగాణ స్పైసీ కిచెన్’ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇక్కడ ముద్దపప్పు, పచ్చి పులుసు ఎంతో రుచికరంగా తయారుచేస్తున్నారు. వీటికోసం టెక్కీలు బారులు తీరడం విశేషం. అలాగే ‘గోలించిన మాంసం, మక్క గారెలు విత్ కంట్రీ చికెన్, దాల్చా మటన్ విత్ బగారా రైస్, పులిహోర విత్ కంట్రీ చికెన్’ వంటకాలను అందిస్తున్నారు. అలాగే కరీంనగర్‌లోనే ప్రత్యేకంగా లభించే ‘చికెన్ ఫ్రైడ్ వింగ్స్’ టేస్టీకి ఫిదా కావాల్సిందే. -
పాఠశాల వంట గదిలో 60 పాములు
-
విష సర్పాల మంద.. వెన్నులో వణుకు!
ముంబై : ఓ స్కూల్ వంట గదిలో విష సర్పాల గుంపు బయటపడటం కలకలం సృష్టించింది. వాటిని చూసిన విద్యార్థులు, వంట మనుషులకు వెన్నులో వణుకు పుట్టింది. ఈ ఘటన మహారాష్ట్ర, హింగోలి జిల్లా, భొకారే గ్రామ ప్రభుత్వ పాఠశాల్లో చోటుచేసుకుంది. ప్రతి రోజులాగే వంట మనిషి గదిలోకి వెళ్లి వంట కోసం కట్టెలు తీయ సాగింది. ఒకటి రెండు కట్టెలు తీసిన తర్వాత ఆమెకు భయంకరమైన పాముల గుంపు కనిపించింది. వెంటనే భయంతో అరుస్తూ బయటకు పరుగెత్తుకొచ్చింది. ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలపగా అతను పాములు పట్టేవారికి సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ విక్కీ దాలడ్ వచ్చి రెండు గంటల పాటు కష్టపడి సుమారు 60 పాములు పట్టుకున్నాడు. దీంతో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ పాములను ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్లు విక్కీ దాలడ్ తెలిపారు. -
భూత వైద్యుడు
ఒక్కసారిగా పెద్దగా అరిచేసింది దుర్గ. ఆ అరుపుకు అదిరిపడ్డాడు అమన్. ‘‘నేను చచ్చాకైనా ఇల్లు మారుస్తావా అమన్?’’ అంది. ‘‘ఈ దెయ్యాల కొంపలో నేనుండలేను’’ అంది దుర్గ.పెద్దగా నవ్వబోయి, ఆగిపోయాడు అమన్. అక్కడ దుర్గ లేదు! కిచెన్‌లో చూశాడు. లేదు! హాల్లో చూశాడు. లేదు! డైనింగ్ రూమ్‌లో చూశాడు. లేదు! పెరట్లోకి వెళ్లి చూశాడు. లేదు! బాత్రూమ్ వైపు చూశాడు. లేదు! ముగ్గేస్తోందేమోనని చూశాడు. లేదు! మేడపైకి వెళ్లి చూశాడు. లేదు!‘‘ఈ దెయ్యాల కొంపలో నేనుండలేను’’ మళ్లీ అంది దుర్గ.‘‘ఎక్కడున్నావ్?!’’ అన్నాడు అమన్, ఆమె చేతిలోంచి కాఫీ కప్పు అందుకుంటూ. వింతగా ఉంది అతడికి. ‘‘బందిత పిలిస్తే వాకిట్లోకి వెళ్లాను..’’ ‘‘వాకిట్లో లేవు మరి!’’‘‘వాకిట్లోంచి వాళ్లింట్లోకి తీసుకెళ్లింది.’’‘‘ఏమంటోంది.. బందిత, తనక్కూడా మనింట్లో దెయ్యం కనిపించిందటనా?’’ నవ్వుతూ అన్నాడు.‘‘బందిత మనింట్లో కాదు కదా ఉండేది! నేనే చెప్పాను మన దెయ్యాల కొంప గురించి.’’‘‘ఏం చెప్పావ్? దెయ్యాలు ఉన్నాయనా?’’‘‘కాదు, మంచి ఇల్లేదైనా ఉంటే చూసి చెప్పమని.’’అమన్ నవ్వాడు. ‘‘ఏమంది బందిత?’’‘‘వెళ్లిపోతారా? అని ఆశ్చర్యంగా అడిగింది.’’‘‘నువ్వేమన్నావ్?’’‘‘పదేళ్లుగా ఉంటున్నాం. ఇక చాలు’’ అన్నాను.పెద్దగా నవ్వాడు అమన్. దుర్గ.. దెయ్యం అన్నప్పుడల్లా.. అమన్ అలాగే నవ్వుతాడు.. పెద్దగా, హార్ట్లీగా.‘‘ధైర్యవంతురాలివే. పేరు మాత్రం దుర్గ’’ అన్నాడు. ‘‘అమన్. నేను సీరియస్‌గా మాట్లాడుతున్నాను. ఇల్లు మారిపోదాం ప్లీజ్’ అంది దుర్గ. ఆమె కళ్లలో తడి!‘‘ఏమైంది.. దుర్గా’’ అన్నాడు. ‘‘ఇల్లు మారిపోదాం అని కదా అన్నాను. కాదు అమన్. పారిపోదాం అనిపిస్తోంది’’ అంది.భార్యవైపు వింతగా చూశాడు అమన్. ‘‘నువ్వు ఆఫీస్‌కి వెళ్లిపోతావు అమన్. పిల్లలు స్కూలుకు వెళ్లిపోతారు. ఇంట్లో నేనొక్కదాన్నీ ఉంటాను. నేనొక్కదాన్నే కాదు. నాతో కొన్ని దె..య్యా..లు కూడా! భయం వేస్తోంది అమన్.. చచ్చిపోతానేమోనని’’ అంది దుర్గ. ‘‘సరే, సీరియస్‌గా వెతుకుతాను. ఒకటి చెప్పు. మనింట్లో నిజంగానే అలాంటివేమైనా కనిపించాయా?’’ అడిగాడు అమన్. ‘‘ఎస్’’ అంది దుర్గ, కళ్లు తుడుచుకుంటూ. భార్య అలా కళ్లు తుడుచుకుంటూ ఇల్లంతా ఒకసారి కలియచూడడం గమనించాడు అమన్. ‘‘సీరియస్‌గా వెతుకుతాను దుర్గా’’ అన్నాడు.అన్నట్లుగానే వెతికాడు. అయితే ఇంటిని కాదు. సైకియాట్రిస్ట్‌ని! పదేళ్లుగా కంఫర్ట్‌గా ఉంటున్న ఇంటిని దెయ్యాల భయంతో ఖాళీ చేసి వెళ్లడం ఏమంత తెలివైన పనిలా అనిపించలేదు అమన్‌కి. దోమలనీ, నీళ్లు సరిగా రావనీ, వర్షాలొస్తే వరండా మునిగిపోతుందనీ, మార్కెట్‌కు దూరమనీ, హాస్పిటళ్లు దగ్గర్లో లేవనీ.. ఇలాంటి ఈతి బాధలు కూడా ఏం లేవు. అద్దెకూడా తక్కువే. అంత మంచి లొకాలిటీనీ, అంత మంచి ఇంటిని వదిలేసి వెళ్లిపోవడం పిచ్చితనం కాకపోతే ఏంటి.. అనుకున్నాడు అమన్. అందుకే సైకియాట్రిస్ట్‌ని కలిశాడు. భూతవైద్యుణ్ణి కలిసి, అతడికి ముందే నాలుగు ముక్కలు చెప్పి ఉంచి, ఇంటినంతా నాలుగు మూలలూ తిప్పించి ‘అసలిది దేవతలు ఉండే ఇల్లు’ అని ఆ భూతవైద్యుడి చేత దుర్గకు చెప్పించవచ్చు. కానీ ఇంట్లోకి భూత వైద్యుడిని రానివ్వడం అమన్‌కి ఇష్టం లేదు. అదీగాక, దుర్గ.. ‘ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోదాం’ అంటోంది తప్ప, ‘ఇంట్లోంచి దెయ్యాలను ఖాళీ చేయిద్దాం’ అనడం లేదు. అందుకే భూత వైద్యుణ్ణి కాక, మానసిక వైద్యుణ్ణి వెతికి పట్టుకున్నాడు అమన్. సైకియాట్రిస్ట్ దగ్గరికి అనగానే ఒక్కసారిగా పెద్దగా అరిచేసింది దుర్గ. ఆ అరుపుకు అదిరిపడ్డాడు అమన్. ‘‘నేను చచ్చాకైనా ఇల్లు మారుస్తావా అమన్?’’ అంది.ఖిన్నుడయ్యాడు అమన్ ఆ మాటకు! చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. దుర్గ కూడా మౌనంగా ఉండిపోయింది. ఆ రాత్రి, ఆ తెల్లారి వాళ్లిద్దరి మధ్యా మాటల్లేకపోవడం పిల్లలు గమనించారు.పిల్లలు స్కూల్‌కి వెళ్లిపోయాక, భర్త ఆఫీస్‌కి బయల్దేరుతుంటే అడిగింది దుర్గ..‘‘డాక్టర్ అపాయింట్మెంట్ ఎన్నింటికి?’’ దుర్గతో చాలాసేపు మాట్లాడాక, ఆమెను బయట వెయిట్ చెయ్యమని చెప్పి, అమన్‌ని లోపలికి పిలిచాడు డాక్టర్ తీర్థ. ఆయన ఎదురుగా కూర్చొన్నాడు అమన్. ‘‘మీ వైఫ్ చెప్పింది నిజమే. మీ ఇంట్లో దెయ్యాలున్నాయి’’ అన్నాడు డాక్టర్ తీర్థ.అమన్ వింతగా చూశాడు. ‘‘ఇంకా మీరు ఆ ఇంట్లో ఉంటే మీ వైఫ్ మీకు దక్కరు’’ అన్నాడు తీర్థ. ‘‘దెయ్యాలు ఆమెను పీక్కుతింటాయనేనా డాక్టర్.. మీరు చెప్పబోతున్నారు?’’‘‘ఎగ్జాట్లీ అమన్. ఆమెకు ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. ‘ఎందుకు ఇష్టం లేదు’ అని నేను ఆమెను అడగలేదు. అలా అడిగితే శాంతిపూజలు చేస్తే సరిపోతుందని చెప్పే భూతవైద్యుడికీ నాకు తేడా ఉండదు. మీరు వెంటనే ఇల్లు మారండి. చింత ఉన్న చోట శాంతి మంత్రం పని చేయదు. పదేళ్ల నుంచీ మీరు ఆ ఇంట్లో ఉంటున్నారు. రెండేళ్ల నుంచీ తను ఇల్లుమారుదాం అంటున్నారు. మీరు నవ్వి ఊరుకుంటున్నారు. నాట్ కరెక్ట్ అమన్’’ అన్నాడు డాక్టర్ తీర్థ. అమన్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ‘‘ఒకే డాక్టర్’’ అని పైకి లేచాడు. మళ్లీ ఒక్క క్షణం ఆగి, ‘‘నిజంగానే మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయంటారా డాక్టర్? మీరు చెప్పండి’’ అన్నాడు. డాక్టర్ తీర్థ అమన్ వైపు చూశాడు. ‘‘లేవు అమన్’’ అన్నాడు. అమన్ అర్థంకానట్లు చూశాడు. ‘‘అవును అమన్. మీ ఇంట్లో దెయ్యాలు లేవు. కానీ మీ వైఫ్‌కి కనిపిస్తున్నాయి. కిచెన్ ఒక దెయ్యంలా, హాల్ ఒక దెయ్యంలా, డైనింగ్ రూమ్ ఒక దెయ్యంలా, పెరడు ఒక దెయ్యంలా, మేడ ఒక దెయ్యంలా, బాత్రూమ్ ఒక దెయ్యంలా.. అసలు మీ ఇల్లే ఓ పెద్ద దెయ్యంలా కనిపిస్తోంది. తనిప్పుడు బంధనవిముక్తి కోసం కొట్టుకుంటున్న ఆత్మలా ఇంట్లో ఉంటోంది. ఏళ్ల తరబడి ఉన్నచోటే ఉండిపోయి, చేసిన పనే చేసుకుంటూ పోతుంటే ఆడవాళ్లెవరికైనా దెయ్యం పట్టినట్లే ఉంటుంది అమన్. మగాళ్లం.. మనకది తెలియదు. రోజూ ఆఫీస్ నుంచి అతిథుల్లా ఇంటికి వచ్చిపోతుంటాం కదా’’.. ముగించాడు డాక్టర్ తీర్థ. అమన్ బయటికి వచ్చాడు. దుర్గ భుజాల చుట్టూ చెయ్యి వేసి చెప్పాడు..‘‘మంచి భూతవైద్యుడే దొరికాడు. నాకు పట్టిన దెయ్యాన్ని వదిలించాడు.’’ -
కిచెన్‌తో పొత్తు
పొలిటికల్ సీన్ వేడెక్కింది. ఎవరితో ఎవరికి పొత్తుంటుందన్నదే హాట్ డిస్కషన్.స్వీట్ టాక్. మీక్కూడా పొత్తుండాలిగా మరి. ఇదిగోండి కిచెన్‌లోకి మొక్కజొన్న తేండి.దానితో పొత్తు పెట్టుకుంది. చిత్తు చేసే రుచులన్నీ జుర్రుకోండి. స్పైస్డ్ సిమ్మర్డ్ కార్న్ రెసిపీ కావలసినవి: ఉడికించిన మొక్కజొన్న గింజలు – అర కేజీ; పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కొత్తిమీర తరుగు – 4 టేబుల్ స్పూన్లు; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; పాలు – 125 మి.లీ.; అల్లం – చిన్న ముక్క; చిలికిన పెరుగు – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – గార్నిషింగ్ కోసం తయారీ: ∙మొక్కజొన్న గింజలను ఉడికించిన నీటిని పక్కన ఉంచాలి ∙మిక్సీలో పచ్చి కొబ్బరి తురుము, పచ్చి మిర్చి, అల్లం, కొత్తిమీర, ఉడికించిన నీరు వేసి మెత్తగా చేయాలి ∙బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి ∙మెత్తగా చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము మిశ్రమం జత చేసి కలపాలి ∙ఉడికించిన మొక్కజొన్న గింజలు, పాలు, పెరుగు జత చేసి సుమారు 10 నిమిషాలు ఉడికించి వేడివేడిగా అందించాలి. కార్న్ పాయసం కావలసినవి: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పులు – 10; కిస్మిస్ – 10; కొబ్బరి తురుము – టేబుల్ స్పూను; మొక్కజొన్న గింజలు – ఒక కప్పు; పాలు – అర లీటరు; పంచదార – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; బాదంపప్పుల పొడి – టేబుల్ స్పూను. తయారీ ∙అర కప్పు మొక్క జొన్న గింజలను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి కరిగాక, జీడిపప్పులు, కిస్మిస్, పచ్చికొబ్బరి తురుము, అర కప్పు మొక్కజొన్న గింజలు వేసి వేయించాలి ∙పాలు, మొక్కజొన్న పేస్ట్ జత చేసి మరిగించాలి ∙మిశ్రమం బాగా చిక్కబడుతుండగా పంచదార జత చేసి మరి కొద్ది సేపు మరిగించాలి ∙చివరగా ఏలకుల పొడి వేసి కలిపి దింపేయాలి ∙బాదం పప్పులతో అలంకరించి అందించాలి. మొక్క జొన్న పులావ్ కావలసినవి: బాస్మతి బియ్యం – పావు కేజీ; మొక్కజొన్న గింజలు – ఒకటిన్నర కప్పులు; నూనె – 2 టేబుల్ స్పూన్లు;ఉల్లి తరుగు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; ధనియాల పొడి – పావు టీ స్పూను; నీళ్లు – 2 కప్పులు; ఉప్పు – తగినంత.గ్రీన్ చట్నీ పేస్ట్ కోసం.. . కొత్తిమీర – పావు కప్పు; పుదీనా ఆకులు – ఒక టేబుల్ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 4 (సన్నగా తురమాలి);పచ్చి కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూనునీళ్లు – మిశ్రమాన్ని ముద్దలా చేయడానికి తగినంత;మసాలా కోసం... బిరియానీ ఆకు – 1; ఏలకులు – 2; లవంగాలు – 2; దాల్చిన చెక్క – చిన్న ముక్క; జాపత్రి – కొద్దిగా; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాలు – 4 తయారీ ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో సుమారు అరగంటసేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ∙గ్రీన్ చట్నీ కోసం చెప్పిన పదార్థాలను మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి. పులావ్ తయారీ ∙కుకర్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడయ్యాక, మసాలా దినుసులు వేసి వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి మెత్తగా చేసిన మసాలా మిశ్రమం జత చేసి, వేయించాలి ∙మొక్క జొన్న గింజలు జత చేసి వేయించాలి ∙పసుపు, మిరప కారం, ధనియాల పొడి వేసి మరోమారు వేయించాలి ∙బియ్యం జత చేసి బాగా కలియబెట్టాలి ∙తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టి మూత పెట్టి, విజిల్ పెట్టాలి ∙మూడు విజిల్స్ రాగానే స్టౌ కట్టేసి దింపేయాలి ∙పులావ్‌ను పెద్ద పాత్రలోకి తీసుకుని, కొత్తిమీరతో అలంకరించి, రైతాతో అందించాలి. హండీ కార్న్ సబ్జీ కావలసినవి :గరం మసాలా కోసం లవంగాలు – 7, మిరియాలు – 8, ఏలకులు – 3, ధనియాలు – ఒక టేబుల్ స్పూను, దాల్చిన చెక్క – చిన్న ముక్క, జీలకర్ర – ఒక టేబుల్ స్పూనుకూరలుక్యాప్సికమ్ – 2కాల్చిన మొక్కజొన్న గింజలు – 2 కప్పులుసబ్జీ కోసంనూనె – 2 టేబుల్‌స్పూన్లు, జీల కర్ర – ఒక టీ స్పూను, మినప్పప్పు – ఒక టీ స్పూను, సెన గ పప్పు – ఒక టీ స్పూను, కరివేపాకు – 5 రెమ్మలు, ఉల్లి తరుగు – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 2, అల్లం తురుము – ఒక టీ స్పూను, కొబ్బరి తురుము – అర కప్పు, పసుపు – ఒక టీ స్పూను, మిరప కారం – ఒక టీ స్పూను, ధనియాల పొడి – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంతచింతపండు పులుసు – 3 టీ స్పూన్లుబెల్లం తురుము – ఒక టీ స్పూనుకొత్తిమీర – కొద్దిగాగరం మసాలా – ఒక టీ స్పూనునిమ్మరసం – కొద్దిగా గరం మసాలా తయారీ ∙బాణలిలో గరం మసాలా కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. సబ్జీ తయారీ:∙బాణలిలో నూనె కాగాక జీలకర్ర, మినప్పప్పు, సెనగ పప్పు వేసి వేయించాలి ∙కరివేపాకు, పచ్చి మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ∙ఉలి తరుగు, అల్లం, వెల్లుల్లి జత చేసి వేయించాలి ∙ఉల్లి పాయలు బంగారు రంగులోకి వచ్చాక, కొబ్బరి తురుము వేసి వేయించాలి ∙పసుపు, మిరప కారం, ధనియాల పొడి, అర టీ స్పూను గరం మసాలా, ఉప్పు, కొద్దిగా నీళ్లు జత చేసి కలియబెట్టాలి ∙చింతపండు రసం, బెల్లం తురుము జత చేసి మరోమారు కలిపి, మొక్కజొన్న గింజలు, గ్రిల్ చేసి క్యాప్సికమ్ తరుగు వేసి బాగా కలిపి, తగినన్ని నీళ్లు జత చేసి, మూత పెట్టి, నీళ్లు ఇగిరిపోయేవరకు ఉడికించాలి ∙ఉడికిన తరవాత దింపి, కొత్తిమీర తరుగుతో అలంకరించి, తయారుచేసి ఉంచుకున్న గరం మసాలా ఒక టీ స్పూను, కొద్దిగా నిమ్మరసం జత చేసి కలిపి అందించాలి. మొక్క జొన్న సమోసా కావలసినవి:మొక్క జొన్న గింజలు – అర కప్పుఉల్లికాడల తరుగు – పావు కప్పుఉల్లి తరుగు – అర కప్పుమిరప కారం – అర టీ స్పూనుఉప్పు – తగినంతమైదా పిండి – ముప్పావు కప్పునూనె – ఒక టీ స్పూను + ఒక టీ స్పూను + డీప్ ఫ్రైకి సరిపడానీళ్లు – తగినంత తయారీ ∙బాణలిలో టీ స్పూను నూనె కాగాక, ఉల్లి తరుగు జత చేసి వేయించాలి ∙మొక్క జొన్న గింజలు జత చేసి కొద్దిసేపు వేయించాలి ∙ఉల్లి కాడల తరుగు వేసి బాగా కలిపాక, ఉప్పు, మిరపకారం వేసి కలిపి దింపి చల్లారబెట్టాలి ∙ఒక పాత్రలో మైదాపిండి, టేబుల్ స్పూను వేడి నూనె, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు జత చేసి చపాతీపిండిలా కలిపి, ఉండలు చేసి చపాతీలా కలపాలి ∙మధ్యకు కట్ చేసి ఒక్కో భాగాన్ని సమోసాలాగ చుట్టాలి ∙తయారుచేసి ఉంచుకున్న మిశ్రమం టీస్పూన మిశ్రమాన్ని సమోసాలు ఉంచి అంచులు తడి చేసి మూసేయాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙బాణలిలో నూనె కాగాక సమోసాలు అందులో వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙టొమాటో సాస్‌తో అందించాలి. గుమ్మడికాయ బెల్లం రోటి పచ్చడి కావలసినవి:గుమ్మడికాయ – పావు కేజీచింతపండు – నిమ్మకాయంతపసుపు – చిటికెడుబెల్లం – 2 టీ స్పూన్లుఉప్పు – తగినంతపేస్టు కోసంపచ్చి కొబ్బరి తురుము – అర కప్పుపచ్చి మిర్చి – 2పోపు కోసం నూనె – 1 టీ స్పూనుఆవాలు – అర టీ స్పూనుమెంతులు – పావు టీ స్పూనుఎండు మిర్చి – 1 కరివేపాకు – 4 రెబ్బలు తయారీ ∙చింతపండు గుజ్జు తీయాలి ∙గుమ్మడికాయను తొక్క తీసి అర అంగుళం ముక్కలుగా తరగాలి ∙అర కప్పు నీటిలో చింతపండు గుజ్జు, గుమ్మడి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి ∙కొబ్బరి తురుము, పచ్చి మిర్చి మెత్తగా నూరి, గుమ్మడి ముక్కల్లో వేయాలి ∙బెల్లం పొడి కలిపి దింపేయాలి ∙చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి కరివేపాకు వేసి వేయించి, పచ్చడికి జత చేయాలి ∙ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. రోటి పచ్చడి పొటాటో – కార్న్ సూప్ కావలసినవి :బంగాళ దుంపలు – 6 (తొక్క తీసి ముక్కలు చేయాలి)కొత్తిమీర ఆకులు – ఒక కప్పుఉల్లి తరుగు – పావు కప్పుమొక్క జొన్న గింజలు – రెండు కప్పులుఉల్లి కాడల తరుగు – పావు కప్పుఉప్పు – తగినంత తయారీ ∙ఒకపెద్ద పాత్రలో బంగాళ దుంప ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు, తగినన్ని నీళ్లు జత చేసి మూత పెట్టి ఉడికించాలి. ∙మొక్కజొన్న గింజలు జత చేసి పదార్థాలన్నీ మెత్తగా అయ్యేవరకు సుమారు పది నిమిషాలు ఉడికించాలి. ∙ఉల్లికాడలు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి దింపేసి, వడగట్టి అందించాలి. మొక్కజొన్న భారతదేశపు ప్రాచీన ఇతిహాసంలో ప్రస్తావించబడిన ఆహార ధాన్యాలైన వరి, గోధుమ, బార్లీ (యవలు) వంటి వర్ణనలలో ‘మొక్కజొన్న పొత్తు’ ప్రస్తావన కానరాదు. ఇది సుమారు 16, 17వ శతాబ్ద కాలంలో విదేశాల నుంచి వలసవచ్చిన ఆహార ధాన్యం మాత్రమే. దీనినే మెయిజ్ () లేదా కార్న్ () అని ఆంగ్లంలో అంటారు. ఇటీవల స్వీట్ (షుగర్) కార్న్ కూడా మనకు విరివిగా లభ్యమౌతోంది. సాధారణ మొక్కజొన్న పొత్తు (కండె) కన్నా ఎక్కువ తీయదనం కల్గి రసప్రధానంగా ఉంటుంది కనుక దీనిని స్వీట్‌కార్న్ అంటారు. పోషక విలువలు: ఆధునిక జీవ రసాయన పరిభాషలో చెప్పాలంటే దీనిలో పీచు పదార్థం (ఫైబర్) పుష్కలంగా లభిస్తుంది. ఎ, బి, సి విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. యాంటి ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. శర్కర, పిండి పదార్థాలు ఎక్కువగా కలిగివుండడం వల్ల మధుమేహ రోగులు వీటిని అధిక ప్రమాణంలో కాకుండా తక్కువగా తినవలసి ఉంటుంది. ఖనిజ లవణాలైన ఫాస్ఫరస్, మేంగనీస్, మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్ తగురీతిలో లభిస్తాయి. పొటాషియం, కాల్షియం బాగా తక్కువగా ఉంటాయి. స్టార్చ్ కూడా అధికంగా ఉంటుంది. నీరు శాతం కూడా అధికమే. ఆరోగ్య ప్రయోజనాలు: తగు ప్రమాణంలో కొంతకాలం తింటే నీరసం తగ్గి, బరువు పెరుగుతారు. కంటిచూపుకి చాలా ఉపయోగకరం. కడుపులోని వాయువులను తొలగించి సుఖవిరేచనం చేస్తుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. ఎలా తినాలి: పొత్తుని పైరేకలు తొలగించి నిప్పుమీద కాల్చి, కొంచెం చల్లారిన తర్వాత నమిలితింటే ఆరోగ్యానికి చాలా మంచిది.ఎండలో ఎండబెట్టి పొడిబారిన తర్వాత ‘పిండి’గా మలచుకొని రొట్టెలు తయారుచేసుకొని తినే అలవాటు ఉత్తర భారతదేశంలో ఉంది. ఆ పిండిని వంటలలో కూడా వాడుతుంటారు.ఆకర్షణీయమైన ‘పాప్‌కార్న్’లోని లోపాలు:వాస్తవానికి వరిధాన్యం నుండి ఒక పద్ధతి ప్రకారం పేలాలను తయారుచేస్తారు. వేడిచేసినప్పుడు ధాన్యం పగిలి, పేలటం ద్వారా వచ్చే పదార్థం కనుక ‘పేలాలు’ అన్నారు. ‘పాప్’కి కూడా వికసించి బయటకు వస్తుంది అని అర్థం. ఎక్కువ కేలరీలు గల నూనెలను వాడి ఈ పాప్‌కార్న్ తయారుచేస్తారు. ఉప్పు, ఇతర మసాలాలను అధికంగా కలిపి రుచిని పెంచుతారు. ఇక సరే, శీతల పానీయాలను తాగుతూ ఇవి తినడం ఒక రివాజు. ఇవన్నీ శరీరానికి హానికరమని మరిచిపోకూడదు. ఇలా తినడం వల్ల వాటి ప్రయోజనాలకన్నా అనర్థాలే అధికమని గమనించుకోవాలి.నీటి ఆవిరితో ఉడికించి తిన్నా మంచిదే.నానబెట్టడం, మొలకలు తయారుచేయడం, పులియబెట్టడం వంటి ప్రక్రియలను అరుదుగా పాటిస్తారు. వీటివల్ల దీనిలో ఉండే ‘ఫైటేట్సు’ యొక్క దుర్గుణాలు తగ్గిపోతాయి. వీటి నుంచి ఆయిల్స్, సిరప్స్ కూడా చేస్తారు. వాటికి దూరంగా ఉంటేనే మేలు. ఆయుర్వేదం: ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో దీని ప్రస్తావనే లేదు కానీ, ఇటీవల 16, 17 శతాబ్దపు ఆయుర్వేద వైద్యుడైన యోగరత్నాకరుడు దీనిని ‘యుగంధరః’ అని ప్రస్తావించి శరీరానికి చాలా మేలు చేస్తుందని, మంచి పథ్యపు ఆహారంగా పనికొస్తుందని, తీపి కల్గి ధాతు పుష్ఠికరమని, త్రిదోష (వాత, పిత, కఫ)హరని, వక్కాణించాడు.‘‘యుగంధరః త్రిదోషఘ్నః స్వాదుః పథ్యో రసాయనః’’అని యోగరత్నాకర గ్రంథంలో ఉంది. ఔషధ గుణాలు: దీనిపై గల రేకలలో మీసాల వంటి సన్నని మృదువైన ‘కేసరాలు’ ఉంటాయి. దీని కషాయం తాగితే ‘ప్రొస్టేటు’ గ్రంథి యొక్క వాపు తగ్గుతుందని ఇటీవలికాలంలో చేసిన పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే కిడ్నీలోనూ, గాల్ బ్లాడరు (పిత్తాశయం)లోనూ గల రాళ్లు కరిగి బయటకు వచ్చేస్తాయి. దీనిలో ఉంటే క్షారగుణం (ఆల్కలైన్ గుణం) ఈవిధంగా ఉపకరిస్తుందని అన్వయించారు. గుర్తుంచుకోవలసిన సారాంశం:‘బక్కచిక్కినోడ మొక్కజొన్న తినుముధాతు పుష్టి కలిగి తనువు మెరయుపాపుకార్ను మనకు వలదంచు గుర్తించిపొత్తు కాల్చి తినుగ పుష్టి కలుగు’ వంటింటి చిట్కాలు బియ్యం, తృణధాన్యాలను నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి రేకలు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి. పదార్థాలు మాడిపోయి పెనం నల్లగా మారితే, దాని మీద సబ్బు నీళ్లు పోసి సన్నటి సెగ మీద ఉంచి, చల్లారాక రుద్దితే శుభ్రపడుతుంది. రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దితే కొత్తవాటిలా మెరిసిపోతాయి. పచ్చి బఠాణీలు ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి. చపాతీలు ఒత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనె వేసి మడతలుగా చేసి కాల్చి, హాట్ ప్యాక్‌లో ఉంచితే ఆరేడు గంటలపాటు మెత్తగా ఉంటాయి. చపాతీ పిండిలో ఉడికిన బంగాళదుంపను వేసి బాగా కలిపి, ఆ పిండితో చపాతీలు చేస్తే, చపాతీలు ఎక్కువసేపు మృదువుగా ఉంటాయి. పరగడుపున ఉసిరికాయ, భోజనం చేశాక అరటిపండు, సాయంత్రం వెలగపండు తింటే అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. పెరుగు పచ్చడి మరింత రుచిగా రావాలంటే, పోపులో టీ స్పూను నెయ్యి కలిపితే సరి. గులాబ్‌జామ్ తయారుచేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పనీర్ జత చేస్తే, మృదువుగా రుచిగా ఉంటాయి. దోసెల పిండి బాగా పులిస్తే, అందులో రెండు టీ స్పూన్ల గోధుమపిండిని కలిపితే రుచిగా వస్తాయి. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail: familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. -
కిచెన్ బయోగ్యాస్
గచ్చిబౌలి: కిచెన్ నుంచి నిత్యం వచ్చే వేస్ట్‌ను వృథాగా పడేయకండి. ఆ వ్యర్థాలతో ఎంచక్కా గ్యాస్ ఉత్పత్తి చేసుకోండి. పోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌తో ఇట్టే వండుకోండి. మిషన్ నుంచి వెలువడే ద్రవ పదార్థాన్ని మొక్కల ఎరువుగా వాడుకోండి. కిచెన్ వ్యర్థాలు బయట పడేసేందుకు ఇక స్వస్తి పలకండి. జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్ అధికారులు బయోగ్యాస్ మిషన్‌లో కిచెన్ వ్యర్థాలు వేసి గ్యాస్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని చెబుతున్నారు. ఎవరికి వారు కిచెన్‌లో ఫోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌ను అమర్చుకోవచ్చు. ఇప్పటికే చందానగర్ సర్కిల్లో పోర్టబుల్ బయోగ్యాస్‌పై డెమో నిర్వహించారు. ప్రయోజనాలెన్నో.. బహుళ ప్రయోజనాలు కల్గిన పోర్టబుల్ బయో గ్యాస్‌ను జీహెచ్ఎంసీలో అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల క్రితం సన్‌గ్రీన్ ఆర్గానిక్ వ్యవస్థాపకురాలు అరుణా శేఖర్ చందానగర్ సర్కిల్–20లో పోర్టబుల్ బయో గ్యాస్‌పై అవగాహన కల్పించారు. దీనిపై వేస్ట్ 500 గ్రాముల తడి చెత్త నుంచి 100 కిలోల తడి చెత్త వెలువడే మిషన్లను అమర్చుకోచ్చు. ఇలా పని చేస్తుంది.. పోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌ను కిచెన్ బాల్కనీలో పెట్టి పైపును కిచెన్‌లో ఉంచుతారు. మిషన్‌తో పాటు స్టౌ కూడా ఉంటుంది. మిషన్ వెంట వచ్చిన బయో కల్చర్‌తో పాటు ఆవు పేడను గుజ్జుగా కలిపి డబ్బాలో వేస్తారు. ఆ తర్వాత మిగిలిపోయిన అన్నం, పండ్లు, కూరగాయల తొక్కలు, సాంబారు, బియ్యం కడిగిన నీళ్లు, మిగిలిపోయిన బోన్ లెస్ మాంసం ముక్కలను అందులో వేయాలి. 24 గంటల అనంతరం గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. మిషన్‌కు మూత ఉండటంతో ఎలాంటి దుర్వాసన రాదు. నిత్యం వాడితే కొద్దిమొత్తంలో వేస్టేజ్ బయటకు వస్తుంది. దానిని పూలు, కూరగాయలు, చెట్లకు ఎరువుగా వాడవచ్చు. 2 కిలోల తడి చెత్త సామర్థ్యం కలిగిన ఫోర్టబుల్ బయో గ్యాస్ మిషన్ విలువ రూ.40,000 ఉంటుంది. రెండు కిలోల చెత్తతో రోజు అర గంట నుంచి గంట సేపు గ్యాస్‌ను ఉపయోగించుకోవచ్చు. కాఫీ, టీతో పాటు ఇతర వంటలు చేసుకునే వీలుంది. ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం.. పోర్టబుల్ బయోగ్యాస్‌ను ఉపయోగించడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తోంది. కేరళలో ఈ గ్యాస్ ఎంతో సక్సెస్ సాధించింది. తడి చెత్తతో గ్యాస్ ఉత్పత్తితో పాటు ఎరువు వస్తోంది. పోర్టబుల్ బయోగ్యాస్‌పై ఇప్పటికి వెయ్యికిపైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. గృహాలు, స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా బయోగ్యాస్‌ను ఉపయోగించాలని ప్రజలను చైతన్యం చేస్తున్నాం. – అరుణా శేఖర్, సన్‌గ్రీన్ ఆర్గానిక్ ఫౌండర్ నా కార్యాలయం నుంచే మొదలు.. పోర్టబుల్ బయోగ్యాస్‌ను ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఎక్కడా ఉపయోగించలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ గ్యాస్‌పై అవగాహన కల్పిస్తున్నాం. రెండు రోజుల్లో పోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌ను శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ కార్యాలయంలో అమర్చనున్నారు. ఉద్యోగుల లంచ్‌లో వచ్చే వ్యర్థాలతో బయోగ్యాస్‌ను ఉపయోగించుకొని టీ, కాఫీ చేసుకోనున్నాం. ఇప్పటికే చందానగర్‌లో నిర్వహించిన డెమో ద్వారా పోర్టబుల్ బయోగ్యాస్ మిషన్ బాగా పనిచేస్తుందనే నమ్మకం కలిగింది. – హరిచందన, వెస్ట్ జోనల్ కమిషనర్ -
ఖాళీ దొరికితే ...
రీసెంట్గా ‘హ్యాపీ ఫిర్ బాగ్ జాయేగీ’ సినిమా కోసం మినీ ట్రక్ స్టీరింగ్ తిప్పిన బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇప్పుడు కిచెన్‌లోకి వెళ్లి గరిటె తిప్పారు. ఎగ్ కర్రీ వండారు సోనాక్షి. ఇప్పుడైతే ఈ వంటకం చేశారు కానీ గతంలో ఏదో స్వీట్ ఐటమ్ ట్రై చేశారట. ఖాళీ దొరికినప్పుడల్లా డిఫరెంట్ వంటకాలను ట్రై చేయడం సోనాక్షి అలవాటు. ఇక... సోనాక్షి చేస్తున్న ‘హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ’ సినిమా విషయానికొస్తే... రెండేళ్ల క్రితం వచ్చిన ‘హ్యాపీ భాగ్ జాయేగీ’ సినిమాకి సీక్వెల్ ఇది. ఇందులో సోనాక్షి సిన్హా, డయానా పెంటీ, జిమ్మీ షెర్గిల్, అలీ ఫజల్, అభయ్ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
‘స్వీట్’ కార్ఖానా..హైటెక్ జమానా
అందులోకి అడుగు పెట్గగానే హెడ్ క్యాప్ ఇస్తారు. కాళ్లకు ప్లాస్టిక్ కవర్ తప్పనిసరి. తర్వాత మీరు ఎయిర్ ఫిల్టర్లు అమర్చి ఉన్న ద్వారం.. దానికి ఉన్న అత్యంత మందమైన ప్లాస్టిక్తెరలను కాసింత బలంగానేచీల్చుకుంటూ లోపలికి అడుగుపెట్టాలి. ఇదంతా చూస్తే అదేదో రీసెర్చ్ సైన్స్ ల్యాబ్ ఏమో అనిపిస్తుంది కదా. కానీ కాదు.. నగరంలోని ఓ మిఠాయి దుకాణం కిచెన్. రుచులతో మాత్రమే కాదు.. అత్యాధునిక కిచెన్తోనూ నగరవాసుల్ని ఆకట్టుకుంటున్నాయి మిఠాయి షాప్స్. కళ్లారా చూసి నమ్మండి అంటూ వినియోగదారులనుకూడా ఆహ్వానిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో :చవులూరించే స్వీట్లు, హాట్లు సరే. మిరుమిట్లు గొలిపే లైట్లు, ఫ్యాన్సీ ఇంటీరియర్స్, ఎయిర్ కండిషనింగ్, యాంబియన్స్.. ఇవీ సరే. ‘వీటన్నింటికన్నా ఆ మిఠాయిలు ఎలా? ఎక్కడ? ఏ విధంగా తయారవుతున్నాయి? అనేదే వినియోగదారులకు అత్యంత ప్రధానమైన విషయం’ అంటారు కూకట్‌పల్లిలోని ఆల్మండ్ హౌస్ నిర్వాహకులు చైతన్య. నగరంలో ఆరు స్వీట్‌షాప్స్ నిర్వహిస్తున్న ఆల్మండ్ హౌస్... 4ఫ్లోర్లలో దాదాపు 20వేల చదరపు అడుగుల్లో విస్తరించిన తమ కిచెన్‌ను అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దింది. స్టోర్‌లో అలంకరణతో పాటు కిచెన్‌లో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నగరంలో ఇంతవరకూ ఏ స్వీట్ షాప్‌కు లేని హజార్డ్ అనాలసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ (హెచ్ఏసీసీపీ) సర్టిఫికేషన్ సాధించే దిశగా పయనిస్తోంది. అత్యాధునికం.. అత్యంత పరిశుభ్రం ప్రత్యేక ప్యాకింగ్ గదులు, ఎయిర్ కండిషన్డ్ ఫినిషింగ్‌లతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో వంటశాలను తీర్చిదిద్దుతుండడం విశేషం. అందులో భాగంగా తయారీ విభాగంలోకి సరఫరా అయ్యే గాలిని సైతం శుద్ధి పరచడం, హ్యుమిడిటీ నియంత్రణ, యూవీ లైట్‌తో స్టెరిలైజ్ అయిన ఫ్రెష్ ఎయిర్... లాంటి ఎన్నో ప్రత్యేక విధానాలు ఇక్కడ కనిపిస్తాయి. గాలి నాణ్యతతో పాటు సూక్ష్మజీవుల పరిమాణాన్ని వారానికోసారి పరిశీలిస్తారు. తయారీదారులు, ఉత్పత్తులను హ్యాండిల్ చేసే సిబ్బంది ఆరోగ్య పరిస్థితులను మూడు నెలలకు ఒకసారి చెక్ చేస్తారు. ఎనీటైమ్.. తనిఖీ చేసుకోండి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు చేస్తున్నారంటేనే నగరంలోని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ సైతం వీలున్నంత వరకు తప్పించుకోవాలని చూస్తాయి. అలాంటిది.. సామాన్య ప్రజలు కూడా తమ కిచెన్‌ను తనిఖీ చేసుకోవచ్చునని ఆఫరిస్తున్నాయి ఆల్మండ్ హౌస్ లాంటి స్వీట్ షాప్స్. ‘కొనుగోలుదారుడిని కేవలం వ్యాపార లావాదేవీల వరకే పరిమితం చేయడం మా ఉద్దేశం కాదు. నిజానికి కిచెన్‌ను చెక్ చేసుకోవడమనేది వినియోగదారుడి హక్కు అని మేం భావిస్తాం. అందుకే మా కిచెన్‌ను మా కస్టమర్స్ ఎవరైనా ఎప్పుడైనా సరే తనిఖీ చేసేందుకు ఓపెన్‌గా ఉంచుతాం’ అంటున్నారీ స్టోర్ నిర్వాహకులు. అంతేకాదు.. నగరవాసులు చిన్న చిన్న బృందాలు, సమూహాలుగా ఈ కిచెన్‌ను సందర్శించాలనుకుంటే తాము స్వాగతిస్తామని చెప్పారు. విద్యాసంస్థలు సైతం తమ విద్యార్థులకు టూర్స్ నిర్వహించదలిస్తే సహకరిస్తామంటూ కొత్త ట్రెండ్‌కు తెరదీశారు. -
తప్పిన పెను ప్రమాదం
గంట్యాడ: పాఠశాల వంటగదిలో గ్యాస్ సిలెండర్ పేలిన ఘటనలో భవనం కుప్పకూలింది. సంఘటన సమయంలో పరిసర ప్రాంతంలో జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే...మండలంలోని రామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పాఠశాల నుంచి ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. పేలుడు శబ్ధానికి పరిసర నివాసితులు ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. పాఠశాల వంటగది నుంచి పొగలు రావడంతో అక్కడకు చేరుకున్నారు. భవనంలో నుంచి మంటలు రావడంతో స్కూల్ కమిటీ చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సమాచారం ఇచ్చారు. హెచ్ఎం ఎంఈఓకు సమాచారం ఇవ్వగా ఆమె 101 ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చి వారిని అప్రమత్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసిం ది. ప్రమాదంలో భవనం పూర్తిగా కూలి పోయింది. పాఠశాలకు ఒంటి పూట బడులు కావడం, సాయంత్రం ప్రమాదం జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్ర మాద వివరాలను ఉన్నతాధికారులకు తె లియజేస్తామని ఎంఈఓ జి.విజయలక్ష్మి తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలి యరాలేదు. ప్రమాదంలో గుడ్లు, వంట సామగ్రి, వంటపాత్రలు ధ్వంసమయ్యా యి. సిలెండర్ తునాతునకలైంది. విజయనగరం అగ్నిమాపక సిబ్బంది ఎస్ఎఫ్ఓ దిలీప్‌కుమార్, సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు. -
వాహ్.. వంటగది!
సాక్షి, హైదరాబాద్: అందమైన ఇంటికి అంతకంటే అందమైన వంటగది ఉండాలనే కోరిక అందరిలోనూ పెరుగుతోంది. ఇందుకోసం లక్షలు వెచ్చించేందుకు సిద్ధంగా లేరు. అందుకే తక్కువ ధరలో, సులువుగా అమర్చుకునే రెడీమేడ్ కిచెన్ల వైపు పరుగులు తీస్తున్నారు. రంగురంగుల డిజైన్లు ఉన్న క్యాబినెట్స్, గ్రానైట్ టాప్, గ్లాస్ హబ్, బాస్కెట్స్, గ్లాస్ చిమ్నీ.. ఇలా ప్రతీ వస్తువు ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటున్నారు. మాడ్యులర్ రెడీమేడ్ కిచెన్ అందుబాటులోకి వచ్చాక వంటగది రూపమే మారిపోయింది. ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా సులభంగా వంట చేసుకునే వీలుండడం దీని ప్రత్యేకత. వంటగది విస్తీర్ణాన్ని బట్టి కిచెన్ క్యాబినెట్లను డిజైన్ చేయించుకోవడం వల్ల వస్తువులను శుభ్రంగా సర్దుకునే అవకాశం ఉంటుంది. వంట పాత్రలు శుభ్రం చేసుకోవడానికి వీలుగా సింక్, కూరగాయలు తరుముకోవడానికి గ్రానైట్ టాప్ ఉంటాయి. హబ్స్‌లో కూడా బోలెడు వెరైటీలున్నాయి. గ్లాస్ హబ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇల్లు మారినా ఓకే..: మాడ్యులర్ కిచెన్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే మాడ్యుల్స్‌ను సులువుగా విడదీసుకోవచ్చు. ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా సులువుగా విప్పుకోవచ్చు. కొత్త ఇంటికి తరలించుకుని మళ్లీ బిగించుకోవచ్చు. మాడ్యులర్ కిచెన్ కాకుండా కార్పెంటర్ చేత కిచెన్ ఏర్పాటు చేయించుకుంటే ఆ కలపను తొలగించడం సాధ్యం కాదు. డ్యామేజీ ఎక్కువగా ఉంటుంది. మరో చోట బిగించడం కష్టంతో కూడుకున్న పని. మాడ్యులర్ కిచెన్‌లో ఈ సమస్య ఉండదు. కొన్ని రోజులు పోయాక మళ్లీకొత్త లుక్ రావాలనుకున్న వారు షట్టర్స్ మార్పించుకోవచ్చు. కొత్త డిజైన్లు ఉన్న షట్టర్స్ వేసుకోవడం వల్ల కొత్తదనం వస్తుంది. సంప్రదాయ కిచెన్ టాప్‌ను నిర్మించుకున్న వారు కూడా మాడ్యులర్ షట్టర్స్‌ను తెచ్చుకుని బిగించుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో విధాలైన సౌలభ్యాలు ఇందులో ఉన్నాయి. -
ఇంటిప్స్
కూరగాయలు కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద గానీ, మార్బుల్ మీద గానీ కట్ చేయడం వల్ల చాకులు పదును కోల్పోయి మొండిగా అవుతాయి. చెక్క మీద కట్ చేస్తే ఈ సమస్య రాదు. కొత్తిమీరని పలుచని క్లాత్‌లో చుట్టి రిఫ్రిజిరేటర్లో భద్రపరిస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఉల్లిపాయలను నీటిలో 10 నిమిషాలు నానబెట్టిన తరువాత కట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ తరిగేటప్పుడు కంటి నుండి నీరు కారదు. -
వాస్తు ప్రకారం వంటగది
వంటగది అనగానే మనకు ముందుగా గుర్తువచ్చేది వంటచేసుకునే గ్యాస్ స్టవ్, చిన్న చిన్న గిన్నెలు, చేతులు కడుక్కోటానికి సింక్, అలాగే మిక్సీ, గ్రైండర్, ఫ్రిజ్, వాటర్ ఫిల్టర్... వాస్తురీత్యా వీటిని వంటగదికి ఉత్తరంవైపుగాని, ఈశాన్యంవైపుగాని, లేదంటే పడమర వాయువ్యం వైపు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక గ్యాస్ స్టౌ విషయానికి వస్తే, తూర్పు అగ్నేయంౖ వెపు తూర్పు గోడకి అనించకుండా స్టౌకి, గోడకి మధ్య ఖాళీ ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. వంటగదిలో స్టౌ పెట్టే ప్లాట్‌ఫామ్, అదే ప్లాట్‌ఫామ్ మీద ఈశాన్యం వైవు సింకు ఉండటం వాస్తు రీత్యా విరుద్ధం. దీనివల్ల ఎంత సంపాదించినా నెలాఖరుకు డబ్బు కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇంటి ఇల్లాలి ఆరోగ్యం దెబ్బతినచ్చు. కాబట్టి స్టౌ ఉండే ప్లాట్‌ఫామ్‌కి, నీరు ఉండే సింకుకు మధ్య కనీసం 3 అంగుళాలు దూరం ఉండటం మంచిది. అలాగే, వంటగదికి ఆనుకోని వున్న వాష్ ఏరియాల్లో గిన్నెలు కడగటం, వాషింగ్ మిషన్స్ ఉంచటం, అక్కడ వాషింగ్ చేయటం అంత మంచిది కాదు. ఆగ్నేయంలో నీటివాడకం ఎంత తక్కువగా వుంటే అంతమంచిది. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు. కుటుంబ సభ్యులమధ్య మనస్ఫర్ధలు రావచ్చు, ఆరోగ్యం దెబ్బతినొచ్చు. కాబట్టి వాషింగ్ ఉత్తర దిశవైపు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు వంటగదిలో రిఫ్రిజిరేటర్‌ను ఏర్పాటుచేయకపోవటం మంచిది, తప్పదంటే దక్షిణ పడమర మూలల్లో గోడలకి తగలకుండా ఉత్తర ముఖంగా ఏర్పాటు చేసుకోవాలి. చివరిగా రోజూ వంటచేసే స్టౌని ఉదయానే శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాతే వంటచేయండి, అలా చేయటం వల్ల, ధనానికి లోటుండదు. -
మీ వంటగది ఎంత శుభ్రం?
కొంతమంది ఇంటిని ఎంతో చక్కగా ఉంచుకుంటారు కానీ వంటగదిని మాత్రం పట్టించుకోరు. వాడిన గిన్నెలను శుభ్రం చేసుకోకుండా బాక్టీరియా చేరేవరకు అలానే వదిలేస్తారు లేదా ఎవరికోసమో ఎదురుచూస్తూ వాటిని అక్కడే పడేస్తారు. తీసుకొనే ఆహారం శుభ్రంగా ఉండాలంటే వంటగది శుభ్రత అవసరమే కదా! మీరు ఈ విషయంలో ఎలా ఉంటారు? 1. బాగా పొద్దుపోయాక అతిథులు వచ్చినా ఏ మాత్రం తడుముకోకుండా వంట పూర్తిచేయగలరు. ఎ. కాదు బి. అవును 2. తెలిసినవారి ఇంటికెళ్లినప్పుడు వంటగది శుభ్రంగా లేకపోతే, దాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎ. కాదు బి. అవును 3. కిచెన్ శుభ్రత విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తుంటాయి. ఎ. అవును బి. కాదు 4. ఫ్రిజ్‌లో ఉన్న ఐటమ్స్ చెడిపోయి వాసన వస్తున్నా పట్టించుకోరు. ఎ. అవును బి. కాదు 5. హోమ్ అప్లికేషన్స్ ఇతరులనుంచి అరువు తెచ్చుకోవటం మీకు ఇష్టం ఉండదు. ఎ. కాదు బి. అవును 6. ప్రతిరోజూ వంట పూర్తయ్యాక విధిగా వంటింటిని శుభ్రం చేస్తారు. ఎ. కాదు బి. అవును 7. కిచెన్‌లో పాత్రలు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటారు. వస్తువులకోసం వెతకకుండా అన్నింటినీ అందుబాటులో ఉంచుకుంటారు. ఎ. కాదు బి. అవును 8. వంటగది అరలు క్లీన్‌గా ఉండాలనుకుంటారు. ఎ. కాదు బి. అవును 9. ఇతరులు మీ వంటగదిని చూసి అభినందిస్తుంటారు. ఎ. కాదు బి. అవును 10. కొత్తకొత్త వంటసామాన్లు కొంటానికి ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఎ. కాదు బి. అవును ‘బి’ లు నాలుగు వస్తే కిచెన్‌పై శ్రద్ధ తీసుకుంటున్నట్లే. ‘బి’ లు ఏడు దాటితే వంటగదిపై విపరీతమైన శ్రద్ధ కనబరుస్తారు. ఇతరులను వంటగదిలోకి చేరనివ్వరు. ఇల్లు, వంటగది నీట్‌గా ఉంచుకోవటం అవసరమే. ‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కువగా వస్తే వంటగదిపై మీరు సరైన శ్రద్ధ తీసుకోవడం లేదని అర్థం. -
అప్పుడే నూరేళ్లు నిండాయి
వంట చేయబోయి బాలిక మృత్యువాత శరీరమంతా ఎగిసిన మంటలు శోకసంద్రంలో పాల్తూరు కష్టాన్నే నమ్ముకున్న ఆ దంపతులకు నలుగురు సంతానం. ఆస్తి పాస్తులు పెద్దగా లేవు.. బతకడానికి ఏ ఆధారంలేదు..కష్టమే వారి జీవనాధారం..కూలి పనికి పోతేనే పూట గడుస్తుంది. మొదటి సంతానంగా మా ఇంట మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. అమ్మానాన్న పనులకెళ్లినా .. ఇంటి పట్టున చెల్లెల్లు, తమ్ముడికి అక్కలా.. అమ్మలా అన్నీ తానై మెలిగేది. ఆడుతూ పాడుతూ ఆ ఇంట తిరిగే ఆ ఇంటి వరలక్ష్మిని చూసి విధి ఓర్చుకోలేకపోయింది. అమ్మలా అన్నం చేస్తుండగా .. అగ్ని ప్రమాదం రూపంలో ఆయువు తీసుకుంది. కళ్లముందు కనకమహాలక్ష్మిగా గెంతులేయాల్సిన ఆచిట్టితల్లికి అప్పుడే వందేళ్లు నిండాయన్న విషయం తెలిసి ఆదంపతులు గుండెలవిసేలా విలపించారు. ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది. విడపనకల్లు (ఉరవకొండ) : విడపనకల్లు మండలం పాల్తూరుకు చెందిన కట్టతిప్పన్నగారి లక్ష్మీ, చెన్నయ్య దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. దంపతులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. శుక్రవారం ఉదయమే చెన్నయ్య పొలానికెళ్లాడు. అన్నం చేసిన తర్వాత లక్ష్మీ కూడా భర్తకు పొలం పనుల్లో తోడుగా ఉండేందుకు బయల్దేరింది. వెళుతూ వెళుతూ ‘పప్పు’ చేసి పెట్టి వెళ్లమ్మా అంటూ ఏడో తరగతి చదివే పెద్ద కుమార్తె వరలక్ష్మి (13)కి చెప్పింది. సరే అని ఆ అమ్మాయి కట్టెల పొయ్యి వెలిగించి పప్పు చేసేందుకు ఉపక్రమించింది. మిగతా ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు ఆడుకునేందుకు బయటకు వెళ్లిపోయారు. ఈ సమయంలో గోడపై పోపు సామాన్లు తీసుకుంటుండగా అక్కడే ఉన్న కిరోసిన్ డబ్బా కిందకు పడింది. కొంత అమ్మాయి శరీరంపైకి, మరికొంత మండుతున్న పొయ్యిలోకి ఎగిసిపడింది. అంతే ఒక్క ఉదుటున అగ్నికీలలు వరలక్ష్మిని చుట్టుముట్టాయి. మంటలకు తాళలేక గట్టిగా కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోయింది. తల్లిదండ్రులు పొలంలోంచి పరుగులు తీసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. బాధ తట్టుకోలేక విలవిలలాడుతున్న కుమార్తెను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడే మృతి చెందింది. వరలక్ష్మి మృతితో పాల్తూరు శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మురళీ తెలిపారు. -
శశికళకు వీఐపీ ట్రీట్మెంట్: భారీగా ముడుపులు!
బెంగళూరు: జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు నిబంధనలకు విరుద్ధంగా జైలులో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ తెలిపారు. గురువారం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక సదుపాయాల కోసం రూ.2 కోట్లు ముడుపులు అందాయన్న ఆరోపణలను కొట్టిపారేశారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళకు ఎలాంటి ప్రత్యేక వంటగది వసతి కల్పించలేదని, కోర్టు ఉత్తర్వులు పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. సాధారణ ఖైదీలకు ఇచ్చే సదుపాయాలే ఆమెకు కల్పిస్తున్నామని చెప్పారు. శశికళకు జైల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించినందుకు దాదాపు రూ.2 కోట్ల మేర ముడుపులు అందాయని కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ డీ రూప.. డీజీపీకి ఆరు పేజీల లేఖ రాయడం కలకలం రేపింది. అయితే శశికళకు వీఐపీ ట్రీట్మెంట్ అంటూ ఆ లేఖలో పేర్కొన్న ఆరోపణలను సత్యనారాయణ ఖండించారు. ముడుపులు తీసుకున్నట్లు డీఐజీ రూప స్వయంగా గుర్తిస్తే అప్పుడు ఈ విషయంపై చర్చించాల్సి ఉందన్నారు. నేనే డబ్బులు తీసుకున్నట్లు డీఐజీ రూప భావిస్తే నాపై విచారణకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పారు. మరోవైపు ఏడాదిన్నర లీవ్ తర్వాత బాధ్యతలు చేపట్టిన తనకు పరప్పన అగ్రహార జైలులో భారీ అక్రమాలు జరుగుతున్నట్లు తెలిసిందని రూప చెబుతున్నారు. ఆ జైల్లో ఏం జరుగుతుందో తెలియాలంటే విచారణకు ఆదేశించడమే ఏకైక మార్గమని రూప అభిప్రాయపడ్డారు. స్టాంప్ పేపర్ స్కాంలో ఇరుక్కుని జైలుశిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ కరీమ్ తెల్గీకి కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని లేఖలో పేర్కొన్నట్లు జైళ్లశాఖ డీఐజీ రూప వివరించారు. -
శశికళకు ప్రత్యేక వంటగది!
సాక్షి, బెంగళూరు: అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక వంటగది వసతి కల్పించారా? ఇంకా అక్కడ అనేక అక్రమాలు జరుగుతున్నాయా? కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప ఆ శాఖ డీజీపీ సత్యనారాయణకు జైలులోని అక్రమాలపై లేఖ రాయడంతో ఈ విషయాలు వెలుగు చూశాయి. ఆరుపేజీలతో కూడిన ఈ లేఖ జైళ్లశాఖలో కలకలం రేపుతోంది. శశికళకేగాక పలువురు ఖైదీలకూ ఇదే విధమైన వసతి లభిస్తోందని రూప తన లేఖలో తెలిపారు. శశికళకు జైల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించినందుకు ఒక జైళ్లశాఖ ఉన్నతాధికారికి రూ.2 కోట్ల ముడుపులు దక్కినట్లు తేలింది. -
వంటొచ్చిన మొగుడు
సమ్సారం సంసారంలో సినిమా అదేంటో నేను కిచెన్‌లోకి అడుగు పెడితే చాలు మా ఆవిడ చిరాకుతో కూడుకున్న ప్రేమతో నా మీదకు దూసుకొచ్చేస్తుంది.‘వంటింట్లోకి రావద్దని నాలుగేళ్ళుగా చెప్తున్నా వినరే... ’ కోపంగా ముఖం పెడుతుంది.మా షాదీ అయి ఇప్పటికి నాలుగేళ్ళన్న మాట. ‘ఎందుకు బేగం? నన్ను కిచెన్ చూడనివ్వొద్దని మీ అమ్మ దగ్గర ఒట్టు పెట్టావా ఏంటి?’ అన్నాను.‘అవును... పెట్టాను’ అని కిచెన్‌లో నుంచి తోసినంత పని చేసింది.నాకు చిన్నప్పట్నించి అమ్మతో, అక్కతో వంటల దగ్గర కూర్చోవటం అలవాటు. అలా అలా వంట చెయ్యటం కూడా వచ్చేసింది. ‘నలభీములు నీ రూపంలో జన్మెత్తారేమో... నిన్ను చేసుకునే పిల్ల బాగా సుఖ పడుతుందిరా మనవడా..’ అని మా అమ్మమ్మ చాలాసార్లు అనేది. కానీ నా పెళ్ళానికి మాత్రం నా చేతివంట తినే ప్రాప్తం లేదు. నేను వంట గదిలోకి వచ్చినా వంట చేస్తానన్నా అస్సలు ఒప్పుకోదు. వంట గదిలోకి వచ్చానంటే ఇన్సెక్యూర్ అయిపోతుంది. కాని ఏం చెయ్యను? ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద గొట్టంతో సుయ్యి సుయ్యిమని ఊదుకుంటూ వంట చేసేవాళ్ళం. రోకట్లో అక్క, నేను టమాట తొక్కు, గోంగూర తొక్కులు కమ్మగా నూరేవాళ్ళం. ఆ తర్వాత వంట మాస్టర్ వహీద్ వెంట పెళ్ళిళ్ళకని పేరంటాలకని అసిస్టెంటుగా వెళ్లి అక్కడ చికెన్, మటన్, కద్దూ కి ఖీర్, డబల్ కా మీఠా, దాల్చా, బగార ఖానా, బిర్యానీ... వండటం నేర్చుకున్నాను. చదువు కోసం హైదరాబాదు వచ్చాక బ్యాచిలర్‌గా రూంలో వంట చేస్కొని తినటం వల్ల నా ఎవ్రీ మూమెంట్లో వంట ఒక భాగమైపోయింది. నా ఫ్రెండ్స్ చాలా మంది వంట చెయ్యటం రాక హోటల్లో తిందామనేవాళ్ళు. నేను మాత్రం హోటల్ ఫుడ్డుకి ఫర్లాంగుల దూరముండేవాణ్ణి. పొద్దస్తమానం ఎంత పనున్నా అలిసిపోయినా ఫ్రెష్ అయి వంట చేసి రీఫ్రెష్ అవడం నాకు అలవాటుగా ఉండేది. స్వయంపాక ప్రహసనంలో ఉండగానే చదువైపోయింది. పెళ్ళీడు దాటిపోతోందని అమ్మ పట్టుబట్టి మరీ షాహిన్‌ని వెతికి పెళ్ళి చేసింది.షాహిన్ నా లైఫ్ ఏంజిల్. బట్ నన్ను వంట దగ్గరికి రావొద్దనే విషయంలో రాక్షసి.‘పెళ్ళి కాకముందు మీరు వంట చేశారో వాయినాలు సమర్పించారో నాకనవసరం. నేను మీ ధర్మపత్నిగా మీ జిందగీలోకొచ్చాను. కాబట్టి మీరు నా చేతి వంటే తినాలి. ఒక ఆడదానిగా నాకు మొగుడికి వంట చేసి కొసరి కొసరి వడ్డించాలని వుంటుంది. ముందు భార్య మనసుని అర్థం చేస్కోవడం అలవాటు చేస్కోండి. కాదని ఓవరాక్షన్ చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు’ ఇలాంటి స్వీట్ వార్నింగులు ఇస్తుంటుంది.అయినా నా వంటబుద్ధి మారదు. ‘చేసిన ప్రాణం వూరుకోదు కదా ? ఇలా ఒకరి ఉత్సుకతకు సంకెళ్ళు వెయ్యటం అన్యాయ్ హై ఔర్ అక్రమం హై’ అని నేనెంత వాదించినా తన మాటే నెగ్గించుకుంటుంది. ‘బయట జాబ్ చేసి ఈ కుటుంబాన్ని పోషిస్తున్నారు కదా. అది సరిపోతుంది. ఇంటికి రాగానే హాయిగా కాలు మీద కాలేస్కొని గులాబ్ జామ్ చేసి పెట్టు, బగార బైంగన్ వండి పెట్టు అని ఆర్డర్లు పాస్ చెయ్యండి హుజూర్. నేను జీ హుజూర్ అని చక్కగా చేస్తా. పతిసేవ చేసుకోనివ్వండి’ అంటుంది. ‘సేమ్ టు యూ’ అనగానే నా వైపు గుర్రుగా చూస్తుంది.‘చెయ్యండి రోజూ వంట మీరే చెయ్యండి. నేనింట్లో తేరగా తినీ కూర్చుని కట్టుకున్న వాడితో నానా చాకిరీ చేయిస్తున్నానని అత్తయ్య, తోడికోడళ్ళ ముందే గాకుండా ఇరుగు పొరుగు వారి ముందు కూడా బద్నామ్ కావాలనే కదా మీ ఉద్దేశ్యం. ఏ జన్మలో ఏం పాపం చేశానో వంటొచ్చే మొగుణ్నిచ్చాడు ఆ పైవాడు. అసలు నాకు పెళ్ళిచూపులప్పుడే అనుమానం వచ్చింది – మీరు మీ హాబీస్‌లో ముందుగా వంట గురించే చెప్పారు. అప్పటికీ స్వరూప అంటూనే వుంది – ‘వంట వచ్చినవాణ్ణి కట్టుకుంటే జీవితమంతా తంటా తప్పదు సుమీ’... అని. తనెంత హెచ్చరించినా అదొక బిత్తిరి మొహంది అనుకొని పిచ్చ లైట్ తీస్కున్నా. కానీ తను చెప్పింది అక్షరాల నిజమే అయ్యింది. మీ అన్నదమ్ముల్ని చూడండి – ఇంటికొచ్చి ఇక్కడి పుల్ల తీసి అక్కడ పెట్టరు. ఆర్డర్లేసి వాళ్ళ పెళ్ళాలతో ఎలా చేయించుకు తింటున్నారో చూడండి. మీరూ వున్నారు ఎందుకూ? వాళ్ళని చూసి నేర్చుకోండి... మారండి..’తనలా ఫ్రస్టేట్గా ఫీలౌతుంటే నాకు నవ్వాగదు ! నవ్వితే తను మూడ్రోజులు మౌనవ్రతం బూనుతుంది.‘అదేమిటి బేగం... ఆడవాళ్ళు మాత్రమే ఇంటిపని, వంటపని చెయ్యాలని రాజ్యాంగంలో రాసిపెట్టి ఉందా? నాకు 24 అవర్స్ పనుండాలి. నేనేదో చిన్నా చితక రైటర్ని కదా! నాకు వంట గదిలో వంట చేస్తుంటేనే థాట్స్ వస్తాయ్ తెల్సా ?’ ‘అలాగైతే నాకొక జాబ్ చూడండి. నేను జాబ్ చేస్కుంటాను. అప్పుడు మీరు ఇంట్లో వుండి వంట చేద్దురు గానీ...’ ఇంతలో బెడ్రూంలోంచి మా పాప ఇరం ‘క్యావ్’ అని ఏడవటం మొదలు పెట్టింది.ఇద్దరం బెడ్రూంలోకి పరుగు తీశాం.ముందుగా నేనే అందుకున్నా పాపని. కాని తను ఉరిమి చూసింది.‘దానికి పాలు కూడా మీరే ఇవ్వండి సరిపోతుంది’ అంటూ పాపని నా చేతుల్లోంచి లాక్కొన్నంత పని చేసి అటువైపు తిరిగి పాలిస్తోంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? దొరికిందిలే సందు అని వంట గది వైపు చటుక్కున జారుకున్నాను. టకటకమని పప్పు కుక్కర్లో వేసి ఉడికిస్తున్నా. అంతలోనే షాహిన్ వచ్చి నన్ను కరిచేట్టు చూసి – ‘ ఛ.. మీరు మారరు ‘ అంది.‘మొగోళ్ళు వంటపనిలో చేయి పెడితే ఇంట్లో బర్కత్ వుంటుందని ఒక హదీస్లో వుందోయ్ ...’‘చాలించండి ఈ సమర్థింపులకేం తక్కువలేదు. నేను వెళ్త...’ అని అక్కడినుండి వెళ్లిపోయింది.‘హమ్మయ్య...’ అనుకుంటూ పచ్చిమిర్చి తొడిమెలు తెంపుతూ ఆలోచనలో పడ్డాను.క్రితంసారి అత్తవారింటికెళ్ళినప్పుడు మామిడి ఆవకాయ పెట్టడానికి నడుం బిగించాను. షాహిన్ వద్దని వారిస్తున్నా లేవకుండా మొండిగా తన మాటను ఇగ్నోర్ చేసి మసాలాలన్నీ దంచి, మామిడి కాయలు నరికేసి జాడీల్లో పెట్టే వరకు ఉడుంపట్టు పట్టాను. ఆ లోపు షాహిన్ ఫ్రెండు వచ్చి నా అవతారాన్ని చూసింది. అది చూసి షాహిన్‌కు పీకల్లోతు కోపం వచ్చింది. మరోవైపు అత్తయ్య నా పని చూసి ముచ్చటపడి మామయ్యని దెప్పి పొడవటం మొదలు పెట్టింది. ‘అల్లుడిలా ఒక్కరోజైనా ఇంటి పని చెయ్యండి..’ అనడంతో మావయ్య నన్ను అదో రకంగా కింది నుండి మీది వరకు చూశాడు.బామ్మర్దులను కూడా వారి భార్యలు నన్ను ఉదాహరణగా చూపించి దెప్పి పొడవటం స్టార్ట్ చేసారు.అత్తవారింటి ఆడవాళ్ళందరి దృష్ఠిలో నేను ఉత్తమ అల్లుణ్ణి.కానీ నా భార్య దృష్ఠిలో నేనెప్పుడూ ఓవరాక్షన్ మొగుణ్ణే. ఈ తగాదా ఎప్పటికైనా తీరుతుందంటారా? సినిమాలో సంసారం నాన్నవంట చూడ్డానికే... తినటానికి కాదు ఆనంద్‌రావు (అక్కినేని నాగేశ్వరరావు), జయలకు(జయసుధ) ఐదుగురు పిల్లలు. వాళ్ల అల్లరితో ఇల్లు సందడిగా ఉంటుంది. ఓ రోజు పిల్లలు స్కూల్ నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొస్తారు. చిన్న పాపకు వచ్చిన మార్కులు చూసి జయ మందలిస్తే రావు పిల్లలకు సపోర్ట్‌గా మాట్లాడతాడు. ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం చేయనంటుంది జయ. ‘నువ్వు చేయకుంటే నేను చేస్తా’నంటాడు రావు. ‘అన్ని పనులూ మీరే చేయండి వంటతో సహా, నేను కూర్చుంటాను’ అంటుంది విసుగ్గా జయ. ‘వంట పెద్ద విద్య అనుకున్నావా? పిల్లలూ రండి.. వంట చేసి మన తడాఖా ఏంటో చూపిద్దాం’... అంటూ పిల్లలతో కిచెన్‌లోకి వెళ్తాడు రావు. వంట చేసి ప్లేట్లలో వడ్డించి పిల్లల్ని తినమంటాడు ఆనంద్‌రావు. కట్ చేస్తే... పిల్లలంతా అమ్మ వద్దకు చేరి ‘ఆకలేస్తోందమ్మా’ అంటారు.‘మీరూ మీ నాన్నగారు కలిసి వంట చేసుకున్నారుగా వెళ్లి తినండి’ అంటుంది జయ. ఇవాళ వంట సరిగ్గా కుదరలేదు అని నసుగుతాడు రావు. ‘నాన్న చేసిన వంట చూడ్డానికే కానీ తినటానికి బాగాలేదమ్మా’ అంటారు పిల్లలు ‘రావుగారిల్లు’ సినిమాలో. ఇలాంటి సంఘటనలు మనిళ్లలోనూ జరగకపోవు. ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి. ఈ మెయిల్:samsaaram2017@gmail.com – హుమాయున్ సంఘీర్ -
ఇంటిప్స్
కూరగాయలు కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద గాని, మార్బుల్ మీద గాని కట్ చేయడం వల్ల చాకులు పదును కోల్పోయి మొండిగా అవుతాయి. చెక్క మీద కట్ చేస్తే ఈ సమస్య రాదు. కొత్తిమీరని పలుచని క్లాత్‌లో చుట్టి రిఫ్రిజిరేటర్లో భద్రపరిస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.ఉల్లిపాయలను నీటిలో 10 నిమిషాలు నానబెట్టిన తరవాత కట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ తరిగేటప్పుడు కంటి నుండి నీరు కారదు. -
వంటింటి చిట్కాలు
► టొమాటోలు ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఫ్రిజ్‌లో వెజిటబుల్ ట్రేలో వేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి పడకుండా పక్కపక్కన పెట్టాలి. అది కూడా ఫొటోలో ఎడమ చేతిలో ఉన్నట్లు కాకుండా కుడి చేతిలో ఉన్న విధంగా బోర్లించినట్లు సర్దుకోవాలి. ఇదే విధంగా ఒక వరుస మీద మరో వరుస వచ్చేటట్లు పేర్చుకుంటే ఒకదాని బరువు మరొకదాని మీద పడకుండా తాజాగా ఉంటాయి. ►టొమాటో,ఉల్లిపాయ ఒలవాలంటే వాటిని మరుగుతున్న నీటిలో వేసి తీసి చన్నీటి ధార కింద పెడితే (వాటర్ టాప్ కింద) త్వరగా ఊడి వచ్చేస్తుంది. టొమాటోలకైతే పదిహేను సెకన్లు, ఉల్లిపాయలైతే రెండు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. ►ఎండుద్రాక్ష, డ్రైఫ్రూట్స్ తరిగే ముందు చాకును చన్నీటితో తడిపితే త్వరగా కట్ అవుతాయి. ►మాంసం కాని చికెన్ కాని మరీ పలుచని ముక్కలుగా కట్ చేయాలంటే ఇరవై నిమిషాల పాటు ఫ్రీజర్‌లో పెట్టాలి. ఒక మోస్తరుగా గట్టిపడుతుంది కాబట్టి కట్ చేయడం సులభమవుతుంది. సమయం ఆదా ఆవుతుంది. ► నిమ్మకాయ నుంచి రసం మొత్తం రావాలంటే కోసే ముందు కాయను కిచెన్ ప్లాట్‌ఫాం మీద పెట్టి అరచేత్తో రుద్దాలి. ఇలా చేస్తే కాయ మెత్తబడి పిండిన వెంటనే రసం మొత్తం వచ్చేస్తుంది. రసం తీసే టైం తగ్గుతుంది. ►వెల్లుల్లి రేకల పొట్టు త్వరగా రావాలంటే ఒలిచేటప్పుడు ఒకవైపు చాకుతో గాటు పెట్టి చివర నొక్కాలి. ► ఎక్కువ రేకలు కావల్సినప్పుడు వేడి నీటిలో వేసి ఒకటి రెండు నిమిషాల తర్వాత నీటిని వంపేసి ఆ గిన్నెను చన్నీటి ధార కింద రేకలకు నీటి వత్తిడి తగిలే విధంగా పెడితే పొట్టు ఊడిపోయి నీళ్ల మీదకు తేలుతుంది. ►వంటల వాసన ఇల్లంతా వ్యాపించకుండా ఉండాలంటే వండేటప్పుడు వంటగదిలో తడి టవల్‌ను ఆరేస్తే వాసన టవల్‌కు పట్టేసి గది ఫ్రెష్‌గా ఉంటుంది. -
ఇంటిప్స్
కూరగాయలు కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద గాని, మార్బుల్ మీద గాని కట్ చేయడం వల్ల చాకులు పదును కోల్పోయి మొండిగా అవుతాయి. చెక్క మీద కట్ చేస్తే ఈ సమస్య రాదు.కొత్తిమీరని పలుచని క్లాత్‌లో చుట్టి రిఫ్రిజిరేటర్లో భద్రపరిస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఉల్లిపాయలను నీటిలో 10 నిమిషాలు నానబెట్టిన తరవాత కట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ తరిగేటప్పుడు కంటి నుండి నీరు కారదు. -
ఇంటిప్స్
పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చేతులకు కొంచెం ఆయిల్ రాసుకుంటే చేతులు మండకుండా ఉంటాయి. వంటగదిలో అలోవెరా మొక్కను పెట్టుకుంటే మంచిది. చిన్న చిన్న గాయాలు తగిలినపుడు అలోవెరా ఆకును తెంపి ఆ జెల్‌ను గాయమైన చోట రుద్దితే ఉపశమనం కలుగుతుంది. -
మనసు దోసేశాడు!
షూటింగ్ స్పాట్లో దర్శకుడు చెప్పినట్టు నటించే సూర్య.. షూటింగులకు సెలవు రోజైన ఆదివారం ఇంట్లో భార్య జ్యోతిక చెప్పినట్టు చేశారు. సినిమాలో నటిస్తారు కానీ, ఇంట్లో నటించలేదు. తన ప్రేమను వ్యక్తం చేశారు. శ్రీమతి దర్శకత్వ పర్యవేక్షణలో గరిటె తిప్పారు సూర్య. కిచెన్‌లోకి వెళ్లి శ్రీమతికి ఓ దోసేసి.. ప్రేమగా ఆమె మనసు దోచేశారు. ఇంతకీ, సడన్‌గా సూర్య ఎందుకు దోసెలు వేశారు అనే సందేహం వచ్చిందా? అసలు విషయం ఏంటంటే... ఇటీవల జ్యోతిక ముఖ్య పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘మగళిర్ మట్టుమ్’ ట్రైలర్ విడుదలైంది. అందులో ఇంట్లో అందరి కోసం లెక్కకు మించిన దోసెలు వేసే అమ్మ లేదా శ్రీమతి కోసం ఎవరైనా ఒక్క దోసె వేశారా? అనే పాయింట్ లేవదీశారు. అంతే... ‘ప్రేమతో మీ ఇంట్లో మహిళలకు ఓ దోసె వేయండి’ అంటూ దోసె ఛాలెంజ్ స్టార్ట్ చేశారు. ఐస్ బకెట్ తరహాలో అన్నమాట. ఒకరు దోసెలు వేసిన తర్వాత స్నేహితులకు ఛాలెంజ్ విసురుతారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాను దోసె వేసిన తర్వాత హీరో మాధవన్, దర్శకుడు వెంకట్ ప్రభు, సంగీత దర్శకులు హ్యారీస్ జయరాజ్, దేవిశ్రీ ప్రసాద్‌లకు సూర్య సవాల్ విసిరారు. ‘సింగం సార్... దోసె రౌండ్‌గా లేకున్నా ఓకేనా? లేదంటే మా అమ్మ దగ్గర నేర్చుకుంటా’ అని దేవిశ్రీ రిప్లై ఇచ్చారు. -
ఇంటిప్స్
కిచెన్ ప్లాట్‌ఫాం మీద కాని, స్టవ్ మీద కాని జిడ్డు మరకలుంటే ముందుగా కొద్దిగా నీళ్లు చల్లి సోడాబైకార్బనేట్ చల్లాలి. రెండు - మూడు నిమిషాల తర్వాత స్పాంజ్‌తో కాని క్లాత్‌తో కాని తుడవాలి. థర్మాస్ ఫ్లాస్కు లోపల వాసన వస్తుంటే ఒక టేబుల్ స్పూన్ సోడాబైకార్బనేట్ వేసి నిండా నీటిని పోయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగితే వాసనపోయి శుభ్రంగా ఉంటుంది. అవసరమనిపిస్తే బ్రష్‌తో రుద్దవచ్చు. కిచెన్‌లో అవెన్, స్టవ్, ప్లాట్‌ఫాం తుడిచే స్పాంజ్లు, బ్రష్‌లు కొద్దిరోజులు వాడిన తరవాత వాసన పట్టేస్తుంటాయి. వాటిని నీటిలో ఒక టేబుల్‌స్పూన్ సోడాబైకార్బనేట్, నాలుగు చుక్కల డిష్‌వాష్ లిక్విడ్ కలిపి రాత్రంతా నానబెట్టి శుభ్రం చేయాలి. {ఫిజ్‌ను శుభ్రం చేయాలంటే లీటరు నీటిలో కప్పు సోడా బైకార్బనేట్ కలిపి ఆ మిశ్రమంలో స్పాంజ్‌ను ముంచి లోపలి అరలన్నీ తుడవాలి. తరవాత మంచినీటిలో ముంచి పిండేసిన స్పాంజ్‌తో మరొకసారి తుడవాలి.స్టెయిన్లెస్ స్టీల్ సింకులో రెండు స్పూన్ల సోడా బైకార్బనేట్ చల్లి కొద్దిగా నీటిని చల్లి రుద్ది కడిగితే కొత్తదానిలా మెరుస్తుంది. పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి. -
ఇంటిప్స్
కిచెన్ షెల్ఫులు, తలుపులు రోజూ శుభ్రం చేస్తున్నా కూడా జిడ్డు పడుతుంటాయి. నెలకొకసారి లీటరు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ అమోనియా, రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్లో పోసుకుని జిడ్డుగా ఉన్న ప్రదేశాలలో స్ప్రే చేసి తడి పీల్చుకునే పొడి వస్త్రంతో తుడవాలి. గార పట్టేసిన సింకులు, టైల్స్, బాత్టబ్బులను శుభ్రం చేయడానికి నాలుగు లీటర్ల వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ అమోనియా కలిపి వాడాలి. అవెన్ శుభ్రం చేయాలంటే ముందు అవెన్‌ను ఆన్ చేసి 65డిగ్రీల వేడి వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి. ఒక కప్పులో సగం వరకు అమోనియా పోసి అవెన్‌లో పై అరలో ఉంచాలి. ఒక పెద్ద గిన్నెలో వేడినీళ్ళు పోసి కింద అరలో పెట్టి అవెన్ మూసివేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే అమోనియా కప్పు, వేడి నీటి గిన్నెలను బయటకు తీసి కొద్ది సేపు అవెన్‌ను ఓపెన్ చేసి ఉంచాలి. ఒక లీటరు వేడి నీటిలో పాత్రలు శుభ్రం చేసే లిక్విడ్ కొంచెం, ఒక టేబుల్ స్పూను అమోనియా కలిపిన మిశ్రమంలో క్లాత్‌ను ముంచి అవెన్ అంతా తుడవాలి. -
పోషకాలు కోల్పోకుండా...
ఫ్రిజ్‌లో లేదా షెల్ఫ్‌లలో పదార్థాలను ఒకే పాకెట్లో 3-4 రకాలవి వేసి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆయా పదార్థాలకున్న ప్రత్యేక వాసన, పోషకాలు కోల్పోతాయి. ⇔ పదార్థాలను కట్‌చేసేటప్పుడు, వేరు చేసేటప్పుడు గోరువెచ్చని నీటితో తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలి. ⇔ కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, మాంసాహారాన్ని శుభ్రపరిచేటప్పుడు గోరువెచ్చని ఉప్పు నీటిని ఉపయోగించాలి. ⇔ కటింగ్ బోర్డులు, గిన్నెలు ఉపయోగించడానికి ముందు, తర్వాత తప్పనిసరిగా సబ్బు నీటితో శుభ్రపరచాలి. నీచు వాసన రాకుండా ఉండటానికి ఘాటువాసనలు లేని బ్లీచ్‌ని ఉపయోగించవచ్చు. ⇔ వంటగదిలో వంటపాత్రలు, స్టౌ, ఉపయోగించే ఇతర పరికరాలు సురక్షితమైనవే ఎంచుకోవాలి. ⇔ రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన మాంసపదార్థాలు గానీ, కూరగాయలు గానీ 30 నిమిషాల లోపు వండేయాలి. ⇔ మిగిలిపోయిన పదార్థాలను రెండు గంటలకన్నా మించి బయట ఉంచకూడదు. ఫ్రిజ్‌లో అయితే ఒక రోజులోనే వాటిని పూర్తి చేయాలి. -
‘బావర్చి హోటల్’ సీజ్
► మునిసిపల్ అధికారుల దాడి ► పరిశుభ్రత లోపించడంతో మూసివేత బోడుప్పల్: పరిశుభ్రత పట్టని ఓ హోటల్‌ను పీర్జాదిగూడ మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఉప్పల్ డిపో వద్ద ఉన్న బావర్చి హోటల్‌పై మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి, శానిటరీ అధికారులు కలిసి బుధవారం ఆకస్మిక దాడి నిర్వహించారు. వివరాలు.. బావర్చి హోటల్ వెనుక వైపు గల మ్యాన్‌హోల్ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోందని స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం మున్సిపల్ కమిషనర్, శానిటరీ అధికారులు బావర్చి హోటల్ వెనుక ఉన్న మ్యాన్‌హోల్‌ను పరిశీలించగా మురుగునీరు, చెత్తా చెదారంతో నిండిపోయి ఉంది. అధికారులు సదరు హోటల్లోని కిచెన్‌ను పరిశీలించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉంది. ప్లాస్టిక్ డబ్బాల్లో కుళ్లిపోయిన చెత్తాచెదారం ఉంది. దోమలు, ఈగలు ఎగురుతున్నాయి. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో వండిని ఆహార పదార్థాలు తింటే ప్రజలు అనారోగ్యం పాలవడం ఖాయమని భావించిన అధికారులు హోటల్‌ను సీజ్ చేశారు. దాడిలో శానిటరీ ఇంజినీర్ సుక్రుతారెడ్డి, ఏఈ శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
కిచెన్‌లో యూట్యూబ్
ఒకప్పుడు కొత్త కొత్త వంటలు నేర్చుకునేందుకు... వంటల పుస్తకాలు దొరికేవి. అలాగే.. టీవీ షోల్లో బోలెడు వంటల కార్యక్రమాలు వస్తున్నాయి. దాంట్లో చూస్తూ... ఆ రెసిపీలను పేపర్లలో రాసుకునే వారు. అలా మగువలు పుస్తకాలను పట్టుకొని, చదువుకుంటూ వంట చేసేవారు. కానీ ఇప్పుడు జమానా బదల్ గయా. టెక్నాలజీ హైటెక్కు టమారాలను నేర్చుకుంది. యూట్యూబ్‌లో చూసి వంటలు చేసే కాలం వచ్చేసింది. అయితే, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లను కిచెన్‌లోకి తీసుకెళ్లడం సాధ్యమయ్యే పనికాదు కదా! దీనికీ పరిష్కారం అందుబాటులోకి వచ్చేసింది. ఐప్యాడ్‌లోనే యూట్యూబ్ ఆన్ చేసుకొని, చూసుకుంటూ వంట చేయొచ్చు. ఎలాగంటారా..? ఇదిగో ఈ ‘ఐప్యాడ్ కిచెన్ సెట్’తో ఇట్టే వంట కానిచ్చేవచ్చు. ఇందులోని బ్లూటూత్ టెక్నాలజీతో పని చేసే స్పీకర్లు బ్యాటరీతో పని చేస్తాయి. కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై దీనిని నిటారుగా నిలబెట్టి పెట్టుకోవడానికి వీలుగా స్టాండ్, నూనె వంటివి చింది ఐపాడ్ తెర పాడవకుండా ఉండేందుకు రిమూవబుల్ స్క్రీన్ షీల్డ్ ఉంటాయి. ఐప్యాడ్ కింద పడిపోకుండా ఈ స్టాండ్‌లో పెట్టి మనకు అనుకూలమైన రీతిలో బిగించుకోవచ్చు. అలా వీటి సాయంతో ఇకపై కిచెన్లోనే యూట్యూబ్ వీడియోలను చూస్తూ, ఎలా చేయాలో వింటూ హ్యాపీగా బోలెడన్ని వెరైటీ వంటకాలను ట్రై చేయొచ్చు. మరెందుకు ఆలస్యం, ప్రపంచంలోని అన్ని రకాల డిషెస్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. -
వైజాగ్‌లో కిచెన్ సూపర్ స్టార్ కాంటెస్ట్
-
వంటిల్లు + డైనింగ్ టేబుల్ + రిఫ్రిజిరేటర్ = సేపియన్ స్టోన్!
ఒకే దెబ్బకి రెండు పిట్టలు అని విన్నాం కానీ ఒకే దెబ్బకి మూడు పిట్టలు అంటే! ఊహించడానికి భలే ఉంది కదా.. ఈ ఫొటోలో కనిపిస్తున్న డైనింగ్ టేబుల్ దీనికి చక్కని ఉదాహరణ. ఎందుకంటే ఈ డైనింగ్ టేబుల్ మీదే వంటలు చే యొచ్చు.. ఆహార పదార్థాలను వేడిగానూ, చల్లగానూ ఉండేలా చేయొచ్చు. ఏంటీ నమ్మలేక పోతున్నారా అయితే ఈ ఫొటోలో ఎడమవైపు నిలుచున్న వ్యక్తి ఏం చేస్తున్నాడో ఒకసారి చెప్పండి. ఏముందీ అందరికీ భోజనం వ డ్డిస్తున్నాడు అని అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అతను వంట చేస్తున్నాడు. ఇక భోజనం చేస్తున్న వారి పక్కనే ఓ షాంపెయిన్ బాటిల్ కనిపిస్తోందా? అది ఫ్రిజ్‌లో ఉన్నట్లే చల్లగా ఉంది. ఒకవైపు వేడి, మరోవైపు చల్లదనమా? ఇదెలా సాధ్యం అనుకోకండి. సేపియన్ స్టోన్ స్మార్ట్ స్లాబ్ ప్రత్యేకత అదే మరి. ఈ టేబుల్‌పైన ఉపయోగించిన స్లాబ్‌ను పింగాణి వంటి పదార్థంతో తయారు చేశారు. స్లాబ్ అడుగు భాగంలో నిర్ణీత ప్రదేశాల్లో ఇండక్షన్ కుక్కర్లు ఏర్పాటు చేశారు. వీటితోపాటు అక్కడక్కడా చల్లదనాన్ని ఇచ్చేందుకు, ప్లేట్స్ ఉంచే చోటులో ఆహారాన్ని వెచ్చగా (గరిష్టంగా 42.5 డిగ్రీ సెల్సియస్) ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ప్రత్యేకమైన పింగాణీ కాబట్టి ఏ ప్రాంతంలోని ఉష్ణోగ్రత అక్కడే ఉంటుందన్నమాట. స్వీడన్, జర్మనీలకు చెందిన డిజైనర్ సంస్థ క్రామ్/వైస్హార్ దీన్ని అభివృద్ధి చేసింది. -
అందమైన వంటిల్లు!
మాడ్యులర్ కిచెన్స్ పై పెరుగుతున్న ఆసక్తి సాక్షి, హైదరాబాద్: మహిళలు తమ ఇష్టప్రకారం నడిపించే రాజ్యం వంటగది. పిల్లలు అమ్మ నుంచి తాయిలం సంపాదించాలన్నా.. నాన్నకు సిఫారుసులు చేరవేసేలా అమ్మను కాకాపట్టాలన్నా.. కొత్త కోడలు కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవాలన్నా వంట గదే మూలం. మరి అలాంటి గదిని అందంగా తీర్చిదిద్దడం ఒక కళే. ఆ ఆసక్తిని ఉపాధిగా మార్చుకునేలా చేస్తోంది ‘మాడ్యులర్కిచెన్’. ♦ ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఓ భాగమే కిచెన్ డిజైనింగ్. రానురానూ దీనికి ఆదరణ పెరిగి మాడ్యులర్ కిచెన్ డిజైనింగ్ అనే ప్రత్యేక విభాగంగా రూపాంతరం చెందింది. ముంబై, ఢిల్లీ, చెన్నైల్లో మనకంటే కాస్త ముందుగానే కిచెన్ డిజైనింగ్ విస్తరించగా హైదరాబాద్, బెంగళూరుల్లోనూ వీటి ఆదరణ పెరుగుతోంది. మాడ్యులర్ కిచెన్ అంటే.. వంటింట్లోని సామాగ్రి బయట కనబడకుండా, సులువుగా తీసుకునేలా అందంగా తీర్చిదిద్దడమే మాడ్యులర్ కిచెన్. తక్కువ స్థలంలో ఎక్కువ వస్తువులను తీర్చిదిద్ది.. అందంగా ఉండాలని కోరుకుంటున్నారు మహిళలు. అందుకే ఇల్లు పాతదైనా.. కొత్తదైనా.. వంట గదిని ఆకర్షణీయంగా కనిపించేలా చేయడంతో పాటు అవసరమైనప్పుడు తెరుచుకునేలా, కావాల్సిన వైపుకు తిప్పుకునేలా మాడ్యులర్ కిచెన్‌లో ర్యాకులుంటాయన్నమాట. చిన్న చిన్న వస్తువులకు కూడా హైరానా పడకుండా అందుబాటులో ఉండేలా డిజైన్ చేస్తారు. బడ్జెట్‌ను బట్టి.. ఇందుకోసం ముందుగా తయారీ విడి భాగాలతో ఒక నమూనా తయారు చేస్తారు. కేటాయించిన స్థలం, ఖాతాదారుడి బడ్జెట్‌పై వీటి తయారీ ఆధారపడి ఉంటుంది. వంటగదికి కేటాయించిన స్థలాన్ని అంచనావేసి, దానికి అనుగుణంగా విడిభాగాలను సేకరించి వంటగదిలో అమర్చుతారు. తక్కువ స్థలంలో ఇముడుతూ, ఎక్కువ అందంగా వంటగది కనిపించేలా చూడటమే డిజైనర్ పని. మన ఆసక్తి, అభిరుచులకు తగ్గట్టుగానే మాడ్యులర్ కిచెన్స్లోనూ పలురకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వంటింట్లోని సామాగ్రి బయట కనబడకుండా, సులువుగా తీసుకునేలా అందంగా రూపుదిద్దుతున్నారు. వీటి ధరలు రూ.10 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. మాడ్యులర్ కిచెన్స్ నుంచి పొగ బయటకు రాదు. పాతకాలంలో పొయ్యి మీద పొగ గొట్టాలున్నట్లుగానే ఉంటాయి. కానీ ఇవి అధునాతనంగా ఉంటాయి. దీంతో పాటు వంట సామాగ్రి చెంచాలు, కప్పులు, ప్లేట్లు వేర్వేరుగా పెట్టుకునేందుకు అరలను అమరుస్తారు. లిమెన్స్ కార్నర్, పుల్ అవుట్, టాల్ యూనిట్ ఇలా రకరకాల పేర్లతో మన అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేక అరలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో అర 50 కిలోల బరువును మోసేలా ఉంటుంది. వీటికి వేడి తగిలినా.. నీటిలో తడిచినా ఏమాత్రం చెక్కుచెదరవు. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
మెక్సికో మనదనుకో
టొమాటో పోషకాల గురించి చిలవలు పలవలుగా వర్ణన కరక్టేనేమో! అందుకే మనం చారు కాస్తాం. మెక్సికన్లు సూప్ చేస్తారు. మెక్సికోలో అయినా మనదేశంలోనైనా చీజ్, చిప్స్, చికెన్, చిల్లీస్... కాంబినేషన్ కుదిరితే... పాకం ముదరడం, రుచి అదరడం ఖాయం. అడ్డుగోడ కట్టేసి వంట ఘుమఘుమల్ని ఆపడం కష్టం. ఆపడమూ, ఆగడమూ ఎందుకు? చలో కిచెన్... ప్రిపేర్ మెక్సికన్! ట టార్టిల్లా సూప్ కావల్సినవి: టొమాటోలను ఉడికించి, గుజ్జు చేసి, తీసిన రసం - 1 1/2 కప్పు, నల్ల చిక్కుడు గింజలు/బొబ్బెర్లు(ఉడికించినవి) - టీ స్పూన్ టొమాటో, ఉల్లిపాయల తరుగు - టేబుల్ స్పూన్ ఉడికించిన స్వీట్ కార్న్ (మొక్కజొన్న గింజలు) - టేబుల్ స్పూన్ పనీర్ (మాంసాహారం కావాలనుకునేవారు ఉడికించిన చికెన్ ముక్కలను సన్నగా తరిగి వాడచ్చు) - టేబుల్ స్పూన్ ఉప్పు - తగినంత అలంకరణకు... పాల మీగడ - టీ స్పూన్, కొత్తిమీర - 4 ఆకులు టార్టిల్లా చిప్స్ (ఏ చిప్స్ అయినా వాడుకోవచ్చు) - 10-15 తయారీ: టొమాటో రసాన్ని మరిగించాలి. ఒక గిన్నెలో ఉడికించిన ఉలవలు, పనీర్ తరుగు లేదా చికెన్ ముక్కలు, టొమాటో, ఉల్లి తరుగు, ఉడికించిన మొక్కజొన్న, పనీర్ లేదా చికెన్ తరుగు, ఉప్పు వేయాలి.దీనిపైన మరిగించిన టొమాటో రసం పోయాలి. పైన పాల మీగడ, కొత్తిమీర,టార్టిల్లా చిప్స్ వేసి సర్వ్ చేయాలి. ఎన్చిలడాస్ కావల్సినవి: ఫ్లోర్ టార్టిల్లా - 2 (4 కప్పుల మైదా, టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల వెన్న, నీళ్లు తగినన్ని. ఇవన్నీ కలిపి ముద్ద చేసి, 10 నిమిషాలు అలాగే ఉంచాలి. పిండి మృదువుగా అవుతుంది. దీన్ని చిన్న చిన్న ముద్దలు తీసుకొని, చపాతీలా చేసి, పెనం మీద రెండు వైపులా కాల్చుకోవాలి. వీటిని ఫ్లోర్ టర్టిలా అంటారు) ఫిల్లింగ్‌కు... ఎన్చిలడా సాస్ - టేబుల్ స్పూన్ (2 టేబుల్ స్పూన్ల మైదా, కప్పు టొమాటో గుజ్జు, టేబుల్ స్పూన్ కారం, వాము, వెల్లుల్లి, ఉల్లి, పంచదార టీ స్పూన్ చొప్పున, ఉప్పు, మిరియాల పొడి తగినంత. 2 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి, పై పదార్థాలన్నీ బాగా వేసి, వేయించి వాడుకోవాలి), పనీర్, క్యారెట్, క్యాబేజీ తరుగు - 2 టేబుల్ స్పూన్లు, ఛీజ్ - టేబుల్‌స్పూన్ అలంకరణకు... పాల మీగడ (గిలకొట్టినది) - 2 టేబుల్ స్పూన్లు, కారం - పావు టీ స్పూన్, ఉప్పు - తగినంత తయారీ: ఎన్చిలడా సాస్‌ను ఫ్లోర్ టార్టిల్లా అంతా రాయాలిదాంట్లో క్యారెట్, క్యాబేజీ, సాస్, ఛీజ్ తరుగు వేసి రోల్ చేయాలి వెడల్పు, మందం ఉన్న గిన్నెలో అడుగున స్పూన్ బటర్ వేసి, రోల్ చేసిన టార్టిల్లాలను ఉంచి, సన్నని మంట మీద ఉడికించాలి. మాడకుండా ఛీజ్ కరిగేంతవరకు ఉంచి, తీయాలి పాలమీగడ వేసి, టొమాటో, క్యాబేజీ, ఉల్లి, కొత్తిమీర తరుగుతో వడ్డించాలి. నోట్: ఫిల్లింగ్ కోసం... చికెన్, మటన్ తరుగులను వాడచ్చు. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ కావల్సినవి: వెనిలా లేదా నచ్చిన ఐస్ క్రీమ్ - 1 స్కూప్ బ్రౌన్ బ్రెడ్ - 2 స్లైసులు కాస్టర్ సుగర్ (గిన్నెలో పంచదార వేసి, సన్నని మంట మీద కరిగించినది) - 1/3 కప్పు దాల్చిన చెక్కపొడి/ ఇలాచీ పొడి - టీ స్పూన్, చాక్లెట్ సిరప్/ తేనె (ఒక చిన్న గిన్నెలో చాక్లెట్ బార్ వేసి, వేడి నీళ్లలో పెట్టి కరిగించినది. లేదంటే మార్కెట్లో చాక్లెట్ సిరప్ లభిస్తుంది) - కావల్సినంత తయారీ:ఐస్ క్రీమ్ స్కూప్ను (2 గంటలు డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి){బెడ్ చివర్లను కత్తితో కట్ చేయాలి. {బెడ్‌ను గుండ్రంగా స్వీట్ కప్‌లా రోల్ చేయాలి.ఐస్ క్రీమ్‌ను రోల్ చేసిన బ్రెడ్ మీద పెట్టి, చుట్టూ బ్రెడ్తోనే అదిమి, బాల్లా చేసుకోవాలి. (పూర్ణం బూరెలా) మరుగుతున్న నూనెలో వేసి, 8-10 సెకండ్లలోపు తీసేయాలి.కరిగించిన పంచదారలో దాల్చిన చెక్క/ఇలాచీ పొడి కలపాలి.దీంట్లో ఐస్‌క్రీమ్ ఉన్న బ్రెడ్ ఉండను దొర్లించాలి.చివరగా చాక్లెట్ సాస్, లేదంటే తేనె పైన వేసి, సర్వ్ చేయాలి. చెర్రీ పండు, వాల్‌నట్స్‌ను అలంకరణకు వాడుకోవచ్చు. నోట్: అవెన్‌లో అయితే, 175 డిగ్రీల వేడిలో 15 సెకన్లు ఉంచి, వెంటనే తీయాలి సిజ్లింగ్ ఫజిట కావల్సినవి:ఎరుపు, పచ్చ బెంగుళూరు మిర్చి తరుగు (పొడవుగా కట్ చేయాలి) - 1 1/2 టీ స్పూన్ చొప్పున ఉల్లిపాయ - 1, టొమాటో -1 ఫ్లోర్ టార్టిల్లా- 5 రొయ్యలు - 200 గ్రా.లు (శాకాహారులు పనీర్‌ను వాడచ్చు) నూనె - టేబుల్ స్పూన్ ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత సోయా సాస్(పనీర్ లేదా చికెన్ మ్యారినేషన్‌కు) - టేబుల్ స్పూన్ తయారీ:ఇనుప మూకుడును వేడి చేయాలి. అందులో నూనె వేసి మిర్చి, ఉల్లిపాయ తరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి 3-4 నిమిషాలు వేయించాలి.చికెన్‌ను బొగ్గుల మీద కాల్చి, ప్లేట్లో తీసుకోవాలి. సాస్ వేసి 10 నిమిషాలు ఉంచాలి. 2 టర్టిలాలను తయారుచేసుకొని, పక్కన ఉంచాలి.వేయించిన కూరగాయ ముక్కలను పెట్టి, దాని పైన రొయ్యలను లేదా పనీర్ ముక్కలను ఉంచాలి.వాటి పైన కరిగించిన బటర్ లేదా నెయ్యి వేయాలి. దీనిని వేడి వేడిగా టార్టిల్లా, టొమాటో సూప్, ప్రైడ్ రైస్.. వంటి కాంబినేషన్‌తో వడ్డించాలి. గమనిక: సిజ్లర్ ప్లేట్‌ను ఇనుముతో తయారుచేస్తారు. అందులోనే పదార్థాలను వండి, ఆ ప్లేట్‌ను చెక్కమీద పెట్టి వడ్డిస్తారు. దీని వల్ల పదార్థం వేడి తొందరగా తగ్గదు. కరె్టిసీ: జావేద్, షెఫ్ లా మెక్సికన్ కె.పి.హెచ్.బి, హైదరాబాద్ ఫొటోలు: శివ మల్లాల -
ఇంటిప్స్
కిచెన్, బాత్రూమ్ ట్యాప్స్పైన గారలా ఏర్పడుతుంటుంది. మురికిగా కనపడతాయి. నిమ్మకాయను సగానికి కోసి, అర ముక్కకు తగినంత ఉప్పు అద్ది, దాంతో ట్యాప్స్ని రుద్దాలి. తర్వాత కాటన్ క్లాత్‌తో తుడవాలి. మురికంతా పోయి కొత్తవాటిలా మెరుస్తాయి. ఉతికేటప్పుడు దుస్తుల రంగు పోకుండా ఉండాలంటే నీటిలో కొద్దిగా ఉప్పు, వెనిగర్ కలిపి వాటిని నానబెట్టి, తర్వాత ఉతకాలి. -
బేకింగ్ సోడాతో హోమ్ మేకింగ్
కిచెన్ కిటుకు కేక్‌లు, కుకీస్ వంటివి గుల్లగా రావడం కోసం వాటి తయారీలో బేకింగ్ సోడాని వాడుతుంటాం మనం. కానీ అది వంట చేయడానికే కాదు... చాలా వాటికి పనికొస్తుంది. చాలా పనులు చేసిపెడుతుంది. అవేంటంటే...{ఫిజ్ కనుక దుర్వాసన వస్తుంటే, ఓ చిన్న గిన్నెలో బేకింగ్ సోడా వేసి లోపల ఉంచితే చాలు. ఆ వాసన పోతుంది;ఆభరణాలు కిలుం పట్టినట్టుగా తయారైతే... బేకింగ్ సోడాలో కొంచెం నీళ్లు కలిపి పేస్టులా చేసి, దానితో కడిగితే తిరిగి మెరుస్తాయి; మన దంతాలు రంగు మారినప్పుడు బేకింగ్ సోడాలో ఉప్పు కలిపి తోముకుంటే మళ్లీ తెల్లగా అయిపోతాయి;నేలమీద పడిన నూనె జిడ్డు వదలకుండా ఉంటే కాసింత బేకింగ్ సోడా చల్లి కడిగితే జిడ్డు పోతుంది.అలాగే వంటగిన్నెల జిడ్డును కూడా బేకింగ్ సోడాతో కడిగి పోగొట్టవచ్చు;డస్ట్‌బిన్ వాసన వస్తుంటే అందులో కాస్త బేకింగ్‌సోడా చల్లితే సరి; స్నాక్స్ దుర్వాసన గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ వాసన వదిలించడానికి నీటిలో బేకింగ్ సోడా వేసి నానబెట్టి ఉతికితే ఫలితముంటుంది;లంచ్ బాక్సులు వాసన వస్తుంటే వాటిని నీటితో నింపి, అందులో కాస్త బేకింగ్ సోడా వేసి నాననిచ్చి, గంట తర్వాత కడిగేస్తే వాసన మాయమౌతుంది;పిల్లలు గోడమీద గీసిన పెన్నుగీతలు పోవాలంటే తడి స్పాంజికి బేకింగ్‌సోడా అద్ది తుడవాలి. -
బెటర్ గార్డ్
రీడర్స్ కిచెన్ తీపి చేదులు కలిస్తేనే జీవితానికి అసలైన అర్థం తెలుస్తుంది అంటారు పెద్దలు. ఆహారం కూడా అంతే. తీపితో పాటు చేదు కూడా అప్పుడప్పుడూ తగులుతూ ఉంటేనే ఆహారంలోని మాధుర్యం అర్థమవుతుంది. అయినా సరిగ్గా వండాలే కానీ... కాకరలోని చేదు కూడా జిహ్వకు తీయగానే తగులుతుంది అంటున్నారు మన పాఠకులు కొందరు. కాకరకాయతో మీదైన ఓ వెరైటీ వంటకాన్ని రాసి పంపమని కోరగానే అందరూ ఎంతో ఉత్సాహంగా పంపించారు. వాటిలో నాలుగు ఉత్తమ వంటకాలు ఈవారం ‘రీడర్స్ కిచెన్’లో మీకోసం... 1. కాకరకాయ వడలు కావలసినవి: కాకరకాయలు - 2, మైదా - అర కప్పు, కార్న్‌ఫ్లోర్ - 2 చెంచాలు, పెరుగు - అరకప్పు, ఉల్లిపాయ - 1, తరిగిన పుదీనా - 2 చెంచాలు, తరిగిన కొత్తిమీర - 2 చెంచాలు, కారం - 2 చెంచాలు, వేయించిన వేరుశనగల పొడి - 2 చెంచాలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా, జీలకర్ర - 1 చెంచా, గరం మసాలా - అర చెంచా, ధనియాల పొడి - అర చెంచా, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా తయారీ: కాకరకాయల్ని శుభ్రంగా కడిగి, గుండ్రని చక్రాల్లా కోసుకోవాలి; ఓ బౌల్లో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి; ఈ మిశ్రమంలో కాకరకాక ముక్కల్ని వేసి అరగంటపాటు ఉంచాలి; ఆ తర్వాత మైదా, కార్న్‌ఫ్లోర్, వేరుశనగ పొడి, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి వడల పిండి మాదిరిగా కలుపుకోవాలి; స్టౌమీద బాణలి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి; వేడెక్కాక... పిండిని చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకుని నూనెలో దోరగా వేయించాలి. 2. కాకరకాయ టిక్కీ కావలసినవి: కాకరకాయలు (పెద్దవి) - 2, క్యారెట్ - 1, బఠాణీలు - పావుకప్పు, బియ్యపు పిండి - 1 కప్పు, బొంబాయి రవ్వ - పావుకప్పు, కొత్తిమీర - పావుకప్పు, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా, ధనియాల పొడి - 1, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా తయారీ: క్యారెట్‌ను తురుముకుని పక్కన పెట్టాలి; బఠాణీలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేయాలి; ఉల్లిపాయల్ని, గింజలు తీసేసిన కాకరకాయల్ని వేర్వేరుగా మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి (మరీ మెత్తగా అవ్వకూడదు); ఓ బౌల్లో ఉల్లి ముద్ద, కాకరకాయ ముద్ద, బఠాణీ-కొత్తిమీర-పచ్చిమిర్చి ముద్ద, క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి; తర్వాత బియ్యపు పిండి, బొంబాయి రవ్వ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి; ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని, టిక్కీల్లాగా ఒత్తుకోవాలి; స్టౌ మీద అట్ల రేకు పెట్టి, కాసింత నూనె వేసి, రెండు వైపులా ఎరుపురంగు వచ్చేవరకూ కాల్చుకోవాలి. 3. కాకరకాయ ఉల్లికారం కావలసినవి: కాకరకాయలు - 4, ఉల్లిపాయలు (పెద్దవి) - 2, ఎండుమిర్చి - 7, జీలకర్ర - 2 చెంచాలు, నువ్వులు - 2 చెంచాలు, చింతపండు - నిమ్మకాయంత, ఉప్పు - తగినంత, నూనె - తగినంత తయారీ: ముందుగా మిక్సీలో ఉల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి; కడాయిలో కొద్దిగా నూనె వేసి, ఉల్లిపాయ పేస్టును పచ్చి వాసన పోయేవరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి; కాకరకాయల్ని శుభ్రంగా కడిగి, నాలుగు పాయలుగా చీలి, గింజలు తీసేయాలి; తర్వాత ఈ కాయల్లో ఉల్లిపాయ పేస్టును కూరాలి; స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేయాలి; వేడెక్కాక కాకరకాయ ముక్కలు వేసి మూత పెట్టాలి; అప్పుడప్పుడూ కలుపుతూ సన్నని మంట మీద వేయించుకోవాలి; ఎరుపురంగులోకి మారాక ఓ ప్లేటులోకి తీసుకుని, పైన నువ్వుల్ని చల్లి వడ్డించాలి. 4. కాకరకాయ పోళీ కావలసినవి: కాకరకాయలు - పావుకిలో, ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు, ఎండుమిర్చి - 6, పచ్చి శనగపప్పు - 2 చెంచాలు, ధనియాలు - 2 చెంచాలు, వేయించిన కొబ్బరిపొడి - 2 చెంచాలు, వేయించిన నువ్వుల పొడి - 2 చెంచాలు, మెంతులు - 1 చెంచా, చింతపండు గుజ్జు - 4 చెంచాలు, బెల్లం తరుగు - 1 చెంచా, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, నూనె - తగినంత తయారీ: స్టౌమీద బాణలి పెట్టి, కొద్దిగా నూనె వేయాలి; వేడెక్కాక గుండ్రంగా కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి; పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, మెంతుల్ని దోరగా వేయించి పొడి చేసుకోవాలి; బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి; బ్రౌన్ కలర్ వచ్చాక కాకర కాయ ముక్కలు వేయాలి; రెండు నిమిషాలు వేయించాక... మిక్సీ పట్టిన పొడితో పాటు కొబ్బరిపొడి, నువ్వుల పొడి కూడా వేయాలి; కాస్త మగ్గాక బెల్లం తరుగు, చింతపండు గుజ్జు వేసి, కొద్దిగా నీరు పోసి కలిపి మూతపెట్టాలి; నీరు ఇగిరిపోయి బాగా దగ్గరగా అయ్యేవరకూ సన్నని మంటమీద ఉడికించుకుని దించేసుకోవాలి. కాకరలో పోషకాలు ఎక్కువే! కాకరకాయలో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ ఉంటాయి. బీ1, బీ2, బీ3, సీ విటమిన్లతో పాటు మెగ్నీషియం, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫైబర్ మెండుగా ఉంటాయి. బ్రకోలీ కంటే రెండు రెట్లు ఎక్కువ బీటా కెరోటిన్, పాలకూరలో కంటే రెండు రెట్లు ఎక్కువ కాల్షియం, అరటిపండులో కంటే రెండు రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటాయి. ఇందులో ఉండే ‘పోలీపెప్టైడ్ పి’.. ఇన్సులిన్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. అందుకే మధుమేహ రోగులు తరచుగా తినాలి. కాకరకు ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు... కడుపులో మంట, గుండె మంట, అల్సర్ల వంటివి తగ్గుతాయి. అయితే గర్భవతులు, బిడ్డలకు పాలిచ్చే తల్లులు కాకరను తినకపోవడం ఉత్తమం. ఇందులో ఉండే క్వినైన్, మోరోడైసిన్, సపోనిక్ గ్లైకోసైడ్స్ వంటివి పడక కొందరికి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. స్వల్ప మోతాదులో ఉండే విషపూరిత టాక్సిన్లు కడుపునొప్పి, వాంతులు, డయేరియా, నరాల బలహీనత తదితర ఇబ్బందులు కలిగించవచ్చు. కాబట్టి వండే ముందు ఓ పది నిమిషాలు ఉప్పునీటిలో నానబెట్టి వండుకుంటే మంచిది. - సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్ రీడర్స్ కిచెన్ ఇంతవరకూ సాక్షి ‘ఫ్యామిలీ’ అందించిన వైవిధ్యభరితమైన వంటకాలను చూశారు, నేర్చుకున్నారు, వండుకుని ఆస్వాదించారు. ఇక ఇప్పుడు మీ రుచులను అందరికీ అందించే సమయం ఆసన్నమైంది. ప్రతివారం మేము అడిగే ప్రధాన దినుసుతో మీదైన వంటకాన్ని వివరంగా రాసి, దాని ఫొటోను, మీ ఫొటోను జతచేసి మాకు పంపించండి. కూర, వేపుడు, స్వీట్, స్నాక్ ఏదైనా సరే... మీరు పంపే వంటకం వినూత్నంగా, వైవిధ్యంగా ఉంటే దాన్ని కుకరీ పేజీలో ప్రచురిస్తాం. అయితే ప్రతివారం బుధవారానికల్లా మీ వంటకం మాకు అందాలి. ఈ వారం ‘పచ్చి మామిడికాయ’తో ఓ వెరైటీ వంటకాన్ని పంపించండి. అది కచ్చితంగా మీరు కనిపెట్టిన వంటకమై ఉండాలన్న విషయం మర్చిపోకండి. మా చిరునామా: రీడర్స్ కిచెన్, సాక్షి దినపత్రిక, 2-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34 ఈ మెయిల్: sakshi.cookery@gmail.com -
కిచెన్ షో
వంటింటికి అవసరమైన సామగ్రి అంతా ఒకేచోట కొలువుదీరింది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో గురువారం ప్రారంభమైన ఇండియాస్ బిగ్గెస్ట్ కిచెన్ షో ఇందుకు వేదికైంది. ఆదివారం వరకు జరగనున్న ఈ షోలో 60కి పైగా స్టాళ్లు ఏర్పాటుచేశారు. 70కి పైగా బ్రాండ్లు అందుబాటులో ఉంచారు. హైదరాబాద్‌లో తొలిసారి నిర్వహించిన ఈ కిచెన్ షోలో చిన్న కంపెనీల దగ్గరి నుంచి ప్రముఖ కంపెనీల ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వంటగదిలో అవసరమయ్యే టీ గ్లాస్ నుంచి ప్రతి వస్తువు అందుబాటులో ఉంది. నూనె లేకుండానే వండుకొనే ఇటలీకి చెందిన జీపిటర్ పాత్రలు, లక్ష రూపాయల విలువ చేసే హ్యాండ్ మేడ్ సిల్వర్ కుక్కర్ ఆకట్టుకుంటోంది. ఇవికాకుండా సూపర్ చైర్ ప్రధాన ఆకర్షణ. శరీర కదలికలను బట్టి ఈ చైర్ అడ్జస్ట్ అవుతుంది. ఈ ఇటలీ చైర్ మరో రెండు వారాల్లో సిటీ మార్కెట్లోకి రానుంది. సాక్షి, సిటీప్లస్ -
70 వేల ఇందిరమ్మ ఇళ్లు రద్దు?
మోర్తాడ్: గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు చేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 వేల ఇళ్లు రద్దు అయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను, అంతకు ముందు సంవత్సరాల్లో మంజూరు అయిన ఇళ్లకు సంబంధించి ఎంతో కొంత బిల్లు చేసిన ఇళ్లను మాత్రమే ఆన్లైన్లో ఉంచిన అధికారులు అసలే బిల్లు చేయని ఇళ్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. పేద, మధ్య తరగతి ప్రజలకు సొంత ఇంటి కలను నెరవేర్చడానికి రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అయితే, పాత విధానానికి స్వస్తి పలుకుతూ కొత్త విధానానికి దివంగ త ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించి ఆర్థిక సహాయాన్ని పెంచారు. సకల సదుపాయాలు కల్పిం చే విధంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు బెడ్రూం లు, హాలు, కిచెన్, అటాచ్డ్ బాతురూం కలిగిన ఇంటిని రూ. మూడు లక్షల వ్యయంతో నిర్మించి ఇస్తామని ప్రకటించింది. అయితే ఇంతవరకు గృహనిర్మాణ సంస్థ ద్వారా అందించే ఆర్థిక సహాయానికి సంబంధించిన పాలసీని ప్రభుత్వం ఖరారు చేయలేదు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యిందనే నమ్మకంతో ఎంతో మంది ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. బంధు, మిత్రులు, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేసి అనేక మంది ఇళ్ల నిర్మాణం ప్రారంభిం చారు. ఎలాగూ ఇల్లు మంజూరు అయ్యింది కదా అని భావించిన లబ్ధిదారులు బిల్లు వచ్చిన తరువాత అప్పులు తీర్చేయవచ్చని ఆశించి ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశారు. అయితే రాష్ట్ర విభజనకు ముందుగానే బిల్లుల చెల్లింపునకు వెబ్‌సైట్‌ను క్లోజ్ చేసిన గృహనిర్మాణ సంస్థ ఇప్పటి వరకు ఆన్‌లైన్‌కు అనుమతి ఇవ్వలేదు. వెబ్సైట్ ఆన్‌లో ఉంటేనే ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు చెల్లించే వీలు ఉంది. ఇళ్లు మంజూరు అయినా ఎంతో కొంత బిల్లు చెల్లింపు జరుపకపోవడంతో 70 వేల ఇళ్లు రద్దు కానున్నాయని సంబంధిత అధికారిక వర్గాలు చెబుతున్నాయి. పాతవి, కొత్తవి కలుపుకుని 1.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 25 వేల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మరో 25 వేల ఇళ్లు 50 శాతం నిర్మాణ దశను పూర్తి చేసుకున్నాయి. 30 వేల ఇళ్ల నిర్మాణం మొదలు కావడంతో 10 శాతం బిల్లు చెల్లింపు జరిగింది. 70 వేల ఇళ్లకు అసలే బిల్లు చెల్లింపు జరుగకపోవడంతో అవి రద్దు కానున్నాయి. మంజూరు అయి రద్దు అవుతున్న ఇళ్ల స్థానంలో రెండు బెడ్రూంలు, హాలు, కిచెన్, అటాచ్డ్ బాత్రూం గల ఇంటిని మంజూరు చేస్తారా లేదా అనేది ఇంకా తేలలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పథకం ప్రకారం తమకు ఇళ్లు మంజూరు అయితే పర్వాలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. కొత్త ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం విషయమై ప్రభుత్వ పాలసీ ఖరారు కాక పోవడంతో ఇప్పుడే ఏమీ చెప్పలేమని అధికారులు అంటున్నారు. ఇప్పుడే ఏమీ చెప్పలేం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన వెబ్సైట్ క్లోజ్ అయ్యింది. వెబ్సైట్ ఆన్‌లో ఉంటే ఏదైనా చెప్పగలం. ఇళ్లు రద్దు విషయం మాకు అధికారికంగా ఇంకా తెలియలేదు. బిల్లులు అసలే చెల్లించకుంటే ఆ ఇళ్లను రద్దు చేస్తారా లేక కొత్త పథకం కింద తీసుకుంటారో ఇంకా స్పష్టత లేదు. -
మారుతోన్న వంటిల్లు
ఆధునాతన హంగులు.. అందమైన అలంకరణ సాక్షి, హైదరాబాద్: కాలం మారుతోంది. దానికి అనుగుణంగానే అభిరుచులు కూడా మారుతున్నాయి. ఇంటిని ఎంత అందంగా నిర్మించుకోవాలనుకుంటున్నారో అంతే అందంగా వంటిళ్లు, పడకగది తదితర వాటిని ఉంచుకోవాలనుకుంటున్నారు. దీనికి తగ్గట్టు గతంలో మాదిరిగా టేకు, ఫ్లయివుడ్, డెకోలానికి కాలం చెల్లింది. ప్రస్తుతం మార్కెట్లో ఎండీఎఫ్, (మీడియం డెనిసిట్ ఫైబర్), మరిన్ ఫ్లయ్ (వంద శాతం నీటిని తట్టుకునే రకం) వచ్చేశాయి. ఇందులో పలు రంగులుంటాయి. అభిరుచిని బట్టి ఇంటి మొత్తాన్ని అరలతో మార్చేస్తారు. తక్కువ స్థలంలో ఎక్కువ సామాను పట్టేలా, అది కూడా ఆకర్షణీయంగా ఎక్కడికక్కడ అమరుస్తారు. ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాలు సైతం కిచెన్‌తో పాటు ఇంటీరియల్ డెకరేషన్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఆసక్తి, అభిరుచులకు తగ్గుట్టుగా పలురకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకు వంటిళ్లు, పడక గదిలో అరలు ఏర్పాటు చేసుకోవచ్చు. ధరలను బట్టి సామాగ్రి మారుతుంటుంది. గత ఐదేళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు నిర్మించే ప్రతి ఇంట్లోనూ అధునాత వంటిళ్లు, పడకగది, ఇంటీరియర్ డెకరేషన్ చేయిస్తున్నారు. స్థాయిని బట్టి వంటిళ్లును మార్చుకునేందుకు వీలుండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అధునాతన సౌకర్యాలు.. వంటింటిలోని సామాగ్రి బయట కనబడకుండా, సులువుగా తీసుకునేలా రూపుదిద్దుతున్నారు. వంటింట్లో ప్రధానమైన గ్యాస్ స్టవ్‌ను మార్చేస్తున్నారు. ఇందులో రూ.9 వేల నుంచి మొదలుకొని రూ.25 వేల వరకు ఉన్నాయి. దీంతో వంట సమయంలో పొగబయటకు రాదు. దీంతో పాటు వంట సామాగ్రి చెంచాలు, కప్పులు, ప్లేట్లు వేర్వేరుగా పెట్టుకునేందుకు అరలను అమరుస్తారు. ఇందులో ఏ ఒక్కటి బయటకు కనబడదు. వంటింట్లో ఏమాత్రం స్థలాన్ని వృథా పోనీయకుండా అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. లిమెన్స్కార్నర్, పుల్ అవుట్, టాల్ యూనిట్ ఇలా రకరకాల వాటిని మన అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో అర 50 కిలోల బరువును ఆపేలా ఉంటాయి. వేడి, నీటిని తట్టుకునేలా ఉంటాయి. -
దాల్చినచెక్కతో మధుమేహం నియంత్రణ!
న్యూయార్క్: వంటగదిలో అతి సాధారణ దినుసు అయిన దాల్చినచెక్క మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుందట. టైప్2 మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెరల నియంత్రణకు ఇది బాగా ఉపయోగపడుతోందని కాలిఫోర్నియాలోని వెస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. పరిశోధనలో భాగంగా.. 543 మంది టైప్2 మధుమేహ రోగుల్లో కొంతమందికి దాల్చినచెక్కను రోజుకు 120 మిల్లీగ్రాముల నుంచి 6 గ్రాముల వరకూ మాత్రల రూపంలో ఇచ్చారు. మరికొంత మందికి నకిలీ మాత్రలు ఇచ్చారు. త ర్వాత ఫలితాలను పరిశీలించగా.. దాల్చిన చెక్క మాత్రలు తీసుకున్నవారి రక్తంలో చక్కెరల స్థాయి మిగతావారికన్నా మెరుగ్గా నియంత్రణలో ఉన్నట్లు తేలింది. ఇన్సులిన్ హార్మోన్ విడుదల, పనితీరును దాల్చినచెక్క ప్రభావితం చేయడం వల్లే చక్కెరల స్థాయి మెరుగుపడుతున్నట్లు గుర్తించారు. అలాగే చెడు కొలెస్ట్రాల్(ఎల్డీఎల్)ను, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంతోపాటు మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచడంలో కూడా దాల్చినచెక్క దోహదపడినట్లు గమనించారు. అయితే టైప్2 మధుమేహ రోగులకు కచ్చితంగా ఎంత మోతాదు దాల్చినచెక్కను ఇవ్వాలన్న దానిని ఇంకా నిర్ధారించాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.